top of page
Original.png

ఈ వొడ్డు, ఆ వొడ్డు

4 hours ago
3 min read

వర్షం పడుతున్న నది ఒడ్డునుంచి అవతలి పొడి ఒడ్డుకు వెళ్లాలని చూస్తున్న కిష్టయ్య, వెనుక ఇంటి దగ్గర నుంచి పిలుస్తున్న అత్త.

Ee Voddu AA Voddu - Telugu Emotional Story | Bhattu Venkata Rao

ఈ వొడ్డు, ఆ వొడ్డు తెలుగు భావోద్వేగ కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 10/09/2026


“ఈ వొడ్డు, ఆ వొడ్డు” భట్టు వెంకటరావు రచించిన చక్కని తెలుగు బాల్యస్మృతి కథ. నది ఒడ్డున ఉన్న ఓ గ్రామం, వర్షం పడుతున్న ఒక వైపు, చినుకు కూడా లేని మరో వైపు, ఆ ఒడ్డున ఆడుకోవాలనే చిన్నారి కోరిక—ఇవన్నీ కథకు సహజమైన అందాన్ని తీసుకొస్తాయి.


నదికి ఈ వొడ్డున వర్షం పడతా ఉంది. ఆ వొడ్డున లేదు.


నదికి ఈ వొడ్డున ఊరు ఉంది. ఆ వొడ్డున అరమైలు అవతలి దాకా అంతా ఇసక నేల, అందులో సరివి తోపులు. నాలాంటి పిల్లకాయలు ఆ తోపుల్లో, చెట్ల నీడల్లో పరిగెడతా ఎంత సేపైనా ఆడుకోవచ్చు. రోజూ అట్లానే ఆడుకుంటా ఉంటాం. వర్షాకాలంలో తప్ప ఏటిలో మనుషులు మునిగిపోయేంత నీళ్ళుండవు. మిగతా రోజుల్లో ఈ వొడ్డు నుంచి ఆ వొడ్డుకి, ఆ వొడ్డు నుంచి ఈ వొడ్డుకి ఎప్పుడూ మనుషులు తిరుగుతానే ఉంటారు, ఏవో పనుల మీద.


రెండు చోట్ల నుండి నది లోపలికి దిగొచ్చు. ఒకటి ఊరికి ఈ వైపు. రెండోది ఆ వైపు. మెట్లేమీ ఉండవు. అంత దిగువకు కూడా ఉండదు నది. వర్షం పడిందంటే తడిసి బురదౌతది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అడుగెయ్యాలంతే... జారి పడకుండా! అలవాటున్నోళ్ళకి చెప్పాల్సిన పని లేదు. లేనోళ్ళ కోసమే ఈ మాటలన్నీ!

మధ్యాహ్నం ఉన్నట్లుండి ఊరి మీద నల్లటి మబ్బులు కమ్మినై.


ఇదేందబ్బా అని చూసే లోపలే చిటపటమని చినుకులు మొదలైనై. 'ఇదేం వానరా బాబూ!' అని ఊళ్ళో జనమంతా నవ్వుకున్నారు.


అట్నుంచి ఊళ్ళోకొచ్చిన వాళ్ళు 'అటేపు చుక్క చినుకు లేదు. ఇక్కడేందో మరి?' అనుకుంటూ పోతున్నారు.


ఇలాంటి మాటలే అంటూ వస్తున్న ఒకతన్ని పక్కనే ఉన్న మరొకతను "ఎందుకెహె అంత సణుగుతావు? ఏమయిద్దనీ?" అని విసుక్కున్నాడు.

"తల తడిసిపోతుళ్ళా" అన్నాడు మొదటతను.


"అబ్బా... మొలకెత్తవులే గాని పారా..." అని మొదటతడిని అదిలించాడు పక్కనున్నతను.


ఏటికి అటేపు ఉన్నోళ్ళకి పట్నం ఎళ్ళాలంటే, ఏటికి ఈవైనున్న మా ఊరొచ్చి బస్సెక్కాల్సిందే. అలా వస్తున్నవాళ్ళలో ఎవరో ఇద్దరు గామోసు వాళ్ళు అనుకున్నాను.

నదికి ఈ వొడ్డున, వర్షం కురుస్తున్న వైపున, నిలబడి ఉన్నాన్నేను. మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర. నాలుగంగలేస్తే వచ్చేస్తది.


"ఏందిరా కిష్టయ్యా, చినుకులు పడతుంటే తెలీటంలే? తడుస్తూ నిలబడ్డావ్?" అని కేకేసింది మా అత్త, ఇంట్లోంచే. వాళ్ళిల్లు కూడా ఇక్కడికి దగ్గరే. ఇంట్లోంచి చూస్తే ఏటి వొడ్డు, ఏరు కనిపిస్తా ఉంటది.


'మా అత్తకేం పన్లేదు, నేను కనిపిచ్చినప్పుడల్లా ఇంటికి పోరా అని తరమడం తప్ప!' అనుకుంటూ...


"ఆ.... పోతున్నాలే!" అని వర్షం పడుతున్న గట్టు దిగి, ఏట్లోకి పరిగెత్తాను.


"అదేందిరా? అటు పోతున్నావ్?" అని ప్రాణం పోతున్నట్టు అరిచింది మా అత్త.


"చినుకుల్లో తడుస్తున్నానని కదా ఇంటికి పొమ్మంటుండావ్... ఆ వొడ్డున చినుకులు పడటల్లేదత్తా... అటెల్లి కాసేపు ఆడుకుని పోతాలే!" అంటూ వర్షపు ఒడ్డును వదిలి, ఆ వైపుకి గట్టిగా పరుగు లంకించుకున్నాను...


ఎనక నుంచి మా అత్త గొంతు చించుకుంటూ 'ఒరేయ్ కిష్టయ్యా... ఒరేయ్... నా మాటినరా...' అని అరిచే అరుపులు నాకు వినపడకూడదన్నట్లుగా...


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page