top of page

ఎవరుకాదు గొప్ప?


'Evaru Kadu Goppa' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

'ఎవరుకాదు గొప్ప' తెలుగు పద్యాలు

రచన: సుదర్శన రావు పోచంపల్లి


మన్నన బొందుటకున్ సరి దూగుదురటంచు

మాన్యులు గొందరు నీ మది యుండి యుండినన్

జనులందరు మెప్పు నొందెదరు వారి వారి

పనులందు పరిపక్వత నొంది యుండినన్


కుమ్మరి కుండల జేయును ఇమ్మహిపై

నిమ్మళముగ మట్టి చేత నిజముగ జూడన్

మన్నికగ నుండునట్లు మహా భాండము నైనన్

ఎన్నియొ కళలను దించుచు నా మట్టి కుండలు గట్టిగ నుండన్.


వేయి గొర్రెలందైన వేలెత్తి జూపు

తనగొర్రె ఇదియని తడుముకోకుండ

గొల్లవారి తెలివి గోప్యంబు గాదు

ఎల్లరు మెచ్చనది గొప్ప గాదె జూడ.


చెప్పులు గుట్టుచుండు చర్మకారి

ఒప్పుగ నుండునట్లు అతి నేర్పరియై

గొప్పగ జదువరి యా తీరు గుట్ట గలడె

చెప్పులు చర్మ కారికి సాటిన్.


కుందనము కరిగి అతివలకు నమిత

నందము చిందునట్లు ఆభరణములు జేయు

కంసాలి ప్రతిభకు కాగలె సాటి

కాంచనంబును కంసాలె కాచి కొట్టి కళల నింపు.


భారత భాగవతము లెన్నడు జదువకున్నను

బావసారులు జేతురు బొమ్మలు భావ గర్భితముగ

ఆత్మయందున్న భావనల అహర్నిశము బోరాడి

కళాత్మకత సృష్టించరె కలియుగ స్రష్ట వోలె.


కోమటి కొట్టుకెళ్ళి కోరిన వస్తువడుగ కోరుచు సొమ్ము

చేయట సాచి చెప్పును వెల ఇదటంచు

తడబడకుండ అడిగిన వస్తువది నాణ్యత మంచిదంటు

గడబిడ ఎంత యైన వడివడిగ నందించు పదిమందికైన పదిలంబుగన్.


రజకుడుతుకును బట్టలవి యెంత మురికివైన

రాజు పేదను భేదాలు తన జోలి రానీయకుండ

తారుమారెంతయున్ లేక తడబాటు లేక

ఊరంత నందించు ఉదికిన బట్టలు వరుసగాను


కత్తెర చేత బట్టి క్షురకుడు కడు నేర్పరియై

కత్తిరించును జుట్టు వారి వారి కోరిక మేరన్

మైల యెంతైన నున్న మానుకోక నులుము దలను

తైల సంస్కారమొనరించు తగురీతి నుంచు.


రైతు బండించిన పత్తిని రాట్ణంబుతోడ

నేతకుపకరించు దారము నేర్పుగా వడికి

చెనేత వస్త్రముల్ దానేయు పద్మశాలి

మాన రక్షకుడై మహిలోన మసలు చుండు


మనిషి కొలతలను బట్టి మన్నికగ నుండునట్లు

మేరెవారు గుట్టెదరు బట్టలు మేటిగాను

తరతరముల పోకడల్ తగురీతి దెలిసి

దర్జి గుట్టెడి బట్టలె దర్జాగ నుండు


విశ్వకర్మకు వారసత్వంబు నొంది

వడ్రంగి జేయు నోర్పుతో బనులు

కలప ఏతీరుదైన కడు నేర్పు జెక్కి

సకల విధముల సామగ్రి చక్కగా జేయు.


భుజ బలము తోడ కమ్మరి నిజముగ

విజయము సాధించి ఇనుము కాచి కొట్టి

నాగలి గుంటుక బండి చట్రముపట్టా యనెడి

బహు పనిముట్లు ఎన్నియొ బాగుగా జేయు.


అవయంబులు తనువుకు అమరి నట్టు

ఊరియందు పనివారు ఉండనున్న

బతుకు సాగు చుండు భార మనక

అదియె పని వారి ప్రతిభ పంటవలతి యందు.


ప్రావీణ్యపు వృత్తుల ఆధారంగా తరతరాలు చేయు పనులచే కులములు ఏర్పడినవి. కులము అనునది ముందే పుట్టలేదు. విశాల హృదయముతోఅ ఆయా వృత్తుల వారిని గౌరవించాలి కాని కులము పేరిట నిందించడము ద్రోహము.

ప్రతి గ్రామము నందు అన్ని వృత్తుల వారు ఉంటేనే మనుగడ సాగేది.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/psr

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.19 views0 comments
bottom of page