top of page
Original.png

ఫేస్బుక్ కథ

4 hours ago
4 min read

ఫేస్బుక్‌లో రహస్యంగా పరిచయమైన భార్యాభర్తలు నిజ జీవితంలో ఒకరినొకరు గుర్తించి షాక్‌కు గురైన దృశ్యం

Facebook Katha- Telugu Social Story | Undavilli M

ఫేస్బుక్ కథ - తెలుగు సామాజిక కథ | ఉండవిల్లి.ఎమ్

Published In manatelugukathalu.com On 06/10/2026


“ఫేస్బుక్ కథ” సోషల్ మీడియా మాయలో చిక్కుకున్న దాంపత్య జీవితాన్ని ప్రశ్నించే ఆసక్తికరమైన తెలుగు సామాజిక కథ.


అరణి కంప్యూటర్ ముందు కూర్చుని, ఫేస్బుక్ లాగిన్ అయింది. కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్లు వచ్చి చేరాయి. రిక్వెస్టు పంపించిన వాళ్ల ప్రొఫైల్స్ అన్నీ చూసింది. మెసేజ్లన్నీ పరిశీలించింది. అందరికీ జవాబు రాయడం తన వల్ల కాదు.


కానీ, రాజ్ ప్రొఫైల్ చాలా బాగుంది. అతని ప్రొఫైల్ చదివితే మాట్లాడాలనిపిస్తోంది. కొత్తగా, ఆసక్తిగా ఆకర్షిస్తూ రమ్మని పిలుస్తున్నట్టుంది.


ఫ్రెండ్ రిక్వెస్టు ఓకే చేసి, రాజ్కి మెసేజ్ పంపించింది.


అట్నుంచి రిప్లయి వచ్చింది: "నా పేరు ధనరాజ్, ఇండస్ట్రియలిస్ట్ని, అందంగా ఉంటాను. అందంగా ఉన్న అమ్మాయి స్నేహం కోసం చూస్తున్నాను," అని.


"సేమ్ టు యు," అరణి జవాబు రాసింది.


"మీరు ఏం చేస్తుంటారు? మీ హాబీలు? మీ ఫొటో పంపించవచ్చు కదా!" రాజ్ మెసేజ్ పంపించాడు.


"అన్నింటికీ నా మనస్సు సంతృప్తిపడితే, నేనే డైరెక్టుగా కలుస్తాను. అవేవీ మ్యాచ్ కాకుండా నా ఫోటో పంపించను," అరణి రాసింది.


"నాకు ఒంటరిగా చాలా బోరింగ్గా ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు మరీ బోరింగ్! ఏం చేయాలో అర్థం కాదు. ఎన్నో ఆలోచనలు మనసుని కుదురుగా ఉండనియ్యవు," రాజ్ పంపించాడు.

"నాకూ అంతే! డే టైమ్ కూడా చాలా ఆలోచనలతో మనసు ఉక్కిరిబిక్కిరవుతోంది," అరణి రాసింది.


"సినిమాలు చూస్తారా?" రాజ్ అడిగాడు.


"యూట్యూబ్లో ఎక్కువగా చూస్తాను. రొమాంటిక్ సినిమాలంటే ఎక్కువ ఇష్టం. పుస్తకాలు కూడా అలాంటివే చదువుతాను," అరణి పంపింది.


రాజ్ ఇక ఆగలేకపోయాడు. ఫేస్బుక్లో ఎన్ని రోజులు సెర్చ్ చేసినా, సరైన జోడీ తనకి తగల్లేదు. తనలో అంతర్గతంగా దాక్కున్న కోరికలన్నీ ఏకరువు పెట్టాడు. వాత్సాయనుడి గురించి, రాంషా పుస్తకాల గురించి విపులంగా వివరించి చెప్పాడు.


అరణికి అతని మెసేజ్లోని వివరణలు, విశేషాలు చదివాక, తన జీవితంలో చాలా కోల్పోయి, యాంత్రికమైన జీవితాన్ని వృథాగా గడుపుతున్నట్టు అర్థమైంది. ఇలాంటి టచ్లు లేని జీవితాన్ని, జీవితకాలం మోయడం కష్టం. రాజ్కి అనుగుణంగా ఆమె కీబోర్డు కదలిపోతోంది.


"మీ మొబైల్ నెంబరు?" అడిగాడు రాజ్.


"అప్పుడే కాదు, వీలైతే ముందు కలుస్తాను, కొంచెం వెయిట్ చెయ్యండి," అరణి అంది.


మర్నాడు --


గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయింది రాజ్ మెసేజ్. పదకొండు గంటలకి లాగిన్ అయింది అరణి. రాజ్కి రిప్లయి ఇచ్చింది. రాత్రంతా కలల అంచున ఒంటరిగా అతనెలా తపస్సు చేసిందీ వర్ణించి చెప్తున్నాడు. తన గెస్ట్ హౌస్లో నిద్రలేకుండా చేసిన సంఘటనలు దృశ్యాలుగా ఆవిష్కరించి అరణి ముందుంచుతున్నాడు.


"ఎక్కడుంది మీ గెస్ట్ హౌస్?" అరణి అడిగింది.


"ఇంచుమించు ఫారెస్ట్ లాంటి ప్రాంతం. రాత్రి కారులో వెళుతుంటే దారిలో కారాగిపోయింది. అంతా చీకటి, దూరంగా లీలగా అడవి జంతువుల అరుపులు... ఏం చేయాలో తెలీలేదు, చాలా భయం వేసింది. కానీ, గెస్ట్ హౌస్కి వెళ్లిపోతే అక్కడ చాలా బావుంటుంది.


కలల్ని నిజం చేసుకునే చోటు... అక్కడికి జంటగా వెళితేనే ఆనందం. పగటిపూట భలే థ్రిల్లింగ్గా ఉంటుంది," రాజ్ మెసేజ్లు ఏకధాటిగా పంపిస్తూనే ఉన్నాడు.


"అలాంటి చోట నేనూ ఒకరోజు ఉండొచ్చా?" అరణి అడిగింది.


"ఎన్ని రోజులైనా ఉండొచ్చు," వెంటనే జవాబు వచ్చింది రాజ్ నుంచి. రాజ్ ఆమెకి అన్నివిధాలా నచ్చేశాడు. అరణి కూడా అతనికి అతుక్కుపోయేట్టు అనుగుణంగా సాగిపోతోంది.


మర్నాడు --


గుడ్ మార్నింగ్తో మొదలైంది. అరణి అతని రూపురేఖలు, ఎత్తు, బరువు అన్నీ అడిగి తెలుసుకుంది. "గెస్ట్ హౌస్లో ఇద్దరం కలుద్దాం... వీలవుతుందా?" అని అడిగింది.


"పగలే కుదురుతుంది. రాత్రిపూట టౌన్లో నాకు పనుంటుంది," రాజ్ చెప్పాడు.


ఎవరైనా అయితే రాత్రిళ్లు కూడా ఉండమని అడుగుతారు. కానీ, ఇతను నిజాయితీ మనిషిలా అనిపించాడు అరణికి. ఆరోజు గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం 2 గంటలకు కలవడానికి, సాయంత్రం 6 గంటలకి టౌన్లోకి వచ్చేయడానికి ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు.


ఐడెంటిఫికేషన్ కోసం ఆమె తన స్నఫ్ కలర్ శారీ మీద పింక్ ఫ్లవర్స్ ఉన్న ఆనవాళ్లు చెప్పింది. రాజ్ తన బ్లూ కలర్ షర్ట్ని ఇన్ షర్ట్ చేసుకుని, బ్లాక్ స్పెక్ట్స్, బెల్టు అన్నీ చెప్పాడు.


మధ్యాహ్నం 2 గంటలకి సిటీ పార్కు బయట --


అరణి ముందుగా వచ్చి నిలబడింది. ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లాక్ స్పెక్ట్స్ ఉన్న అతన్ని దూరంగా చూసి అందగాడే అని ఊహించింది. అతను దగ్గరయ్యే కొలదీ, మబ్బు వీడినట్టు, మనసు తునాతునకలుగా విడిపోవడం మొదలైంది.


రాజ్లోనూ ఉరకలేసిన మనసు, ఉరేసినట్టు ఉలిక్కిపడింది. ఇద్దరూ దగ్గరయ్యారు.


ఆశ్చర్యం...


ఎవరూ మాట్లాడుకోలేక షాక్లో ఉండిపోయారు. ఏం చేయాలో ఆ క్షణంలో ఆలోచించడానికి కూడా లేని ఒక సందిగ్ధ అవస్థ... ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని, రహస్యపు మాటల్ని కుదుర్చుకుని, తీరా కలిశాక --


వాళ్లిద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలు!


ఇద్దరూ ఒక్కసారే గట్టిగా కేకలేసుకున్నారు.


"ఛీ! నువ్వు ఇలాంటి దానివా!" అంటే, "ఛీ! నువ్వు ఇలాంటి వాడివా?" అంటూ ఇద్దరూ దుమ్మెత్తి పోసుకున్నారు. చుట్టూ జనం పోగయ్యారు. అతను ఆమెని కొట్టడానికి సిద్ధమయ్యాడు.


ఆమె అతనిపై "ఛీ" అంటూ ఉమ్మేసింది.


అప్పటివరకు ఇంట్లో చాలా అన్యోన్యంగా ఉంటూ, అంతర్జాలంలో రహస్యంగా జరుగుతున్న కలాపం బయటపడ్డాక, శత్రువులుగా మారిపోయారు.


ఒక సాంప్రదాయ కుటుంబంలోని వ్యక్తుల రహస్య ఆలోచనలు ఎవ్వరూ చూడరు అన్న భావం కలిగాక, ధైర్యంతో దాన్ని సాధించుకోవడానికి వాళ్లు చేసే గమనంలో పొరపాటున ఇలా జరిగితే, గుండె గుభేలు మంటోంది.


వాస్తవాన్ని అర్థం చేసుకుని ఎప్పట్లాగే ఒకరికొకరు దగ్గర కాలేరు; దానికి విరుద్ధంగానే మనసు సాగిపోతుంది.


అతి వేగంగా ఒకరంటే మరొకరు ఇష్టపడని పరిస్థితి ఏర్పడి, ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకెక్కారు.


సబ్కాన్షస్లోని కోరికల్ని తీర్చుకోవడానికి అనువైన అంతర్జాలంలో కలిసి, నిజాలు బయటపడి, కోర్టుకెక్కిన వీళ్లకు ఏ తీర్పు వస్తుందో!!?


(ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో జరిగిన యథార్థ సంఘటన - ఫిబ్రవరి 2016. ఆంధ్రప్రభ దినపత్రికలో చూశాక... - రచయిత)


('రేపటికోసం' మే - 2016)

- ఉండవిల్లి.ఎమ్

సమాప్తం. 

 ౼౼౼౼౼


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్

ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి. 

'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. 

 నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 


చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి. 

 అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం! 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page