'Five Minutes Upma' - New Telugu Story Written By Mohana Krishna Tata
'ఫైవ్ మినిట్స్ ఉప్మా' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఉదయం 9 అయ్యింది. అందరూ ఆఫీసు కు ఆల్రెడీ వచ్చేసారు. టైం కు రావడం విచిత్రమే.. ఎందుకంటే.. ఇక్కడ బాస్ చాలా స్ట్రిక్ట్.. టైం కు రావాలని రూల్ పెట్టాడు.
రామ్మోహన్ 9 కు ఆఫీస్ కు కరెక్ట్ గా వచ్చేసి, తన సీట్ లో కూర్చున్నాడు. ఒక పక్క నుంచి ఆకలి వేస్తోంది.. బాస్ రౌండ్స్ వస్తాడేమోనని ఆలోచిస్తున్నాడు. రామ్మోహన్ ఉదయం 7 గంటలకు ఇంటినుంచి బయల్దేరితే గాని, ఆఫీసు కు టైం చేరుకోలేడు. రోజూ ఉదయం, తన భార్య తో టిఫిన్ ఇంట్లో చేయడానికి కుదరదని, బాక్స్ పెట్టమనేవాడు. ఆ మహా ఇల్లాలు, ఒక పక్క, టిఫిన్ బాక్స్, మరో పక్క లంచ్ కు సిద్ధం చెయ్యాలి రామ్మోహన్ కు.
అనుకున్నట్టుగానే, బాస్ కేబిన్ లోంచి బయటకు వచ్చాడు. అందర్నీ చూసుకుంటూ బయటకు వెళ్ళాడు.
రామ్మోహన్ "గుడ్ మార్నింగ్ బాస్" అని విష్ చేసాడు. రామ్మోహన్ కు ప్రమోషన్ పెండింగ్ ఉంది. రోజూ టైం కు రావడం, గుడ్ మార్నింగ్ చెప్పడం తప్పదు అనుకున్నాడు.
బాస్ మళ్ళీ తిరిగి తన కేబిన్ లోకి వెళ్ళగానే, పక్కన ఉన్న తన ఫ్రెండ్ సుబ్బారావు ను పిలచి "టిఫిన్ చెయ్యాలి.. కంపెనీ ఇమ్మన్నాడు"
"సరే, పదా!" అన్నాడు సుబ్బారావు
"రామ్మోహన్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసాడు. కమ్మని ఉప్మా సువాసన బాక్స్ లోంచి బయట ప్రపంచాన్ని చూసింది.
"ఏమిటి ఉప్మానా?" ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.
"ఉప్మానే.. ఉప్మా కేమి తక్కువ రా?" అన్నాడు రామ్మోహన్.
"రోజు నీతో వస్తాను.. నువ్వు రోజు బాక్స్ ఓపెన్ చేస్తావు.. ఎప్పుడూ ఉప్మా నే చూస్తాను.. బోర్ కొట్టదూ?"..
"ఉప్మా ను తక్కువ చేయకు రా! సుబ్బా రావు.. టిఫిన్ లో నూడుల్స్ తర్వాత ఫాస్ట్ గా చేసేది ఏమిటో తెలుసా? ఉప్మా..
పెళ్ళాం చేత ఉప్మా చేయిస్తే, ఎంత సంతోషిస్తుందో తెలుసా? అదే ఏ పూరి చేయమంటే.. ఆమె ముఖం లో అలసట ముందే చూడొచ్చు!
ఉప్మా చేయడమే కాదు రా.. తినడమూ.. చాలా సులువు.. నోట్లో పెట్టుకున్న వెంటనే, కరిగిపోతుంది..
ఉప్మా లో ఎన్ని రకాలో తెలుసా.. రవ్వ ఉప్మా.. అందులో మళ్ళీ టమాటో బాత్.. రుచే వేరు..
గోధుమ ఉప్మా.. అందులో, స్మాల్, మీడియం, పెద్ద రవ్వ..
సేమియా ఉప్మా.. అటుకుల ఉప్మా.. బియ్యం రవ్వ ఉప్మా..
ఇంకా.. ఎనెన్నో.. జారుగా చేసుకోవొచ్చు.. మాములుగా చేసుకోవచ్చు.. నేతి లో చేసుకోవచ్చు.. టమాటో తో చేసుకోవచ్చు.. చెబుతుంటేనే నోరూరుతుందనుకో సుబ్బారావు! రోజుకో రకం తిన్నా, వారం మొత్తం బోలెడు వెరైటీస్.. తెలుసా?
ఒక విషయం చెప్పారా సుబ్బారావు.. నువ్వు ఎవరింటికైనా వెళ్లావనుకో.. నువ్వు ఉండే అరగంటలో టిఫిన్ చెయ్యాలంటే.. ఏమి చేస్తారు.. చెప్పు?"
"ఉప్మా" అంటూ నీరసంగా అన్నాడు సుబ్బారావు.
ఫంక్షన్స్ లో ఫస్ట్ ఉండే మెనూ ఐటెం ఏమిటో తెలుసా ?
హోటల్ మెనూ లో ఉండే టిఫిన్స్ లో ఇన్స్టంట్ గా తెచ్చేది ఏమిటో తెలుసా? పెసరట్టు లోకి కాంబినేషన్ ఏమిటి.. ఉప్మా వే కదా..
ఉప్మా చేసినప్పుడు మా ఆవిడా ముఖం లో చిరునవ్వు చూస్తాను రా.. అదే నెలకొకసారి చేసే పూరి చేసినప్పుడు.. మా ఆవిడా చిర్రు బిర్రు లాడుతుందనుకో..”
“నువ్వు ఎన్నైనా చెప్పారా! మా వీధిలో, సురేష్ ఇంటికి ఉదయం పూట, ఎవరూ వెళ్ళడానికి సాహసించరు తెలుసా?..”
"ఎందుకో" అడిగాడు రామ్మోహన్.
"వాళ్ళావిడ.. ఇంటికి ఎవరొచ్చినా.. 5 మినిట్స్.. అంటుందట.. ఏ నూడుల్స్ తెస్తుందనుకునేవు!.. ఉప్మా చేసి తెచ్చేస్తుందంట.. ఇన్స్టంట్ గా.." అన్నాడు సుబ్బారావు.
"అలా అనకురా సుబ్బారావు! ఉప్మా చేయడము ఒక ఆర్ట్.."
"అయితే మన బాస్ కు ఉప్మా అంటే పరమ చికాకు.. ఉప్మా ఎక్కువ గా చేస్తోందని.. మొదటి పెళ్ళానికి విడాకులు ఇచ్చేసాడు తెలుసా?
నువ్వు మన బాస్ చేత ఉప్మా తినిపించాలి.. ప్రమోషన్ కొట్టాలి.. అప్పుడే నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను.." ఛాలెంజ్ చేసాడు సుబ్బారావు.
"మా శ్రీమతి ని తక్కువ అంచనా వెయ్యకు రా.. పెళ్ళైన దగ్గరనుంచి మా ఇంట్లో ఉప్మా రవ్వలే ఎక్కువ తెచ్చేది నెలకు కిరాణా లో. ఉప్మా చేయడం లో.. నా శ్రీమతి దిట్ట.."
"అయితే, ఈ శుక్రవారం.. మన బాస్ ఆడిటింగ్ ఉన్నందున.. ఆఫీస్ కు ఉదయాన్నే వచ్చేస్తాడు.. ఆ రోజు నువ్వు ఉప్మా తినిపించాలి.." అన్నాడు సుబ్బారావు.
"ఓకే" అన్నాడు రామ్మోహన్
ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకున్న రామ్మోహన్.. పెళ్ళాం తో..
"రమా! నాకో చిన్న సాయం చేసి పెట్టాలి"
"ఏమిటండి అది"
"నా ప్రమోషన్ పెండింగ్ లో ఉంది.. మా బాస్ కు ఉప్మా తో ప్రమోషన్ కొట్టాలని ఆఫీస్ లో ఉంటాడే.. సుబ్బారావు.. నాతో ఛాలెంజ్ చేసాడు.. ఆలోచించి కమ్మగా చేయాలి శుక్రవారం"
"ఓకే అంది.." రమ,
శుక్రవారం తెల్లవారు 4 గంటలకే లేచేసాడు రామ్మోహన్.. పెళ్ళాన్ని పడుకోనీకుండా.. లేపేసాడు..
"ఉప్మా వే కదండీ.. ఎందుకండీ టెన్షన్?"
"నీకేమి తెలుసు.. నా ప్రమోషన్.."
"మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత.. నాకు పట్టుచీర కొనాలి మరి.."
"అలాగే రమా.."
రమ.. కమ్మని నేతి తో చక్కని ఉప్మా చేసింది. మంచిగా గార్నిష్ చేసింది.
"ఇదిగోండి, హాట్ ప్యాక్ లో ఉంచాను.. తీసుకుని వెళ్ళండి.. ఆల్ ది బెస్ట్"
రామ్మోహన్, నీట్ గా రెడీ అయ్యి, ఆఫీస్ కు బయల్దేరాడు.. అప్పటికే, బాస్ వచ్చి.. చాలా బిజీ గా ఉన్నాడు.. టెన్షన్ గా కూడా ఉన్నాడు.. దేవునికి దణ్ణం పెట్టుకుని.. బాస్ దగ్గరకు వెళ్ళాడు.
"సార్! ఈరోజు, మా ఆవిడ స్పెషల్ టిఫిన్ చేసింది.. కొంచం టేస్ట్ చేస్తారా?"
"రామ్మోహన్! నేను ఈరోజు టిఫిన్ కూడా చెయ్యలేదు "
"అయితే తినండి సార్"
"వస్తున్నాను పదా!" అన్నాడు బాస్.
బాక్స్ ఓపెన్ చేసాడు రామ్మోహన్.. ఆ సువాసన కి తన మైండ్ అంతా ఫ్రెష్ గా అయ్యిందని మెచ్చుకున్నాడు బాస్..
ఒక స్పూన్ లోపల పెట్టుకోగానే, టెన్షన్ అంతా, మర్చిపోయాడు..
రెండో స్పూన్ తినగానే.. "రామ్మోహన్! ఈ డిష్ బాగుందయ్యా.. ఏమిటిది?"
"ఉప్మా సార్"
"ఉప్మా నా! ఇంత మధురంగా ఉందేమిటయ్యా?"
"మా ఆవిడ చేతి మహిమ సార్"
"ఇది తినగానే, ఉప్మా మీద ఉన్న నెగటివిటీ ఆంతా పోయిందయ్యా రామ్మోహన్!"
"నా ప్రమోషన్ సంగతి సార్"
"మూడవ స్పూన్ తినగానే కంఫర్మ్ చేసానయ్యా! రామ్మోహన్..
సెలవు తీసుకుని.. నీ భార్య తో సినిమాకు వెళ్ళవయ్యా.. ఎంజాయ్!"
"థాంక్స్ సార్"
*****************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments