జెన్ ‘జీ’ రామాయణం
- Pulletikurthi Nagesh

- Jun 4
- 4 min read

Gen 'Z' Ramayanam - Telugu Emotional Story | Pulletikurthi Nagesh
జెన్ ‘జీ’ రామాయణం - తెలుగు భావోద్వేగ కథ | పుల్లేటికుర్తి నగేష్
Published In manatelugukathalu.com On 04/06/2026
బాబూ? అభి ! చిన్న ఫేవర్ చేయాలి రా..
చెప్పు తాతా.. always at your service .. అన్నాడు నవ్వుతూ
అంత వొద్దులే.. సాయంత్రం మా గ్రూప్ సత్సంగ మీటింగ్ వుంది. మన డ్రైవరు రాలేదు ఊర్లో పనుందని వెళ్ళాడు .. నన్ను కొంచెం తీసుకెళ్ళి.. మళ్ళీ తీసుకురావాలి..
Ok తాతా అదెంత పని.. అని నవ్వుతూ ఒప్పుకున్నాడు.. అభినయ రామ్.. అదే అభి
తాతగారు పరంధామయ్య గారు.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. ఇక మన అభి బి. టెక్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్..
అన్న మాట ప్రకారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరు కలసి కారులో బయల్దేరారు..
తాతా ఏంటి ఈ సత్సంగ ప్రోగ్రామ్ అడిగాడు కుతూహలంగా..
మా రిటైర్డ్ ఉద్యోగులం అందరం వారానికి ఒక రోజు కలుసుకొని.. ఏమైనా మంచి విషయాలు, భక్తి విషయాలు, లోకాభిరామయణం చర్చించుకుని ఓ రెండు గంటలు గడుపుతాం.. నువ్వు విను బాగుంటుంది..
ఆ రోజు విషయం రామాయణం.. రాముడు..
కారు సత్సంగం జరిగే హాలు వైపు సాగిపోతోంది.
స్టీరింగ్ తిప్పుతూనే అభి, "రామాయణం అంటే రాముడి గురించి కదా తాతా?
మనకు తెలిసిందేగా.. చిన్నప్పటి నుంచి కథలు, కార్టూన్ లు వింటూనే ఉన్నాం, చూస్తూనే వున్నాం కదా!" అన్నాడు చాలా క్యాజువల్గా.
పరంధామయ్య గారు నవ్వి, "పైపైన చూస్తే కథే అభీ. దాన్ని లోతుగా చూడాలి.. వయసు పెరుగుతున్న కొలది అర్ధం అవుతుంది.. నీకు కూడా మెల్ల మెల్లగా.
ముఖ్యంగా మీ లాంటి యూత్‌కి ఈ కాలంలో చాలా అవసరం" అన్నారు. నువ్వు కూడా కూర్చొని శ్రద్ధా గా విను..
ఒకరి తరువాత ఒకరు అందరు మాట్లాడారు.. అంతా బాగానే వుంది.. ఇంతలో
ఇంతలో ఒక పెద్దాయన.. లేచి.. ఒక కధ చెప్పడం ప్రారంభించాడు..
ఒక క్లాస్ లో టీచర్ పిల్లలను అడిగాడు, ప్రపంచాలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు?
క్లాస్ అంతా ఏకంగా అరిచారు – “తాజ్ మహల్” సార్
ఒక విద్యార్ధి మాత్రమే ‘ రామసేతు’ అన్నాడు
ఎందుకు అలా చెప్పావు? బాలుడు లేచి నెమ్మది గా చెప్పసాగాడు.
రామసేతువు రాముడు తన భార్య మృత దేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకు రావడానికి నిర్మించాడు.
శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు,
షాజహాన్ కి చాలా మంది భార్యలు, ఉంపుడుగత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు.
రామ సేతును శ్రీరాముడు సైన్యంలోని వానరవీరులు నిర్మించారు,
అయితే తాజ్ మహల్ ని అంతా కరువు సమయంలో బానిసలతో బలవంతంగా నిర్మించారు.
అంతే కాదు, వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు.. షాజహాన్ ఏం చేశాడు లోకంలో ఇలాంటివి మళ్ళీ నిర్మించకూడదని వారి చేతులు నరికించాడు..
ఆయన స్పీచ్ అవగానే.. అందరు చప్పట్లు .. సభ ముగిసింది..
ఇద్దరు తిరుగు ప్రయాణం అవసాగారు.. అభి కొంచెం గాంభీర్యం గా నడుపుతున్నాడు.. నచ్చినట్లు లేదు..
ఏం అభి అలా వున్నావు.. నచ్చలేదా?
అవును తాతా నచ్చలేదు..
పరంధామయ్య గారు ఆశ్చర్య పోలేదు. ఈ జనరేషన్ పిల్లలకు రామాయణం ఎక్కడ నచ్చుతుంది? ఏం అర్ధం అవుతుంది? అని మనసులో అనుకున్నారు.
అయితే ఆయన ఆలోచనలని పసిగట్టినట్లు అభి నెమ్మదిగా, స్థిరంగా మాట్లాడడం ప్రారంభిచాడు ..
తాతా.. శ్రీరామచంద్రునికి రావణాసురునికి కంపేర్ చేస్తే ఒక అర్ధం వుండి వుండవచ్చు గాని, షాజహాన్ తో పొలుస్తున్నారు ఏంటి తాతా?
సాక్షాత్తు భగవత్ స్వరూపం అని ఒక ప్రక్క నమ్ముతూ.. ఇంకో ప్రక్క ఒక మానవ మాత్రునితో పోల్చడమా?
వినడానికే ఎబ్బెట్టుగా లేదూ !!!
మహాత్మా గాంధీ కి పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న అవార్డు లు రాలేదని బాధపడతమా? ఉద్యమిస్తమా?
దేశంలో గొప్ప వ్యక్తిని వెతికి ‘రత్న’ అవార్డు ఇవ్వొచ్చు .. ఇక్కడ ‘గాంధీ నే దేశం’ “దేశమే గాంధీ”..
శ్రీరాముడు గొప్పవాడని మనం ఎవరికి నిరూపించాలి? ఎందుకు నిరూపించాలి? తాతా
రాముడి సుగుణాల గురించి చెప్పడానికి ఎన్ని లేవు తాతా!
చిన్న విషయాలకే పేరెంట్స్‌తో గొడవపడే ఈ రోజుల్లో తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన కొడుకు ఆయన.
పేపర్లలో విడిపోవడాలు, ఆత్మహత్యలు రోజూ చూస్తున్నాంగా ...
కానీ జీవితాంతం సీతమ్మ కోసమే బ్రతికిన నమ్మకమైన భర్త రాముడు.
ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే అన్నదమ్ములు, అవసరం తీరాక ముఖం చాటేసే స్నేహితులు ఉన్న ఈ సమాజంలో...
తమ్ముళ్ళను ప్రాణంగా చూసుకున్న అన్నయ్య,
హనుమ, సుగ్రీవ, విభీషణులను గుండెకు హత్తుకున్న ట్రూ ఫ్రెండ్ ఆయన.
పదవుల కోసం ఆరాటపడే నేటి లీడర్ల మధ్య, ప్రజల కోసం తన సుఖాలనే త్యాగం చేసిన పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్ శ్రీరాముడు!"
అంత గొప్ప విషయాలు వదిలేసి ఇలాంటి స్పీచ్ ఏంటి తాతా ..
కారులో ప్రారంభమైన ఈ సంభాషణ, ఇంటి ముందు వరకు, ఇంటి నుండి తాత గారి బెడ్ రూమ్ వరకు కొనసాగింది..
ఇంకా చెప్పాలంటే .. శ్రీరాముని నాయకత్వ లక్షణాల గురించి చెప్పుకోవాలి ..
రాముడు కేవలం ఆర్డర్లు వేసే రాజు కాదు. వానర సైన్యాన్ని నడిపించిన తీరు, అందరినీ కలుపుకుపోయే గుణం సహజంగా రాజులకి వుండే లక్షణం.
"ముఖ్యంగా ఆయన 'ఎమోషనల్ బ్యాలెన్స్' మైండ్ బ్లోయింగ్ తాతా!
పొద్దున కింగ్ అవుతావన్నా పొంగిపోలేదు, సాయంత్రం ఫారెస్ట్‌కి పొమ్మన్నా కుంగిపోలేదు.
ఎలాంటి సిట్యుయేషన్ లోనైనా స్థిరంగా ఉండడం రాముడి స్టైల్.
ఇక వానర సైన్యాన్ని నడిపించిన తీరు చూడు...
సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు లాంటి డిఫరెంట్ మైండ్‌సెట్స్ ఉన్నవాళ్ళని హ్యాండిల్ చేయడం పర్ఫెక్ట్ 'టీమ్ బిల్డింగ్' కదా!
అందుకే చెప్తున్నా... రామాయణం అనేది పూజగది లో పెట్టుకునే స్టోరీ మాత్రమే కాదు,
ప్రతీ మనిషికి లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక 'ప్రాక్టికల్ లైఫ్ గైడ్'!"
మరేంటి ఇదంతా ..
రెండు శతాబ్దాలు పరిపాలించిన క్రిస్టియన్లు, ఎన్నో శతాబ్దాలు పరిపాలించిన ముస్లింలు ఏమీ చెయ్యలేని మన హిందూ మతాన్ని ఇప్పుడు ప్రమాదం జరుగుతుంది అని ఎందుకు భయం?
అన్ని మతాలకి బేస్ మన హిందూయిజమే అయినప్పుడు, మన ఓన్ షాడోస్ ని చూసి మనమే ఎందుకు భయపడాలి తాతా?
ఇట్స్ టోటల్లీ ఇల్లాజికల్!"
మన భయమే ఎదుటి వారి బలమన్న చిన్న క్లారిటీ ఎలా మిస్ అయ్యారు తాతా..
పరంధామయ్య గారు ఏదో చెప్పబోతే సతీమణి శారదమ్మ సుతారంగా భుజంమీద చెయ్యివేసి ఆపింది.
మనకన్నా బలంగా నమ్ముతున్న వాడికి, అంత క్లారిటీతో వున్న వాడికి నాలుగు శ్లోకాలు, నలభై అర్థాలు, నానార్థలు, పరమార్థాలు, చెప్పి ఇంకేం నమ్మించాలి...
పరంధామయ్య గారికి, శారదమ్మ గారికి మనమడిని చూసి ఎంతో ముచ్చట వేసింది..
భావి తరాలకు భగవంతుని పై ఉన్న క్లారిటీ నీ చూసి ఇంకా ముచ్చట వేసింది ..
మనవాళ్ళని మనం ఇంకా పిల్లలే అనుకుంటున్నామండి .. ఈ ‘Gen జీ’ పిల్లల దగ్గరే ఎక్కువ సమాచారం వుంది,
ఉన్న సమాచారాన్ని వడపోసి జ్ఞానం గా మార్చుకునే తెలివి కూడా.. దానికి జనరేషన్ తో పని లేదు.. వయసుతో అస్సలు పని లేదు..
రామాయణం గొప్పది అన్న దాంట్లో మరో ఆలోచన లేదు..
కానీ రామాయణాన్ని అర్ధం చేసుకున్నవాడు ఇంకా గొప్పోడు..
“మన మతం ప్రమాదం లో వుంది” అనే భయం కంటే,
“మన మతం, మన ధర్మం, మన సంస్కృతి గొప్పది, దాన్ని సరిగ్గా అర్ధం చేసుకుందాం”
అనే ఆలోచన రావాలి మనందరికీ.
చివరగా “శ్రీ రామచంద్ర మూర్తి” మా తెలుగు మాస్టారి మాటల్లో..
“రాముడు దేవుడు మాత్రమే కాదురా.. దేవుడెలా బ్రతకాలో చూపించిన మనిషి”
సమాప్తం
***
పుల్లేటికుర్తి నగేష్ గారి కొన్ని ఇతర రచనలు:
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం







Comments