నేరము – శిక్ష
- Pulletikurthi Nagesh
- 8 hours ago
- 4 min read
#NeramuSiksha, #నేరముశిక్ష, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

నేరము – శిక్ష - (దేవుడి స్క్రిప్ట్)
Neramu Siksha - New Telugu Story Written By Pulletikurthi Nagesh
Published In manatelugukathalu.com On 21/11/2025
నేరము శిక్ష - తెలుగు కథ
రచన: పుల్లేటికుర్తి నగేష్
రోజూ ఉదయం 5. 45 కి వాకింగ్ కి నేను స్టేడియం కి వెళ్ళడం అలవాటు. ఒక నెల రోజులనుండి నా ఆలోచనలు ఎప్పుడూ ఆ పెద్దాయన చుట్టే తిరుగుతున్నాయి. స్టేడియం కి వెళ్లే దారిలో బ్రిడ్జి క్రాస్ చేయాలి. బ్రిడ్జి దాటిన వెంటనే రోడ్డు రెండుగా అంటే ‘Y’ జంక్షన్ లా చీలిపోయింది. ఒక దారి ఊర్లోకి ఒక స్టేడియం కి వెళ్తుంది. కరెక్టుగా జంక్షన్ లో ఒక పెద్దాయన అప్పుడప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాడు. ఇంత తెల్లవారి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు అంటే డెఫినిటే గా మొదట్లో పిచ్చడమో అనుకునే వాడిని.. అంతే అంతగా పాటించుకోలేదు. కొంచెం బండి స్లో చేసి ఆయన వున్నాడా లేదా అని చూడడం అలవాటైంది ఈ మధ్యనే. రోజూ వుండరు గాని వారానికి ఒకటి రెండు రోజులు కనిపిస్తుంటారు.
ఒక రోజు వాకింగ్ కి కొంచెం బద్దకంగా వుండడంతో ఆ జంక్షన్ కి కొంచెం దూరంగా ఒక గట్టు మీద కూర్చొని ఆబ్సర్వ్ చేయడం ప్రారంభించాను. ఇంచు మించు ఒక గంట చాలా సిన్సియర్ గా ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. ఇంతలో ఒక అబ్బాయి సుమారు 35 – 40 వుంటాయి.. కార్ ఆపి పెద్దాయనని ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు. వాళ్ళని ఆపి ఇదంతా ఏమిటో అడుగుదామనుకున్నా.. కానీ ఇంతలో ఇద్దరు కారు ఎక్కి వెళ్లిపోయారు.
అలా రోజు ఉదయం ఆ ‘Y’ జంక్షన్ దాటుతున్నప్పుడు, పెద్దాయన గురించి చూడడం అలవాటు అయిపోయింది. ఆయన చేయ ఎత్తి స్లో అవమంటే స్లో గా వెళ్ళడం అలవాటైంది. నన్ను కూడా గుర్తు పడుతున్నట్లు వున్నారు, చిన్నగా పలకరిస్తుంటారు అప్పుడప్పుడు.
ఒక రోజు మా ఆఫీసు లో రోడ్డు సేఫ్టీ కన్సల్టెంట్స్ తో మీటింగ్ అవుతున్నప్పుడు ఆ అబ్బాయి కనిపించాడు. బహుశా వాళ్ళతో వచ్చి వుంటాడు.
నేను "మీటింగ్ అయిపోయిన తరువాత ఒక సారి నన్ను కలుస్తారా? కొంచెం మాట్లాడుదాం," అన్నా.
నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. "నేను మీకు తెలుసా సర్" అంటే "కొంచెం తెలుసు" అని చిన్నగా నవ్వి తల ఉపాను.
ఆఫీసు పని అంతా అయిపోయినాక, ఆ అబ్బాయి వస్తే, "మీ కేమి అర్జెంట్ పనిలేకపోతే కాసేపు మాట్లాడు కుందామా?" అన్నాను.
"నాకేం అంత అర్జెంట్ పని లేదండీ. పదండి, కాంటీన్ లో కూర్చొని మాట్లాడుకుందాం."
నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
అతడి పేరు ఉదయ్ అట. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. రోడ్డు సేఫ్టీ కన్సల్టెంట్స్ దగ్గర పని చేస్తున్నాడు.
"ఇప్పుడు చెప్పండి సార్.. నేను మీకు ఎలా తెలుసు. మీరు నాకు తెలీదు. ఎక్కడా చూసిన గుర్తు కూడా లేదు."
అప్పుడు చెప్పా..
ఉదయం నేను ఆ పెద్దాయనని ‘Y' జంక్షన్ దగ్గర గమనించడం. ఆయన వెహికల్స్ ని స్లో చేయడం. మళ్ళీ వెళ్ళమని సైగ చేయడం. తను వచ్చి కారులో తీసుకెళ్లడం.
చిన్నగా నిట్టూర్చాడు.
"మా నాన్నగారే సర్. మతిస్తితిమితం లేదు అని చెప్పలేం గాని. వారానికి రెండు మూడు రోజులు అలా ప్రవర్తిస్తుంటారు."
"మీకభ్యంతరం లేకపోతే కొంచెం వివరంగా చెప్పగలరా?"
"నాన్నగారి పేరు ప్రసాద రావు సార్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో వెహికలే సేఫ్టీ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు.
వెహికల్ ఫిట్నెస్ చెక్ చేసి, వాటిని రోడ్ల మీదకి పంపాలా వద్దా అని నిర్ణయించే వారు.
ఒక రోజు రోడ్ల మీద వాహనాలను చెక్ చేస్తూ ఒక లారీ ని పట్టుకున్నారట.
"అరే బాబు ఈ లారీకి ఫిట్నెస్ రెన్యువల్ అవలేదు కదా.. రోడ్లమీద కి రాకూడదు. ప్రక్కకి తీసి పెట్టు."
"సార్ సార్.. ఒక్క నెల రోజులే అయింది సార్. రెండు రోజులల్లో చిన్న చిన్న రిపేర్లు చేసి రెన్యువల్ కి మీదగ్గరకి తీసుకొస్తాం సార్."
"బ్రేక్ లు కూడా సరింగా లేనట్లున్నాయి కదా రా.."
"అవును సార్, బ్రేక్లు మొత్తం మార్చాలట. కొంచెం ఎక్కువ ఖర్చు. అందుకే మా ఓనర్ టైమ్ తీసుకున్నాడు. ఒక్క నెల టైమ్ ఇవ్వండి సార్."
"తప్పమ్మా.. అలా ఫిట్నెస్ లేని బళ్ళు రోడ్ల మీదకి రాకూడదు. పోయి చెప్పు మీ ఓనర్ తో."
వాడు ఓనర్ కి ఫోనే చేసి, "సార్. ఒక అర్ధ గంటలో వస్తా" అని చెప్పి లారీ ప్రక్కన పెట్టి వెళ్ళాడు.
మళ్ళీ వచ్చి "సార్. మా సార్ ఇది మీకు ఇమ్మన్నారు సార్" అని ఒక కవర్ ఇవ్వబోయాడు.
"రేయ్! నాకే లంచం ఇస్తావా.."
అని ముందు కొంచెం బెట్టు చేసి మెల్లగా ఎవరూ చూడకుండా తీసుకుని జేబులో పెట్టు కున్నా..
సుమారు యాభై వేలు వుండవచ్చు..
అమ్మాయి పెళ్ళికి ముందు ముందు చాలా ఖర్చు వుంది అని సర్ది చెప్పుకుని..
"బాబూ జాగ్రత్తగా వెళ్ళు, బ్రేక్ లు మార్చకుండా రోడ్డు మీదకి రావద్దు. ఈసారి దొరికితే వదిలేది లేదు." అని చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చారు సార్.
ఈ యాభై వేలు లంచం మా జీవితాలని ఎంత ఘోరంగా దెబ్బతీస్తుందో ఊహిస్తే ఆయన చిటికెన వేలుతో కూడా తాకేవారు కాదు సార్.
సుమారు 8 గంటలకి ఫోన్..
అమ్మ, నా భార్య, చెల్లి, మా ఇద్దరు పిల్లలు వున్న కార్ కి ఆక్సిడెంట్ అయిందని.
వెంటనే నేను ఆఫీసు నుండి, నాన్న ఇంటి నుండి హుటాహుటిన స్పాట్ కి వెళ్ళాము.
అక్కడ దారుణంగా వుంది సార్.
అందరు స్పాట్ లో చనిపోయారు.
పిల్లలనైతే గుర్తు పట్టడం కష్టం సర్.
బయటకి తీయడానికే 3 గంటల సమయం పట్టింది.
అంత బలంగా లారీ కొట్టింది. బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయ్యాయట సార్.
ఇంతలో నాన్న స్పాట్ కి వచ్చారు. ఆయనని పట్టుకోవడం ఎవరి తరం కాలేదు.. గుండెలు ఆవిసేలా ఏడుస్తున్నారు.
సడన్ గా ఆయన ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది.
పిచ్చాడు చూస్తున్నట్లు ఆ ఆక్సిడెంట్ చేసిన లారీ వైపు చూస్తూ వుండిపోయారు సార్.
మేము ఎంత పిలుస్తున్నా నిశ్చేష్టులై వుండిపోయారు.
ఒక డీప్ షాక్ లో వున్నట్లు వుండి పోయారు.
నోటివెంట మాటలేదు.. ఏడుపు లేదు.
తరువాత ఫార్మాలిటీస్ అన్నీ రొటీన్ గా జరిగిపోయాయి సర్."
ఉదయ్ నా వైపు చూసి ఒక్కసారి మౌనంగా అయ్యాడు.
నా కళ్ళలో సన్నగా నీటి పొర. కప్పులోని టీ మసకబారిపోయినట్టు.
“ఆ రోజు నుండే మా నాన్నగారు మారిపోయారు సర్.. ఆ ప్రమాదం చేసినటువంటి లారీని చూసిన క్షణం నుండే.. అందరి కన్నా ముందుగా ఆయనకే ఏదో అర్థం అయ్యింది.
ఆ లారీ నంబర్.. ఆ బాడీ డెంట్స్..
అదే లారీ.. అదే లారీ.. అని చిన్నగా సణుగుతున్నారు..
ఉదయం ఆయన పట్టుకున్న, ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న లారీ..
అలాగే, ఆయన జేబులోపెట్టుకున్న అదే కవర్..
ఓ నిశ్చేష్టత. ఓ అంతులేని ఖాళీ.
“అమ్మ, చెల్లి, నా భార్య, ఇద్దరు పిల్లలు.. ఐదు ప్రాణాలు..”
“ఆయన చేతిలో తీసుకున్న ఒక కవర్ కారణమైపోయిందనే భావన..”
ఐదు ప్రాణాల ఖరీదు యాభై వేలు
వాళ్ళ ప్రాణాలకి ఆయనే ఖరీదు కట్టిన ఫీలింగ్.
దేవుని తీర్పు ఇంత భయంకరంగా వుంటుందా ??
ఆ తర్వాతి రోజులు..
ఉదయ్ చెబుతుంటే, నా గుండెల్లో ఏదో బాధ.
"అప్పటి నుండి నాన్నగారు మాట్లాడడం తగ్గిపోయింది, అల్మోస్ట్ మర్చిపోయారని చెప్పవచ్చు సార్.
నడక.. బయటకి వెళ్ళడం.. తినడం.. పడికోవడం.. అన్నీ యాంత్రికంగా..
డాక్టర్లు “పోస్ట్ ట్రామాటిక్ షాక్” అన్నారు.
కాని మాకు తెలిసింది మాత్రం ఒకటే—
ఆయన మనసులో ఆ ప్రమాదం నిరంతరం రీప్లే అవుతోంది.
పట్టించుకుంటే మనిషిని పశ్చాత్తాపం ఎంతగా దహించి వేస్తుందో మా నాన్నని చూస్తే తెలుస్తుంది సార్.
ఒక్కో రోజు .. ఎవ్వరికీ చెప్పకుండా .. ఉదయం 5. 30కి లేచి ఇక్కడికి వచ్చేస్తారు సర్.
ఇంకెక్కడికి వెళ్లారు. అందుకే నేను కూడా పెద్దగా గాబరా పడను. తిన్నగా ఆ Y జంక్షన్ దగ్గరికి వస్తారు.
చేతితో స్లో సిగ్నల్ ఇస్తూ అందరి బ్రేక్ లు పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేస్తారట.
అదే gestures.. అదే seriousness.. అదే concentration..
అయితే ఆ సమయానికి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ వుండదు.
సూర్యుడు కూడా పూర్తిగా ఉదాయించడు.
చాలా తక్కువ vehicles వస్తుంటాయి.
కాని ఆయన మాత్రం
అక్కడే నిలబడి
“ఈరోజైనా ఒక్క ప్రమాదం కూడా జరగకుండా నేను చూస్తా..”
అన్నట్టుగా తన పని తాను చేసుకు పోతుంటారు.
అప్పటినుండి ఆయన ఒక్క కన్నీటిబొట్టు కూడా కార్చలేదు సార్
ఒక విధంగా చూస్తే..
ఆయన శిక్ష కూడా అదే.
ఆయన శాంతి కూడా అదే."
పట్టించుకుంటే మనిషిని పశ్చాత్తాపం ఇంతగా దహించి వేస్తుందా???
***
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం
