top of page

గుంటూరు గోంగూర 3'Gunturu Gongura - Part 3/3' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao Published In manatelugukathalu.com On 30/05/2024

'గుంటూరు గోంగూర - పార్ట్ 3/3' పెద్ద కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావుజరిగిన కథ:


మహేష్ ఒక సెలెబ్రిటీ. తండ్రి పేరు అమర్నాథ్. సోదరి చంద్రవంక. 


స్టార్ హోటల్ లో పార్టీ జరుగుతున్నప్పుడు అతని స్నేహితుడు మురళి పై అంతస్తునుండి కిందికి దూకి మరణిస్తాడు. 


మహేష్ అమెరికాకి బయలుదేరుతాడు. 

మహేష్ సోదరి చంద్రవంక భర్త పేరు గోవిందరావు. కూతురు అమృత. 

తండ్రి అమర్నాథ్ భర్తను అవమానించడంతో తండ్రిమీద కోపంతో అతనికి దూరమవుతుంది. 

అమృత పెరిగి పెద్దయ్యాక ఒక హోటల్ లో మహేష్ కొడుకును కలుస్తుంది. 

అతడు తనపేరు 'గుంటూరు గోంగూర' అని చెబుతాడు. 


ఇక గుంటూరు గోంగూర పార్ట్ 3 చదవండి. అపరిశుభ్రంగా ఉన్న గుంటూరు గోంగూర రూం చూడగానే అమృతకు వాంతి వచ్చినంత పనైంది. 


అది చూసిన గుంటూరు గోంగూర, " ఏమిటి అప్పుడే మూడో నెలా? అత్త కూతురా.. కత్తి చూపుల జాతర" అన్నాడు. 

"నువ్వింత రఫ్ గా తెలుగు మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావురా? అసలు పెళ్లే వద్దని అమెరికా వెళ్ళిన మా తమ్ముడు మహేష్ కు నువ్వెలా కొడుకువయ్యావు?


కొడుకువయ్యి ఇండియా ఎందుకు వచ్చావు? అమెరికా ప్రెసిడెంట్ మా తమ్ముడిని కిడ్నాప్ చేయడం ఏమిటి? నువ్వు గుంటూరు గోంగూరవు అవ్వడమేమిటి? ఇందులో ఏది నిజం? ఏది అబద్దం? అసలు నువ్వు నిజమేనా!?" గుంటూరు గోంగూర ను అడిగింది చంద్రవంక. 


"నేను నిజం, నువ్వు నిజం, నా పేరు గుంటూరు గోంగూర అన్నది పచ్చి నిజం. మా డాడీ.. అదే నీ బ్రదర్ ఫ్రెండ్ మురళీ ఆత్మహత్య చేసుకున్నాడు కదా? అతని చెల్లెలే మా మమ్మీ కేవీ. కే. వి అంటే కళ్యాణ వీణ. మా మమ్మీ కళ్యాణ వీణకు గుంటూరు గోంగూర పచ్చడి అంటే ఇష్టం. కాదు కాదు మహా ప్రాణం. ఈ రోజుకి ఈ స్టోరీ చాలు. మిగతా స్టోరీ వినాలంటే నీ కూతురు గుంటూరు వెళ్ళి, తన స్వహస్తాలతో గుంటూరు గోంగూర ను తెచ్చి గుంటూరు గోంగూర పచ్చడి చేసి పెట్టాలి. లేకుంటే స్టోరీ కట్. మీలో టెంక్షన్ పుల్. " చంద్రవంక తో అన్నాడు గుంటూరు గోంగూర. 


"అమృత కు గోంగూర పచ్చడి చేయడమైతే రాదు. పచ్చడి బండతో తల పగలగొట్టడమైతే వచ్చు. " అంది చంద్రవంక. 


"అయితే నేను తర్వాత కథ చెప్పను. నా కథలో గోవిందరావు మామాజీ కూడా కంస మామాజీ లెవల్ కి కొంచెం ఎక్కువ లెవల్ లోనే ఉంటాడు. " అన్న గుంటూరు గోంగూర మాటలు విని తన తండ్రి గురించిన సమాచారం మరింత తెలుసుకోవాలన్న ఆతృతతో అమృత గోంగూర పచ్చడి నూరడం ప్రాక్టీస్ చేసింది. 


గుంటూరు గోంగూరతోనే పచ్చడి చేయాలన్న గుంటూరు గోంగూర కండీషన్ అనుసరించి గుంటూరు గోంగూర కొనడానికి తల్లితో గుంటూరు వెళ్ళింది. గోంగూర కోసం గుంటూరు గోంగూర చెప్పిన షాపుకే వెళ్ళింది. 


అక్కడ గుంటూరు గోంగూర అమ్ముతున్న మేఘన చంద్రవంకను చూసి, ‘బాగున్నావా?’ అంటూ గుంటూరు గోంగూర ఇచ్చింది. 


"మీరెవరు?" మేఘనను అడిగింది చంద్రవంక. 


"నేనెవరో గుంటూరు గోంగూర కు బాగా తెలుసు. వెళ్ళి అతగాడినే అడుగు. " చంద్రవంక తో అంది మేఘన. 


"ఆ విషయం నువ్వు మాకు చెప్పనవసరం లేదు. ఆ గుంటూరు గోంగూరనే అడుగుతాం.. కావాలంటే కడుగుతాం. అసలు ఆ గుంటూరు గోంగూర ఆప్ట్రాల్ నాలుగు కట్టల గోంగూర కోసం నీ దగ్గరే గోంగూర కొని తీసుకురమ్మని మమ్మల్ని ఇక్కడికే ఎందుకు పంపాడు?" మేఘనను అడిగింది అమృత. 


"తనవారు చేసిన తప్పు గురించి తెలుసుకునే ముందు తనవారి వలన నష్టపోయిన వారి ముఖం చూస్తే తనవారెంత దుర్మార్గులో వారు ఆలోచించే అవకాశం స్పష్టంగా వస్తుందని గుంటూరు గోంగూర నమ్మకం. అందుకే మిమ్మల్ని గుంటూరు గోంగూర నా దగ్గరకు పంపాడు. " అంది మేఘన. 


అమృత గుంటూరు గోంగూర తో పచ్చడి చేసి, గుంటూరు గోంగూర కు పెట్టి, "ఆమె ఎవరు?" అని గుంటూరు గోంగూర ను అడిగింది. 


"ఆమె మురళి అంకుల్ భార్య మేఘన. ఆ రోజు మురళి అంకుల్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం మీ డాడీ గోవిందరావు. 


మురళీ అంకుల్, మా డాడీ ప్రాణ స్నేహితులు. 

మీ డాడీకి మా డాడీనే మురళీ అంకుల్ ని పరిచయం చేసాడు. 


మీ డాడీ మా డాడీని, తాతయ్యను, పెదనాన్న ను చెప్పు చేతల్లో పెట్టుకుని సమస్త ఆస్తుల మీద పెత్తనం చెలా యించాలనుకున్నాడు. 


ఈ విషయాన్ని మీ మమ్మీ గమనించలేదు. మీ మమ్మీ మీ డాడీ ని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రేమించింది. 

మీ డాడీ మాత్రం మనీనే  ప్రేమించాడు. 


మీ డాడీ నే మా డాడీ ని వ్యసనాలకు బానిసను చేసి, పెళ్ళంటే విరక్తి కలిగేటట్లు చేసాడు. 

ఈ వాస్తవాలను మీ మమ్మీ గమనించలేదు. మురళి అంకుల్ గమనించాడు. తాతయ్య గమనించాడు. 


ఒకసారి మీ డాడీ మా డాడీకి అసభ్యకర ఆడవాళ్ళ ఫోటోలు చూపిస్తూ, ఆడవాళ్ళంత కొంచెం అటూ ఇటూ అంతే అనడం తాతయ్య కిటికీ చాటునుండి విన్నాడట. 


అప్పుడే తాతయ్య అందరికి ఆస్తులను సమానంగ పంచేసాడట. మీ మమ్మీ ఈ వాస్తవాలను గమనించకుండా రాజసం తో కాలం గడుపుతూ, భర్తనే వెనకేసుకు వచ్చేదట. 

తాతయ్య ఆస్తులను సమానంగా పంచినా మీ డాడీ మారలేదు. 


మా డాడీ ని పదిమంది ఆడవాళ్ళ నడుమనే తిప్పేవాడట. అది మురళి అంకుల్ కి నచ్చేది కాదట. మా డాడీ సంపదను సృష్టించడం లో మహా నేర్పరి అవడంతో మీ డాడీ మా డాడినే అంటి పెట్టుకొని ఉండేవాడట. అయితే అనుక్షణం చెత్త సలహాలను, అసభ్య సలహాలను ఇచ్చేవాడట. మా డాడీ మీ డాడీ మాటలు విన్నప్పటికీ మురళీ అంకుల్ మాటలే వ్యాపార విషయంలో అనుసరించేవాడట. 


 ఒకసారి ఒక స్త్రీని మీ డాడీ హత్య చేసి, ఆ నేరం మురళీ అంకుల్ మీద తోసేసాడట. మరలా మీ డాడీ నే తన పలుకుబడిని ఉపయోగించి మురళీ అంకుల్ ని రక్షించినట్లు నటించాడట. ఆ తర్వాత “నిన్ను నేను పూర్తిగా కాపాడతా. నువ్వు మహేష్ ని హత్య చెయ్యి. మేడ మీదనుండి తోసెయ్యి. లేకుంటే నిన్ను చెరసాలకు పంపుతా” అని మీ డాడీ మురళి అంకుల్ ని బెదిరించాడట. 


 ఆ రోజు పార్టీ జరిగినప్పుడు మురళి అంకుల్ మా డాడీ ని చంపలేక ‘నువ్వు అమెరికా వెళ్ళిపో’ అని కాగితం వ్రాసి ఇచ్చి, మేడ మీద నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. 


 అమెరికా లో డాడీని మురళి అంకుల్ చెల్లెలు కళ్యాణ వీణ కలిసింది. జరిగినదంత డాడీ కి చెప్పింది. మురళి అంకుల్ లోని చిన్న చిన్న బలహీనతలే అతని చావుకు కారణమైనవని చెప్పింది. డాడీ ఆలోచనలను మార్చింది. వివాహ బంధంలోని మాధుర్యాన్ని తెలియ చేసింది. " అన్నాడు గుంటూరు గోంగూర. 


"ఆ తర్వాత ఆ కళ్యాణ వీణ నీ అయ్యకు పెళ్ళాం అయ్యింది. అంతేగా.. " గుంటూరు గోంగూర తో అంది చంద్రవంక. 


"అంతేగాదు. మా మమ్మీ కేవి అంటే కళ్యాణ వీణ, మన సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తుంది. అప్పుడు మన వంటలను స్వహస్తాలతో చేసి అమెరికా వారికి వడ్డించేది. వారందరికీ మమ్మీ స్వహస్తాలతో చేసి వడ్డించే గుంటూరు గోంగూర పచ్చడి అంటే మహా ఇష్టమయ్యేది. అలా నేను అక్కడ గుంటూరు గోంగూర గారి అబ్బాయి ని అయ్యాను. ఇక్కడకు వచ్చి గుంటూరు గోంగూర ను అయ్యాను. " అన్నాడు గుంటూరు గోంగూర. 


" అది సరే, నువ్వు ఇప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చావు రా? అత్తా అత్తా మేనత్త.. నీ మొగుడు మర్డర్ కి గురయ్యాడు. చూస్తూ చూస్తూ ఇంకా నీ కూతురుకి ఎవరూ పిల్లగాడిని ఇవ్వరు. కాబట్టి నీ కూతురు ని నేను ఉంచుకుంటానని చెప్పడానికి వచ్చి, ఇన్ని డ్రామాలు ఆడావా?" గుంటూరు గోంగూర కళ్ళలోకి కోపంగా చూస్తు అంది చంద్రవంక. 


"అంత మాట అనేసావేమిటి అత్తా! నేను నీ తమ్ముని బిడ్డనత్త. ఎన్ని వేషాలు వేసిన సంస్కారం లేని పనులు చేయనత్త. " చంద్రవంకతో అన్నాడు గుంటూరు గోంగూర. 


"నా భర్త గురించి నాకంతా తెలుసురా.. అవసరం అనుకుంటే నా భర్త కోసం నా తండ్రి, నా తమ్ముళ్ళు అంతా అంతా ఆఖరికి ప్రాణమైన సరే ఇచ్చేస్తారని కూడా నాకు తెలుసు. 

 విషనాగుని పుట్టలో ఉంచాలి లేదా బుట్టలో ఉంచాలి. దేవాలయంలో ఉంచకూడదు. అందుకే నేను నా తండ్రితో గొడవ పడి బయటకు వచ్చేసాను. 


ఏదేమైన నా భర్తను నేను ప్రేమించాను. అందుకే ఆయన ఏం చేసిన భరించాను. తల్లిగా ఈ విషయాలన్నీ నేను అమృత కు చెప్పలేను. ఇప్పుడు నీ ద్వారా తెలిసాయి. ఓ. కే. ఏదేమైనా దేవుడు ఉన్నాడు చూసావు.. వాడు మహా మహా మాయగాడు రా.. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరితో నిజాన్ని కక్కిస్తాడు ‌. ఇది నిజం. నిజం కక్కిస్తాడు. అందుకే వాడు దేవుడయ్యాడు. నిజం చెప్పాలంటే నిజమే నిజమైన దేవుడు. " గద్గద స్వరంతో అంది చంద్రవంక. 

"నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి రావడానికి పెదనాన్న రాజేష్ ప్రధాన కారణం అని చెప్పాలి. తాతయ్య ఆస్తులను పంచేసాక పెద్ద నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తన ఒక్కగానొక్క కూతురు జలజక్క ను మెడిసి న్ చదివించసాగాడు. అప్పుడు కూడా గోవిందరావు మామయ్య మెడికల్ సీటు, ఆ తర్వాత గవర్నమెంట్ డాక్టర్ పోష్టు ఇప్పిస్తానని పెదనాన్న దగ్గర ఇరవై ఐదు లక్షల వరకు నొక్కేసాడట. ఆ తర్వాత మొఖం చాటేసాడట. 


జలజక్క మామయ్యను నిలదీసి అడిగితే, మీ అత్తను పెళ్ళి చేసుకున్నాను. నిన్ను ఉంచుకుంటాను అని జలజక్క చేతిలో చెప్పుదెబ్బలు తిని నవ్వుతూ వెళ్ళిపోయాడట. 


 జలజక్క కష్టపడి చదివి, అమెరికా లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అప్పుడు పెదనాన్న జరిగిందంతా డాడీకి చెప్పారు. 

తాతయ్య బంధువులందరికీ దూరంగా ఎక్కడో హాయిగా ఉంటున్నారని తెలిసింది. ఈ విషయాలను తాతయ్య కు చెప్పి ఆయన మనసును బాధ పెట్టడం మమ్మీ కి ఇష్టం లేదు. 


 మామయ్య మర్డర్ కి గురయ్యాడని పేపర్స్ లో చూసాము. అది మర్డర్ కాదు సూసైడ్ అని కొందరు అన్నారు. 

 మమ్మీ మీ గురించి తెలుసుకుని అసలు విషయం చెప్పమని మేఘన ఆంటీ దగ్గరకు పంపింది. మేఘన ఆంటీ వాళ్ళ బంధువులదే ఆ హోటల్. ముందుగా ఈ విషయాలన్నీ తాతయ్యకు చెప్పవద్దంది. అందుకే తాతయ్య ను ఇంకా కలవలేదు. " చంద్రవంక ముందు తలవంచుకుని అన్నాడు గుంటూరు గోంగూర. 


 "మా నాన్న గారు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు" అని చంద్రవంక అమృత గుంటూరు గోంగూర ని తండ్రి అమర్నాథ్ దగ్గరకు తీసుకువెళ్ళింది. 


"నా విషయంలో అల్లుడు దశమ గ్రహం కాదు శని గ్రహం అయ్యాడు. " అన్నాడు అమర్నాథ్. 


ఆ తర్వాత అందరూ అమెరికా నుండి వచ్చారు. 

గుంటూరు గోంగూర పెళ్లి అమృత తో నిశ్చయమైంది. 

"ఇంతకీ గుంటూరు గోంగూర అసలు పేరేమిటి?" పురోహితునితో పాటు అందరూ కళ్యాణ వీణ ను మహేష్ ను అడిగారు. 


గుంటూరు గోంగూర అసలు పేరు చెప్పడానికి కళ్యాణ వీణ తన డైరీ తీసింది. 


"అమరానంద ఇంద్ర ఈశ్వర ఉత్సాహ ఊహేశ్వర…” అంటూ గుంటూరు గోంగూర అసలు పేరును కళ్యాణ వీణ చదవసాగింది.

 

"ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రోటి పచ్చడి రోటి పచ్చడే. గుంటూరు గోంగూర పచ్చడి గుంటూరు గోంగూర పచ్చడే.. " అంటూ చంద్రవంక గుంటూరు గోంగూర పచ్చడితో అందరి దగ్గర కు వచ్చింది. 

"ఏవమ్మో కొండవీటి చాంతాడుకు హనుమంతులవారి తోక కలిపితే ఎంతవుతుందో ఆ పేరు అంత ఉంది. ఆ పేరంత శుభలేఖ లో పట్టదు. అందుకే శుభలేఖ లో గుంటూరు గోంగూర అని వ్రాసేస్తాను. శుభం అనేస్తున్నాను. ఎవరూ తుమ్మకండి. " అంటూ లఘ్న పత్రికను చదవసాగాడు పెళ్ళిళ్ళు చేసే పురోహితుడు.

=======================================================================

 శుభం భూయాత్ 

=======================================================================

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


 27 views0 comments

Comments


bottom of page