ఇంకా అమ్మాయిలపై వివక్షా?
- A . Annapurna

- Nov 6
- 3 min read
#AAnnapurna, #అన్నపూర్ణవ్యాసాలు, #InkaAmmayilapaiVivaksha, #ఇంకాఅమ్మాయిలపైవివక్షా

Inka Ammayilapai Vivaksha - New Telugu Article Written By A. Annapurna
Published in manatelugukathalu.com on 06/11/2025
ఇంకా అమ్మాయిలపై వివక్షా? - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
ఎటు పోతున్నాం మనం? ఈ శతాబ్దంలో కూడా అబ్బాయి– అమ్మాయి వివక్షత కొనసాగుతూ ఉండటం బాధ కలిగిస్తుంది. అన్నిటా నవనాగరికతను అనుసరిస్తూ, అమ్మాయి అంటే నిర్లక్ష్యం చూపించే సమాజం ఏమి మారినట్టు వుంది? వున్నత చదువులు చదివిన వారుకూడా పరువు హత్యలకు పాల్పడుతూ, పరువు కాపాడుకున్నాం అనే భ్రమలో మునిగిపోతున్నారు.
అసలే అబ్బాయిలకు తగినట్టు అమ్మాయిలు దొరకడంలేదు. వారి నిష్పత్తి తగ్గిపోఇంది. దేశ జనాభా 145.09.
వీరిలో 68.59 మంది మహిళలు ఉంటే, యువతులు 1000 మంది అబ్బాయిలకు 907 మంది అమ్మాయిలు ఉన్నారు అని జనాభా లెక్కలు చెబుతున్నాయి.
పెళ్లి అయినా మహిళలు పెడదారిలో నడుస్తూ కన్నబిడ్డలనే కర్కశంగా కడతేర్చడం వింటున్నాం.
ఇదేం దౌర్భాగ్యం? కారణాలు: మత్తుమందులు, కల్తీ ఆహారంతో ముప్పుతెస్తున్న హార్మోన్ స్టెరాయిడ్స్, పాలు, పెరుగు, ఆన్లైన్ ఫుడ్, హోటల్స్, పార్టీ సంస్కృతి.... ఇలా చెప్పాలి అంటే లెక్క లేదు.
నియంత్రణ లేని సినిమాలు, టీవీ సీరియల్స్ — ఒకటేమిటి అన్ని. స్వచ్ఛత అనేది ఎక్కడ కనబడటం లేదు. ఒక చోట చెప్పినట్టు డాక్టర్ రిపోర్ట్ ఇవ్వలేదని, ఆమెను హింసించి, ఆత్మహత్యకు కారణమైనవారికి శిక్షలు ఉండటమే లేదు.
చదువులు లేక ఆర్ధికంగా భర్త మీద ఆధారపడిన రోజు హింస తప్పలేదు. చదువు, ఉద్యోగం, ఉన్నదైన ఉంటుందని కూడా బయట వేధింపులు ఎక్కువ అయ్యాయి. అంటే మహిళాగతి ఎప్పుడూ ఒకలా ఉంటుంది. పెళ్లి వద్దు.... ఒంటిరాగా ఉండటం అంటే మరో రకమైన ఇబ్బందులు. వయసు మించి పెళ్లి చేసుకుంటే అప్పటికే పెళ్లి అయ్యాక మోసం చేసేవారు....ఇలాప్రతి విషయంలో అమ్మాయిలు దగా పడుతున్నారు.
''పూర్వకాలమే బాగుంది. ఒక వయసు వచ్చాక హై స్కూల్ చదువు అయ్యాక పెళ్లిచేసేవారు. ఇప్పుడా అసలు అమ్మాయిని పట్టుకోగలమా? పెళ్లి గురించి మాట మాట్లాడకూడదు. ఇప్పుడుకాదు అంటూ సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఉన్నదా ఒకరొ ఇద్దరో. వీళ్లు అసలు చెప్పిన మాట వినరు. బాయ్‌ఫ్రెండ్స్, తిరుగుళ్ళు, పబ్బులు.. వీటికి ఇప్పుడు కొత్త కొత్త పేర్లు.'' అంటూ ఇంట్లో బామ్మలు గొణుగుతూ ఉంటారు.
అమ్మాయిలు అంత వయసు వచ్చి, అన్ని తెలిసి కూడా అమ్మా నాన్నల మాట వినిపించుకోరు. నిజమే.పెళ్లి అంటే విముఖత. స్వేచ్ఛపట్ల అనురక్తి. ఎటూకాకుండా పోతున్నారు. ఈ మిశ్రమ జీవన విధానం చేటు తెస్తోంది. అమ్మాయిలకు ఒక పద్ధతి, పెళ్లి వయసు, సంతానం — అంటే ఎలాంటి ప్లాన్ ఉండదు. ఆలస్యంగా పెళ్లి చేసుకుని, పిల్లలు కలగక, కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించడం.ఇది సంతాన సాఫల్య కేంద్రాలకు వరంగా మారింది. ఎన్నో అక్రమాలు చేసి డబ్బు దోచుకుంటున్నారు వాళ్లు.అనుభవంతో చెప్పే అమ్మా నాన్నల మాట వినండి. మంచి మార్గంలో వివేకం పెంచుకోండి.
సరైన సమయంలో ఇరవై ఐదు దాటకుండా పెళ్లి చేసుకోండి. నియమబద్ధమైన జీవితం గడపండి. అప్పుడు అందరికి హ్యాపీగా ఉంటుంది.
ఇప్పుడే ఒక వార్త విన్నాను. ఆంధ్రాలో జంగారెడ్డిగూడెం అనివూళ్ళో ఒక మహిళకు ఇద్దరు కొడుకులు — చిన్న కొడుక్కి మగబిడ్డ పుట్టింది. పెద్దకొడుక్కి సంతానం లేదు. కనుక రెండో కోడలు బావగారి ద్వారా ఇంటికి వారసుడిని కని ఇవ్వాలి... అని కోడలిని కొడుక్కి దూరంగా పెట్టి వేధించడం మొదలుపెట్టింది. పదిరోజులు ఆహారం నీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించి వేధించింది. ఏమిటీ ఈ దురాగతం. చిన్నకొడుకు బిడ్డ ఇంటికి వారసుడు కాదా?? ఇదెక్కడి వారసత్వం! ఎవరు ఎవరికీ చెప్పి పెడతారో. లేదా ఆ మహిళకు బుద్ధి, జానం లేవా?
*******************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)





Comments