జన్మజన్మల అనుబంధం
- Bhallamudi Nagaraju

- Dec 22, 2025
- 2 min read
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #JanmajanmalaAnubandham, #జన్మజన్మలఅనుబంధం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Janmajanmala Anubandham - New Telugu Poem Written By Bhallamudi Nagaraju Published In manatelugukathalu.com On 22/12/2025
జన్మజన్మల అనుబంధం - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
నేల తల్లిని నమ్ముకున్న రైతన్న
పుడమి తల్లికి పురుడు పోసి
పసిమి పంటలను కాపు కాసి
ధాన్య రాసులు కుప్పపోసి అమ్మబోతే!
వానలు వరదలు వచ్చి
పండిన గింజలు తడిచి
మొక్కలు వస్తే
బోరుబోరున విలపించి
ఇంటిల్లి పాదిని పస్తులుంచి
గింజలు అమ్ముకుందికి
రోడ్డు ఎక్కిన రైతన్నలను
ఖాఖీ బూట్లు కడుపులో తన్ని
ఈడ్చి ఈడ్చి తరిమికొట్టె!
కంటి తుడుపు మాటలు
ఓదార్పు యాత్రలు
సాయపడని నేతలు
రైతన్నను కృంగ దీసినా
చెమట చుక్కలతో
నేల తల్లికి అభ్యంగన స్నానం చేయించి
పుడమి తల్లి పై మోకరిల్లిన
రైతన్న-భూ మాత లది
ఒకరికొకరు
విడదీయ రాని బంధం
జన్మ జన్మల అనుబంధం
***
భళ్లమూడి నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
భళ్లమూడి నాగరాజు ఒడిశా రాష్ట్రం రాయగడ కు చెందిన కవి ,రచయిత . వీరు విజయనగరం జిల్లా బొబ్బిలి లో 1962 లో జన్మించి విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేశారు.బొబ్బిలి రాజా ఆర్ ఎస్ ఆర్ కే రంగారవు కళాశాలలో చదువుతున్న సమయం లోనే కళాశాల వార్షిక సంచిక కోసం తొలి “యువతా మేలుకో”కవిత రాయగా,వార్షిక సంచికలో ప్రచురితం అయింది . ఉద్యోగ రీత్యా 1987 నుంచి రాయగడ లో ఉంటున్న వీరు స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ, రాయగడ రచయితల సంఘం వంటి సంస్థల్లో కీలక సభ్యులు గా ఉన్నారు. ఇప్పటివరకూ 37 కథలు వివిధ వార, మాసపత్రికల్లో ప్రచురితం అయ్యాయి. బామ్మ మనసు, సుబ్బారావు పెళ్లి, విజిటింగ్ కార్డు కథలు మంచి గుర్తింపు తెచ్చాయి.పలు కవితలు, వ్యాసరచనల పోటీల్లో బహుమతులు పొందారు. 118 కవితలు దిన, వార , మాస,వెబ్ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. వీరిని గురజాడ ఫౌండేషన్ (అమెరికా)రాయగడ శాఖ వారు “సాహితీరత్న” అవార్డు తో సత్కరించారు. కవి, రచయిత గానే కాక వీరు నటుడుగా గుర్తింపు పొందారు. 2017 లో విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియం లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నటించి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే ప్రశంసాపత్రం అందుకున్నారు.
భళ్లమూడి నాగరాజు,
కవి ,రచయిత ,
రాయగడ




Comments