top of page

జీవితం విలువైనది'Jeevitham Viluvainadi' - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 05/01/2024 

'జీవితం విలువైనది' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్''డాడీ ! ఇదినేను చివరిసారిగా పిలిచే పిలుపు. ఇంతటితో మీకు నాకు వుండే సంబంధం కట్ అవుతుంది. ఈ మాట చదివి మీరు ఎంత బాధపడతారో.. నాకు తెలిసే రాస్తున్నాను. 


అవును. మీరు బాధపడాలి. ఎందుకంటే నేను కోరుకున్న ప్రవీణ్ ని మీరు ఇష్టపడలేదు. అందుకు శాస్తిగా మీరుకూడా బాధపడాలి. ఇదే నాకోరిక. 


అవును. నాకు ప్రవీణ్ మీకంటే వేయిరెట్లు ఎక్కువ. అతడులేకపోతే నేను ఉండను. నేను అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను.. అని మీతో చెప్పాను. నామీద ప్రేమవుంటే మీరు వైభవంగా పెళ్లి చేయండి.. అని అడిగాను. 

కానీ మీకు ప్రవీణ్ నచ్చలేదు. అతడి కులం, చదువు, పేదరికం.. ఇవేమి మీకు నచ్చవు. నాకంటే మీకు డబ్బు, హోదా ఎక్కువ.. పద్దెనిమిదేళ్లు మీతో పెరిగిన నాకు ఈ జీవితం విసుగు వచ్చింది. 


ప్రవీణ్తో కలిసివుండే జీవితమే నాకు కావాలి. అందుకే ప్రవీణ్తో కలిసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మీ డబ్బు, పోలీసు రిపోర్ట్, లాయర్లు నన్ను ఏమి చేయలేవు. నేను మేజర్ని. 

 నా నగలు, అమ్మనగలు, కొంత డబ్బు తీసుకు వెడుతున్నాను.. 

అందుకు క్షమించండి. నేను ప్రవీణ్ ఉద్యోగాల్లో చేరాక తిరిగి ఇచ్చేస్తాను. 

గుడ్ బై !


రంజని, వుత్తరం రాసి తలగడ కింద పెట్టింది. తెల్లవారగట్ల వొంటిగంటకు ఫోనులో అలారం సెట్ చేసుకుంది. 

సూట్ కేసు లో కొన్ని డ్రెస్సులు డబ్బు నగలు సర్దుకుంది. 

రేపటి రోజుకోసం ఎదురుచూస్తూ నిద్రపోయిన్ది. 


 'ఈరోజు రంజని ఎందుకో చాలా సంతోషంగా వుంది. నాతొ చాలా కబుర్లు చెప్పింది. రాత్రి బీరువా తలుపులు తీయడం శబ్దాలు వినిపిస్తే ఎంత శ్రద్ధ వచ్చింది, ఎప్పుడూ తన వస్తువులు నేనే సర్దాలి. 


ఈరోజు తానే సర్దుకుందేవిటో.. బాధ్యత తెలుస్తోంది.. 'అనుకుంది.. సరళ కూతురిని చూసి. 


 ఫోనులో చాలాసేపు ప్రవీణ్ తో మాటాడటం అలవాటే ! వద్దు, డాడీకి తెలిస్తే తిడతారు అతడితో స్నేహం వదులుకో.. అని ఎన్ని సార్లు చెప్పినా మానడంలేదు. ఈ రోజుల్లో పిల్లలకు అమ్మ నాన్నల గారం ఎక్కువైంది. 

చెప్పినమాట వినడంలేదు. 


 మగపిల్లలతో తిరగడం, పార్టీలు అంటూ అర్ధరాత్రి ఇంటికి రావడం.. ప్రేమ- పెళ్లి అంటూ ఎదిరించడం..

ఏమి కొంప ముంచుతారో !

 నేను కాలేజీకి వెళ్లినా అబ్బాయిలతో మాటాడలేదు ఎప్పుడూ. నాన్నగారికి తెలిస్తే చదువు మానిపిస్తారు.. అని, భయం ఉండేది. 


డబ్బులోపుట్టి డబ్బులోపెరిగి విలువలు తెలియకుండా పెరుగుతున్నారు.. ఈ నాటి యువతరం. 

ఆధునిక జీవితానికి అలవాటు పడ్డారు. అనుకుంటూ చాలాసేపు మేలుకునే వుంది. 


 ప్రవీణ్ రంజనితో ముందే తన ప్లాన్ చెప్పేడు. 

''నువ్వు నీ సామాను తీసుకుని మీ ఇంటి వెనుక గోడ దగ్గిర వుండు. నేను రెండు గంటలకు వచ్చి నిన్ను తీసుకు వెడతాను. మనం తిన్నగా గోవా వెళ్లి అక్కడ చర్చిలో పెళ్లి చేసుకుందాం. 


మా అంకుల్ అన్ని ఏర్పాటు చేశారు. అక్కడే హోటల్ బుక్ చేశారు. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోవుండి జాబ్ వెదుక్కుంటాను. ఇకనుంచి మనిద్దరం ఒక్కటి. ''


 ''ఓ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు ఎంత థ్రిల్గా ఉందొ '' అంటూ అతడిని అతుక్కు పోయి మురిసిపొయిన్ది రంజని. 


''అవును ఇక మనం ఎవరికీ భయపడక్కరలేదు. ఒక్క క్షణం విడిచి ఉండక్కరలేదు. కొన్ని రోజులకు మీ డాడీ వెదుక్కుంటూ వచ్చి ఇంటికి పిలుస్తారు. '' అన్నాడు ప్రవీణ్. 


అసలు వాళ్లిద్దరూ ఎలా ఆకర్షణలో పడ్డారంటే.. , 

 ''రంజని, నేను రెండు రోజులు క్లాసులు మిస్ అయ్యాను. నీ నోట్స్ ఇస్తావా.. ?” అని అడిగాడు ఒకరోజు ప్రవీణ్.


 'ఏం? ఎందుకు మిస్ అయ్యావు?” అడిగింది రంజని.. 

''మా అమ్మ కి హార్ట్ ఎటాక్ వస్తే హాస్పిటల్లో చేర్చాం. '' అన్నాడు ప్రవీణ్. 


'అయ్యో, ఇప్పుడెలా వున్నారు? మరి హాస్పిటల్లో ఇప్పుడు ఎవరు వున్నారు ఆవిడ దగ్గిర?''


''మా అన్న వచ్చాడులే.. పర్వాలేదు ''


''నీకు హెల్ప్ కావాలంటే చెప్పు మనీ ఇస్తా మాడాడీ ని అడిగి''


''థాంక్స్. అవసరం ఐతే అడుగుతాను.. అన్నాడు ప్రవీణ్. 


అలా మొదలైన వాళ్ళ స్నేహం.. '. ప్రేమ అంటే ఇదే.. సినిమాల్లో చూపిస్తారు అలా.. 'అనుకుని సినిమాలు

షికార్లు పార్టీలు అంటూ ఇష్టం వచ్చినట్టు తిరిగే స్థాయికి చేరుకుంది. 


మామూలే, మమ్మి అడిగితె స్పెషల్ క్లాసులని ఫ్రెండ్కి సహాయం వెళ్లెనని.. అబద్ధాలు చెప్పడం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం.. ఇద్దరూ హద్దులు మీరడం దాకా వెళ్ళింది ఇంటర్ మొదటి ఏడూ. 


ఇప్పుడు రెండో ఏడు రంజని- ప్రవీణ్ ఇల్లు విడిచి గోవా వెళ్ళేదాకా వచ్చింది.. ఆమైకం. 


నిద్ర లేని సరళ కూతురు గదిలోకి వెళ్లి చూసింది. 

ఆరూంకి రెండో కీ మమ్మి దగ్గిర ఉందని రంజనికి తెలియదు. 

సరళ కూతురు బెడ్ దగ్గిరకు వెళ్ళింది. తలగడ కిందవున్న లెటర్ చివర కనబడితే బయటకు తీసి చదివింది. 

నిర్ఘాంతపోయి, చేతిలోవున్న ఫోనుతో ఫోటో తీసి లెటర్ అక్కడే వదిలి తన బెడ్ రూంలోకి వెళ్ళిపొయిన్ది

సైలెంట్గా ! భార్గవతో వుత్తరం సంగతి చెప్పింది. భార్గవ స్నేహితుడు డా. ధర్మ తేజతో మాటాడితే అతను

నిద్రమాత్ర కలిపిన పాలు తాగించి వాళ్ళ ఇంటికి తీసుకు రమ్మన్నాడు. 


రంజని కళ్ళు తెరిచి చూస్తే తన బెడ్ మీద కాకుండా వేరే రూంలో ఉన్నట్టు అర్ధమై ఫోన్ తీసుకుని చూసింది. 


ఫోను సైలెంట్ మోడ్లో ఉంటే ఆన్ చేసింది. ప్రవీణ్ నుంచి మిస్సెడ్ కాల్స్ నాలుగు వున్నాయి. 

అతడికి కాల్ చేసింది వెంటనే !


''హలొ రంజని.. నేను ఇప్పుడు గోవాలో వున్నాను. మనం తప్పు చేస్తున్నాం.. చదువులేదు మంచి జాబ్ ఎలా వస్తుంది? మన పెళ్లి మీ ఇంట్లో ఇష్టంలేదు మా ఇంట్లో ఇష్టంలేదు. కనుక నా నిర్ణయం మార్చుకుని

ఒక్కడినే వెళ్ళాను. 

నువ్వు బాగా చదువుకుని మీ డాడీ చెప్పినట్టు విను. ఇక ఫోన్ చేయద్దు. బాయ్.. ! అంటూ మరోమాట లేకుండా ఫోన్ ఆఫ్ చేసాడు ప్రవీణ్. 


ప్రవీణ్ సడెన్గా ఇలా మారిపోయాడేమిటి? ప్రేమ -పెళ్లి అంతా ఒట్టిదేనా ? నాకేమిటి ఇలా మైకంగా వుంది!

 ఇక్కడికెలా వచ్చాను. ఇది డాక్టర్ అంకుల్ ఇల్లు.. అనుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది. 


హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గిర మమ్మి డాడీ అంకుల్ ఫామిలీ వున్నారు. 


రంజనిని చూసి ''గుడ్మార్నింగ్ రంజూ.. ఎలావుందీ ఇప్పుడు?” ఆత్రంగా వచ్చి సరళ కూతురిని దగ్గిరకు తీసుకుంది. 


''అవునమ్మా.. నీకు సడన్గా హెల్త్ అప్సెట్ ఐతే డాడీ తీసుకువచ్చారు. నీకు మాఇల్లు అలవాటుగా. 

రెస్ట్ కోసం మా ఇంట్లోనే ఉంచి టాబిలెట్ ఇచ్చాను. ఎలా వుంది ?” అడిగాడు డాక్టర్ ధర్మతేజ.

 

''పర్వాలేదు అంకుల్. థాంక్స్..” అని చెప్పి ఆంటీ ఇచ్చిన మిల్క్ తాగింది. 


 డా. తేజ ఇంట్లో లంచ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాక భార్గవ చెప్పేడు. 

 ''రంజితా ! నువ్వు కాలేజీకి సరిగా వెళ్ళలేదు. ఇంటర్ లో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. సరే నీ ఆరోగ్యం బాగాలేదు. సరిగా చదవలేదు. నిన్ను విదేశాలకు పంపి బాగా చదివించాలని ఆశ పడ్డాను. 


నా చిన్నతనంలో మార్క్స్ బాగా వచ్చినా విదేశాలకు వెళ్లి వున్నత చదువులు చదవలేక పోయాను నేను! తాతగారికి చిన్న వుద్యోగం. బాధ్యతలు ఎక్కువ అయినందువల్ల నా కోరిక తీరలేదు. నీకు అలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్ను ఎక్కడైనా చదివించగలను. 


కానీ మెరిట్లో చదవి మంచి యూనివర్సిటీలో సీటు తెచ్చుకోడం నీకు ఉపయోగ పడుతుంది.. ఏమి చేస్తావు? ఇంతటితో చదువు ఆపేస్తావా! లేక పెళ్లి చేయమంటావా?”

 

''నేను శ్రద్ధగా చదివి మీ కోరిక తీరుస్తాను. పెళ్లి చేసుకుంటే ఈ చదువుతో ఇంటికే పరిమితం కావాలి. కాలేజీలో చేరుతాను. '' అంది రంజిత.

 

డొనేషన్ కట్టి ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పించాడు భార్గవ. 

చెప్పిందికాని రంజిత సరిగా చదువుతుందని అనుకోలేదు. మొదటి ఏడూ రెండోయేడు భార్గవ అనుకున్నట్టే

యావరేజ్ మార్కులు వచ్చాయి. 


 మూడో ఏడాది ఫైనల్ ఇయర్ అనూహ్యంగా అందరినీ దాటి కాలేజీ ఫస్ట్ తెచ్చుకుని అమ్మ నాన్నలనే కాదు,

ఫ్రెండ్స్ కి షాక్ ఇచ్చింది. 

 భార్గవ ఆనందానికి అంతులేదు. 

''ప్రౌ డాఫ్ యూ మై బేబీ '' అంటూ హృదయానికి హత్తుకుని మనసారా కూతురిని అభినందించాడు. 


“వాట్ నెక్స్ట్?” అన్నాడు. 


''మా ఫ్రెండ్స్ నలుగురం కొన్ని యూనివర్సిటీలకు అప్లై చేస్తున్నాం.. నాకో లక్ష రూపాయలు ఇవ్వండి '' అంది. 


''ఒకటికాదు మరో ఏభై వేలు తీసుకో..” అంటూ ఇచ్చాడు సంతోషంగా !


 ''మీరు మరీ గారం చేయకండి. అడిగినంతా ఇస్తే చాలు కదా..” అంది సరళ. 


''మన రంజిత ఎలాగైనా అమెరికా వెళ్లి తీరాలి. వెడుతుంది కూడా! డబ్బుకి లోటు రానీయను ''అన్నాడు

భార్గవ. 


''పూర్తిగా అన్ని అడ్డంకులు తీరాలి. అప్పటివరకు రంజితను కనిపెట్టాలి. ఏమో మళ్ళీ.. దారి తప్పుతుందేమో.. !'' సందేహంగా అంది సరళ. 


''నేను జాగ్రత్తగానే వున్నాను. తేజా కొడుకు పోలీస్ ఆఫీసరుకదా, అతడికి అప్పగించాను. నీకేమి భయం లేదు. రంజిత ఇక తప్పుచేయదు. గండం గడిచింది'' అన్నాడు భార్గవ. 

నెల రోజులకు గుడ్ న్యూస్ తెలిసింది. 

రంజితకు ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MS కి సీటు వచ్చింది. సీటు అంటే వచ్చింది కానీ ఫీజు కి మొదటి ఏడు ౩౦ లక్షలు అవుతుంది. పైన మరో పది లక్షలు ఉండాలి. రంజిత చదువుకుంటూనే జాబ్ చేయచ్చు. పర్వాలేదు. అది రెండో ఏడు చదువుకు సరిపోతుంది. 


పార్టీ -షాపింగ్, అందరిని కలుసుకుని సెండాఫ్ చెప్పడం మరో నెల హడావిడిగా గడిచిపొయిన్ది. ఇక ప్రయాణం వారం రోజులు ఉండగా భార్గవకు అమెరికా యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. 


అతను ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూసాడు. రంజిత చదివే చోటుకి దగ్గిర వూళ్ళో అసోసియేట్ లెక్చరర్ గా

వచ్చిన లెటర్ అది!


ఇదేమిటి? నేను అప్లై చేయలేదు.. ఎలావచ్చింది.. అని ఆలోచిస్తే రంజిత ''డాడీ !మీ సంతకాలు కావాలని ఏవో పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకోడం అప్లికేషన్స్ పూర్తి చేయిన్చడం గుర్తుకి వచ్చింది. 


ఇందుకే అన్నమాట అనుకుని కూతురిని పిల్చి అడిగాడు. 

''అవునుడాడీ! మీరు అమెరికావెళ్లి చదువుకోవాలని అనుకున్నారు. అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు చదువేకాదు.. ఏకంగా జాబ్ వచ్చింది. నేను మీకు ఆశ్చర్యం కలిగించాలనే ముందు చెప్పలేదు. నేను అప్లై చేసాను. ''

''అదికాదమ్మా అందరమూ వెళ్ళాలి అంటే చాలా డబ్బుకావాలి. ఈ ఇంటిమీద లోను తీసుకున్నాను. ''


''డాడీ ! మీరు నన్ను మాత్రమే విదేశాలకు పంపాలని అనుకున్నారు. కానీ నేను మీ కోరిక తీర్చాలనుకున్నాను. 

అదేమీ ఈ రోజుల్లో అసాధ్యం కాదు. పైగా మీకు టీచింగ్ అనుభవం డాక్టరేట్ వున్నాయి. 


ఈ ఇల్లు సేల్ చేసేసి అందరమూ అమెరికా వెళ్లిపోవచ్చు. డా. అంకుల్ నేను కలిసి ఈ ప్లాన్ వేసాము. ఆయనే మన ఇల్లు రెండు కోట్లకు కొంటున్నారు!” అంటూ మంచి కబురు చెప్పింది. 


భార్గవ - సరళ, కూతురు రంజిత చేసిన పనికి ఆనందంతో మురిసిపోయారు. 


ఆరాత్రి రంజిత వుత్తరం రాసిపెట్టి ప్రవీణ్తో గోవా వెళ్ళిపోడానికి సిద్ధపడినప్పుడు ఆవుత్తరం సరళ చూసినందువలన పెద్ద గండం గడిచింది. 


వెంటనే భార్గవ, ఫ్రెండ్ డా ధర్మ తేజ సలహా అడిగాడు.

 

డా. తేజాకొడుకు పోలీస్ ఆఫీసర్ ! అతను, భార్గవా, ప్రవీణ్ ఇంటికి వెళ్లి, బుద్ధిచెప్పి ఊరునుంచి పంపేసి అతడిచేత రంజితకు ఫోన్ చేయిన్చారు. 


రంజిత - ప్రవీణ్ ని అసహ్యించుకుంది. తన పొరబాటును తెలుసుకుని శ్రద్ధగా చదువుకుంది. తండ్రి భార్గవ కోరిక తీర్చింది. 


ఆక్షణం.. అందరి జీవితాలను మార్చి వేసింది. పెద్ద ఆపదనుంచి తప్పించింది.. అనుకున్నారు భార్గవ సరళ ! 

టీనేజ్లో పిల్లలు తప్పులు చేస్తారు. వారిని కనిపెట్టి చూసుకుంటూ తప్పటడుగులు వేయకుండా

కాపాడుకోవడం తల్లి తండ్రుల కర్తవ్యం !


ప్రేమలు పెళ్లిళ్లు జీవితంలో స్థిరపడ్డాకనే జరగాలి. తెలిసి తెలియని వయసులో ఆకర్షణలు ప్రేమ కాదు. 

అదొక వలయం. అందులో చిక్కుకుంటే పిచ్చిలోపడి తల్లి తండ్రులని కాదని జీవితాన్ని ఛిద్రం చేసుకుంటారు. 


చదువుకునే వయసులో చదువుకోవాలి. పెళ్లి చేసుకునే వయసులో జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. 

ఆకర్షణలకు లొంగిపోయి హద్దులు దాటి వాటికి బలి కాకూడదు. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. కోరుకుంటే రావు. 


జీవితం విలువైనది. పోగొట్టుకుంటే తిరిగి లభించదు. చదువు వివేకాన్ని ఇస్తుంది. నిర్లక్ష్యం చేయద్దు. 

అందమైన జీవితానికి అందమైన ముగింపు ఉండాలి. అది తెలుసుకునేవారు సుఖంగా జీవిస్తారు. 

************************************************************************************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)

59 views1 comment

1 Comment


కధ ఉద్దేశం కల్పన బాగున్నాయి! సన్నివేశాలు కాస్త నిదానంగా విపులంగా మనసుకు హత్తుకునేలా వ్రాసి వివరిస్తే కధ ఇంకా బాగుండేదనిపిస్తోంది. ఇది సూచన మాత్రమే! తప్పుగా భావించ వద్దు!!

అభినందనలు.

Like
bottom of page