top of page

జీవితం పరిపూర్ణం


'Jeevitham Paripurnam' - New Telugu Story Written By Pitta Gopi

'జీవితం పరిపూర్ణం' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


విజయ్ పెద్ద ధనవంతుల్లో ఒకడు.

తనకు వ్యవసాయ భూములు, ఫ్యాక్టరీ లు సహా పలు బిజినెస్ వార్డులు ఉన్నాయి.


కానీ.. పరమ కోపిష్టి. చీటికీ మాటికీ కోపం, చిరాకు దీంతోపాటు విజయ్ కి పక్కోడి కష్టం అనవసరం. ఎవరిని ఆదుకునే గుణం అతనిలో కాస్తైనా లేదు.


ఎంత ధనవంతుడు అయినా.. విజయ్ కి చెడ్డ పేరు ఉంది. అతడంటే భయము, కోపం, ఆసుయ తప్ప ఏ ఒక్కరు గౌరవించరు. అంతెందుకు తన ఇంట్లో పనివాళ్ళు, కాంట్రాక్టర్లుతో పని చేయించుకుని జీతాలు ఇవ్వటం తప్పా వారి యోగక్షేమాలు పట్టించుకోడు. అంతటి కఠిన హృదయుడు విజయ్.


విజయ్ కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టి రెండు నెలలు అవుతుంది. పనులు చురుగ్గానే సాగుతున్నాయి.


ఈరోజు స్లాబ్ వేయాల్సి ఉంది. మేస్త్రి కనపడితే

"పని వారు అందరూ వచ్చినట్లేనా" అడిగాడు విజయ్.


"ఒక్క మనిషి తగ్గాడు " అన్నాడు మేస్త్రి.


“పర్వాలేదు, పనికి ఇబ్బందిలేకుండా చేయండి" అన్నాడు విజయ్.


ఇంతలో ఎక్కడ నుండో.. రాజయ్య అనే వ్యక్తి వచ్చి,


"అయ్యా! ఈ ప్రాంతానికి నేను కొత్త వాడిని, పేదోడిని. వారం నుంచి పని లేకపోవడంతో కుటుంబం తో పాటు నేను పస్తులుండాల్సి వచ్చింది. మీకు తగ్గిన ఆ మనిషికి బదులు నేను పని చేస్తానయ్యా. పైగా పని నాకు అలవాటే" అన్నాడు రాజయ్య


"నీవెవరో తెలియకుండా, నీ పనితనం తెలియకుండా పనిలో పెట్టుకునేది లేదు. వెళ్ళు వెళ్ళు’ అన్నాడు విజయ్.


రాజయ్య విజయ్ వైపు దయచూపండి అన్నట్లు చూశాడు.


ఆ చూపుతో విజయ్ మనసు మారిపోయింది.

ఎందుకంటే అతని ప్రాదేయతలో తన ఆకలి, తన కుటుంబం, భవిష్యత్ ఉన్నాయి కనుక.


"ఈరోజుకి పెట్టుకుని చూద్దాం" అంటూ మేస్త్రి కి చెప్పాడు విజయ్.


రాజయ్య అందరి కంటే పని బాగా చేస్తున్నాడు. విజయ్ వారికి టీ తెచ్చాడు.

రాజయ్య ఆ టీ ని ఇష్టంగా తాగుతున్నాడు. తన మనసు ఎలా మారిందో.. తెలియని ఆలోచన తో విజయ్, రాజయ్య కు ఆకలి వేస్తున్నట్లు అర్థం చేసుకున్నాడు.


వెంటనే భోజన విరామం ఇచ్చాడు విజయ్.


అందరూ భోజనం చేస్తున్నారు. రాజయ్య ఏమి తెచ్చుకోకపోవటంతో వైబ్రేట్ నడుపుతు పని చేస్తూనే ఉన్నాడు.


చుట్టుపక్కల హోటల్లు కూడా లేకపోవటంతో విజయ్ ఏమీ చేయలేకపోయాడు. రాజయ్య మాత్రం మంచినీళ్ళతో సరిపెట్టుకున్నాడు.


సాయంత్రం అవగానే కూలీలు కు డబ్బులు పంచుతున్నాడు విజయ్.


రాజయ్య వచ్చి చేతులు జోడించగా డబ్బులు ఇస్తూ..

"ఏమి తినకుండా పని చేశావు, ఇంటికెళ్ళు. ఏదో తిను " అన్నాడు.


"నేనే కాదయ్యా.. ఇంటి దగ్గర అందరూ తినకుండా ఉన్నారు" అంటూ వెళ్తుండగా విజయ్ రాజయ్య వైపు అలా చూస్తూ ఉండిపోయాడు.


వెళ్తున్న రాజయ్య కు ఎదురుగా ఒక పావురాలు అమ్మే వ్యక్తి తారసపడటం విజయ్ చూశాడు. ఈరోజు వచ్చిన డబ్బుతో రాజయ్య పావురాలు కొంటున్నాడని, పావురాల మాంసంతో ఈ రాత్రి విందు చేసుకుంటాడని విజయ్ కి అర్థం అయింది. ఇప్పటి వరకు రాజయ్య పై కలిగిన జాలి అంత పోయింది విజయ్ కి.


బేరం కుదిరినట్టు ఉంది. రాజయ్య చేతిలో డబ్బులు పెట్టి పావురాలు తీసుకోవటం. బాగుంటాయి వీటి కోసం మరలా నన్ను వెతుక్కోవాలి అన్నట్లు ఊహించుకుని రాజయ్య కు విజయ్ సమీపిస్తున్నాడు.


అప్పటికే రాజయ్య పావురాలు కు ఒక ముద్దు పెట్టి వాటిని వదిలేసి ఎగురుతున్న వాటిని చూస్తు మహ ఆనందం పొందాడు.


" ఏంటీ డబ్బులు అంత ఈజీగా వస్తున్నాయా.. అన్నాడు పావురాలు అమ్మే వాడు.


" డబ్బులు పోతే మరలా సంపాదించుకోవచ్చు అండీ.. కానీ ప్రాణం పోతే సంపాదించలేం కదా " అన్నాడు రాజయ్య.


ఆ మాటకు రాజయ్య దగ్గరకు కోపంతో వస్తున్న విజయ్ కి మరలా మనసు మారిపోయింది.


రాజయ్య ఇంత మంచోడా..

అతని ఆకలి, కుటుంబం పస్తులుండాల్సినా.. ఒక ప్రాణం డబ్బు కంటే గొప్పదని చాటిచెప్పాడు.


రాజయ్య కుటుంబం ఆకలి విజయ్ కళ్ళలో కలవర పెట్టింది.


కటిక పేదరికం లో ఉండి ఒక మనిషి లో ఇంత గొప్ప మనసు ఉంటుందా అనుకున్నాడు విజయ్.


పావురాలు అమ్మే వ్యక్తి మాత్రం "బతుకు తెరువు కోసం ఇదంతా తప్పటం లేద"ని అంటు రాజయ్య ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వబోగా


రాజయ్య సున్నితంగా తిరస్కరించి

"డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండద"ని చెప్పి వెళ్ళిపోతున్నాడు.


అది చూసి విజయ్ అతని వెనుకే బండేసుకుని వెళ్ళి, బండి ఎక్కమన్నాడు.


"అయ్యా మీరా.. పర్వాలేదు అయ్యా" అన్నాడు.


"నేను అటువైపే వెళ్తున్నాను పర్వాలేదు ఎక్కు " అన్నాడు విజయ్.


చిరిగిన వస్త్రాలు తో కూర్చున్న రాజయ్య తో ఉన్న విజయ్ ని చూసి నగరంలో అనేక మంది ఆశార్యపోగా మరికొందరు విజయ్ మారిపోయాడని అనుకుని నమస్కారించసాగారు.


ఎందుకో ఆ పలకరింపులు తాను రాజయ్య కు చేస్తున్న, చేయాలనుకుంటున్న మంచిపని వలనే అని విజయ్ కి బాగా అర్థం అయింది.


సంతోషం తో ఓ పెధ్ద రెస్టారెంట్ వద్ద ఆపి ఆ రాత్రికి కుటుంబం నకు బోజనంతో పాటు ఓ మూడు రోజులకు సరిపడే సరకులు కొనటమే కాక ఇంటికి తీసుకెళ్ళి బయలుదేరాడు విజయ్.


రాజయ్య విజయ్ కి చేతులు జోడించగా


"చేతులు జోడించాల్సింది నువ్వు కాదురా.. నేను.

రాజయ్య నిజంగా గొప్పోడంటే డబ్బు ఉన్నోడు అనుకున్నాను కానీ.. నిజంగా మనసున్న నీలాంటి వారే గొప్పవాళ్ళు అని నాకు కళ్ళు తెరిపించావ్. నీకు చేసిన సహాయం తో ఊరు వాడా నన్ను గౌరవిస్తున్నారు. నీ వలన నా జీవితానికి ఒక అర్థం ఒక గౌరవం, ఒక మంచి మనసు నాకు సిద్దించాయి. జీవితంలో ఇవి ఉంటే ఇక జీవితం పరిపూర్ణం.

ఈరోజు నుండి నా ఇంట్లో గౌరవ ప్రదానమైన పనులన్నీ నీవే చేస్తు నాకు ఇంట్లో, పనుల్లో ఒక స్నేహితుడు గా ఉంటావని మాట ఇవ్వు "అన్నాడు విజయ్.


ఆ మాటకు " కన్నీళ్లు పెట్టుకుంటూ.. అయ్యా.. నాకు నా కుటుంబానికి ఒక బతుకు దారి చూపారు. మీ మాటకు ఎలా ఎదురు చెబుతానయ్యా.. అలాగే అంటూ మాటిచ్చి చేతులు జోడించి విజయ్ ని సాగనంపాడు రాజయ్య.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
59 views0 comments

Comments


bottom of page