top of page

జోలపాట


'Jolapata' - New Telugu Song Written By Sudarsana Rao Pochampally

'జోలపాట' తెలుగు పాట

రచన: సుదర్శన రావు పోచంపల్లి


లాలీ లాలీ లాలీ లాలి

నిద్దుర పోరా బాబూ నిద్దుర పోరా

నిద్దురలో నీకెంతో హాయి


హాయిగా తీయగా కమ్మని నిదురతో నీ

కలువ రేకుల కన్నులు మూయుచు

నిద్దుర పోరా బాబూ నిద్దుర పోరా


తూగుటూయలలొ ఊగుచు నీవు

అమ్మ పాడే కమ్మని పాటలు వినుచు

హాయిగా నిద్దుర పోరా బాబూ నిద్దుర పోరా


లోకం పోకడ నీకొద్దు

పాపం పుణ్యం మాటలు నీవినవద్దు

ఇంపుగ పాడే పాటలె వినరా

సొంపుగ నీవు నిద్దుర పోరా


పాటల పల్లవి ఊయల ఊపులు

మై మరిపించే నిద్దుర మత్తులొ

అర చూపుల కన్నులు మరి మూయుచు

నిద్దుర పోరా బాబూ నిద్దుర పోరా


బాల్యం ఎంతో చిన్నది మరి

జీవితమెంతో గొప్పది

దేవుని స్థానం నీకీనాడున్నది అది మరి

కొన్నాళ్ళకు మానవ రూపం దాల్చనున్నది


కోరిక లెన్నో కోరుచు నీవు

కోపం నాకు తెప్పిస్తె

కొట్లు తిట్లు అవి నా ఊహకు ఎన్నో రెట్లు


చదువులు సందెలు పిల్లా పాపలు

సంసారపు చిక్కులు లెక్కకు మించిన ఇక్కట్లు

నిద్దుర పోరా బాబూ నిద్దుర పోరా

నిద్దురలో నీకెంతో హాయి

లలీ లాలీ లాలీ లాలి-----

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


28 views0 comments
bottom of page