top of page

స్వతంత్రం లేని తండ్రి


'Swatantram Leni Thandri' - New Telugu Story Written By Pitta Gopi

'స్వతంత్రం లేని తండ్రి' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

తన తండ్రి చనిపోయే నాటికి స్వరూప్ కి ఏ ఆస్తులూ లేవు, ఏ అంతస్థులూ లేవు. కష్టపడితే కానీ.. పూట గడవని పరిస్థితి.


అలాంటి స్థితి నుండి నలుగురు వ్యక్తులు కూర్చుని తిన్నా తరగని ఆస్తుల వరకు వచ్చాడంటే.. స్వరూప్ ఎంత కష్టపడ్డాడో.. ఎన్నేళ్ళు శ్రమించాడో ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అయితే తాను కూడబెట్టినవి ఆస్తులే కాదు. సంపాదన సృష్టించుకునే కొన్ని చిన్న పరిశ్రమలు. పశువుల పెంపకం, వ్యవసాయం అందులో ముఖ్యమైనవి.


అయితే ఇంత సంపాదించినా.. స్వరూప్ కి ఒక కోరిక ఉండేది. తాను ఇంకా బాగా సంపాదించి మంచి పశువుల పరిశ్రమ ను పెట్టి ఆ పరిశ్రమలో అన్ని పశువులను మచ్చిక చేసుకుని వాటి మనసు అర్థం చేసుకోవాలని, వాటినే ప్రాణంగా బతకాలని, అలాగే కొడుకు ప్రయోజకుడు అయితే దాన ధర్మాలు చేయాలని కలలు కనేవాడు.



స్వరూప్ కాస్త తక్కువ వయసులో పెళ్ళి చేసుకోవటంతో అతనికి సంతానం కూడా త్వరగానే కల్గింది.


అయితే తను ఎంత సంపాదించినా.. గర్వపడటం ఎప్పుడూ చేయలేదు సరికదా, ఆస్తి ఉందని కష్టపడటం మానివేయలేదు.


కొడుకు కోసం, కుటుంబం కోసం స్వరూప్ కష్టపడుతూనే ఉన్నాడు.


ఇకపోతే స్వరూప్ కొడుకు విఘ్నేష్ వయసుకు వచ్చాడు. ఒకవైపు చదువుతూ మరోవైపు తండ్రి సంపాదనను దర్జాగా, కులాసాగా అనుభవిస్తూ వచ్చేవాడు.


విఘ్నేష్ కు దురలవాట్లు ఎక్కువ అయ్యాయి. తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులు చదువు పేరుతో వృధాగా ఖర్చు చేసేవాడు.



బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాదించి జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలో విఘ్నేష్ లేడు. స్వరూప్ మాత్రం కొడుకు మీద ప్రేమతో అన్నీ ఓర్చుకుని సహనంతో ఉండేవాడు. విఘ్నేష్ మాత్రం తండ్రి ఆస్తులతో జల్సాలు చేస్తూ.. బాగా ఎంజాయ్ చేసేవాడు.


ఎంత ఓపిగ్గా ఉన్నా.. విఘ్నేష్ లో మార్పు రాకపోవడంతో స్వరూప్ కొడుకు ని దూరం చదువులకు పంపటానికి నిర్ణయించుకున్నాడు.


అక్కడ కూడా ఈ దురలవాట్లు మానలేదు. చదువు పేరుతో, ఫీజుల పేరుతోను తండ్రిని ఎప్పుడూ డబ్బులు పంపమంటూనే ఉండేవాడు.


అయితే చదువు లో కాస్త ముందు ఉంటున్నాడనే వార్త స్వరూప్ కి కాస్త ఆనందాన్ని తెచ్చి పెట్టింది.


చివరకు చదువులు పూర్తి చేసుకున్న విఘ్నేష్, ఒక మంచి కంపెనీలో జాబ్ కొట్టాడు. కానీ అప్పటికే స్వరూప్ ఆస్తులు కొంత తరిగాయి.


పై చదువులు, దూరం చదువులు అంటే మాటలా.. ఈరోజుల్లో..


ఎలాగైతేనేం కొడుకు బాగుపడ్డాడు అనే ఆనందం తప్పా.. కొంత ఆస్తి పోయిందని ఎప్పుడు దిగులుపడలేదు స్వరూప్.


కొంతకాలం తర్వాత విఘ్నేష్ కి ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు. విఘ్నేష్ కూడా పెళ్లి తర్వాత చాలా మారిపోయాడు. దురలవాట్లు మానివేసి తండ్రి లా మంచి సంపాదన పై దృష్టి పెట్టాడు.


ఎంతో సంపాదించాడు. కుటుంబాన్ని, తండ్రిని చూసుకునేవాడు. కానీ స్వరూప్ కి వయసు అయిపోలేదు. తానూ కష్టపడేవాడు. అయితే ఒకప్పటి లా కాదు.


ఎంత సంపాదించినా... విఘ్నేష్ మాత్రం తండ్రి ఆశయాలు ఏంటని కానీ.. అతని ఇష్టాలు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.


తండ్రి కష్టం తోనే అతడు ఈ స్థానంలో ఉన్నాడనే ఇంగిత జ్ణానం కూడా లేదు విఘ్నేష్ కి.


తన కల నెరవేరకపోయినా.. చెడు అలవాట్లు మానాడని, బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నాడనే ఆనందం మాత్రం స్వరూప్ లో ఉంది.


స్వరూప్ ని బాగానే చూసుకుంటున్నా.. తనకు ఏం కావాలంటే అది తెచ్చి పెడతాడే తప్ప స్వయంగా తండ్రికి కోరికలు ఉంటాయి అని, కొంత డబ్బు ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు విఘ్నేష్.


అయితే కొడుకుగా తండ్రి సంపాదనను సులభంగా అనుభవించటానికి విఘ్నేష్ కి స్వతంత్రం దొరికింది కానీ.. అదే స్వతంత్రం కొడుకు సంపాదించినపుడు తండ్రిగా తనకు దొరకలేదని స్వరూప్ మనసులో ఎంతోగానో దుఃఖించాడు.


నిజం మరీ ! ఈ విషయంలో కేవలం స్వరూప్ మాత్రమే కాదు ఎంతోమంది తండ్రులు ఇలాంటి వ్యధను అనుభవిస్తున్నారు.


కొడుకు సంపాదనలో నిజంగా తండ్రికి స్వతంత్రం ఉంటే స్వరూప్ చివరి దశలో మిక్కిలి ఆనందంతో పరవసించి పోయేవాడు. కానీ పాపం ఆ అదృష్టం లేకుండా పోయింది.


స్వరూప్ చివరి దశలో విఘ్నేష్ ఏది చెబితే అది, ఏది పెడితే అది.. అలా మారింది.


విఘ్నేష్ కూడా ఒక తండ్రి అవుతాడు. అప్పటికి కానీ అతడికి తెలియరాదు తన తండ్రి వ్యధ.


కళ్ళముందే ఆస్తులు ఉన్నా.. కలలు నెరవేరని తండ్రి స్వరూప్. నిజంగా ఏ తండ్రికి అయినా కుటుంబం లో స్వతంత్రం లేదని తనవారి కోసం తండ్రి ఎంత చేసినా.. తన కోసం తనవారు ఏమీ చేయరని కుటుంబం లో స్వతంత్రం లేని ఏకైక వ్యక్తి తండ్రేనని స్వరూప్ జీవితం తో పదిమందికి అర్థం అవ్వాలి. అప్పుడే ప్రతి తండ్రి వ్యధా కొడుకులకు అర్థం అవుతుంది.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం






48 views1 comment
bottom of page