'Ma Abbayi Chala Manchodandi babu' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao
'మా అబ్బాయి చాలా మంచోడండి బాబు' తెలుగు కథ
రచన, కథా పఠనం: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
చెల్లూరు అనే గ్రామంలో వెంకటచలమయ్య, వసుంధరమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వసుంధరమ్మకు ఎప్పటినుండో గుండె సమస్యలు ఉన్నాయి. దగ్గర టౌన్ రామచంద్రపురo లో చూపిస్తే చిన్న గుండె ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్. కంగారు లేదుకానీ వీలైనంత తొందరలో చేయాలనీ ఖర్చు లక్ష రూపాయలు అవుతుందన్నారు.
అతని కొడుకు కోటేశ్వరరావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలు. తన తల్లికి వచ్చిన గుండె సమస్యకు సంభందించి అతను జాబ్ చేస్తున్న కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లించరని వీలుచూసుకుని చేయిద్దాం కంగారుపడవద్దని తండ్రికి చెప్పాడు. ఆలా చెప్పి ఆరు నెలలయింది.
గుండె సమస్యకదా.. సడన్గా ప్రమాదం జరగవచ్చునని భార్యకు ఎలాగోలా ఆపరేషన్ చేయించాలి అన్న నిర్ణయానికి వచ్చేసాడు వెంకటచలమయ్య. కానీ ఎంత ప్రయత్నించినా డబ్బు సదురు బాటు అవ్వటం లేదు.
డబ్బు కోసం ఆపరేషన్ చేయించకుండా అలా అలా కాలయాపన చేస్తున్నాడు వెంకటచలమయ్య. అప్పు చేయాలి అంటే నెలకు నూటికి పది రూపాయల వడ్డీ అయితే ఇస్తాను అన్నారు. అమ్మో.. అంత వడ్డీ కట్టడం కష్టం అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు అతను.
****
ఆ రోజు హైదరాబాదులో వున్న కోటేశ్వరరావుకు తండ్రి వెంకటచలమయ్య నుంచి ఫోన్ వచ్చింది. విషయం ఏమిటి అంటే.. వసుంధరమ్మ ఆపరేషన్ ఇక లేటు చెయ్యకూడదని, అందుకోసం ఆవిడ దగ్గర ఉన్న పుస్తెలతాడు లాంటి బంగారాలు అమ్మేస్తే ఒక ఏభై వేలు రూపాయలు రావచ్చు అని, మరో ఏభై వేల కోసం తెలుసున్న వాళ్లను అడిగితే పని జరగలేదని, కనుక మరో ఏభైవేలు పట్టుకొని రేపు చెల్లూరు వచ్చేయమని, ఎల్లుండే ఆపరేషన్ చేయించాలి.. అని తండ్రి ఫోన్.
ఐతే.. కొడుకు కోటేశ్వరరావు... తను కొన్ని సమస్యలలో ఉన్నానని.. ప్రయత్నిస్తాను కానీ ఏభై వేలు పోగు చేయడం తన వల్ల కాదని, అందుచేత తన మీద పూర్తిగా ఆశ పెట్టుకోకుండా తండ్రినే చూడమని తిరుగు జవాబు ఇచ్చాడు. అదీ విషయం.
అసలు విషయం ఏమిటంటే.. ఎన్నో ఏళ్ల నుండి హైదరాబాదు లో కొనాలని ప్రయత్నిస్తున్న ఫ్లాట్ ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించు కొని ఎలాగోలా ఎనభై లక్షలతో కొని తీరాలని ఖచ్చితంగా నిర్ణయించేసుకున్నాడు కోటేశ్వరరావు... ఆ పరిస్థితి లో ఎవరైనా డబ్బు ఎలా సరదగలరు.. అని మనసులో అనుకున్నాడు కోటేశ్వరరావు.
తండ్రి చెప్పినట్టు మర్నాడు కోటేశ్వరరావు భార్య పిల్లలతో కాకుండా తను ఒక్కడే చెల్లూరు వెళ్లడానికి హైదరాబాదులో బస్సు ఎక్కి రామచంద్రపురం బస్టాండ్ లో దిగాడు. అక్కడ నుండి చెల్లూరు నాలుగు కిలోమీటర్లు మరో బస్సు ఎక్కాలి. బస్టాండ్లో ఒకళ్ళిద్దరు తప్పించి జనం లేరు. తండ్రి అడిగినట్టుగా తన తల్లి ఆపరేషన్కు సంబంధించి మరో ఏభై వేలు తను పట్టుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయాడు కోటేశ్వరరావు.
చెల్లూరు బస్సు ఇంకా రాకపోవడంతో ఆలోచిస్తూ బస్టాండ్ లో త్రీ ఇన్ వన్ ఫైబర్ మలేషియన్ బెంచి మీద కూర్చున్న కోటేశ్వరరావు దృష్టి తన ఎదుట బెంచి కింద ఒక మూలగా ఎవరికీ కన పడకుండా పడివున్న బ్లాక్ కలర్ క్యాష్ బ్యాగ్ మీద పడింది. ఎవరో పారేసుకుని ఉంటారు. అందులో ఏమైనా కాష్ ఉందా లేదా అని ఆలోచించి, చుట్టూ తనని ఎవరూ గుర్తించటం లేదని గ్రహించి నెమ్మదిగా ఆ బ్యాగ్ ని కాలుతో లాగి అందుకున్నాడు. కిందకు వంగి బ్యాగ్ నొక్కి చూస్తే అందులో నోట్ల కట్ట ఉన్నట్టు అనిపించింది. గబగబా తన గుడ్డ సంచిలో దానిని దూర్చి పరుగులాంటి నడకతో దూరంగా ఉన్న బాత్రూంలోకి వెళ్లి జిప్ ఓపెన్ చేసి చూశాడు. త్వర త్వరగా లెక్కపెడితే కరెక్ట్ గా ఏభైవేలు ఉన్నట్టు అనిపించింది. కోటేశ్వరరావు గట్టిగా సంతోషంగా అరిచేయాలనుకున్నాడు. ఆ పని చేయకుండా చెల్లూరు బస్సు కోసం బస్టాండ్ లో ఉండకుండా నడుచుకుంటూ సెంటర్కు వచ్చి ఆటో ఎక్కేసాడు.
చెల్లూరు లో తన ఇంటికి వెళ్లిన వెంటనే అతని తండ్రి డబ్బుతెచ్చావా.. అని అడక్కుండా ఉండలేకపోయాడు. కోటేశ్వరావు ముందుగానే ఆలోచించుకొని రెడీ అయ్యి ఉన్నాడు కనుక ఏమాత్రం తడబడకుండా హైదరాబాదులో అతి కష్టం మీద ఏభై వేలు పోగుచేశానని మూడు నెలల్లో తప్పకుండా తిరిగి ఇచ్చేయాలని తండ్రికి డబ్బు అందిస్తూ చెప్పాడు. సరే ఎలాగోలా ఏర్పాటు చేస్తానులే ముందు ఆపరేషన్ ప్రయత్నం చూద్దాం అంటూ ప్రశాంత పడ్డాడు.. అతని తండ్రి వెంకటచలమయ్య.
హాస్పటల్ వ్యవహారం కనుక ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అంతగా అవసరపడకపోతే వెంటనే ఇచ్చేయవచ్చని ముందు జాగ్రత్తగా వెంకటచలమయ్య పదిరూపాయల వడ్డీ అని కూడా చూడకుండా అప్పు చేసి ఒక పక్కన పెట్టిన మరో ఏభై వేలు రూపాయలు ఉండడంతో ఆపరేషన్ ఏర్పాటు చెయ్యమని డాక్టర్కు ఫోన్ చేసి చెప్పాడు.
ఆ మర్నాడే వసుంధరమ్మకు రామచంద్రపురం హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగిపోయింది. రెండు రోజుల తర్వాత ఇంటికి కూడా పంపించేశారు.
***
ఆరోజు బుధవారం..
సాయంత్రం అయ్యింది.
తమ పక్క వీధిలో కాపురం ఉంటూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబిల్ గా పనిచేసే ధనంజయరావు మోపెడ్ మీద వెంకటచలమయ్య ఇంటికి వచ్చాడు.
వెంకటచలమయ్య తనకు కొంచెం పరిచయం ఉన్న ధనంజయరావుని కూర్చోబెట్టి..
''సమాచారం ఏదైనా తెలిసిందా'' అని అడిగాడు.
''వెంకట చలమయ్య గారు.. మీ ఏభై వేల రూపాయలు తిరిగి మీ చేతికి రావడం ఖాయం. మీ బ్లాక్ కలర్ కాష్ బ్యాగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎస్ ఐ గారు మిమ్మల్ని రేపు ఉదయం ఒకసారి రమ్మన్నారు. విషయం ఏమిటి అంటే రామచంద్రపురం బస్టాండ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎస్ ఐ గారు చెకప్ చేయించారు. మీరు మూడు రోజుల క్రితమే కంప్లైంట్ రాసిచ్చిన సీసీటీవీ కెమెరాల టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల మేము వెంటనే చెక్ చేయలేకపోయిము. ఈ రోజే రిజల్ట్ చూడగలిగాము.
జరిగిన విషయం ఏమిటంటే రామచంద్రపురం బస్టాండ్ లో మీరు చెల్లూరు బస్సు ఎక్కడానికి కూర్చుని మీ పక్కనే మీ క్యాష్ బ్యాగ్ పెట్టుకున్నారు. ఈలోగా మీరు సెల్ మాట్లాడుతుండగా ఒక కుక్క పిల్ల వచ్చి దానిని లాగి మీ ఎదురు బల్ల కింద పడేసింది. అది కాస్త ఎవరికీ కనబడ కుండా కొంచెం పక్కకు పడిపోయింది. మీరు కాసేపటికి బ్యాగ్ లేదని గ్రహించి కంగారుపడి అక్కడ బెంచీల పైన వెతికి బెంచీల క్రింద కూడా చూశారు. ఆ కంగారులో అసలైన చోట చూడలేదు. వెంటనే దగ్గరలో ఉన్న మా స్టేషన్కు వచ్చి కంప్లైంట్ రాసి ఇచ్చారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో సినిమాలా మాకు కనపడింది. ఇదిగో మీరు రాసి ఇచ్చిన కంప్లైంట్ పేపరు ఇంకా నా బ్యాగ్ లోనే ఉంది.
మీరు వస్తువులు అమ్మి ఇంటికి తెస్తున్న 50 వేల రూపాయలు క్యాష్ బ్యాగ్ పోయిందని మీరు కంగారు పడిన, మేము కంగారు పడలేదు. ఎందుకంటే అది దొరుకుతుంది అని మాకు తెలుసు కనుక. సరే సీరియల్ గా ఆ ఫుటేజ్ చూస్తూ ఉంటే ఆ మర్నాడు హైదరాబాద్ బస్సు దిగిన ఒక అబ్బాయి వేరొక బస్సు ఎక్కడానికి బస్టాండ్ లో మలేషియన్ బెంచ్ మీద కూర్చుని.. ఆ బ్యాగ్ అతని కంట పడటంతో పట్టుకొని వెళ్లిపోయాడు. ఆ అబ్బాయి దొంగతనం చేయలేదు కానీ మా దృష్టిలో అతను నేరస్తుడే. ఆ బ్యాగు తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. ఆ బ్యాగు మేము బాధితులకు చేరవేస్తాం.
సరే.. ప్రస్తుత విషయం ఏమిటి అంటే సీసీటీవీ ఫుటేజ్ లో బ్యాగు పట్టుకుని వెళ్లిపోయిన అబ్బాయి మీకు ఏమైనా తెలుసేమో.. కనిపెట్టడానికి ఎస్సై గారు రమ్మన్నారు. నాకైతే ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు ఉంది కానీ గుర్తుపట్టలేక పోతున్నాను. కనుక మీరు రేపు ఉదయం రండి.'' అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వచ్చిన కానిస్టేబుల్ ధనంజయరావు.
అతను వెళ్ళిపోగానే పక్క గదిలో వున్న కోటేశ్వరావు కానిస్టేబుల్ చెప్పింది అంతా పూర్తిగా విని కంగారుపడి తండ్రి దగ్గరకు వచ్చి.. విషయం ఏమిటి అని అడిగాడు.
''అవునురా.. మీ అమ్మ వస్తువులు అమ్మేస్తానని చెప్పాను కదా. నువ్వు రావడానికి ముందు రోజే అవి అమ్మేసి క్యాష్ నల్ల బ్యాగ్ లో పెట్టుకుని వస్తూ ఉంటే రామచంద్రపురం బస్టాండ్లో బ్యాగ్ కన పడకుండా పోయింది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఎలాగోలా ప్రయత్నించి బ్యాగ్ పట్టుకోగలరు అన్న ఉద్దేశంతో మీ అమ్మ ఆపరేషన్ కంగారులో ఇదంతా నీకు చెప్పడం ఎందుకు అని చెప్పలేదు. కంగారుపడి గుండె దడ ఇంకా పెరిగేలా చేసు కుంటుందని మీ అమ్మకు కూడా చెప్పలేదు. సరే ఇంతకీ బ్యాగ్ దొరికేలాగే ఉంది కదా కానిస్టేబుల్ గారు చెప్పారు.. విన్నావు కదా నువ్వు. రేపు ఇద్దరం పోలీస్ స్టేషన్ కు వెళ్దాం లే. '' అన్నాడు వెంకటచలమయ్య కొడుకుతో..
అంతే! కోటేశ్వరరావుకు గుండెలో బండ కాకుండా పెద్ద పర్వతమే పడిపోయినట్లు అయిపోయింది. గదిలోకి వెళ్లి కాసేపు పడుకుని ఆలోచించి మళ్లీ వెంటనే తండ్రి దగ్గరకు వచ్చాడు.
''నాన్నా.... రేపు పోలీస్ స్టేషన్ వెళ్దాం అనుకుంటున్నావా?''
''అదేమిటిరా అలా అంటావు? ఇద్దరం కలిసి వెళ్దాం. ఈ కానీస్టేబుల్ ది పక్కవీదే. నాకు బాగా తెలుసు."
''వద్దు నాన్న నువ్వు ఈ పరిస్థితుల్లో అసలు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు.. మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ విషయం మన ఊరులో అందరికీ తెలిస్తే నిన్ను పలకరించడానికి లైన్ పెట్టి వస్తారు. దాంతో నువ్వు కాదన్నా అమ్మకు ఈ విషయం తెలిసిపోతుంది. అమ్మ టెన్షన్ కు గురవుతుంది. డాక్టర్ మనకు ఏం చెప్పారు.. ఏమాత్రం టెన్షన్ విషయాలు చెప్పకండి. ప్రశాంతత ఉంటేనే అమ్మ కోలుకుంటుంది, లేదంటే చాలా కష్టం అన్నారు కదా.. అందుకని నువ్వు స్టేషన్ కి వెళ్లొద్దు'' అంటూ కంగారుగా తండ్రితో అన్నాడు కోటేశ్వరరావు.
''మరి ఎలారా. ఏభై వేల రూపాయలు ఎలా వదులుకుంటాం. నువ్వు అప్పు తెచ్చాను ఎవరికో ఇవ్వాలి అన్నావు కదా. మూడు నెలల లోపున అప్పు తీర్చాలి అన్నావు కదా. '' ప్రశ్నగా ముఖం పెట్టి అడిగాడు వెంకటచలమయ్య
''నాన్నా! నాకు అమ్మ ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? అందుకనే నేను ఒక విధానం ఆలోచిం చాను. నువ్వు నాకు ఏభైవేలు రూపాయలు పంపించనక్కర్లేదు. హైదరాబాద్ వెళ్లాక నేను ఎలాగోలా సరి పెడతాను.'' మరింత కంగారుగా చెప్పాడు కోటేశ్వరరావు.
''ఏమో నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఏభైవేలు వదులుకోవాలని అనిపించడం లేదురా.'' అన్నాడు తండ్రి.
తను హైదరాబాద్ వెళ్ళిపోయాక తండ్రి పోలీస్ స్టేషన్కు వెళతాడేమో అన్న అనుమానం పీక్కు తింది కోటేశ్వరరావు మనసులో. తండ్రిని స్టేషన్కు వెళ్లకుండా చెయ్యాలి అంటే..? ఇంకాసేపు ఆలోచించాడు కోటేశ్వరరావు.
''నాన్నా, నీకు వివరంగా చెప్పాలంటే నాకు కుదరటం లేదు. లోపల గదిలో పడుకున్న అమ్మకు ఏ ఒక్క మాట వినబడకూడదు. మరో విషయం ఏమిటంటే మన ఫ్యామిలీలో ఇలా జరిగింది అని పేపర్ ద్వారా కానీ, న్యూస్ ఛానల్ ద్వారాగాని మా ఆఫీసులో తెలిసింది అనుకో.. నాకు విలువ ఉండదు. మా బాస్ మంచోడు కాదు నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. అందుకని నువ్వు అసలు పోలీస్ స్టేషన్ వ్యవహారం నెత్తి మీద పెట్టుకోవద్దు.
ఇప్పుడే ఆ కానిస్టేబుల్ గారు ఇంటికి వెళ్లి ఎలాగోలా బ్రతిమలాడి ఏదో ఒకటి చెప్పి ఆ కంప్లైంట్ పేపర్ పట్టుకుని వచ్చేయ్. అంతకి అడిగితే అమ్మ ఆరోగ్యం బాగున్నాక చూద్దామని చెప్పు. ఇదిగో ఇప్పుడే వెళ్లి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం పట్టుకొచ్చేయి. ఎస్ఐ గారికి ఏదో చెప్పమను. నీకు తెలిసిన ఫ్రెండే కదా ఈ కాని స్టేబుల్. '' తండ్రిని తెగ కంగారు పెట్టేసాడు కోటేశ్వరరావు.
అయినా వెంకటచలమయ్య పైకి లేవడం లేదు. కోటేశ్వరరావుకు మరింత అదుర్ధా పెరిగిపో యింది. బీపీ ఎక్కువైపోయి తనకు గుండెపోటు వస్తుందేమో అన్నంత భయం పట్టుకుంది. సరే ఇది కాదు పని అని చివరి అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకొని తండ్రితో ఇలా అన్నాడు..
''నాన్న.. మనకు డబ్బుకు లోటు ఏంటి? నేను సంపాదిస్తున్నాను కదా. బుజ్జిగాడు అకౌంట్లో ఎప్పటినుంచో ఏభయ్ వేలు ఉండిపోయింది. నేను చూసుకోలేదు. ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ డబ్బులు నీ అకౌంట్లోకి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ సమయం లో ఎలాగూ అవసరం పడుతుంది కనుక అది వాడుకోండి. అసలు ఈ పోలీసు వ్యవహారాలు వద్దు. నువ్వు పైకి లేచి వెళ్లి ఆ కాగితం తెచ్చేయ్. '' అంటూ తన అకౌంట్లో ఏభై వేలు తండ్రి అకౌంట్ లోకి మార్చి చూపించి.. కంగారు పెట్టి పంపించాడు.. ఆ కంప్లైంట్ కాగితం తీసుకురావడానికి.
కాసేపటికి తండ్రి ఆ కాగితంతో తిరిగి వచ్చాక దాన్ని తీసుకుని ముక్కలు చేసి హాయిగా ఊపిరి పీల్చి వదిలాడు.. కోటేశ్వరరావు.
వెంకటచలమయ్యకి ఇదేమి అర్ధం కాక బుర్ర గోక్కుంటూ.. తన కొడుకు ఎంత మంచివాడో అనుకుంటూ భార్య గదిలోకి వెళ్లిపోయాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentarios