top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 13


'Amavasya Vennela - Episode 13 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.


నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.


మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ. సాగర డ్రైవింగ్ బాగా నేర్చుకుంటుంది. శ్రీరమణకు సెకండ్ హ్యాండ్ కారు కొనిస్తానంటాడు మధుసూదన్.


హంస అనే ఆవిడను హాస్పిటల్ లో చేర్చడంలో సహాయం చేస్తాడు శ్రీరమణ. తనను కలవమని ఫోన్ చేస్తుంది ఆమె.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 13 చదవండి.

రాత్రి భోజనం చేస్తూ..

పార్వతమ్మకు చంద్రిక వాళ్ల కబురులు చెప్పాడు శ్రీరమణ.

"బాగుంది నాయనా. మంచి పనే చేసావులే. వాళ్ల పని నుండి నువ్వు గట్టేక్కావు. ఇకనైనా నీ కష్టం నీకే మిగుల్చుకో." చెప్పింది పార్వతమ్మ.


అప్పుడే..

"అమ్మా.. నీకు చెప్పుతుంటానుగా.. గతంలో నేను ఉన్న నా రూమేట్స్ గురించి.." చెప్పుతున్నాడు శ్రీరమణ.


అడ్డై..

"అవునవును. అన్నట్టు.. ఆ అబ్బాయి వెంకట్ అక్కడైనా స్థిరమయ్యాడా." అడిగింది పార్వతమ్మ.


"వాడు బాగానే ఉన్నాడు. ఇక మిగతా ఇద్దరిలో.. సుబ్బారావుకు పెళ్లి కుదిరింది. వాడు పెళ్లయ్యాక.. భార్యతో ఈ ఊరే వచ్చేయబోతున్నాడు. గిరి ఒంటరి కాబోతున్నాడు." చెప్పుతున్నాడు శ్రీరమణ.


అంతలోనే..

"అంటే ఏమంటావు. వాడిని నెత్తినేసుకోబోతున్నావా." గబుక్కున అడిగేసింది పార్వతమ్మ.


"అబ్బే. అది కాదమ్మా. గిరి మంచోడు. ఒబ్బిడి మనిషి. నాకు తెలుసుగా. మరి అటు వంటి వాడిని.. చంద్రిక చెల్లెలు ఇంద్రజకు భర్తగా చేస్తే.. వీడు.. వాళ్లు.. బాగుంటారని తోస్తుంది అమ్మా." ఆగాడు శ్రీరమణ.


"నీది భలే సంబడం.. నిజంగా ఉట్ఠి సత్తికాల మనిషివి." బుగ్గలు నొక్కుకుంటుంది పార్వతమ్మ.


"అలా కాదులే అమ్మా. మంచితో మనుగడ అందుతుందట.. నా నాన్న చెప్పుతుండేవాడు." చెప్పాడు శ్రీరమణ.


పార్వతమ్మ ఏమీ అనలేకపోయింది.

"ప్రయత్నించి చూస్తాను. కుదిరితే మంచిదేగా. ఏమంటావు అమ్మా." అన్నాడు శ్రీరమణ.


"సరే. ప్రయత్నించు. నీలాంటి వాడిని వెనుక్కు లాక్కూడదు." చెప్పేసింది పార్వతమ్మ.


***

మర్నాడు..

ఉదయం టాక్సీ స్టాండ్ వైపు కారుతో పోతూనే..

హంసకు ఫోన్ చేసాడు శ్రీరమణ.


అతడిని రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టనీయలేదు.. హంస పిలుపు.

హంస తన కాల్ కు కనెక్ట్ కాగానే..

"నేను శ్రీరమణని. నాతో మాట్లాడాలన్నారుగా. ఇప్పుడు రా వచ్చా." అడిగాడు శ్రీరమణ.


"అయ్యో. రా వచ్చా ఏమిటి బాబూ. రా. నీ కోసమే కాచుకు ఉన్నా." చెప్పింది హంస.


"ఇదిగో వస్తున్నాను." చెప్పేసాడు శ్రీరమణ. కాల్ కట్ చేసేసాడు.


అర గంట లోపే.. హంస ఇంటిని చేరాడు.

ఆ ఇద్దరూ.. ఎదురెదురు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.

హంస చాలా నీర్సంగా ఉండడం గుర్తించాడు శ్రీరమణ.

"అమ్మా.. ఇంకా మీకు తగ్గేలా లేదు. హాస్పిటల్ కు తీసుకు వెళ్లానా." అడిగాడు.


"వద్దు. ఇది నాకు మామూలే." చెప్పింది హంస.


"డాక్టర్ చెప్పింది విన్నాను. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదంటా." అన్నాడు శ్రీరమణ.


హంస నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు.

"ఏంటమ్మా. మీ తీరు. మీరు బాగా వీక్ గా అగుపిస్తున్నారు." ఆదుర్దా అయ్యాడు శ్రీరమణ.


"ఇది ఎప్పటి నుండో పడుతున్న బాగోతంలే బాబూ." నిర్లిప్తతగా అనేసింది హంస.


శ్రీరమణ వింతయ్యాడు.

అప్పుడే.. పక్కింటావిడ అక్కడికి వచ్చింది.

ఆవిడను పోల్చుకున్నాడు శ్రీరమణ. 'లక్ష్మి కదూ' అనుకున్నాడు.


"నిన్న పిలిస్తే ఇప్పుడు వచ్చాడు." శ్రీరమణను చూపుతూ హంస అంది.. లక్ష్మితో.


"ఎందుకు పిలిపించుకున్నావు. ఏమైనా మళ్లీ హాస్పిటల్ కు వెళ్తావా." అడిగింది లక్ష్మి.


"అబ్బే లేదు. ఎప్పుడో చూసిన వాడిలా తోస్తే రమ్మనమన్నాను. అంతే." అనేసింది హంస.


"అవునా. అలికిడి ఐతే ఇలా వచ్చాను. మీరు మాట్లాడుకోండి. నాకు వంట పని ఉంది." అంటూ లక్ష్మి వెళ్లి పోయింది.


హంస లేచి.. వీధి తలుపు దగ్గరగా మూసేసింది.

"నీతో గుట్టుగా మాట్లాడాలి." అంది శ్రీరమణతో. తిరిగి కుర్చీలో కూర్చుంది.


అప్పుడే శ్రీరమణ ఫోన్ మోగుతుంది.

జేబులోని ఫోన్ తీసుకున్నాడు.

కాశిం ఫోన్ చేస్తున్నాడు.

ఆ కాల్ కి కనెక్ట్ అయ్యాడు.


***

అదే సమయాన..

సావిత్రి ఇంటిలో..

"ఇంద్రను మార్కెట్టుకు పంపుతున్నాను." చెప్పింది సావిత్రి.. చంద్రకకు.


"ఎందుకు." అంది చంద్రిక.


"రమణకి ఒక పూట భోజనమైనా పెట్ట లేదా అన్నావుగా. ఈ పూట పెడదామని.. మాంసం కూర తెప్పిస్తున్నాను. కొన్ని కాయకూరలు కూడా." చెప్పింది సావిత్రి.


"డబ్బులు ఉన్నాయా." అడిగింది చంద్రిక.


"ఉన్నాయి. ఇంద్రజ ద్వారా అందిన రెండు వేలుతో పాటు.. రమణ ఇచ్చిన మూడు వేలు చిల్లర కూడా ఉన్నాయి." చెప్పింది సావిత్రి.


"సరే. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. ఇంతకీ రమణకి ఫోన్ చేసి రమ్మన్నావా. ముందు వస్తాడో లేదో తెలుసుకో." చెప్పింది చంద్రిక.


సావిత్రి.. శ్రీరమణకి ఫోన్ చేస్తుంది.

నిముషం లోపే.. "రమణ ఫోన్ ఎత్తడం లేదు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉంది." చెప్పింది.


"ఆగి చేయ్. అతను వస్తానంటేనే ఇంద్రను మార్కెట్ కు పంపు." చెప్పింది చంద్రిక.


***

"స్టాండ్ కు ఇంకా రాలేదు." అటు నుండి ఫోన్ లో అడిగాడు కాశిం.


"లేదు. మరో పని మీద మరో చోటకు వచ్చాను. ఇక్కడిది కాగానే.. అక్కడికి వస్తాను." చెప్పాడు శ్రీరమణ.


"సరే. రాకపోయే సరికి.. ఫోన్ చేసాను. అంతే." కాల్ కట్ చేసేసాడు కాశిం.


ఫోన్ ని తిరిగి జేబులో పెట్టేసి..

శ్రీరమణ.. "చెప్పమ్మా." అన్నాడు.. హంసను చూస్తూ.


"నువ్వు తారస పడడానికేనేమో నేను ఇంకా ఉన్నాను." సడన్ గా చెప్పింది హంస.


"అయ్యో. అలా అంటావేమిటమ్మా." ఆతృత పడుతున్నాడు శ్రీరమణ.


"అవును. నిన్ను చూడగానే నాకు అలానే అనిపించింది." చెప్పింది హంస.


"నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించుకున్నారు." అడిగేసాడు శ్రీరమణ.


"చెప్తాను. మొదట నువ్వు చెప్పు.. నీ తండ్రి సోములు కదూ." అడిగేసింది హంస.. శ్రీరమణనే పట్టి చూస్తూ.


"అవును." అన్నాడు శ్రీరమణ.


"నిన్ను చూడగానే అనుకున్నాను. నువ్వు చాలా మట్టుకు సోములు లానే ఉన్నావు." అంది హంస.


శ్రీరమణ తేలిక పడలేక.. "అమ్మా.. నీకు నా తండ్రి.. సోములు తెలుసా. ఎలా. నువ్వు ఎవరు." టకటకా ప్రశ్నించేసాడు.


"ముందు చెప్పు.. సోములుకు నీతో పాటు పిల్లలు ఇంకా ఉన్నారా." అడిగింది హంస గజిబిజిగా.


"లేరు. నేనొక్కడనే." చెప్పాడు శ్రీరమణ.


"సోములు ఎలా ఉన్నాడు." అడుగుతుంది హంస.


"నాన్న ఎప్పుడో చనిపోయాడు." చెప్పాడు శ్రీరమణ.


"నేను.. నీ తల్లిని." చెప్పేసింది హంస.


చెంప చెళ్లుమన్నట్టు కదిలి పోయాడు శ్రీరమణ.

హంసనే చూస్తూ ఉండి పోయాడు.


"నా తల్లి ఒక పడుపుగత్తె. తను జబ్బుతో చని పోయింది. దాంతో నేను రోడ్డున పడ్డాను. ఊరులు తిరిగాను. అప్పుడే సోములు తగిలాడు. అతడి ఒంటి పుష్టి.. అతడి మాట తీరు.. నన్ను మెప్పించాయి. పూర్తిగా అతడి తోనే ఉండి పోవాలనిపించింది. ఉన్నాను కూడా. అలా నిన్న కన్నాను. ఆ తర్వాత.. ఒక గొప్పింటోడి ప్రలోభకి లొంగి పోయాను. వాడిని నమ్మి.. సోములును, నిన్ను వదిలి.. అతడితో పోయాను. వాడు నన్ను నిర్భీతిగా ఒక కంపెనీకి అమ్మేసాడు." ఆగింది హంస.


శ్రీరమణకు చెమటలు పడుతున్నాయి.


***

సావిత్రి.. కొద్ది సేపు ఆగి.. శ్రీరమణకు ఫోన్ చేస్తుంది.

అటు.. శ్రీరమణ ఆ కాల్ కు కనెక్ట్ అయ్యాడు.

"చెప్పమ్మా." అన్నాడు.


ఇటు.. సావిత్రి.. "రమణ.. చంద్రిక చెప్పుతుంది.. ఈ పూట భోజనంకి నిన్ను రమ్మనమని. రా." చెప్పింది.


అటు.. శ్రీరమణ తడబడ్డాడు. "అలానా." అన్నాడు.


ఆ వెంబడే..

"నేను ఒక అర్జంట్ పనిన ఉన్నానమ్మా. మరో మారు వస్తాను." చెప్పగలిగాడు.


ఇటు.. "సరే." అనేసింది సావిత్రి. కాల్ కట్ చేసేసింది.


"మరో మారు వస్తానన్నాడు." చంద్రికకు చెప్పింది.


"సరే. ఉన్నవే వండుకుందాం. మార్కెట్ కు ఇంద్రని పంపకు." అనేసింది చంద్రిక.

సావిత్రి వంటకై కదిలింది.

ఇంద్రజ ఏదో పుస్తకం చదువుకుంటుంది.


***

హంస ఇంటిన..

చేతిలోని ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసేసి.. దానిని జేబులో పడేసుకుంటూ..

"తర్వాత ఏమిటి." అన్నాడు శ్రీరమణ.


"ఆ కంపెనీలో.. నాకు.. ఎవడి మూలంగానో జబ్బు అంటింది. అది తెలిసిన ఆ కంపెనీ వాళ్లు నన్ను తోలేసారు. నేను రైలు ఎక్కేసానే కానీ.. ఎటు వెళ్లాలో తేల్చుకోలేక పోతున్నాను. అప్పుడే.. ఆ రైలులో.. లక్ష్మి పరిచయం ఐంది. మాటలు కలిసాయి. నేను.. నా వివరాలు ఏమీ చెప్పక.. నేను ఒక అనాథగా చెప్పుకున్నాను. లక్ష్మి జాలి చూపింది. తనతో నన్ను తనింటికి తీసుకు వచ్చింది. తనదే.. ఈ ఒంటి గది ఇంటిని.. అద్దె లేకుండా ఇచ్చింది. అప్పటికి నా వద్ద ఉన్న కొద్ది పాటి డబ్బుతో.. నాతో చీటీలు కట్టిస్తూ.. నన్ను ఆదుకుంటుంది. నాలో కేన్సర్ ఉందన్నాక మరింత నాకు తోడు ఐంది. వంట వద్దని.. తనే వండి ఇంత పెడుతుంది." చెప్పడం ఆపింది హంస.


శ్రీరమణ ఏమీ అడగలేదు.

నిముషం తర్వాత.. "లక్ష్మి మంచితనం గొప్పగా ఉన్న మనిషి. దేవుడు చాలా గొప్పోడు.. అప్పుడు లక్ష్మిని నాకు చూపాడు.. ఇప్పుడు నిన్ను నాకు చూపాడు." చెప్పింది హంస.


శ్రీరమణ తెములుకోలేక పోతున్నాడు.


***

టాక్సీ స్టాండ్ కు సైకిల్ మీద వచ్చాడు సుబ్బారావు.

శ్రీరమణకై చూసాడు.

అబ్దుల్ కనిపించాడు.


శ్రీరమణ మూలంగా అబ్దుల్.. సుబ్బారావుకు తెలుసు.

అతడి చెంతకు వెళ్లి..

"రమణ కిరాయికి వెళ్లాడా." అడిగాడు.


"అవును. రమణ బాయ్ ఉదయం నుండి స్టాండ్ కే రాలేదని మా కాశిం చెప్పాడు." చెప్పాడు అబ్దుల్.


శ్రీరమణకి ఫోన్ చేసాడు సుబ్బారావు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
112 views0 comments

Comments


bottom of page