top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 14


'Amavasya Vennela - Episode 14 - New Telugu Web Series Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 09/10/2023

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.

నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.

మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ. సాగర డ్రైవింగ్ బాగా నేర్చుకుంటుంది. శ్రీరమణకు సెకండ్ హ్యాండ్ కారు కొనిస్తానంటాడు మధుసూదన్.

హంస అనే ఆవిడను హాస్పిటల్ లో చేర్చడంలో సహాయం చేస్తాడు శ్రీరమణ. తనను కలవమని ఫోన్ చేస్తుంది ఆమె. హంస తన తల్లి అనీ, ఆమెకు కాన్సర్ అనీ తెలుస్తుంది శ్రీరమణకి.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 14 చదవండి.

అటు నుండి.. శ్రీరమణ ఫోన్ 'స్విచ్ ఆఫ్' అని తెలుస్తుంది.

"అరె.. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ ఐ ఉంది. సరే.. నేను వచ్చానని చెప్పు. ఇది నా పెళ్లి కార్డ్. రమణకి స్వయంగా ఇవ్వాలని వచ్చాను. నేను సాయంకాలం ఊరు వెళ్తున్నా. ఫోన్ చేస్తానని రమణకి చెప్పు." అన్నాడు. ఒక వెడ్డింగ్ కార్డ్ ను అబ్దుల్ కు అందించాడు.

దానిని అందుకొని.. "అలానే. రమణ బాయ్ కి ఇచ్చి చెప్తాలే." అనేసాడు అబ్దుల్.

"మర్చిపోకు. తనను తప్పక పెళ్లికి రమ్మనమన్నానని చెప్పాలి." సైకిల్ ఎక్కుతూ చెప్పాడు సుబ్బారావు.

"అలానే.. అలానే." తలాడించేసాడు అబ్దుల్.

***

హంస దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని..

"మందులు కూడా వేసుకో బుద్ధి కావడం లేదు. చావుకై చూస్తున్నాను. పొత్తి కడుపులో నొప్పి జాస్తీగా వస్తుంటుంది. భరించలేక.. అది వచ్చినప్పుడల్లా.. చావు అంచు వరకు పోతున్నాను. ఛ.. చావు దక్కడం లేదు." అంటుంది.

శ్రీరమణ ఆరాట పడుతున్నాడు.

"అయ్యో. వద్దు.. వద్దమ్మా.. అలా అనుకో వద్దు. మందులు మానొద్దు. తగ్గుతుంది." అస్తవ్యస్తంగా మాట్లాడగలుగుతున్నాడు.

తను కూర్చున్న కుర్చీని లాక్కొని.. హంస కూర్చున్న కుర్చీకి చేరవయ్యాడు.

హంస చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"దిగులు వద్దు. డాక్టర్ ని అడుగుదాం. బాగా వైద్యం అందితే.. నీకు ఏమీ కాదు. నువ్వు డీలా పడొద్దు." చెప్పుతున్నాడు.

హంస అడ్డై..

"లేదు నాయన.. రాను రాను.. రోజును గడపడం కష్టంగా ఉంది. నీ దగ్గర.. దాపరికం ఎందుకు.. లజ్జ ఎందుకు. ఈ మధ్య జాస్తీగా ఉచ్చతో రక్తం ముక్క ముక్కలగా పడుతుంది.. లక్ష్మితో పాటు.. ఎవరి కంటా పడకుండా మరి నేను ఇది ఇంకా దాయలేను. చాలా చికాకుగా ఉంది నాయన." బెక్కుతూ చెప్పేసింది.

శ్రీరమణ డంగయ్యాడు.

హంసనే చూస్తూ ఉన్నాడు. ఆవిడ బక్కతనంకి కారణం అతడికి అవగతమవుతుంది.

కొద్ది సేపు తర్వాత.. తెములుకుంటూ..

"డాక్టర్ ఇచ్చిన ఫైల్ ఉంటుందిగా. అది ఇవ్వు. నేను డాక్టర్ ని కలుస్తాను." అస్తవ్యస్తంగా అన్నాడు.

"లేదు నాయన. నాకు తెలిసి పోతుంది. నేను బతకడం ఇక కష్టం. మందులు వద్దు. నన్ను గమ్మున చావని." హంస బేలయ్యిపోతుంది.

శ్రీరమణ తల్లడిల్లిపోతున్నాడు.

"నిన్ను చూడడం కోసమే ఏమో.. నేను ఈ బిక్కు బిక్కు బతుకు బతుకుంది." చెప్పింది హంస వెక్కుతూ.

శ్రీరమణ మంచి నీళ్లకై చుట్టూ చూసాడు. గది మూలన మట్టి కుండ కనిపించింది. లేచి అటు కదిలాడు. గ్లాస్ కై చూడగా.. ఆ గదికి ఆనుకొని.. రేకు తలుపుతో మూసి ఉన్న మరో గది కనిపించింది. రేకు తలుపు తోసాడు. అది బాత్రూం కమ్ లెట్రిన్ అని గ్రహించాడు. దానిలో.. ఓ మూలన.. బొగ్గుల పొయ్యి.. మరో మూలన చిన్న నీటి బకెట్టు.. ఓ మగ్గు.. పడి ఉన్నాయి.

ఆ తలుపు మూసేసి.. తిరిగి గదిని చూసాడు.

మరో మూలన ఒక ప్లేట్.. ప్లాస్టిక్ గ్లాస్ అగుపించాయి.

ఆ గ్లాస్ తో.. కుండ లోని నీళ్లు తీసుకొని.. హంస దగ్గరికి జోరు జోరుగా వచ్చాడు.

"నీళ్లు తాగు. ఏడవకు." చెప్పాడు.

హంస ఆ గ్లాస్ అందుకుంది. నీళ్లు తాగుతుంది.

శ్రీరమణ కుర్చీలో కూర్చున్నాడు.

హంస నుండి ఖాళీ గ్లాసు అడిగి తీసుకున్నాడు. కింద పెట్టాడు.

అప్పుడే.. లక్ష్మి భోజనం ప్లేట్ తో అక్కడికి వచ్చింది.

"అబ్బాయ్.. ఇంకా ఉన్నావా." అంది.

శ్రీరమణ ఏమీ అనలేదు.

హంస.. "భోజనం వేళ అయ్యిందా." అంది.

"ఆఁ." అంటూనే.. లక్ష్మి వెళ్లి.. గదిలోని ప్లేట్ లోకి తను తెచ్చిన ప్లేట్ లోని భోజనంని సర్దింది.

"నేను మళ్లీ కలుస్తాను." లేచాడు శ్రీరమణ.

తలెత్తకనే.. తలాడించింది హంస.

శ్రీరమణ వెళ్లి పోయాడు.

భోజనం ప్లేట్ చేతికి అందిస్తూ.. "అబ్బాయ్ ఎవరు. ఎందుకు పిలిపించుకున్నావు." అడుగుతుంది లక్ష్మి.

"చూసినబ్బాయిలా అనిపించి పిలిచాను. తెలిసిన వాడే. అంతే." తేల్చేసింది హంస.

లక్ష్మి అక్కడి ఖాళీ గ్లాస్ ని తీసుకొని.. మంచి నీళ్లకై ఆ మట్టి కుండ వైపు నడుస్తుంది.

***

శ్రీరమణ.. హంస నుండి నేరుగా టాక్సీ స్టాండ్ కు వెళ్లాడు.

అక్కడ కాశిం, అబ్దుల్ ఇద్దరూ ఉన్నారు.

"ఏమిటి. గట్టి కిరాయి దొరికినట్టు ఉంది." నవ్వేడు కాశిం.

శ్రీరమణ చిన్నగా నవ్వేసాడు. ఏమీ అనలేదు.

"నీ దోస్తీ సుబ్బారావు వచ్చాడు. అతడికి పెళ్లట. కార్డు ఇమ్మన్నాడు. నిన్ను తప్పక పెళ్లికి రమ్మన్నాడు. నీకు ఫోన్ చేస్తానన్నాడు." చెప్పాడు అబ్దుల్.

అబ్దుల్ ఇచ్చిన కార్డును అందుకున్నాడు శ్రీరమణ. దానిని చూస్తున్నాడు.

"ఇక్కడి నుండే నీకు ఫోన్ కూడా చేసాడు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ న ఉందా." అడిగాడు అబ్దుల్.

అప్పుడు ఎఱికయ్యింది. ఇందాక తను.. తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం.

జేబులోని ఫోన్ ను తీసి.. స్విచ్ ఆన్ చేసాడు.

"ఎండ మాడ్చేస్తుంది. కిరాయికి పెద్దగా ఎవరూ తగలడం లేదు." చెప్పాడు కాశిం.

"నువ్వు కిరాయికి వెళ్లావుగా. అప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నా. అబ్బే.. ఏమీ లేవు." చెప్పాడు అబ్దుల్.

"మీరు లంచ్ కానిచ్చేసారా." అడిగాడు శ్రీరమణ.

"మావి ఇంటి కేరేజీలు గా. ఇప్పుడే మా ఇద్దరం కానిచ్చేసాం." చెప్పాడు కాశిం.

"నువ్వు వెళ్లి రా." చెప్పాడు అబ్దుల్.

"సరే." అంటూ అక్కడి నుండి తన కారు వైపు కదిలాడు శ్రీరమణ.

***

సావిత్రి ఇల్లు..

భోజనాలు చేస్తు్న్నారు.. ఆ తల్లి కూతుళ్లు.

కలిపి ఇస్తే.. ప్లేట్ లోనిది తనంతట తానే తినగలుగుతుంది చంద్రిక.

"సాయంకాలం.. రమణతో.. ఎక్కడికి వెళ్లి ట్యూషన్స్ చెప్పాలో కదుపు అక్క." అంది ఇంద్రజ.

"చెప్పాడుగా. చూద్దాం. రెండు రోజులు ఆగి అడుగుతాలే. పిల్లల్ని ఇంటికి తెస్తున్నాడుగా." అంది చంద్రిక.

సావిత్రి ఏమీ మాట్లాడ లేదు.

***

శ్రీరమణకి భోజనం వడ్డిస్తుంది పార్వతమ్మ.

కోరి.. హంస కబురు.. క్లుప్తంగానైనా.. వివరంగా పార్వతమ్మకు వివరించాడు శ్రీరమణ.

"ఆ మహా తల్లి.. నీ తల్లా. అట్టిది నీకు తారస పడిందా." అనేసింది పార్వతమ్మ చిందర వందరగా.

"నాన్న చెప్పింది.. ఈమె చెప్పేది.. అంతంతగా ఉన్నా.. ఆవిడ మాత్రం నా తల్లే." అన్నాడు శ్రీరమణ.

"అంతగా పాడయ్యిపోయిందా ఆవిడ." అడిగింది పార్వతమ్మ.

"అవును అమ్మ. చావు కళ కనబడుతుంది." శ్రీరమణ గొంతు బొంగురయ్యింది.

పార్వతమ్మ ఆ మాటలు సాగ కూడదు అనుకుంది.

శ్రీరమణనే చూస్తూ.. "నువ్వు నచ్చే పుణుకులు పులుసు.. తిను." అంటూనే దానిని.. శ్రీరమణ ప్లేట్ లో వేస్తుంది.

శ్రీరమణ తింటున్నాడు అస్తవ్యస్తంగా.

కొద్ది సేపు తర్వాత.. శ్రీరమణ వాలకంకి జంకి..

"ఏమైనా తను నీ తల్లి.. ఆడ ఎందుకు.. ఇడకి తెచ్చేయ్. నేను మీకు తోడు అవుతాను." చెప్పగలిగింది పార్వతమ్మ.

శ్రీరమణ వెంటనే మాట్లాడ లేదు.

భోజనం తర్వాత.. తిరిగి టాక్సీ స్టాండ్ కు బయలుదేరుతూ..

"తను అక్కడే ఉండనీ అమ్మా." అనేసాడు.

అతడి మాట తీరుకు.. పార్వతమ్మ ఏమీ అనలేక.. తగ్గిపోయింది.

***

నాలుగు రోజులు తర్వాత..

ఈ లోగ..

ఇంద్రజ.. తనే వెళ్లి వచ్చేలా ట్యూషన్స్.. శ్రీరమణ కుదర్చడం..

ఇంద్రజ.. తన అక్క స్కూటీతో ట్యూషన్స్ కు తిరుగుతుండడం..

శ్రీరమణ.. పార్వతి ఇంటికి రోజూ వెళ్లకపోవడం..

శ్రీరమణ ఎంత చెప్పినా.. హాస్పిటల్ కు రావడానికి హంస నిరాకరించడం..

శ్రీరమణ.. రోజులో ఏదో ఒక టైంన.. హంసను చూస్తూ వస్తుండడం..

జరిగాయి.

ఉదయం..

సుబ్బారావు పెళ్లికై.. తన కారులోనే.. అతడి ఊరి వచ్చాడు శ్రీరమణ.

అక్కడ.. గిరితో పాటు వెంకట్, అతడి భార్యను కలిసాడు.

"నాకు పెళ్లి ఐపోయింది. సుబ్బారావుకు ఐపోతుంది. మరి.. గిరి.. నువ్వు మిగిలారు. మీరు కానిచ్చేయండి." నవ్వేడు వెంకట్.

గిరి ఏమీ అనలేదు.

కానీ శ్రీరమణ.. "నాకు తెలిసిన అమ్మాయి.. ఇంద్రజ.. ఉంది. తను మంచి అమ్మాయి. గిరికి ఇష్టమయ్యితే మాట్లాడతాను." చెప్పాడు.

"మరేం. కుదిర్చేయరా." చనువుగా అన్నాడు సుబ్బారావు.

"గిరి భావాలు ఎరిగిన వాడిని కనుక.. ముందు పడుతున్నాను. వాళ్లు ఏమీ ముట్ట చెప్పలేరు. వీడికి కూడా పెళ్లి నుండి ముట్టాలన్న ఆశ లేదు. అలాగే అమ్మాయి చదువుకుంది. ట్యూషన్స్ ద్వారా నెలకు ఎనిమిది వేలు వరకు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా మంచిది.." నొక్కి చెప్పుతున్నాడు శ్రీరమణ.

అడ్డై..

"నువ్వు అన్నాక మరో ఆలోచన వద్దు. గిరి.. నువ్వూ ఏమీ ఆలోచించకు. రమణ చెప్పినట్టు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో." చెప్పాడు వెంకట్.

"నేను వాళ్లతో కదిపి ఉన్నాను. గిరి సరే అంటే వాళ్లతో సూటిగా ముచ్చటిస్తాను. పెద్దలు పెద్దల్ని కలపగలను." చెప్పాడు శ్రీరమణ.

"నువ్వు చెప్తే.. మా వాళ్లని తీసుకు వస్తాను." చెప్పాడు గిరి.

"ఇంకేం.. వీడిది క్లియర్. మరి.. నువ్వూ చేసుకోరా." అన్నాడు వెంకట్.. శ్రీరమణని చూస్తూ.

నవ్వేసాడు శ్రీరమణ.

"పక్కోళ్లనే సుఖ పెట్టడం కాదు.. నువ్వు సుఖ పడు." చెప్పాడు సుబ్బారావు.

"సరేలేరా." అనేసాడు శ్రీరమణ.

"వీడు ఎప్పుడు.. మన మాట విన్నాడు." అనేసాడు వెంకట్.

అప్పుడే భోజనాలకు కబురు రావడంతో.. వాళ్లంతా అటు కదిలారు.

========================================================================

ఇంకా వుంది..

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 15 ( చివరి భాగం ) త్వరలో..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








111 views1 comment

1 Comment


Praveen RoMeO
Praveen RoMeO
Oct 10, 2023

Share your contact number bvd prasad rso garu

Like
bottom of page