top of page
Original.png

కాలు... మాట... జారితే?


రైల్వే స్టేషన్‌లో పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న మాధురి, దూరంగా నడుచుకుంటూ వెళ్తున్న గురునాథ్

Kaalu... Maata... Jaarithe? - Telugu Social Message Story | Ch. C. S. Sarma 

కాలు... మాట... జారితే? - తెలుగు సామాజిక సందేశాత్మక కథ | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 16/08/2026


కాలు... మాట... జారితే? అనే ఈ కథ మనిషి జీవితంలో మాట విలువ, నమ్మకం, ఆత్మగౌరవం, సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. కళాశాల విద్యార్థుల మధ్య ఏర్పడిన స్నేహం, ప్రేమ, మోసం, ప్రమాదకర పరిస్థితి నుంచి ఒక యువతిని కాపాడిన మానవీయ స్పందన వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక ప్రభావం ఉంటుందని, ఒక్కసారి జారిన మాట జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగిల్చగలదని కథ ముగింపు బలంగా గుర్తుచేస్తుంది.


గురునాథ్, మాధురి, వాసవరాయ ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్. గురునాథ్ చాలా తెలివిగలవాడు, నెంబర్ వన్ స్టూడెంట్. తన అవసరాలకు మాధురి, గురునాథుని వాడుకుంది విద్య విషయంలో. అమాయకుడు గురునాథ్ ఆమెను ఎంతగానో ప్రేమించాడు. ఒక సందర్భంలో ఆమెకు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఆమె “నీతో నేను చనువుగా ఉన్నంత మాత్రాన నా మనసులో నీ మీద ఇలాంటి భావన లేదు” అని కచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయింది.


కానీ ఆ పిచ్చిది వాసవరాయ మైకంలో పడిపోయి అతనిని గాఢంగా ప్రేమించింది. తన అవసరాన్ని తీర్చుకునే దానికి వాసవరాయ ఆమెను లాడ్జికి తీసుకుపోయాడు. వారు వెళ్ళేది గురునాథ్ చూసి వారిని ఫాలో అయ్యాడు.


వాసవరాయ సరదాగా మాట్లాడుతూ మాధురిని ఎంజాయ్ చేద్దాం అని అడిగాడు, కానీ ఆమె నిరాకరించింది. అదంతా వివాహం తర్వాతే అంది. వాసవరాయ మనసులో ఆమెను అనుభవించి తీరాలని వాంఛ. ఆమెకు ఫుడ్, తనకు బీర్లు తెప్పించి సేవించాడు. మాధురి భోంచేసి పడుకుంది. తాళ్లతో ఆమె చేతులను కట్టేసి వాసవరాయ కార్యక్రమానికి ఉపక్రమించబోయాడు.


ఆ సమయంలో తలుపు తట్టిన శబ్దం. రెండుసార్లు నిర్లక్ష్యం చేశాడు. మూడోసారి బిగ్గరగా తలుపు శబ్దం వినిపించేసరికి తలుపు తెరిచాడు. గురునాథ్ లోపల మాధురి పరిస్థితి గ్రహించి లోనికి ప్రవేశించి ఆమె కట్లను విప్పాడు. వాసవరాయ అతని మీద తిరగబడ్డాడు. గురునాథ్ రిసెప్షన్‌కి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చారు, పోలీసులకు ఫోన్ చేశారు. వాసవరాయను పోలీసులు బేడీలు వేసి లాక్కొని వెళ్లిపోయారు.


గురునాథ్ మాధురిని తన ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. మాధురిని సొంత ఊరైన భువనేశ్వర్‌కు టికెట్ కొని రైలు ఎక్కించి చెప్పాడు.

“మాధురీ! ఒక మాట, కాలు జారితే గాయం, మచ్చ మిగిలిపోతుంది. కానీ మాట జారితే దాని మరపు మన మరణానంతరమే. కనుక ఈ రెండింటి విషయాల్లో ఎవరైనా సరే, సదా జాగ్రత్తగా ఉండాలి సుమా!”


తాను గురునాథ్ విషయంలో చేసిన తప్పును తలుచుకొని మాధురి ఏడుస్తూ కంపార్ట్‌మెంట్ దగ్గర నిలబడిపోయింది. గురునాథ్ వెనుతిరగకుండా స్టేషన్ బయటికి నడిచాడు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page