top of page
Original.png

కల మేల్కొన్న వేళ

కల మేల్కొన్న వేళ, చిలకమర్రి పద్మావతి, తెలుగు కథ, అమ్మమ్మ కథ, కుటుంబ విలువలు, వృద్ధాప్యం, మనవలు, ప్రేరణాత్మక కథలు, మహిళా కథలు, తెలుగు సాహిత్యం

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ కల మేల్కొన్న వేళ కథలో మనవలతో కథలు చెబుతూ, భవిష్యత్తు గురించి ఆశతో ఆలోచిస్తున్న అమ్మమ్మను చూపించే భావోద్వేగ కుటుంబ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ కల మేల్కొన్న వేళ కథలో మనవలతో కథలు చెబుతూ, భవిష్యత్తు గురించి ఆశతో ఆలోచిస్తున్న అమ్మమ్మను చూపించే భావోద్వేగ కుటుంబ దృశ్యం.

Kala Melkonna Vela - Telugu Family Story | Chilakamarri Padmavathi

కల మేల్కొన్న వేళ - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి పద్మావతి

Publishes in manatelugukathalu.com on 14/06/2026


వయసు పెరిగేకొద్దీ మనిషి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటాడు. కానీ కొందరి హృదయాల్లో మాత్రం కొత్త కలలు పుడుతూనే ఉంటాయి. మనవల నవ్వులు, కుటుంబ ప్రేమ మధ్య కూడా సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో జీవించే ఒక అమ్మమ్మ మనసులో పుట్టిన ఆలోచన ఈ కథకు ప్రాణం. "కల మేల్కొన్న వేళ" కథ వృద్ధాప్యం అంటే ముగింపు కాదని, కొత్త ఆశలకు ఆరంభమని హృదయాన్ని తాకేలా చెబుతుంది.


పిల్లల కేరింతల శబ్దాలతో మెలకువ వచ్చిన నాకు, ఒక్క క్షణం ఎక్కడున్నానో అని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.


“హే.. అమ్మమ్మ లేచింది!” అంటూ గెంతుతున్న పిల్లల్ని చూసి నాకూ వెంటనే లేచి గంతులేయాలనిపించింది. కానీ నా శరీరం అందుకు సహకరించలేదు. ఏమిటిలా! ఎలా ఉండేదాన్ని, ఇలా అయిపోయాను?


కాల మహిమ అంటే ఇదే కాబోలు. నాలో నేనే అనుకుని, చిన్నగా నవ్వుకుంటూ పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాను. ఎంత ముద్దు చేసినా తరగదు వాళ్ళని. కల్మషం లేని వాళ్ళ నవ్వు, అమ్మమ్మ అనే పిలుపు. వీళ్లందరూ ఎవరికి ఎవరో... నా నీడలోకి వచ్చారు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా, మేమిద్దరం మాత్రం ఈ చరమ దశలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూనే, వీళ్ళందరికీ అమ్మమ్మ, తాతలమయ్యాం. అలా అలా నా మనసులోనే ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయా.


“అమ్మమ్మా! మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయావా? ఇలా అయితే మేము తాతతోనే ఆడుకుంటాం. నీ దోస్త్ కటీఫ్!” అంటూ అలిగిన పిల్లల్ని చూసి, "అదేం లేదు... మీకు ఏ కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నా" అన్నాను. కథ అనగానే, "చెప్పు చెప్పు" అంటూ చుట్టూ చేరారు ఎంతో ఉత్సాహంగా.


“అమ్మమ్మా... నాకు రాజు కథ!” “నాకు రాముడి కథ!” నాకు కృష్ణుడి కథ!” 

“నాకు దేవుడి కథ వద్దు, డిష్యుం డిష్యుం ఫైటింగ్ కథ కావాలి!” 


అంటూ వాళ్లలో వాళ్ళే అరుచుకుంటున్నారు. ఇంకా మాటలు పూర్తిగా రాని పిల్లలు కూడా, కథ అనగానే ఉత్సాహంగా దగ్గరికి చేరారు.


ఏ కథ చెప్పాలి ఇవాళ వీళ్ళకి? ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ... వాళ్ళ జీవితాలే బోల్డన్ని కథలు. వీళ్ళందరినీ నేను సరిగ్గా పెంచగలనా? నాకు శక్తి సరిపోతుందా?

శక్తికి మించిన పని పెట్టుకున్నానా? ప్రశాంతంగా పిల్లల దగ్గర హాయిగా, వాళ్ళకి సహాయంగా ఉండకుండా, "ఏమిటో నీ పిచ్చి పనులు" అంటూ చిన్నగా విసుక్కున్నా, నన్ను వదిలి వెళ్ళలేక నా చెంతనే ఉండేవారు మా వారు.


నన్ను ప్రోత్సహించే నా పిల్లలు... అన్నీ బానే ఉన్నాయి. మరి ఇంకా దేనికో వెతుకులాట! ఏదో ఆరాటం... ఇంకేదో చేయాలనే తపన. ఏం చేయాలి? ఏం చేయగలను?


అమ్మమ్మా! ఏంటి అలా నిద్రలో ఏదో కలవరిస్తున్నావ్? లే, లే... ఆడుకుందాం అంటూ నన్ను ఊపేస్తుంటే మెలకువ వచ్చిన నాకు, ఒక నిముషం తర్వాత అర్థమైంది. నేను ఇంకో పదేళ్లు ముందుకు వెళ్ళిపోయా నా ఊహల్లో అని. ఆ విషయం గ్రహించిన వెంటనే, నాకు డిన్నర్ టైమ్‌లో ఆ విషయం నా కుటుంబ సభ్యులందరికీ చెప్పాలని, నా కల నిజం చేసుకోవాలని గట్టిగా అనుకోగానే, నా మనస్సు తేలిక అయినట్టనిపించింది. ఇంకో పది రోజులు పోతే, అందరూ ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఇవాళే మాట్లాడాలి.


ఏదో కొత్త ఉత్సాహం నాలోకి వచ్చినట్టు అనిపించింది. నా చిన్ని తల్లులతో ఆడుకోడానికి హుషారుగా కదిలాను.


యే! ఏ! అమ్మమ్మ రెడీ! అందరూ రండి... ఫ్యామిలీ గేమ్ ఆడుకుందాం! అంటూ అరుస్తున్న నా మనవరాళ్ళ గొంతులు నాకు వినసొంపుగా అనిపించాయి. ఎంత ముద్దుగా ఉన్నారు వీళ్ళు! నా దిష్టే తగిలేలా ఉంది! అని నవ్వుకుంటూ గదిలోంచి బయటికి నడిచాను, నా కల నిజం చేసుకునే ఆలోచనలతో.


                   ***************************************


చిలకమర్రి పద్మావతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి పద్మావతి

నా పేరు చిలకమర్రి పద్మావతి

నేను విజయవాడ ఆంధ్రా బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ చేశాను.. మా వారు శ్రీ మరింగంటి సుందర శ్రీనివాస్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ నుండి రిటైర్ అయ్యాక ఇద్దరం విశ్రాంతి జీవితం గడుపుతున్నాము .మాకు ఇష్టమైన ప్రదేశాలన్నీ తిరగటం ,మా పిల్లల, మనవరాళ్ళ ఫోటోలు వీడియోలు చూడటం..ఇవే మా ఆనందాలు.. మొదటి నుంచి (పుస్తకాలు) కథలు నవలలు చదవటం అలవాటు..చిత్ర కళ లో కొద్దిగా ప్రవేశం వున్నా అన్ని లలిత కళలను ఆస్వాదించడం చాలా ఇష్టం..

మా మనవరాళ్ళకి కథలు చెప్పటం ఇంకా ఇంకా ఇష్టం.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

ఎంత అందమైన కల! జీవితాన్ని పండించుకునే సమయం లో విరబూసిన కుసుమాల సౌరభం పరవశింప చేసిన అనుభవం నిజం అయ్యే తీరుతుంది

Like
bottom of page