'Kalisochiina Adrushtam' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 22/10/2023
'కలిసొచ్చిన అదృష్టం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
నా పేరు భాస్కర్. నేను ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మే మిడిల్ క్లాస్ వ్యక్తి ని. సిటీ లో ఒక చిన్న కంపెనీ లో ఉద్యోగం చేసుకుని హ్యాపీ గా ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి అందమైన భార్య రావాలని.. చాలా కలలు కనే వాడిని. అదృష్టం ఉన్న వాడికి రంభ లాంటి పెళ్ళాం వస్తుందని ఎక్కడో చదివాను. ఇలా ఉంటుండగా, మా ఇంట్లో నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది.
"నాయనా! నువ్వు తొందరగా బయల్దేరి ఊరు రావాలి"
"ఎందుకు అమ్మా! అంత కంగారు ఎందుకు?"
"మీ నాన్న గారికి వొంట్లో బాగోలేదు.. డాక్టర్ పెద్ద హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళమన్నారు.. నువ్వు ఉండాలని చెప్పారు. వెంటనే బయల్దేరి రా!"
"అలాగే! వస్తున్నాను.. నువ్వు కంగారు పడకు!"
ఎంతో కంగారుగా.. బస్సు కోసం బస్సు స్టేషన్ కు బయల్దేరాడు భాస్కర్. ఇంకో ఐదు నిమిషాలలో బస్సు అని తెలుసుకున్నాడు భాస్కర్. ఈలోపు తన గతం గుర్తు చేసుకున్నాడు.
***
"నాన్నా! మీరు వంద చెప్పండి! వెయ్యి చెప్పండి.. నేను మావయ్య కూతుర్నిపెళ్ళి చేసుకోను.. "
"దానికి ఏమిటి తక్కువ.. బానే ఉంటుంది గా?"
"అదే తక్కువ.. అందం!"
"అందం తో ఏమిటి చేసుకుంటావు రా ! మనసు ముఖ్యం. నువ్వంటే దానికి చాలా ఇష్టం!"
"లేదు నాన్న! చినప్పటినుంచి అందమైన పెళ్ళాం రావాలని ఎన్నో కలలు కన్నాను. నా జాతకం లో కుడా.. దేవ కన్య లాంటి అమ్మాయి భార్య గా వస్తుందని ఉందంటా!"
"వచ్చాడు అండీ! మన్మధుడు మరి!"
ఇంట్లో గొడవ పడి.. సిటీ కి ఉద్యోగం కోసం వచ్చేసాడు భాస్కర్. అప్పుడే.. నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
***
కొంప దీసి.. నాన్న బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నాడా? అనేక ఆలోచనలు మనసుని కుదిపేస్తున్నాయి. ఈలోపు బస్సు హార్న్ చేస్తూ.. వచ్చేసింది. బస్సు ఎక్కిన వెంటనే చల్లటి గాలికి నిద్ర పట్టేసింది..
ఇంటికి చేరుకున్న భాస్కర్.. ఇంటి వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు..
"ఏమిటమ్మా! ఇదంతా.. నాన్న కు ఎలా ఉంది?"
"మీ నాన్న కేమి రా! గుండ్రాయి లాగ ఉన్నాడు.. "
"మరి ఫోన్ లో అలా చెప్పవేంటి!"
"మీ నాన్న చెప్పమన్నారు"
"ఈ పెళ్ళి పనులు ఎవరి కోసం?"
"నీకే నాన్న! ఇంకో గంటలో.. నీకు మావయ్య కూతురితో పెళ్ళి.. "
మా నాన్న ఇంత పెద్ద స్కెచ్ వేస్తాడని అనుకోలేదు.. ఈ పెళ్ళి వద్దన్నా వినలేదు.. చేసుకోవాల్సి వచ్చింది.
"బావా! ఏమిటి అలా ఉన్నావు? ఈ పెళ్ళి ఇష్టం లేదా?"
"నేను అందమైన పెళ్ళాం కోసం కలలు కనే వాడిని.. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. మా నాన్న ఇష్టం లేకుండా చేసాడు ఈ పెళ్ళి"
"బావా! నేను అందంగా లేనా? ఈ నాలుగు సంవత్సరాలలో కొంచం రంగు చేసి.. బొద్దుగా అయ్యానని అందరూ అంటున్నారు. నీ ముఖానికి నా కన్నా అందమైన పెళ్ళాం వస్తుందా?"
"అలా అనకు భావనా! నా జాతకం లో కూడా అదే ఉంది!"
"అబ్బా! నీ కోసం రంభ దిగి వస్తుందన్నట్టు చెబుతున్నావే!"
"వచ్చినా వస్తుందేమో.. అదృష్టం వుంటే! చూస్తూ ఉండు ఏదో రోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాను" అంటూ బాల్కనీ లోకి వచ్చేసాడు భాస్కర్.
ఆ రోజు రాత్రి.. భాస్కర్ కు ఒక కల వచ్చింది.. అందులో రంభ ఊరి చివర విహారానికి వచ్చినట్టు.. కల వచ్చింది.
తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు కదా! రాత్రికి అక్కడకు వెళ్ళి చూస్తాను. ఆ రోజు రాత్రి .. ఊరి చివరకు.. వెళ్లి తన కల నిజమవుతుందేమో నని ఆశ పడుతున్నాడు భాస్కర్..
గజ్జెల శబ్దం తో రంభ అక్కడకు వచ్చింది. విహారనికి వచ్చిన రంభ..
"రా మానవా! నీ కోసమే చూస్తున్నాను"
"నా కోసమా.. ఈ అందాల రంభ చూడడమా.. ? ఇది కలా.. నిజమా?"
"నిజమే!"
"నేను వస్తున్నట్టు మీకు ఎలా తెలుసు?"
"నిన్న రాత్రి.. నీకు కలలో నేను కనిపించానా?"
"అవును..”
“అందుకే నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు చిన్నప్పటినుంచి రంభ జపం చేస్తున్నావని నాకు తెలిసింది. అందుకే నిన్ను పిలిచాను"
"నన్నే ఎందుకు.. ?"
"నువ్వు అదృష్టవంతుడవు.. నువ్వు పుట్టిన సమయం, నక్షత్రం నీకీ అదృష్టం తెచ్చాయి .. "
"అయితే?"
"విను.. వివరంగా చెబుతాను.. నేను విహారానికి వచ్చినప్పుడు.. నా చేతి కంకణం జార విడుచుకున్నాను.. అది లేనిదే నేను మళ్ళీ దేవ లోకానికి వెళ్ళలేను. నీ లాంటి వాడికే, ఆ కంకణం తీసుకుని వచ్చే అవకాశం ఉంది. నా కోసం.. రేపటికల్లా తీసుకుని రావాలి"
"కాని.. నాకు ఒక వరం ఇవ్వాలి.. దానికి బదులుగా.. " అడిగాడు భాస్కర్.
"నువ్వు కంకణం తెస్తే.. నువ్వు అడిగిన వరం ఇస్తాను"
తన కోరిక నెరవేరుతుందని.. భాస్కర్ చాలా కస్టపడి కంకణం వెతికి తీసుకుని వచ్చాడు.
"ఇప్పుడు చెప్పు మనవా! నీకు ఏమి వరం కావాలో?"
"నన్ను నీవు పెళ్ళి చేసుకోవాలి!"
“అలాగే! నీ కోసం.. నీకు ఇచ్చిన మాటకోసం.. నిన్ను నాతో పాటు దేవ లోకానికి తీసుకుని వెళ్తాను..”
"రంభా! వస్తున్నా.. నీ కోసమే వస్తున్నాను.. " అని ఆనందంలో మునిగిపోయాడు.
ఒక లెటర్ రాసి, ఇంటికి పోస్ట్ చేసాడు. లెటర్ అందుకున్న భావన.. అందులో విషయం చదివింది..
"భావనా! ముందు నీకు థాంక్స్ చెప్పాలి.. నువ్వే కనుక ఆ రోజు నాతో అలా మాట్లాడి ఉండకపోతే, నేను ఈరోజు రంభ ను పెళ్ళి చేసుకోగలిగే వాడిని కాదు. చాలా థాంక్స్. నువ్వు నచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకో.. మా అమ్మ, నాన్న ని జాగ్రతగా చూసుకోమని మా తమ్ముడికి చెప్పు. బై"
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Hozzászólások