కల్లు సార కాదు సుఖం

'Kallu Sara Kadu Sukham' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
'కల్లు సార కాదు సుఖం' తెలుగు కవిత
రచన: సుదర్శన రావు పోచంపల్లి
కల్లు సార దాగకయ్య
ఇల్లు గుల్ల జేయకయ్య
పాలు లేక పిల్లోడు
పస్తులున్న నామేను
పట్టి పట్టి పీడిచ్చి
లొట్టలేసి ఏడుస్తు
గుటికెడైన పాలు లేక
గునుసుకుంటు నను జూసి
గుడ్ల నీళ్ళు గుక్కుకొనె
ఏడాది ఎడమైనా
ఏ కొంచెం లేకుండ
ఎడపిల్లడు వీడైతె
పుట్టబోయె పసికూనకు
గొట్టపు పాలు కొనిదెచ్చేదెట్లయ్యా
పసులెన్నొ బండబెట్టి
పుస్తె నాది తెగనమ్మి
మస్తుగా తాగి వచ్చి
కుస్తీకి దిగుతావు
బస్తీలో మన పరువు
బాజారు పాలాయె
ఇంటిముందు ఈరన్న
వెనుకింటి వెంకన్న
పక్కింటి పాపన్న,గోపన్న
భార్య మాట కాదనక
కల్లు మీద ఒట్టు బెట్టి
సారమాట కట్టిబెట్టి
బాస జేసి బాగుపడిరి
మూడేళ్ళ పిల్లల్ని
ముచ్చటగా బడికి బంపి
కూలి నాలి జేసుకుంటు
కూడబెట్టిరి సొమ్మెంతొ
పూరి గుడిసె మారిపాయె
పెంకుటిల్లు పెరిగి వచ్చె
నిన్న మొన్న నిందించిన
చిన్న పెద్ద వారలంత
మారినోళ్ళు మనుషులంటు
వారి నెంతొ మెచ్చు కొనిరి
మారినోళ్ళ మాట నమ్మి
దారి తెలిసి మసులుకుంటె
ఊరి వాళ్ళు నీకు గూడ
ఉపకారం చేస్తారు
సర్కరోళ్ళు సాయపడి
నీ ఇంటిని చక్క దిద్దుకొమ్మందురు
తాగుబోతు నేడు వీడు
కాడు చూడ మంటు జనం
బాగుపడ్డ మనిషంటు
బాగుగానె జూస్తారు
కల్లు సార దాగకయ్య
ఇల్లు గుల్ల జేయకయ్య.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/psr
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.