top of page

కల్పతరువు - పార్ట్ 5'Kalpatharuvu - Part 5' - New Telugu Web Series Written By Surekha Puli

Published On 27/12/2023

'కల్పతరువు - పార్ట్ 5' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సత్యలీల పెళ్లి డి. ఎస్. పి. విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


ప్రజ్ఞా పృథ్వీధర్లు బావామరదళ్లు. పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. 


చండీఘడ్ లో పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు. 


ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. ‘కుట్లు-అల్లికల’ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ. 

త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. 


ఇక కల్పతరువు ధారావాహిక ఐదవ భాగం చదవండి.. 


జ్వాల పుట్టినరోజని అచల డబల్కామీటా ఇచ్చింది. 


సత్యలీల మాట కదిపి ”బాగా ఆలోచించుకో, ఒకసారి వివాహబంధం తెంచుకున్నావంటే మళ్ళీ వెను తిరగలేవు. ” 


“చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ దినదిన గండం కంటే విడాకులు ముఖ్యం. ”


“ఐతే విడకులైన మహిళ పట్ల రోజూ ఎదుర్కునే మనుషుల భాష, ప్రవర్తన అన్నీ వేరేగా వుంటాయి. ఒక్కొక్క సారి చాలా హీనమైన పరిస్థితులు దాటుకొని పోవాల్సి వుంటుంది. అన్నీ సహించగలను అనుకుంటేనే నువ్వు ఈ బంధం తెంచుకోగలవు. "


అచల యెంతో శ్రద్దగా వింటూ వున్నది. 


"మరో ముఖ్యమైన విషయం.. ఇప్పుడున్న భర్తతో నీ కష్టాలు. కానీ, బాబును వదులుకో గలవా?” ధైర్యాన్ని పెంచే ప్రశ్న వేసింది. 


“నాకు జ్వాల ముఖ్యం, బాబు ఎలాగైనా తండ్రి సమక్షంలో బ్రతగ్గలడు. కానీ ఛీత్కారాల మధ్య పాప నలిగి పోతుంది. పైగా నా మనఃశాంతి కోసం నేను కూడా కొంత త్యాగం చేయాలి కదా. ” స్థిరత్వం వ్యక్త పర్చింది. 


“ఐతే, శ్రద్దగా విను, మీ వారితో నేను స్నేహం పెంచుకుంటాను, అతని ద్వారానే విడాకుల ప్రయత్నం చేద్దాం. అందుకని ఇదిగో ఈ ఐదు వందలు పాప బర్త్ డే గిఫ్ట్, వెయ్యి రూపాయలు బాబుకు గిఫ్ట్. ”


"బాబుకు ఎందుకు? వాడి పుట్టిన రోజుకు ఇంకా టైమ్ వుంది.”


"ఇప్పటి నుండి నీకూ - నాకు సఖ్యత అంతంత మాత్రమే. త్యాగి గారికి బాబు అంటే చాలా ప్రేమ కనుక నేను వెయ్యి రూపాయల ఎర వేసి ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాను.”


మారు మాట్లాడకుండా అచల వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయమే త్యాగి బాబును తీసుకుని వచ్చాడు. నిజమే, త్యాగి అందగాడు, సినిమాలో ఛాన్స్ వస్తే బావుండేది. 


“మేడమ్ జీ, మా వూళ్ళో మీకు సౌకర్యంగా వుందా?” అని మాట కలుపుతూ చాలాసేపు కబుర్లు సాగించాడు. 


ప్రతీ రోజు రావడంతో కొంచెం ఫ్రీడం ఏర్పడ్డది. ఇక ఆదివారం సత్యలీలకు సెలవు అని తీరిగ్గా గోడు వెళ్ళగక్కాడు. చాలా ఆర్ధిక యిబ్బందులు వున్నాయని, ఐదు వేలు సద్దమని సారాంశం. 


“ఐదు వేలు కాకుంటే పదివేలు ఇవ్వగలను, కానీ ఒక్క విషయం నిజంగా చెప్పండి. ”


“మీరు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారు మేడమ్ జీ, అడగండి. ”


“అచలాదేవి వలన మీరు సంతోషంగా వున్నట్టు లేరు. మీ స్వంత విషయాలు అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు, ప్లీజ్.. నేనొక సోదరి లాంటిదాన్ని.. ”


త్యాగి తలవంచుకొని “అచల నా గురించి మీతో ఏమైన చెప్పిందా?” అనుమానంగా అడిగాడు. 


“లేదు, ఏమీ చెప్పలేదు. ఎప్పుడూ ఏదో పనిలో వుంటుంది. నాతో ముఖాముఖీగా వుంటది. మీ ముఖంలో వున్న బాధ అచల ముఖంలో లేదు. ”


టీ, బిస్కట్స్ టీపాయి పైన పెడుతూ సత్యలీల చెప్పింది “రేపు సోమవారం, బ్యాంక్ నుండి మనీ డ్రా చేసి యిస్తాను. సరేనా, టీ తీసుకోండి. ”


టీ తాగుతూ ఆత్మకథ చెప్పుకున్నాడు. అచల చెప్పిన వివరాలకు త్యాగి చెప్పే వివరాలుకు తేడా వుంది. “ఇంతగా చీకటి వున్న నా జీవితంలో నా కొడుకు ఒక సూర్యుడు. ” అన్నాడు. 


“బాబు సూర్యుడు ఐతే మరి చందమామ ఎవరు?” కొంచం చిరునవ్వు ప్రకటిస్తూ అడిగింది. 


"ఎవ్వరితోనూ చెప్పనని ఒట్టేస్తే చెప్తాను మేడమ్ జీ. " 


సరేనని ఒట్టేసింది. 


కొంచెం సంతోషంగా, ఇంకొంచం సిగ్గుగా సంభాషణ మొదలుపెట్టాడు. “మనాలిలో నాకు మరో స్త్రీతో సంబంధం వుంది. చాలా మంచి అమ్మాయి.” పరోక్ష స్త్రీ పట్ల దయ, జాలి, అత్యంత ప్రేమ ప్రకటిస్తూ తన వివాహేతర సంబంధం గూర్చి, చెబుతూ ఆమెకు పిల్లలు పుట్టరని భావోధ్యేగం వెళ్ళాడించాడు. 


విషయాన్ని మారుస్తూ పిల్లల భవిషత్తు, పొదుపు అంటూ పరిస్థితిని స్తబ్ధ పర్చింది సత్యలీల. 


>>>>>>>>>>


ఒక నెల రోజులు తల్లి తోడుగా వెళ్ళింది. తోటి విద్యార్తుల కలయికతో ప్రజ్ఞలో జంకు, బిడియం పోయాయి. 


ఆరోగ్యరీత్యా పిల్లల మతి స్తిమితం లేకున్నా, నిరాశల్లో కూరుకు పోయినా తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం వారిని ఆ వూబిలో నుండి బయటకు లాగాలి. 


“నాన్నా, టీచర్ కుట్టుమెషిన్ కొనుక్కోమంది. కానీ వద్దులే, ఎందుకంటే నేను టైలర్ అవ్వను కదా, అదొక వృధా ఖర్చు. కాలేజీలో ఇంటర్ చదవాలి అన్నారు కదా. ”


“కుట్టుమెషిన్ ఇంట్లో వుంటే ఎన్నో లాభాలు. దాని మాట వినకండి, చిన్చిన్న చిరుగులు కుట్టుకోవచ్చును. కూతుళ్లందరూ తల్లుల వద్ద నేర్చుకుంటారు. నేనూ మాత్రం ప్రజ్ఞ వద్ద కుట్టు నేర్చుకుంటాను.” తల్లి హుషారుగా చెప్పింది. 


ఇదొక వంక అని తెల్సినా, నారాయణ కుట్టుమెషిన్ కొన్నాడు. ప్రజ్ఞ మనసులో తెలియని ఆనందం. “నాన్న తన కోసం బొమ్మలు, బట్టలు, పుస్తకాలే కాదు, కుట్టుమెషిన్ కూడా కొన్నాడు. ” 


కొబ్బరి కాయ కొట్టి పూజ చేశారు. అన్నీ కోల్పోయినట్లు, ఓ మూల కూర్చోవటం పూర్తిగా మానేసింది. అమ్మను విశ్రాంతి తీసుకోమని తానే వంటలు రుచిగా చేయడమూ, ఆ తృప్తిని ముగ్గురూ పంచుకునే రోజులు వచ్చాయి. 


ఆరు నెలలు ఆవిరై పోయాయి, 'కుట్లు-అల్లికల' కోర్సు పూర్తయింది. 


డిసెంబర్లో రామకోఠి మ్యూజిక్ కాలేజీ నుండి అప్లికేషన్ ఫామ్ తెచ్చాడు నారాయణ. 


“నీకు నచ్చిన సంగీతం నేర్చుకో అమ్మా, ఈ ఫామ్ నింపి, రేపు మనిద్దరము వెళ్దాం. ”


“నాన్నా, జూన్లో నేను కాలేజీకి వెళతానుగా, మళ్ళీ సంగీతం డిగ్రీ నాకెందుకు?”


“డిగ్రీ కోసం కాదమ్మా, నా కోరిక. నాకు అవకశాల్లేవు, కనీసం నిన్ను చూసి నేను సంతృప్తి పడతాను. ”


“నాన్నా, సిటీలో ఏది వూరికే రాదు, అన్నిటికీ కాసులు, కాణీలు గుమ్మరించాలి. ”


“ఈ మ్యూజిక్ కాలేజీ ప్రభుత్వం వారిది, ఖర్చు చాలా తక్కువ. ప్రతీ రోజు ఒక గంట మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి, ఇంట్లో కూడా సాధన చేస్తే చాలు. ” 


అడ్మిషన్ ఫామ్ తీసి చదివింది. “ఏ కోర్సు తీసుకోవాలి?”


“నీ ఇష్టం మీద ఆధారపడి వుంది. ” 


“నాకు గాత్ర సంగీతం కంటే వాయిద్య సంగీతమే ఇష్టం. ”


అమ్మ: “వీణ నేర్చుకో.. ” 


“నాన్నా, నువ్వేమంటావు?” 


జవాబు రాలేదు. 


“సితార్ వాయిద్యం విన సొంపుగా వుంటుంది” ప్రజ్ఞ మనసులోని మాట. 


“మన దక్షిణ భారత దేశంలో వీణ ప్రాముఖ్యత ఎక్కువ. సితార్ ఉత్తర భారత దేశంలో చలామణి. ”


“మరి తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో వాయిద్య సంగీతానికి పలుకుబడి లేదా?” నారాయణ వ్యంగ్యం. 


ప్రజ్ఞ ముసిముసిగా నవ్వుకుంది. ఈ ఆహ్లాదమే తల్లిదండ్రులు తమ సంతానం నుండి ఆశించేది. 


“కర్ణాటక వోకల్ గానీ, హిందుస్తానీ వోకల్ గానీ నేర్చుకుంటే సితార్ వాయిద్యం కొనే అవసరం రాదు. ” సద్దుకోవాలనుకుంది ప్రజ్ఞ. 


“నీ అభిలాషను తోసిపుచ్చకు, నేను కదా సితార్ కొనిచ్చేది. నువ్వు సితార్ నేర్చుకునేంత వరకే నీ ప్రయత్నం, మిగితా విషయాలు మావి. ” 


ఆ మర్నాడే సితార్ క్లాస్ లో అడ్మిషన్ దొరికింది. జనవరి నెలలో సితార్ క్లాస్ మొదలైంది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. సాఫీగా సాగిపోయే బాటలో ముల్లు గానీ చిన్ని రాయి కానీ గుచ్చుకోక మానదు. 


ప్రతీ రోజు ఉదయాన్నే సితార్ క్లాస్ కు వెళ్ళే దారిలో కొందరబ్బాయిలు ప్రజ్ఞను హేళన చేస్తూ వెంబడిస్తున్నారు. 


“మా క్యురియాసిటీ.. నువ్యే సిటీ?” ప్రజ్ఞ వెనుకగా అబ్బాయి మాట. 


“మేం సింప్లిసిటీ.. మాకు మాటలు రావమ్మా..” మరో అబ్బాయి జవాబు. 


ప్రజ్ఞ నడక వేగం చేసింది. 


“మాటలు నేర్పక, నడక మాత్రమే నేర్పించరా.. ”


“అమ్మాయిలు హంస నడక నడవాలి.. అంత జోరు పనికిరాదు.. పాప.. ” 


“పాప కాదురా.. , మరి పేరేమిటో.. ”


“పేరెందుకులే.. మ్యూజిక్ కాలేజీ నుండి వస్తుంది.. అర్థం చేసుకో.. ”


“ఓహో, మ్యూజిక్ కాదు, డాన్స్ నేర్చుకుంటున్నాని చెప్పకనే చెప్పుతున్నది రోయ్. ” 

 

“ఆ జడ చేసే నాట్యం చూసి అర్థం చేసుకో.. ”


“అటు ఇటు తబలా.. జడ డాన్స్.. వరెవహ!” 


చేతులతో చప్పట్లు కొడుతూ, వెకిలి నవ్వులతో అబ్బాయిల మూక ప్రజ్ఞ వెనకే వస్తూ వున్నారు. 


మౌనంగా వెళ్ళినా, వాళ్ల ద్వంద్వార్థ మాటలతో, పాటలతో చిరాకు కల్గింది. 


రోజూ ఇదే తంతు. 


“సితార క్లాస్ మానేస్తా.. ఈ కోతి మూక ముఖం చూడాల్సిన పని లేదు. కానీ ఇంట్లో కారణం ఫలనా అని తెలిస్తే అమ్మానాన్నలు నిరాశ పడతారు. ఈ సమస్య పరిష్కారమేమి?” ఆలోచిన మొదలయింది. 


.స్వస్థల హైదరాబాద్ నివాసి కేశవరెడ్డి గారికి చెబితే పరిష్కారం దొరుకుతుందేమో..’ వెంటనే నిర్ణయం స్పూర్తికి వచ్చింది. 


ప్రజ్ఞను కూతురు వలెనే ఆదరిస్తూన్న కేశవరెడ్ది సమస్య విని, ఆనంద్ ను రహస్యంగా గమనించమని చెప్పాడు. అల్లరి చేస్తూ వెంబడిస్తున్న మూకలో మేయర్ గారి కొడుకున్నాడు. 


“నారాయణ, నువ్వొక కారు కొని ప్రజ్ఞను ప్రతీ రోజు మ్యూజిక్ క్లాస్ కు తోడుగా వెళ్ళాలి”


“అంతా మామూలుగానే వుంది కదా, నేను తోడు వెళ్తే, పిరికితనం మొదలౌతుంది. అమ్మాయిల్లో ఆత్మనిర్భరత మనమే పెంచాలి. ”


అల్లరి అబ్బాయిల భాగోతం విన్పించాడు. “కారు కొంటానేమో కానీ ప్రజ్ఞ తన సమస్యని తానే తెలివిగా ఎదుర్కోవాలి. ” స్నేహితుడి మాటను పట్టించుకోలేదు. 


‘తన మాట తనదే..


’ మొదటి సారి కేశవరెడ్డికి నారాయణ పైన కోపం, ప్రజ్ఞ అంటే ఆత్మీయత పెరిగాయి. 


========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి

58 views4 comments

4 Comments


@KGS990 • 27 minutes ago

Good Morning Ma'am We know Your are Best Life teacher for us, But we can't Understand Telugu Properly, So I Request you please Make it in English or Hindi Language.

Like

Surekha P

1 hour ago

Thanks 🙏 😊

Like

Anil Gurram

1 hour ago

👌🥳👌🙏

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 27, 2023
Replying to

Thank you Anil 🙏

Like
bottom of page