top of page

కల్పతరువు - పార్ట్ 6'Kalpatharuvu - Part 6' - New Telugu Web Series Written By Surekha Puli

Published On 02/01/2024

'కల్పతరువు - పార్ట్ 6' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సత్యలీల పెళ్లి డి. ఎస్. పి. విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


ప్రజ్ఞా పృథ్వీధర్లు బావామరదళ్లు. పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. 


చండీఘడ్ లో పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు. 


ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. ‘కుట్లు-అల్లికల’ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ. మ్యూజిక్ క్లాస్ లో కూడా చేరుతుంది. తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్న విషయం తండ్రి స్నేహితుడు కేశవరెడ్డితో చెబుతుంది ప్రజ్ఞ. 


త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతాడు త్యాగి. 


ఇక కల్పతరువు ధారావాహిక ఆరవ భాగం చదవండి.. 


సత్యలీల ఫోన్ చేసి లాయర్ శరణ్జీత్ ఇంటికి వెళ్ళి, అచల కథను వివరంగా విన్నవించింది. 


“ఏది ఏమైనా అచలకు విడాకులు ఇప్పించాలి సర్, ఖర్చు నేను భరిస్తాను. ” 


లాయర్ చాలాసేపు నచ్చచెప్పాడు. “ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిల్లింగ్ ఇస్తే వాళ్ళే సర్దుకుంటారు. అనవసరంగా కుటుంబాలను విడదీయడం అంత సబబుకాదు. " వృత్తి అనుభవాన్ని నెమరు వేశాడు. 


శ్రోత విన్పించు కోలేదు. 


“సర్, స్వేచ్ఛ ప్రతీ జీవి జన్మహక్కు. సంఘంలో ‘భర్త’ అని ఒక పురుషుడికి, ‘భార్య’ అని ఒక స్త్రీకి ‘వివాహం’ అనే అర్హత గల పీఠం ఇచ్చినప్పుడు; వారు వారివారి విధులను సక్రమంగా, క్రమశిక్షణతో ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, విశ్వాసం కల్గి వుండాలి. ఇద్దరూ సమఉజ్జీవులుగా జీవనం సాగించాలి. 


అంతేగానీ యిద్దరి మధ్య హింస, బానిసత్వం, మోసం అనబడే బలహీనతలు వుంటే ఎవరికి వారే, వాళ్ళ అర్హతలకు రాజీనామా చేయాలి. కలిసి జీవించలేరు. ఎన్ని కౌన్సిల్లింగ్లు ఇచ్చినా ఆత్మాభిమానం చంపుకుంటూ సమాజం కోసమో, పిల్లల భవిష్యత్ కోసమో రాజీ పడి, ఎవ్వరికీ చెప్పలేక, బాధను దిగమింగుతూ చావలేక బ్రతకాలి. ” 


“ఆచాలదేవికి ఏ దారి చూపిస్తావు మరి?”


“సర్, ఆ విషయం కూడా నేను ఆలోచించాను, నేను హైదరాబాద్ తిరిగి వెళ్లిపోతాను, బంజారా హీల్స్ లోని నా స్థలం కొంత అమ్మేసి, మిగితా స్థలంలో ఒక బుటీక్ తెరుస్తాను. 


అచల వర్కింగ్ పార్టనర్, నేను ఫనాన్సియర్ అండ్ స్లీపింగ్ పార్టనర్. కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ అయే వరుకు యిబ్బంది, తరువాత అదే సర్దుకుంటుంది. ”


“సరే, ముందుగా మీ అన్నగారితో చెబుదాము. ” 


లాయర్ మాటకు సరేనంది. 


***


త్యాగి సోమవారం అప్పు పైకము తీసుకున్నాడు, “త్యాగిగారు ఒక్క షరతు.. ”


“చెప్పండి మేడమ్ జీ “


“వచ్చే శని, ఆదివారం సెలవుల్లో టాక్సీ బుక్ చేసుకొని మీరు నాకు హిమాచల్ ప్రదేశాల్ని, ముఖ్యంగా మీ ప్రియురాలిని పరిచయం చేయాలి. ”


“అలాగే, కానీ ఎవరెవరు వస్తారు?”


“నేనూ, నా తరుపున మీ పాప; మీరూ, మీ తపున మీ యిష్టం! ఖర్చు నాది. మీరు గైడ్, సరేనా?”


అమ్మయ్య! అచల లేదు అనుకోని, “సరే, నేనూ, నా బాబు వస్తాం. హిమాచల్ అంతా చూడాలంటే వారమైనా సరిపోదు, కొన్ని అందమైయిన, ముఖ్య ప్రదేశాలకు వెళదాము. కానీ దయచేసి అచలకు మన ప్రోగ్రామ్ తెలియవద్దు. ”


“హిమాచల్ సంగతి చెప్పొచ్చును కదా, మీ ప్రియురాలి సంగతి చెప్పను. ” 


సెలవు తీసుకొని చాలా హుషారుగా త్యాగి వెళ్ళాడు. 


>>>>>>>>>>


వినయ విధేయతల గల్గి కౌమార దశలో వున్న ప్రజ్ఞకు చేయూత నివ్వాలని నిశ్చయించాడు. వీలుచూసుకొని ఆనంద్కు విషయాన్ని వివరించి కొంత కాలం పాటు రహస్యంగా ప్రజ్ఞకు కూడా తెలియకుండా తోడు వెళ్లమన్నాడు, పరోక్షంగా తండ్రి పాత్ర పోషిస్తున్న కేశవరెడ్డి. 


అంగరక్షకుడి సేవ అనుకున్నంత సులువైన పని కాదు. అందునా అటు మేయర్ కుమారుడు, ఇటు నారాయణసేఠ్. దొందూ దొందే! 


రెడ్డిసేఠ్ చెప్పిన పని చేయక పోతే కడుపులో పేగులు నకనక మంటాయి. 


గొడవ చేసి లాభం లేదు. మన జాగ్రత్తలో మనముండాలి. 


ఆనంద్ టి. వి. యస్. బండి వేసుకొని డ్యూటి చేయసాగాడు. రహస్యం ఎన్నాళ్ళూ నిలువ లేదు. 


“ఆనంద్గారు, ప్రతీ రోజు మీరు నా వెనక పడుతుంటే బాగా లేదు” నచ్చని విషయాన్ని నిక్కచ్చిగా చెప్పింది. 


'అల్లరి చేసే ఆకతాయి మూకను నిలువునా ప్రశ్నించి ఎదురించ లేదు కానీ, నన్ను నిలదీస్తున్నది' పైకి అనే సత్తా లేక మనసు లోనే గొణుక్కున్నాడు. 


“వేరే వుద్దేశ్యం ఏమి లేదు మేడమ్ గారు.. ” అంటూ అసలు విషయం చెప్పేశాడు. 


“సేఠ్లకు భయపడి చేస్తున్నారా?”


“కాదు, సేఠ్ పురామాయించిన పని చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఏమి తెలియనట్లుగానే ప్రవర్తించండి. ”


“ఎందుకు?”


“మీ డ్యూటి చేస్తునందుకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది, మా ఇంట్లో మనుషుల సంఖ్య, సంపాదన నిష్పత్తి సరి పాళ్ళల్లో లేదు. మేడమ్, ప్లీజ్. ” 


ప్రాధేయతను మన్నించింది. “నాది కూడా ఒక రెక్వేస్ట్. ” 


“చెప్పండి మేడమ్. ”


“నాకు టి. వి. యస్. వెహికల్ డ్రైవింగ్ నేర్పించాలి. పెద్దవాళ్ళు సమ్మతించరు, కానీ నేను నేర్చు కోవాలి. ఈ విషయం కూడా రహస్యంగానే వుంచుదాము. ”


“నేను డ్రైవింగ్ నేర్పించటము, మీరు నేర్చుకోవటం సమస్య కాదు. సేఠ్లకు తెలిస్తే ఇంతే సంగతులు. 


మీకు అందరి ప్రొత్సహం వుంది. నేను ఆశ్రయం కోరి వచ్చిన వాడిని, ఫలితం ఎలా వున్నా, నా పైన అపవాదు రావద్దు. ”


“చాలా జాగ్రత్త మనిషివి, అలాగే, నేను హామీ ఇస్తున్నాను. ”


కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మనఃస్పూర్తిగా ఏ పని సాధన చేసినా గెలుపు తథ్యం!


***


గృహకల్ప సూపర్ బజార్ ప్రక్కనే బట్టల దుకాణం ఓనర్ నష్టాల తాకిడికి తట్టుకోలేక రాత్రికి రాత్రే మూటా-ముల్లె సర్దుకునే సమయానికి, ఆనంద్ పసికట్టి, ఇద్దరి సేఠ్ల చెవిన వూదేశాడు. 


భాగస్వాములిద్దరూ సునాయాసంగా బట్టల షాపును తక్కువ రొక్కానికి సొంతం చేసుకున్నారు. ఆనంద్ సమయస్పూర్తికి ఎంతో మెచ్చుకున్నారు. పర్యవసానంగా జీతం ద్విగుణీకృతమైంది. 


ప్రజ్ఞ ఇంటర్ హుమానిటీస్ గ్రూపులో పూర్తి చేసి, డిగ్రీ జాయిన్ అయింది. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


42 views3 comments

3 Comments


jaiprakash Mudaliar •1 day ago

👌👌

Like
Replying to

Tq Sir. This is an encouragement 🙏

Like

Anil Gurram •1 day ago

👌🥳👌👍🙏🙏

Like
bottom of page