top of page
Original.png

కల్తీ

ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.


Kalthee - Telugu Inspirational Story | Nandyala Vijaya Lakshmi

కల్తీ - తెలుగు ప్రేరణాత్మక కథ | నంద్యాల విజయలక్ష్మి

Published in manatelugukathalu.com on 09/04/2026

ఉగాది అనగానే కొత్త ఆరంభాలు, కొత్త ఆశలు గుర్తుకు వస్తాయి.కానీ ఈ రోజుల్లో… సంప్రదాయాల మధ్య కూడా “కల్తీ” ప్రవేశించిందా?

కల్తీ అనే ఈ కథలో, ఒక సాధారణ గృహిణి సమాజ సమస్యను తన సమస్యగా తీసుకుని ఎలా మార్పు తీసుకువచ్చిందో మనం చూస్తాం.

ఇది కేవలం ఒక కథ కాదు…ప్రతి మనిషిలో ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసే సందేశం.

రేపే ఉగాది. చిన్నప్పుడు, ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో 

ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచన, ఆ రోజు ఎలా 

ఉంటే సంవత్సరమంతా అలానే ఉంటుందనే భ్రమ, నమ్మకము.

అందుకే బాల్యం అంత మధురం.


ఈసారి ఎందుకో వేపపూత అంతగా లేదు. అందుకే సంతలో పది 

రూపాయలకు నాలుగే నాలుగు చేతిలో పెట్టాడు.

మామిడికాయ కూడా.

చిన్న కాయ ఇరవై రూపాయలు.


ఏది ఏమైనా, ఉగాది పచ్చడి చేసుకుని తినవలసిందే. 

ఎందుకో మనసు కొత్తగా ఆలోచిస్తోంది—భావన.

ఇది మూఢనమ్మకమా? కాదు. మన సంస్కృతి,

సంప్రదాయం, ఇవన్నీ

దీనితో ముడివడి ఉన్నాయి.


వసంతం వాడిపోయిందా?

చైత్రము చిన్నబోయిందా?

ఉగాది పచ్చడి రుచి మారిందా?

కల్తీ ప్రభావము దేనినీ

వదిలిపెట్టడము లేదు.


మనుష్యులలో మానవత్వం లోపిస్తోందా?

సంపాదన ధ్యాసలో,

విలువలు మారిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి.


"ఏమిటి ఇంకా కూర్చున్నావు? నాకు ఆఫీసుకు టైమ్ అవుతోంది," అన్నాడు భాస్కర్.


భావన వాస్తవంలోకి వచ్చింది, మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది. గబగబా పలహారము, దేవుడి పూజ చేసింది, ఉగాది పచ్చడి, కొంచెం పాయసము చేసింది.

టి.వి.లో వార్తలు వింటోంది. పాలలో కల్తీ!

పసిపాపల ప్రాణాలు ప్రమాదంలో!

ఇది వినగానే భావనకు భయమేసింది. ఏమవుతోంది? 

కల్తీ చేస్తున్నది

 మనుష్యులా? 

రాక్షసులా?


వెంటనే ఇరుగుపొరుగున ఉన్న ఆడవారిని అందరినీ పిలిచి, కల్తీవ్యాపారులకు

చట్టబద్ధంగా శిక్ష పడేలా చెయ్యాలని చెప్పింది. 


"నిజమే, మనము ఏమి చెయ్యగలము?" అని  కొందరు సందేహపడ్డారు.

భావన అందరికీ ఒకటే విషయం చెప్పింది: "ఇది మన సమస్య. మనమే పరిష్కరించుకోవాలి."

అందరూ భావన మాటను కాదనలేక పోయారు.

వెంటనే దగ్గరలో ఉన్న పాల కేంద్రము ముందు నిలచుని కల్తీ వ్యాపారాన్ని అరికట్టాలి, అంటూ

నినాదాలు చేశారు.

కాసేపటికే పోలీసులు వచ్చి కేసు రాసుకుని, వెంటనే తగిన చర్య తీసుకుంటామని

చెప్పారు,


అందరూ ఇంటి దారి పట్టారు,

సాయంత్రము భావనతో మిగిలిన ఆడవారు అందరూ కలిసి, సమస్యను వెలుగులోకి తీసుకుని వచ్చి, కల్తీ మహమ్మారిని అరికట్టే ప్రయత్నంలో తాము భాగస్వామ్యము అయినందుకు  సంతోషించారు.

ఆ మర్నాడు, కల్తీ చేస్తోన్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వార్త విని, భావన చాలా ఆనందపడింది.

నాకెందుకు అనుకోకుండా, సమస్యను మనది అనుకునే మనస్తత్వము ఉండాలి.

అప్పుడే సమాజానికి శ్రేయస్సు. సంప్రదాయాలను పాటిస్తూనే, సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ప్రయత్నము చెయ్యాలి.


***

నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

Very practical solution suggesting story

Like
bottom of page