top of page
Original.png

కామేశం - కథల సంపుటి - పార్ట్ 2


కామేశం కథల సంపుటి పార్ట్ 2ను సూచించేలా, కథలు చెబుతున్న మధ్యవయస్కుడైన తెలుగు వ్యక్తి చుట్టూ కుటుంబ సభ్యులు, గ్రామీణ వాతావరణం కనిపిస్తున్న దృశ్యం.

Kamesham - Kathala Samputi -Part 2 - Telugu Family Story | Bhaskara Rao B. R. K. V.

కామేశం - కథల సంపుటి - పార్ట్ 2 తెలుగు కుటుంబ కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 05/09/2026



కామేశం – కథల సంపుటి – పార్ట్ 2 తెలుగు కథలను ఇష్టపడే పాఠకుల కోసం రూపొందించిన కథల సమాహారం. ఇందులో జీవితంలోని అనుభవాలు, కుటుంబ అనుబంధాలు, మానవ సంబంధాలు, హాస్య సంఘటనలు, సామాజిక ఆలోచనలు వంటి విభిన్న అంశాలను ప్రతిబింబించే కథలను ఆస్వాదించవచ్చు. సరళమైన తెలుగు భాషలో చెప్పబడే ఈ కథలు పాఠకులకు వినోదంతో పాటు ఆలోచనను కూడా అందిస్తాయి. తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ కథల సంపుటి ఒక ఆహ్లాదకరమైన పఠన అనుభవాన్ని అందిస్తుంది.


"బావగారూ! మా మండలంలోని సగం పైగా ఊళ్ళవాళ్లకి నేనే వడ్డీలకు అప్పులిస్తూ ఉంటాను. బంగార్రాజుగారి చెయ్యి అంటే గోల్డెన్ హ్యాండ్ అని ఎంతోమంది వ్యాపారస్థులు నా దగ్గర డబ్బు తీసుకుని వెళ్తారు. ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ వాళ్ళక్కూడా ఫైనాన్స్ చేయడం మొదలెట్టాను. దాంతో తరచు హైదరాబాద్ కూడా వెళ్లాల్సి వస్తోంది.


ఇదంతా మీ కోడలు పుట్టాకే కలిసివచ్చింది.

అందుకే శోభ అదే మీ కోడలంటే పంచ ప్రాణాలు నాకు. అమ్మగారి పేరు సుబ్బమ్మ, అదే పేరు శోభగా పెట్టాను. నాన్నా! నాకిది కావాలని నోరు తెరిచి అడిగేలోపు అది కాళ్ళ దగ్గర ఉంటుంది.


ఆ గారాబమే కొంపముంచి పెళ్ళి లేటయ్యేలా చేసింది." అని ఆపి, అదేమిటో అన్నట్టు ఆత్రుతగా చూస్తున్న వియ్యంకుణ్ణి చూసి...

"నేను ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టినదగ్గర్నుంచి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు వందమంది సువాసినులను పిలిచి భోజనం పెట్టి చీర సారె ఇవ్వడం చేస్తున్నాను బావగారూ!


అదేవిధంగా మూడు సంవత్సరాలనాడు యథావిధిగా వందమందిని పిలిచి భోజనాలు పెట్టించాను. నా కర్మకాలి భోజనాలు అసలు బాగాలేవని మీ కోడలితో వాళ్ళు చెప్పారు తినేసేక. అంతే మీ కోడలు ఒక్కసారిగా భద్రకాళి అవతారమెత్తినదానిలా ఊగిపోతూ వంటలు చేసే ಆవిణ్ణి పిలిపించి 'నీకు వంటలు చేయడం రాకపోతే ఇంట్లో కూర్చో. వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న మా పరువు నీ చేతకాని వంటలవల్ల పోతోంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు?' అనడిగింది.


'ఒక్కోసారి వంటలు కుదరకపోవడం మామూలే, దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తారు?' కొంచెం తలబిరుసు సమాధానం చెప్పిందావిడ.


అసలే కోపంగా ఉందేమో ఆవిడ మాటలకు అది తారస్థాయికి చేరి 'నాకే ఎదురు సమాధానం చెప్తావా? నువ్వు తక్షణం వెళ్ళిపో' అంది గుడ్లు పెద్దవి చేస్తూ.


'వెళ్తాను. మీరొక్కరేనా వంట చేయించుకునేది? ఏసీ రూముల్లో కూర్చుని ఎన్నైనా చెప్తారు, పొయ్యి ముందు నిల్చుని వంట చేస్తే తెలుస్తుంది ఆ కష్టమేమిటో? ఇంట్లో వంట చేసి భర్తనే మెప్పించలేరు చాలామంది ఆడవాళ్ళు. మేం వందలాది మందికి వంట చేసి ఒప్పిస్తాం. మీరోసారి మాలా కష్టపడి వంట చేసి శభాష్ అనిపించుకోండి చూద్దాం' అంటూ ఆవిడ ఛాలెంజ్ విసిరేసరికి శోభ అహం దెబ్బతిని,

'నువ్వు అన్నట్టు నేను వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి వందమందికి కాదు, ఊరిలోని వాళ్లందరికీ నేనే వండి సంతర్పణ చేస్తాను. వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవరకు పెళ్లిపీటలు ఎక్కను' అని శపథం చేసింది.


అప్పట్నుంచి బావగారూ మొదలయ్యాయండి నా పాట్లు.

వంటల గురించి వ్రాసిన పుస్తకాలతో పాటు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఒకటేమిటి వంటల గురించి ఎక్కడ ఏమి జరిగినా అక్కడ మీ కోడలు ప్రత్యక్షమై దేశ విదేశాల వంటలన్నీ నేర్చుకుని నా ఆస్తిలో పది పైసల వాటా కరిగించేసింది. గారాబం నా నోటికి తాళం వేసింది.


సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది. రోజులు దగ్గరపడేకొద్ది నా గుండెల్లో అలజడి మొదలైంది. ఎటువంటి వంటలు చేసి మా శోభ ఊళ్ళోవారి ఆరోగ్యాలు పాడుచేస్తుందోనని ఒకటే టెన్షన్‌తో నిద్రపట్టేది కాదంటే నమ్మండి. ఆఖరికి నీ ప్రయత్నం మానుకొమ్మా, వేరే వంటవాళ్ళను పిలిపిస్తానని శతవిధాలా చెప్పినా తన శపథం నెరవేర్చుకుంటానని మొండిపట్టు పట్టిందండి.


నా దరిద్రానికి తగ్గట్టు అదే వరలక్ష్మి పూజ రోజు నేను ఫైనాన్స్ చేసిన నాలుగు టీవీ సీరియల్స్ ఓపెనింగ్ కావడంతో ముందు రోజు రాత్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఉన్నానే కానీ ఇక్కడ నుంచి ఏమి ఫోన్ వస్తుందోనని గుండెలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాను. రాత్రి అయ్యేసరికి ఏ కబురు రాకపోయేసరికి హమ్మయ్య అనుకుంటూ తెల్లారిసరికి వచ్చిపడ్డాను.


కారు ఊళ్ళోకి వెళ్తుంటే ఊరంతా చాలా చోట్ల బ్లీచింగ్ చల్లేసి ఉంది. నాలుగేసి ఇళ్ళదగ్గర ముగ్గురేసి చొప్పున నర్సులు మందులతో సహా ఉండేసరికి నా మనసు కీడు శంకించి ఇంటికి వెళ్లేసరికి ఇంటిముందు రెండు జీపులు, నాలుగు కార్లు పార్కు చేసి ఉండటంతో ఏదో కొంప మునిగిందనుకుని ఇంట్లోకి వెళ్లేసరికి హాల్లో పోలీసువాళ్ళు, ఇతర అధికారులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముఖాలు కోపంతో ఎర్రబడి ఉన్నాయి.

నేను భయంతో ఏమి జరిగిందని అడిగాను.


'ఏమి జరిగిందా!!!! మీ అమ్మాయి నిన్న పండుగ అని స్వయంగా వండి ఊరంతా భోజనాలు పెట్టింది. దాన్ని తిన్న వారంతా వాంతులు విరోచనాలు చేసుకుని కలరా బారిన పడ్డారు. దీనికి మీరేం సమాధానం?' అని వాళ్ళు నన్ను నిలదీసేసరికి ఏం చెప్పಾలో తెలియక తలవంచుకుని కూర్చున్నాను. ఇంతలో మా ఎమ్మెల్యే ఫోన్ చేసేసరికి నా గురించి తెలిసిన ఆయన కనుక ఫోన్లోనే బ్రతిమలాడుకునేసరికి కనికరించి నాపై ఏ కేసులు లేకుండా బయటపడ్డాడు.


అయినా తన పట్టు విడువలేదు శోభ. తరువాయి సంవత్సరం పండక్కి ముందుగానే ప్రభుత్వం వారు నోటీసులు పంపించారు, గతంలోలా మరలా చెయ్యొద్దని.

అప్పటికే ఊళ్ళో వాళ్ళు చాలావరకు ఇళ్ళు ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.


వారం రోజులపాటు రెండోసారి తన ప్రయత్నం ఫలించనందుకు మంచం దిగలేదు నా కూతురు.


వయసు పెరిగిపోతున్నందుకు నాలో భయం మొదలై వచ్చే పండక్కి ఏదోవిధంగా కనీసం వందమంది చేతనైనా 'నీ వంట బాగుంది' అని చెప్పించాలని నిర్ణయించుకున్నాను.


ఆ శుభఘడియ రానే వచ్చింది.

అప్పటికే ఊళ్ళోని ప్రజలు ఇతర ఊళ్ళకు వెళ్ళడానికి సిద్ధమౌతుండగా నాప్లాన్ అమలు చేసేసరికి తండోపతండాలుగా స్త్రీలు వచ్చి భోజనాలు చేసి మీ కోడలి వంటల్ని మెచ్చుకుని మరీ వెళ్ళడంతో పెళ్లి పీటలు ఎక్కింది." అని సుదీర్ఘ వివరణ ఇచ్చాడు బంగార్రాజు.


"ఇంతకీ మీరు ఏ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు?"


"మా గుమస్తా చేత భోజనం చేసి మా అమ్మాయి వంటల్ని మెచ్చుకున్న ప్రతి స్త్రీకి అరగ్రాము లక్ష్మీదేవి బంగారపు రూపు ఉచితంగా ఇస్తాను అని చెప్పించాను."


"ఆ!" అంటూ నోరేళ్లబెట్టాడు రాజశేఖరం.




*** 

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page