top of page
Original.png

కోరికలు- ఆలోచనలు

8 hours ago
3 min read

ఆలస్యమవుతున్న వివాహాలు, కెరీర్ మరియు వ్యక్తిగత అభిరుచుల మధ్య యువత నిర్ణయాలను ప్రతిబింబించే దృశ్యం

Korikalu - Aalochanalu - Telugu Devotional Article | Chilakamarri Satyanarayana

కోరికలు- ఆలోచనలు -  తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | చిలకమర్రి సత్యనారాయణ

Published In manatelugukathalu.com On 11/11/2026


కోరికలకు మూలం ఆలోచనలే. మన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకుని కోరికలను నియంత్రించగలిగితే సంతృప్తి, మనశ్శాంతి, ఆనందంతో కూడిన జీవితం సాధ్యమవుతుందని “కోరికలు - ఆలోచనలు” వ్యాసం వివరిస్తుంది.


“లయ వినాశనే ఉభయరోధనే

లయగతం పునర్భవతి నో మృతం”


శ్రీ రమణ మహర్షి ఉపదేశసారంలో చెబుతారు... లయము, వినాశము రెండూ నిరోధనములే! లయమంటే తలపులను కట్టడి చేయడం, వినాశమంటే వృత్తిపరమైన అహంకారాన్ని నశింపజేయడం.


ప్రతి మనిషిలోనూ కోరికలు, ఆలోచనలు నిరంతరంగా కలుగుతూనే ఉంటాయి. కోరిక అంటే ఆకాంక్షించడం, కావాలనుకోవడం, దేన్నయినా పొందాలని ఆశించడం.


అయితే కోరిక అనేది ఆలోచనలోంచే పుడుతుంది. మనిషి సర్వకాల సర్వావస్థలయందూ ఆలోచిస్తూనే ఉంటాడు. 


ఆలోచనల్ని కట్టడి చేయడం బహుశా నిద్ర సమయంలో కొంతవరకు సాధ్యపడవచ్చు. కానీ మరణం మరో క్షణంలో ఉందనగా కూడా మెదడు ఆలోచించడం మానదు.


ఆలోచన తప్పు కాదు; అది ఒక నిరంతర ప్రక్రియ. ఆలోచించే విధానంలోనే తేడాలు కనిపిస్తాయి. మంచి ఆలోచనలు మనిషి సత్ప్రవర్తనకి దారి చూపిస్తే, చెడు ఆలోచనలు మనిషి దుర్మార్గుడిగా మారడానికి దోహదం చేస్తాయి.


మన పురాణాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రామాయణంలో రావణుడు, విభీషణుడు భిన్న ప్రవృత్తులకి ప్రతిరూపాలు. 


లంకానగరం నాశనమైపోయినా సీతను వదలనని అనడంలో రావణునిలోని మూర్ఖపు బుద్ధి ప్రతిబింబిస్తుంది. అదే విభీషణుడు సీతను రాముడికి అప్పగించి లంకానగరాన్ని కాపాడమనడంలో అతనిలోని దూరదృష్టి అర్థమవుతుంది.


మహాభారతంలో కూడా ధర్మరాజు, దుర్యోధనుడు ఈ కోవకే చెందుతారు. 


తాతలు, తండ్రులు, గురువులు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా దుర్యోధనుడి మనసు మారదు. ధర్మరాజు అలా కాదు; కౌరవ వంశం నాశనం కాకూడదని అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. 


కానీ కౌరవుల అహంకారం కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసి లక్షలాది ప్రజల మరణానికి కారణమయ్యింది. దీనికంతటికీ మూలకారణం దుర్యోధనుడు, తనకు ప్రత్యర్థులు లేకుండా చేసుకుని కౌరవ సామ్రాజ్యాన్ని పాలించాలన్న అతని కోరిక.


కోరికలు ఉండడంలో తప్పు లేదు, కానీ కోరిక తీరే సాధ్యాసాధ్యాలు కూడా తెలుసుకుని ఆశపడాలి. కోరిక అనేది మనశ్శాంతి లేకుండా చేస్తే ఏమి లాభం?

కోరికలు కలగడానికి మూలకారణం ఆలోచన. మన ఆలోచనలు సరైనవి అయితే మనలో కలిగే కోరికలని అదుపులో పెట్టుకోవచ్చు. ఆలోచనా రహితమైన జీవితం మరణసాదృశ్యమే.


కోపాన్ని ప్రేమతో జయించాలి. చెడుని మంచితో మార్చాలి. లోభిత్వాన్ని దాతృత్వం ద్వారా, అబద్ధాన్ని సత్యం ద్వారా జయించాలి. మన పూర్వీకులు, పెద్దలు ఇవన్నీ తాము ఆచరించి మనకు ఉపదేశించారు.


భగవద్గీతలో ఆత్మసంయమయోగం అధ్యాయంలో పరమాత్మ చెబుతారు:

"నాసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన" (సంకల్ప త్యాగం చేయనివాడు యోగి కానేరడు).

కోరిక అనేది ఆశయంగా మారితే వ్యక్తి ఉన్నతికి దారి తీస్తుంది. 


గాంధీజీ చరిత్ర మనకి చెప్పేది అదే. ఆయన దేశ స్వాతంత్ర్యం అనే కోరికను తన లక్ష్యంగా మార్చుకున్నాడు; స్వాతంత్ర్యం సాధించాడు. వ్యక్తిగతంగా మహాత్ముడిగా కొనియాడబడ్డాడు.

ఆదిగురువైన శంకరాచార్యులు ప్రశ్నోత్తరీ మణిరత్నమాలలో—

"కో వా దరిద్రో హి విశాల తృష్ణః" అంటారు. అంతులేని కోరికలు కలవాడే దరిద్రుడని దీని అర్థం.


కోరికలకు మూలం ఆలోచనలు కాబట్టి ముందుగా మనం ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఇతరులు చెప్పే మాటలను వింటూనే అందులోని మంచిని మాత్రమే గ్రహించాలి.


కోరికలని జయిస్తే సంతృప్తి లభిస్తుంది. మనసు ఆనందభరితమవుతుంది. మానసికంగా మనిషి సంతోషంగా ఉంటే శారీరిక ఆరోగ్యం కూడా అయాచితంగా లభిస్తుంది. "సంతోషమే సగం బలం" అని ఊరికే అనలేదు పెద్దలు!

***






📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

చిలకమర్రి సత్యనారాయణ

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ

తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు  సహయం చెయ్యాలని ఆకాంక్ష.

వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా  నమ్మకం.

చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.

తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం  కావడం  నా అదృష్టం.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page