top of page
Original.png

కొత్త మార్గం


“మనసు ఉంటే మార్గం దొరుకుతుంది” – ప్రేరణాత్మక కథ
“మనసు ఉంటే మార్గం దొరుకుతుంది” – ప్రేరణాత్మక కథ

Kottha Margam - Telugu Inspirational Story | Bhallamudi Nagaraju

కొత్త మార్గం - తెలుగు ప్రేరణాత్మక కథ | భళ్లమూడి నాగరాజు

Published in manatelugukathalu.com on 04/05/2026

జీవితంలో మనం అనుకున్నది జరగకపోవచ్చు…

కానీ అదే మనకు కొత్త దారిని చూపిస్తుంది.

అవనిక కథ అలాంటి ఒక ప్రేరణాత్మక ప్రయాణం.


రాయగడ జిల్లాలో చంద్రపూర్ ఓ చిన్న గ్రామం. అవనిక ఓ ప్రత్యేకం. పేదరికంలో పుట్టినా పెద్దపెద్ద కలలు కంటూ, ఎప్పుడూ ఉత్సాహంగా, చలాకీగా ఉంటుంది. 

“కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి” అన్న కలాం మాటలు ఆమె మనసులో బలంగా ముద్ర పడ్డాయి. 


అవనిక చలాకీగా ఉండటంతో పాటు తెలివైన పిల్ల కావడంతో స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఆ ప్రశంసలతో ఆమె గుండె ఆనందంతో నిండిపోయేది. కానీ ఒక్కోసారి ఆమెకు భయం వేస్తూ ఉండేది. 

‘అనుకున్నది సాధించగలనా, లేనా...’ అని బాధపడేది. పేదరికం ఆమెను భయపెట్టేది. 


రాజు సాహు ఓ సామాన్య రైతు. తాతల నాటి నుంచి వచ్చిన ఎకరా భూమి తప్పా ఆస్తులు, ఆశలు లేని వ్యక్తి. ఏటా పంట చేతికొచ్చే సమయానికి, వరుణుడు ఆగ్రహించడంతో నష్టాలనే చవి చూస్తూ, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. 

ఈ ఏడాది కూడా పంట నష్టం వచ్చి కృంగిపోతున్న అతన్ని చూసి భార్య రాగిణి ఇలా అంటోంది: 

“ఎందుకయ్యా ఒళ్ళు హూనం చేసుకొని రాత్రి పగలు కష్టపడతావు? మనకు వ్యవస్వాం అచ్చి రాలేదయ్యా. ఆ మడిచెక్క అమ్మేసి రాయగడ వెళ్లిపోదాం. అవనిక చాలా తెలివైన పిల్ల, పెద్ద చదువులు చదవాలని ఆశ పడుతోంది. పట్నంలో దాన్ని చదివిద్దాం” అని అంది.

ఆమె మాటలు విన్న రాజు సాహు “ఉన్న భూమి అమ్ముకుంటే ఎలా బతుకుతామే? వ్యవసాయ పని తప్ప నాకు మరేమీ చేతకాదు. పట్టణంలో బతకాలంటే డబ్బు ఉండాలి! భూమి అమ్మి అవనికను చదివిస్తామా? మనం కూర్చొని తింటామా? ఆలోచిద్దాములే!” అని అన్నాడు. 


అవనిక ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ చదవాలని కలలు కంది. మంచి ర్యాంకు కూడా వచ్చింది. కానీ “ఫీజులు కట్టి చదివించలేను” అని తండ్రి తెగేసి చెప్పడంతో నిరాశ చెంది గదిలోకి వెళ్లి ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది.

కూతురు ఎంతసేపైనా గది తలుపులు తెరవకపోవడంతో రాగిణి ఆందోళనకు గురైంది. గట్టిగా తలుపులు కొట్టడంతో ఏడుస్తూనే తలుపులు తీసింది ఆమె. ఆ స్థితిలో కూతుర్ని చూసి “ఏమైంది తల్లీ? ఎందుకలా బాధపడుతున్నావు?” అంటూ దగ్గరకు తీసుకొని ఓదార్చింది. 

అవనిక తన బాధను తల్లితో చెప్పుకుంది. 


“చూడమ్మా, ‘ఆశించినది లభించనప్పుడు, దొరికినదే స్వీకరించాలి.’ జీవితం అంటే ఇదే. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరిగిపోతాయని అనుకోకూడదు. నువ్వు చాలా తెలివైన పిల్లవు. బాగా ఆలోచించు. ‘మనసుండాలే కానీ మార్గము దొరకకపోదు’...” అంటూ ధైర్యం చెప్పింది రాగిణి. 


అమ్మ చెప్పిన మాటలు అవనికకు ధైర్యాన్ని ఇచ్చాయి. 

డిగ్రీలో చేరింది. ఆశించనిది దొరికింది, ఆగిపోకుండా ముందడుగు వేసింది. 


అందరి లాగే కళాశాలకు వెళుతోంది. కానీ తన ఆశలు, కలలన్నీ ఇంజనీరింగ్ మీదే. గతంలో ఉన్న చలాకీతనం తగ్గింది. తరగతి గదిలో కూర్చున్నా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధపడుతున్న ఆమెను చూసి సరస్వతి మేడం చెప్పిన మాటలు మార్పు తెచ్చాయి. 

“జీవితంలో మనం ఏమి చదవాలనుకున్నది ముఖ్యం కాదు, ఏమి సాధించగలం అన్నదే ముఖ్యం.” అలా ఆమె చెప్పిన మాటలు అవనిక గుండెల్లో మారుమ్రోగాయి. 


ఆ రోజు నుంచి ఆమె పూర్తిగా మారిపోయింది. క్లాస్ పూర్తి కాగానే కంప్యూటర్ ల్యాబ్‌లో ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు నేర్చుకుంది. 

డిగ్రీ పరీక్షలు పూర్తి కాక ముందే పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు చేశాయి. కానీ అవనిక ఎందులోనూ ఎంపిక కాలేదు. 

మళ్ళీ ఆమెను నిరాశ ఆవహించింది. 

రాత్రంతా అనిద్రతో గడిపింది. ఆనాడు తల్లి చెప్పిన మాటలు... 

‘మనసుండాలే కానీ మార్గం దొరకకపోదు’ అన్న తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. 

ఇంకా బాగా కష్టపడాలని నిర్ణయం తీసుకుంది. 


కొన్ని నెలల తరువాత ఓ అంకుర పరిశ్రమ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. ఎంతో పట్టుదలతో వెళ్లి పాల్గొంది. చిన్న పరిశ్రమ, తక్కువ జీతం అయినా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. జాబ్‌లో చేరింది. ప్రతిదీ ఛాలెంజ్‌గా తీసుకుంది. కంపెనీ లాభాల బాట పట్టింది. కొద్దికాలంలోనే జీతం పెరిగింది. వీకెండ్‌లో సొంత ఊరు వెళ్లింది. 

తల్లిని చుట్టేసుకుని, “అమ్మా! నువ్వు ఇచ్చిన ధైర్యం నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు: 

‘మనసు ఉండాలే కానీ మార్గము దొరకకపోదు’ అన్న మాటలు నిజమయ్యాయి” అంటూ మిఠాయి తినిపించింది. 


గ్రామంలో చదువుకొని పట్నంలో ఉద్యోగం చేస్తూ జన్మభూమికి వచ్చిన ఆమెను చూసేందుకు ఇరుగు పొరుగు పిల్లలు అంతా వచ్చారు. వారందరినీ చూసిన అవనిక ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. అందరినీ దగ్గరకు తీసుకొని,

“పిల్లలూ, అందరూ బాగా చదవండి. కలలు కనండి. కానీ ఆశించినది లభించనప్పుడు, దొరికినదానిని స్వీకరించండి. అదే కొత్త మార్గాన్ని మనకు చూపిస్తుంది” అంటూ మిఠాయి తినిపించింది. 

ఇప్పుడు అవనిక మనసు తేలిగ్గా ఉంది. 

ఆనందంతో ఉప్పొంగిపోతోంది.


***

భళ్లమూడి నాగరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం.

Telugu story, moral story Telugu, truth vs lie story, inspirational stories Telugu, social awareness story, భళ్లమూడి నాగరాజు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page