top of page

కోతి చేసిన మేలు


'Kothi Chesina Melu - New Telugu Story Written By Mohana Krishna Tata

'కోతి చేసిన మేలు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అదొక అందాల గేటెడ్ కమ్యూనిటీ. ఇండిపెండెంట్ హౌసెస్ సమాహారం ఆ కమ్యూనిటీ. రాజు-రాణి దంపతుల ఏకైక కొడుకు రాము. ఆ కమ్యూనిటీ లోనే కొత్తగా రెంట్ కు వచ్చారు. చుట్టూ.. చెట్లు, మంచి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం రాము కు ఎంతో బాగా నచ్చింది.


ఎవరికి నచ్చిన మొక్కలు, చెట్లు ఇంటి ముందు పెంచుకుంటున్నారు. రాము కు చిన్నప్పటినుంచి, మొక్కలంటే చాలా ఇష్టం. వాళ్ళ పాత ఇంట్లో, అన్ని రకాల మొక్కలు, చెట్లు పెంచేవాడు. పండ్లు, కూరగాయల మొక్కలు ఉండేవి అక్కడ. వివిధ రకాల పూల మొక్కల తో వాళ్ళ గార్డెన్ అందంగా ఉండేది. రాము వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం చేత, ఇక్కడకు వచ్చేసారు. అంతే కాదు, రాము కు జంతువులు, పక్షులన్నా, చాలా ఇష్టం. వాటిని కూడా చాలా ప్రేమగా చూసేవాడు. తిండి, నీరు అందించేవాడు.


రాము వాళ్ళ పక్కింటి వాళ్ళు, జామచెట్టు పెంచారు. చెట్టు పెద్ద గా ఉండి, జామకాయలు బాగా ఉన్నాయి. అంకుల్ ఎప్పుడూ, జామచెట్టు ను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. కోతులు, ఆ కాలనీ లోకి అడపా-తడపా వచ్చి, కాలనీ లో ఉన్న చెట్లు మీద ఉన్న పళ్ళు తినేసి వెళ్లిపోతాయి. అంకుల్ కు ఎప్పుడూ, అది నచ్చేది కాదు. కోతులను తరిమే వాడు.


ఒక రోజు కోతులు కాలనీ లోకి రావడం చూసాడు రాము. ఒక పెద్ద కోతి, ఒక పిల్ల కోతి పక్కింటి జామచెట్టు ఎక్కాయి. పక్కింటి అంకుల్, వెంటనే, కర్ర విసిరాడు. పెద్ద కోతి కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. కోతులు రెండు, మెల్లగా, రాము ఇంటి ముందరకు వచ్చి పడుకున్నాయి.


రాము, జాలి గుండె కావడం చేత, వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక ఆయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. భయం లేకుండా, కోతి దగ్గరకు వెళ్లి మందు పూశాడు. కోతి కు నొప్పి తగ్గడంతో, రాము కి ఆ కోతి, కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది. రాము కోతి పిల్ల కు, ఇంట్లో ఉన్న జామకాయలు, అరటిపళ్ళు తెచ్చి ఇచ్చాడు. రెండు కోతులు పండ్లు కమ్మగా ఆరగించి అక్కడ నుంచి వెళ్లిపోయాయి. రోజూ, ఇలాగే, రెండు కోతులు కాలనీ లోకి వచ్చేటప్పుడు, రాము దగ్గరకు వచ్చేవి. రాము తినడానికి ఎదో ఒకటి పెట్టేవాడు.


రాము కు పిల్లులు అంటే కూడా చాలా ఇష్టం. కాలనీ లో ఉన్న పిల్లులు వచ్చేటప్పుడు, రోజూ పాలు, అన్నం పెట్టేవాడు. బ్రౌన్ పిల్లి కి 'రాజా' అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు.


ఇలా ఉంటుండగా, రాముకు, రాజా కు, కోతి కి మంచి స్నేహం కుదిరింది. రాము వాటితో, రోజూ మేడ మీద ఆడుకునేవాడు. కోతి, పిల్లి రెండూ ఇప్పుడు మంచి స్నేహితులు. కోతి ఏం చెబితే అదే చేస్తుంది పిల్లి రాజా.


ఒక రోజు, పక్కింటి అంకుల్ మొక్కల దగ్గర పని చేస్తున్నపుడు, ఒక పెద్ద పాము వచ్చింది. అంకుల్ దానిని చూడగానే, భయపడి పరిగెత్తుతుండగా పడిపోయాడు. "పాము, పాము" అని బిగ్గరగా అరిచాడు. ఆ వీధిలో వారంతా, దసరా సెలవులకు ఊళ్ళు వెళ్ళిపోయారు. ఫోన్ తీసి, సెక్యూరిటీ కు కాల్ చేసే అంత టైం లేదు. రాము వాళ్ళు, ఆ సంవత్సరం సెలవులకు ఎక్కడకు వెళ్ళలేదు. ఆ వీధిలో రాము వాళ్ళు మాత్రమే ఉన్నారు.


అంకుల్ అరుపులు విన్న రాము, వెంటనే కోతి ను తీసుకొని అంకుల్ ఇంటి వైపు వెళ్ళాడు. పామును చూసిన కోతి, వెంటనే తన స్నేహితుడైన రాజా ను పిలిచింది. పక్క వీధిలో వున్న రాజా వెంటనే అక్కడకు వచ్చి, కోతి ఆజ్ఞ మేరకు, పాము తో కలబడింది. కానీ, పిల్లి బలం సరిపోలేదు. రాజా, తోటి పిల్లి స్నిహితులను పిలిచింది. కోతి తన తోటి మిత్రులను కూడా పిలిచింది. అందరూ కలసి ఆ పామును చంపాయి. అందరి ఐకమత్యం, చూసి రాము చాలా సంతోషించాడు.


అంకుల్ తాను చేసిన తప్పు తెలుసుకొని, ఇంకెప్పుడూ, ఏ జంతువులను కొట్టేవాడు కాదు. ప్రేమతో చూసేవాడు. జామచెట్టు పై జామకాయలు ఇంక కోతులు స్వేచ్ఛగా తినేవి.

***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


30 views0 comments

Comments


bottom of page