కోయిల రాగాలు - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- Jun 16, 2025
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KoyilaRagalu, #కోయిలరాగాలు, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "కోయిల రాగాలు" పుస్తకావిష్కరణ షోలాపూర్, మహారాష్ట్రలో
Koyila Ragalu - Book Unveiling ceremony At Sholapur, Maharashtra - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 16/06/2025
కోయిల రాగాలు పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
పెద్దకడబూర్ మండల పరిధిలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు డా.గద్వాల సోమన్న 71వ పుస్తకం"కోయిల రాగాలు"తో పాటు శ్రీ దేవనపల్లి ఓగన్న పుస్తకం"ఇష్టపదుల ప్రజ్ఞాన ప్రసూనాలు" పుస్తకాల ఆవిష్కరణ ప్రెసిడెంట్ శ్రీ దయానంద్ మామిడ్యాల్, ముఖ్య అతిథి శ్రీ మల్లికార్జున కమటమ్,మరియు విశేష అతిథి శ్రీ తిప్పన్న గనేరి గారల చేతుల మీద సార్వజనిక్ తెలుగు భాషాభివృద్ధి గ్రంథాలయం,షోలాపూర్, మహారాష్ట్రలో ఘనంగా జరిగింది. అక్కడ తెలుగు భాషాభిమానుల ఆధ్వర్యంలో కవి గద్వాల సోమన్న పుస్తకావిష్కరణ జరగడం గమనార్హం. అనంతరం సోమన్న మరో పుస్తకం "పూల సజ్జ" ను శ్రీ ఓగన్న, శోభాదేవి దంపతులకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ సమన్వయ కర్త శ్రీమతి రేణుకా బుధారము, కమిటీ సభ్యులు గోవర్ధన్ కమటమ్, ప్రభాకర్ భీమనాథ్, సత్యనారాయణ పరిమెల్ల, దేవనపల్లి రవికుమార్, ప్రసూన, దేవనపల్లి శివకుమార్, శృతిక, అడ్వకేట్ హేమంత్ కుమార్ సాక మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. కృతికర్త గద్వాల సోమన్నను సాహితీమిత్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, అభినందించారు.
-గద్వాల సోమన్న













Comments