top of page

క్రమవర్తనం


'Kramavarthanam' Telugu Article


Written By Ch. C. S. Sarma


రచన: సిహెచ్. సీఎస్. శర్మ



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

తల్లిదండ్రులు గురువులు పిల్లలకు చక్కటి ఆదర్శాలను నేర్పుతారు. ఎదిగే కొద్దీ కొందరు పిల్లలు ఆ నీతి వాక్యాలను గాలికి వదిలేస్తారు. వారి దృష్టిలో కాలగమనంలో ఆశయాలు ఆచరణకు అందనవిగా మారిపోతాయి. కొందరి విషయంలో ఆశయాలు వారి క్రమవర్తన... తత్వ రీత్యా వారికి అనుకూలం. అవుతాయి.


ప్రతి మనిషికి ఆశలు వుంటాయి. ఆశయాలూ వుంటాయి. తమ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలను కుంటారు కొందరు. అంటే వారి చర్యల వలన ఇతరులకు కలిగే బాధలు వారికి లెక్కలేదు. వారి లక్ష్యసాధనే వారికి ముఖ్యం. యిది నేటి సభ్యసమాజంలో సిద్ధాంతంగా నమ్మి ఆచరించే విధానం. వీరు వారి జీవిత విధానాన్ని ఇలాగే సాగించి సాగించి... ఒక నాడు మట్టిలో కలిసిపోతారు. జనం, పోయిన వారిని గురించి వారికి బాధలేదు. ఆనందమేమో!...


బహు కొద్దిమంది నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ... ఎన్నో కష్టాలను, కన్నీటినీ అనుభవిస్తూ... 'అంతా నీ నిర్ణయం' అని పై వాణ్ణి తలచుకొంటూ... బరువు బ్రతుకులను లాగి లాగి, కడకు కళ్ళు మూస్తారు. అన్ని వర్గాల వారిలోను... యీ రెండు తెగల వ్యక్తులు కొందరున్నారు. 'చెట్టు కొలది గాలి' అన్నట్లు వర్తిస్తున్నారు.


ప్రతి తల్లిదండ్రులు సంతతి కలిగినప్పటినుంచి వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి భావిలో ప్రయోజకులై తమకు ఆనందాన్ని... గౌరవాన్ని కలిగించి... తమకు వయస్సు మీరిన తర్వాత... అండదండలుగా సాయంగా నిలుస్తారని ఆశిస్తారు. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వారు చేసే ప్రతి పనిలో బిడ్డల యోగ క్షేమాలు దాగి ఉంటాయి. వారి మహత్తర ఆశయం తన బిడ్డలు భవిష్యత్తులో అన్ని విధాల బాగుండాలని.,వారు తమకంటే గొప్పవారు కావాలని.


కానీ!... ఎందరో బిడ్డలు చదివి... విజ్ఞానాన్ని సంపాదించుకొని... ఉద్యోగాన్ని సాధించి... నచ్చిన సుందరాంగిని అర్ధాంగిగా చేసుకుని... తమ వర్తమానాన్ని కేవలం తమ స్వార్ధ పూరిత లక్ష్యసాధనలో గతాన్ని మరచి ముందుకు సాగుతున్నారు.


ఈ విధానంలో నడిచే వారి వలన వారి తల్లిదండ్రులకు అయిన వారికి ఎన్నో కష్టాలు నష్టాలు. వీడి గోడును వారు లెక్కచేయరు. ఇందులో మరో విశేషం!... జీవిత భాగస్వామి సలహాల ఆచరణ... ఆ ఇల్లాలు మంచి మనస్సు కలదై పుట్టింటి వారిని అత్త ఇంటి వారిని ఒకే రీతిగా చూసుకునే మనస్తత్వం కలిగినదైతే... వారి చర్యలలో మార్పు ఏర్పడదు. దీనికి విరుద్ధంగా అగ్నికి ఆజ్యం తోడైనట్లు భాగస్వామి భర్తతో కలిసిపోతే... అయ్యగారు ఆటబొమ్మగా మారి భార్యా విధేయుడనే సార్ధక నామధేయుడై... అయినవారికి దూరమై... కడకు ఒకనాడు ఊహించని చిక్కుల్లో పడిపోతాడు. వీరి వద్ద పెరిగే వీరి సంతతి చిన్న వయస్సు నుండే వికృతంగా తయారవుతారు.


తల్లితండ్రులఅక్రమవర్తనం బిడ్డల పాలిట శాపంగా మారిపోతుంది. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం?...


ఎంతో సుఖంగా ఉండవలసి వైవాహిక జీవితాల్లో ఎలాంటి సమస్యలకు కారణం... ఆ దంపతులకు సహజంగా ఉన్న స్వాతిశయం... స్వార్థం... ఆశ... ఈ మూడూ మనిషిలో మానవత్వానికి, వ్యక్తిత్వానికి మేలి ముసుగును వేస్తాయి. తప్పుడు దారిన నడిపిస్తాయి. కాలం కలిసొస్తే అన్నింటినీ మరచి అందలాలు ఎక్కుతారు. అదే కాలం ఎదురు తిరిగితే తలక్రిందలైనేలకూలుతారు. విచక్షణా రహిత చర్యల పర్యవసానం‌... ఒకనాటికి రాజుకైనాపేదకైనా... ఒకే రీతిగా ఉంటుంది.


ఈ తీరు ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఎన్నో కుటుంబాలకు... పాలకులకు... బాధ్యతాయుత పదవులను నిర్వర్తిస్తున్న అధికారులకు... సామాన్య మానవులకు కూడా!...


ప్రతి వ్యక్తి ఎదిగిన తర్వాత నేర్చుకొనవలసింది... పాటించవలసింది సమైక్యతా భావం... భిన్నత్వంలో ఏకత్వం... ఈ తత్వాన్ని తెలిసినవారు తెలియని వారికి సౌభ్రాతృత్వంతో నేర్పాలి. తాము ఆచరిస్తూ వారినీ ఆచరించేలా చేయాలి.


సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలను నమ్మాలి. స్వార్థం, ద్వేషం, మోసం, అసత్యం, అరాచకాలను అణగద్రొక్కాలి.

దేశమంటే మనుషులోయ్... దేశమంటే మట్టి కాదోయ్...అనే ఈ తేనియలూరే తెలుగు తేట లలిత పదాల పరమార్ధాన్ని గ్రహించాలి. పాటించాలి. పంచాలి.


సంఘీభావంతో తమ కుటుంబంతోనూ ఇరుగు పొరుగు, వాడ వూరు రాష్ట్రం దేశం నాది... నా వారు... అనే సత్యాన్ని నమ్మి... అందరూ 'క్రమవర్తనం' కలిగి వర్తించి... తమ ఇంటి శాంతికి... వూరు శాంతికి... రాష్ట్ర దేశ శాంతికి... శాంతి కాముకులై, పరస్పరం ఏకాభిప్రాయాలతో... జనమంతా కలసిమెలసి మన దేశానికి ఉన్న అనాది మధురనామం రామరాజ్యం యీనాడూ...దిగంతాల వరకూ వ్యాపించాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. సద్వర్తనతో... లక్ష్యంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు కదా!... ఐక్యత అన్నది ఒకటిగా చేరిన గడ్డి పోగుల కట్ట. మదపుటేనుగును సైతం బంధించగలదు కదా అది!...

-సమాప్తం-


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1620751383535435776?s=20&t=D6-i0wUoPJR0yrHZwEJulw

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.


https://www.manatelugukathalu.com/profile/chcs/profile


26 views0 comments
bottom of page