top of page
Original.png

కుంచమంత కూతురుంటే

#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #KunchamantheKuthurante, #కుంచమంత కూతురుంటే, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Kunchamantha Kuthurante - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham Published In manatelugukathalu.com On 10/02/2026

కుంచమంత కూతురుంటే - తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

శివలింగపురంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి పశువులన్నా, పంటలన్నా ప్రాణం. అతని దగ్గర ఉన్న ఆవుకు నెల రోజుల క్రితమే ఒక బుజ్జి లేగదూడ పుట్టింది. 


ఆ లేగదూడ గెంతుతుంటే శివయ్య మురిసిపోయేవాడు. ఒకరోజు రోడ్డు ప్రమాదంలో ఆవు కాలు విరిగిపోయింది. పశువైద్యుడు వచ్చి కట్టు కట్టి, "ఇది కొన్ని రోజులు లేవలేకపోవచ్చు, మేత ఆవు దగ్గరికి అందించాలి" అని చెప్పారు. 


పాపం ఆవు! తన నొప్పి కంటే బిడ్డకు పాలివ్వలేనేమో అన్న దిగులుతో కళ్లనీళ్లు పెట్టుకుంది.


అమ్మ దీనస్థితిని చూసి ఆ బుజ్జి దూడ మనసు చలించింది. పక్కనే ఉన్న క్యాబేజీ తోటలోని ఆకులను చూసింది. గబగబా పరుగు తీస్తూ, తన చిన్ని నోటితో ఒక్కో ఆకును కరుచుకుని వచ్చి, పడుకున్న తల్లి నోటికి అందించసాగింది. 


ఆ దృశ్యాన్ని చూస్తున్న శివయ్య మనసు కరిగిపోయింది. కళ్లు చెమర్చాయి. పక్కనే నిలబడి ఉన్న తన కూతురు లక్ష్మితో


"చూశావా లక్ష్మీ! 'కుంచమంత కూతురుంటే.. మంచం మీదకే కూడు' అని మన పెద్దలు ఊరికే అనలేదు" అన్నాడు.


"నాన్నా! ఆ కుంచం గురించి చెప్పవా?" అని లక్ష్మి ఆత్రుతగా అడిగింది. అప్పుడు శివయ్య కూతురిని దగ్గరకు తీసుకుని 


“కుంచమంత కూతురుంటే.. మంచం మీదకే కూడు' అనేది ఒక సామెత. పూర్వం లచ్చవ్వ అనే పేదరాలు ఉండేది. ఆమెకు పదేళ్ల కూతురు ఉంది. ఒకరోజు లచ్చవ్వకు తీవ్రమైన జ్వరం వచ్చి మంచం పట్టింది. కనీసం లేచి కూర్చునే ఓపిక కూడా లేదు. 


అప్పుడు ఆ చిన్నారి కూతురు, తనకు తెలిసిన అరకొర పనులతోనే తల్లికి గంజి కాచి ఇచ్చింది.

అన్నం కలిపి నోటికి అందించింది. పక్కింటికి వెళ్లి మందులు అడిగి తెచ్చి ఇచ్చింది. కొద్దిరోజులకు లచ్చవ్వ కోలుకుంది.


'కుంచం' అంటే చిన్న కొలత పాత్ర. అంటే కూతురు వయసులో చిన్నదైనా, అమ్మకు కష్టం వస్తే తనే ఒక తల్లిలా మారి సేవ చేస్తుంది. ఈ చిన్ని దూడ కూడా తన తల్లి లేవలేదని గ్రహించి, ఆకలి తీర్చడానికి తానే మేత తెచ్చి ఇస్తోంది.


ఆడపిల్ల అంటే అమ్మకు నీడ, నాన్నకు తోడు. ఇది ఈ సామెత వెనుక ఉన్న అర్థం" అని వివరించాడు శివయ్య.


లక్ష్మి ఆ మాటలు విని మురిసిపోయింది. ఆ దూడను ప్రేమగా నిమిరింది. తల్లి ఆవు కూడా తన బిడ్డ తెలివికి, ప్రేమకు పరవశించి, కళ్లు మూసుకుని హాయిగా ఆ ఆకులను తిని బిడ్డకు పాలిచ్చింది. బిడ్డ చేసిన సేవలతో, శివయ్య చేసిన వైద్యంతో కొద్ది కాలానికే ఆవు కాలి గాయం పూర్తిగా నయమయ్యింది.


సమాప్తం 


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi Viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@kasimavayyakadhalu

•3 hours ago

Super

Like
bottom of page