'Ma Ayana Bangaram' - New Telugu Story Written By Mohana Krishna Tata
'మా ఆయన బంగారం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఉమా! ఎక్కడున్నావు?"
"ఏమిటండీ!"
"కొంచం కాఫీ ఇస్తావా?"
"ఆగండీ! వస్తున్నాను"
"ఇదిగోండి! తీసుకోండి" అంటూ బుంగమూతి తో ఇచ్చింది. . .
"ఏమిటి ఉమా! అలా ఉన్నావ్? ఎప్పుడు నేను ఏది అడిగినా, నా మీద ఇలాగే ఉంటావు. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా!"
"అదే తక్కువ నాకు!"
"నీకేమైందే ఇప్పుడు! మంచి భర్త, ఇద్దరు పిల్లలు. . . కాస్తో కూస్తో ఉన్నదానిలో బానే ఉంటున్నాము కదా! ఇంకేంకావాలి? నీకు తృప్తి లేదే ఉమా!"
"మీరు అలాగే అంటారు! మీకేం, ఎలాగైనా సర్దుకుపోతారు. "
"మనం చాలా మంది తో పోలిస్తే చాలా బెటర్ తెలుసా ఉమా!" అన్నాడు ఉదయ్.
"అందరూ, బాగా అప్గ్రేడ్ అవుతున్నారండి!. . . . 3 నెలలకు సోఫా మార్చేస్తున్నారు. . . సంవత్సరానికి టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ అన్నీ మార్చేస్తున్నారు. . . మన గ్యాస్ స్టోవ్ కూడా, చాలా పాతదండి. . . "
"ఉమా! ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉన్నాయి కదా!, టైం వచ్చినప్పుడు వస్తువులు మారుస్తాం. . దాని గురించి అంత ఆలోచన వద్దు. . . ఇప్పుడు అయితే, అన్నీ బాగానే ఉన్నాయి కదా. . . ప్రేమ, అభిమానం ముఖ్యం ఉమ!"
"మా అమ్మ చెప్పిన మాట వినకుండా ఉండాల్సింది. . . "
"ఏమిటో అది" అడిగాడు ఉదయ్
"నాకొచ్చిన మూడు పెళ్ళి సంబంధాల్లో. . . ముందు రెండు బాగా ఆస్తి ఉన్నవి. . . . కానీ మా అమ్మ మాట విని నేను మిమల్ని చేసుకున్నాను. . . మా అమ్మ… 'ఆస్తి కన్నా… మంచితనం, బాగా చూసుకోవడం ముఖ్యం' అని చెప్పింది. . .
"డబ్బుతో అన్నీ రావు ఉమా!" కాలమే నీకు సమాధానం చెబుతుంది" అని ఊరుకున్నాడు భర్త.
ఉదయ్. . . వాళ్ళ అత్తగారు ఊహించినట్టే, చాలా మంచివాడు. ఒక్క చెడు వ్యసనం కూడా లేదు. బయట ఫుడ్ కూడా ఎప్పుడో కానీ తినడు. పెళ్ళాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చేసేది చిన్నప్రైవేట్ ఉద్యోగమైనా, ఉన్నదానితో అన్నీ సమకూర్చుకున్నాడు. హ్యాపీ గా ఉంటాడు. . . పెళ్ళానికీ అదే చెబుతాడు. . .
ఇక ఉమ, చాలా మంచి అమ్మాయి. చూడడానికి చాలా లక్షణంగా ఉంటుంది. ఇంటి పనులు చక్కగా చేసుకుంటుంది. దైవ భక్తి ఎక్కువ.
ఇలా ఉండగా, ఒక రోజు ఉమ కు సూపర్ మార్కెట్ లో తన పాత ఫ్రెండ్స్ కనిపించారు.
"సీత, గీత! చాలా రోజులయ్యిందే మిమల్ని చూసి. . ఎలా ఉన్నారు?"
"ఈ మధ్యే, ఈ ఊరు వచ్చాము. మేమిద్దరమూ టచ్ లోనే ఉన్నమే, . నువ్వే టచ్ లో లేవు. " అంది సీత
"ఇప్పుడు కలిసాము కదా! చాలా మాట్లాడుకోవాలి!"
"అలాగే కానీ, మా వారు ఇంట్లో వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళాలి" అంది సీత
"మనం రేపు సీత ఇంట్లో, కలుద్దాము, ఒక చిన్న పార్టీ లాగ! ఒకే నా?"
"అలాగే!” అన్నారు గీత, సీత.
"రేపు మీ ఇంట్లో లంచ్ కు వస్తామే సీత. . . 'బీ రెడీ' అన్నారు ఇద్దరు ఫ్రెండ్స్"
"అలాగే. . . ఐ విల్ బి వెయిటింగ్" అంది సీత. .
మర్నాడు భర్తలందరూ. . . ఆఫీస్ కు వెళ్ళాకా. . . అందరూ సీత ఇంట్లో కలిశారు. .
"మీ ఇల్లు చాలా పెద్దదే సీత! సొంతమా?"
"అవునే! ఈమధ్యే కొన్నాం"
"మీది ఓన్ హౌస్ కాదా?" అడిగింది సీత.
"ఓన్ హౌస్! కానీ ఇంత పెద్ద ఇల్లు కాదనుకో!"
"నీ గురించి చెప్పవే ఉమ!"
"నేను, నా భర్త ఇద్దరు పిల్లలు. . . ఇదే నా సంసారం"
"మరి నువ్వే సీత"
"ఏం చెప్పమంటావే! మా అయన ఆస్తిపాస్తులు చూసి మా నాన్నగారు పెళ్ళిచేసారు.
కానీ, మా మావయ్యగారి నుంచి మా అయన చేతికి ఆస్తి వచ్చిన తర్వాత. . . . హారతి కర్పూరం అయిపోతుందే!. . ఈ ఇల్లు ఒకటి నేను కష్ఠపడి కొనిపించాను. . . మా ఆయనకున్న వ్యసనాల వల్ల ఎంత ఉన్నా, సుఖం లేదే. . . పిల్లలు ఉంటే కొంచం బాగుండునే!. . . అయన వ్యసనాలవల్ల, అయన వల్ల ఇంక పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పేసారు" అని బాధ పడుతూ చెప్పింది సీత.
"నిజంగా, నీవి సీత కష్టాలేనే!"
"ఉండండి! నా స్టోరీ చెప్పి బాధ పెట్టాను. . . . లంచ్ చేద్దాం రండి. . . మీకోసం చాలా వెరైటీస్ చేశాను…” అంది సీత. . .
అందరూ లంచ్ చేసిన తర్వాత. . . సీత తన పెళ్ళి ఆల్బం తీసుకొచ్చింది. . . ఓపెన్ చేసి చూపించింది. . .
ఉమ కు షాక్! తన మొదటి పెళ్ళి చూపులకొచ్చిన అబ్భాయే సీత భర్త. . . . నేను చాలా అదృష్టవంతురాలని అయితే అనుకుంది. . . .
"ఇంక టైం అవుతుందే, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, నేను వెళ్తాను!" అని ఉమ 'బై' చెప్పింది…
"మర్చిపోకండి!! రేపు గీత ఇంట్లో మనం కలుస్తున్నాము. . . "
"అలాగేనని, 'బై' అన్నారు సీత, గీత.
మర్నాడు అందరూ గీత ఇంట్లో లంచ్ చేశారు. . . తర్వాత అందరూ. . . . కబుర్లు చెప్పుకుంటున్నారు. . . .
"గీత! నీ హౌస్ చాలా బాగుందే! సొంతమేనా? అడిగింది ఉమ.
"అవునే"
"నువ్వు చాలా లక్కీ"
"పిల్లలు ఎక్కడ?" అడిగింది సీత
"స్కూల్ కు వెళ్ళింది పాప"
"మీ ఆయనకు నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా!"
"గీత కంట్లో నీళ్ళు తిరిగాయి…
"ఏమైందే?"
"మా ఆయనకు, నా మీద అనుమానం ఎక్కువే, నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఎదో, పాప కోసం ఇలాగ ఉంటున్నాను అంతే!"
గీత పెళ్ళి ఆల్బం చూసిన తరవాత ఉమ కు మళ్ళీ షాక్! తనను రెండో పెళ్ళి చూపులు చూడడానికి వచ్చిన అబ్బాయే గీత భర్త!
ఆ రోజు, రాత్రి ఉమ కు నిద్ర పట్టలేదు. ఇదంతా దేవుడు తనకు బుద్ధి చెప్పడానికి చేసిందా?
లేకపోతే, మా ఫ్రెండ్స్ కలవడము. . . వాళ్ళ భర్తలు గురించి నిజాలు తెలియడమూ. . . ఇదంతా ఏమిటి? అని ఆలోచిస్తుంది. . . .
ఇదంతా చూసిన తర్వాత. . . తన భర్త ఎంత మంచివాడో, డబ్బు ఒక్కటే. . . ఆనందాన్ని ఇవ్వదని తెలుసుకుంది. ఉన్నదానితో సంతోషంగా ఉండొచ్చని తన భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. . .
మర్నాడు ఉదయం. . . "ఏమండీ! ఇదిగోండి కాఫీ!"
"ఈరోజు నేను అడగకుండా తెచ్చావు ఉమ!"
"అవునండి! మీ సంతోషమే నా సంతోషము! మీరు చెప్పినట్టే వింటానండి" అని భర్త గుండెల మీద తల పెట్టి ప్రేమగా చెప్పింది ఉమ. . .
****************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Комментарии