top of page
Writer's pictureMohana Krishna Tata

మా ఆయన ఫేమస్


'Ma Ayana Famous' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 10/10/2023

'మా ఆయన ఫేమస్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఏమండీ! పక్కింటి సుబ్బారావు గారు ...మొన్న టీవీ లో కనిపించారు. మొన్న.. మా ఫ్రెండ్ వాళ్ళాయన కుడా టీవీ లో కనిపించాడు. తెగ గొప్పలు పోతున్నారండీ...మా ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడు కనిపిస్తారండి! చెప్పండి!" అడిగింది సుచిత్ర.


ఇదేమిటి! టీవీ లో కనిపించడం ఏమిటి?

"అదేనండీ! టీవీ ఛానల్స్ లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా!...వాటిలో పాల్గొనడం, ప్రైజ్ కొట్టడం అనమాట!"


"పక్కింటాయన ఏమిటి చేసాడో...నీతో చెప్పిందా వాళ్ళావిడ?"

"ఆయన...వంటల ప్రోగ్రాం లో మంచి వంటకం చేసాడంట..."


"నిజమా?"


"వంటకం తిన్నాకా.. జనాలు ఉన్నారా..పోయారా?"

"ఏమిటండీ.. ఆ మాటలు...ఆయనా వంటలు సుమారుగానే చేస్తారంట...మిగిలినదంతా...యాంకర్ మేనేజ్ చేస్తుంది లెండీ! విషయం అది కాదండీ! ఆయన..అందంగా డ్రెస్ చేసుకుని..విగ్ పెట్టుకుని...టీవీ లో కనిపించాడు...అదీ అసలు మ్యాటర్!"


"మరి మీ ఫ్రెండ్ ఏమీ చెప్పలేదా నీతో.. నన్ను ఇలా చంపడానికి!"

"మీరంటే గుర్తోచింది! మొన్నమార్కెట్ లో కనిపించిన రమ్య...వాళ్ళాయన మంచి కామెడీ షో లో కనిపించాడని చెప్పింది"

"నువ్వు చూసావా? స్కిట్ అయిపోయిన తర్వాత సెట్టింగ్ తెసేస్తారు కదా...ఆ బాపతేమో!"

"మా ఫ్రెండ్ మరీ అబద్ధం చెప్పదు లెండీ!

"నువ్వు అందరి మాటలకూ పడిపోతావే సుచిత్రా! అందులో ఎంత నిజముందో ఆలోచించు కొంచం!"


"ఇంకో ఫ్రెండ్ వాళ్ళాయన..రియాలిటీ షో సెలెక్షన్స్ కోసం వెళ్ళారు...మీరూ ఏదో ఒకటి చెయ్యండి...నేను అందరికి గొప్పగా చెప్పుకుంటాను...మీరు ఫేమస్ అవుతారు కదండీ!"


"మీ అయన గొప్ప ఆఫీసర్ అని అందరికి చెప్పుకో...సరిపోదూ!"

"సరిపోదండీ! టీవీ లోనే కనిపించాలి...అంతే! మీరు టీవీ లో కనిపించకపోతే...నేను అలుగుతాను..."


"అలగకే...సుచిత్రా! నువ్వు అలిగితే.. ఏమి జరుగుతుందో...నాకు తెలియనిది కాదు...నాకు ఫుడ్ కట్, మాటలు కట్...ఇంకా.. నీకు కోపం వస్తే...పుట్టింటికి వెళ్ళిపోతావు...అదే నా బాధ డియర్!"


"పోనీ.. చెప్పవే !"


"పాటల పోటీకి వెళ్దామంటే...నాకా పాటలు రావు...పాడితే జడ్జ్ కుడా..పాటలు మర్చిపోతారు...

డాన్స్ కాంపిటీషన్ అంటే..మనకా...ఎప్పుడూ...కాళ్ళు నొప్పులు...వొళ్ళు నొప్పులు...

రియాలిటీ షో అంటే....ఒకే ఇంటిలో అందర్నీ బంధించి ఉంచితే, అసలే మనకి పడదు...రియాలిటీ షోస్ లో మనకి అంత రియాలిటీ లేదు...నిన్ను వదిలి, అన్ని రోజులు ఉండలేను కుడా..సుచిత్రా!"

పోనీ! న్యూస్ చదువుదామంటే...జనాలకి నిద్ర రావడం ఖాయం..

సీరియల్స్ లో చేద్దాం అంటే, అంత గ్లామర్ లేదు మనకి..."


"ఒకటే మార్గం ఉంది..."

"చెప్పండి! చెప్పండి!" ఆత్రుతగా అడిగింది సుచిత్ర!"

"ఏదో ఘోరం చేసి....నేరాలు ఘోరాలు ప్రోగ్రాం లో భారీగా కనిపించడం..."


"అంత పని వొద్దు లెండి! మీరు నా కళ్ళ ముందు వుంటే చాలు...నాకు మీరే హీరో. టీవీ లో కనిపిస్తే...ఎవరికి గొప్పంటా!"


********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


34 views0 comments

Σχόλια


bottom of page