top of page

మా ఇంటికి వచ్చిన గణపయ్య

పాఠకులకు రచయితలకు వినాయక చవితి శుభాకాంక్షలు


'Maa Intiki Vachhina Ganapayya' - New Telugu Story Written By Mohana Krishna Tata

'మా ఇంటికి వచ్చిన గణపయ్య' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


వినాయక చవితి.. మన హిందూ పండుగలలో అత్యంత విశిష్టమైన పండుగ. పంట పొలాల్లో లభించే మట్టితో బొమ్మను చేసి, పొలాల గట్టున లభించే అనేక రకాల ఆకులతో, జిల్లేడు, తుమ్మి, లాంటి పూలతో పూజిస్తే చాలు.. ఆ గణపయ్య అనుగ్రహం లభిస్తుంది.


పండుగ రోజు.. మా ఇంటి తలుపు ఎవరు కొడుతున్నారు..

నేను వెళ్లి తలుపు తీసాను..


ఎదురుగా వినాయకుని వేషధారణలో ఒక మనిషి.


చూడడానికి అచ్చంగా ఆ గణపయ్య వచ్చినట్టుగా అనిపించింది. చూస్తే.. చేతులెత్తి మొక్కాలనిపించింది. కానీ, ఈ కలికాలం లో.. దేవుడు ఎలా వస్తాడు? అని అనుకున్నాను.


"ఎవరు స్వామి మీరు?"


"కనిపించటం లేదా నాయనా!.. నన్ను గణేష్ అంటారు. అందరూ వినాయక.. గణపయ్య అని కొలుస్తారు నాయనా!.. "


"నిజమే స్వామి.. "


మీ అపార్ట్ మెంట్ లో గణపయ్య ను పెట్టారు కదా!.. అది నేనే.. అక్కడ నుంచే వచ్చాను.. ”


"ఓహ్! మా కమిటి వాళ్ళు ఏర్పాటు చేసారా స్వామి? మీకు నేను ఏమి సేవ చేయగలను స్వామి?"


"దారిలోకి వచ్చావు నాయనా!.. "


"నాకు చాలా ఆకలి వేస్తున్నది నాయనా!.. తినడానికి ఏమైనా?"


"నా దగ్గర చిప్స్, బిస్కెట్స్ ఉన్నాయి స్వామి.. "


"నాకు నైవేద్యం కొంచం లేట్ చేస్తున్నారు మీ అపార్ట్ మెంట్ వాళ్ళు.. పండ్లు ఏమైనా ఉంటే.. "


"అలాగే స్వామి.. పండుగ రోజులు కదా!.. పండ్లు ఉన్నాయి.. తెస్తాను.. "


"గణపయ్య వివిధ రకాల పండ్లు ఆరగించి.. నేను ఇక వస్తాను నాయనా.. "


(మా అపార్ట్ మెంట్ కమిటీ వాళ్ళు ఈసారి వినాయక చవితికి రియాలిటీ షో ఏదో ప్లాన్ చేసినట్టున్నారు.. ఎవరికీ చెప్పలేదు.. నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి.. అందుకు నేను

ఇంటికి వచ్చిన గణపయ్య ను భక్తి తో బాగా పూజించాలి.. అని మొదట అనుకున్నా ఆ గణపతిని చూస్తూ వుంటే నిజంగా భక్తి భావం కలిగింది నాకు. )


"స్వామి! కడుపు నిండిందా?.. "


"కిందన.. నాకు నైవేద్యం పెడతారు కదా నాయనా!.. అక్కడ ఆరగిస్తాను లే.. నీకు భక్తి చాలా ఎక్కువ నాయనా.. ఈ చిన్న వయసులోనే.. ”


"అవును స్వామి.. నేను గణపతి భక్తుడను.. రోజూ ఉదయం లేచి.. వినాయకునికి దణ్ణం పెట్టుకోనిదే.. ఆ రోజు స్టార్ట్ అవదు స్వామి నాకు.. అలాగే సాయంత్రం పూట కూడా అంతే స్వామి.. "


"అయితే మహా భక్తుడవే!"


"అవును స్వామి"


"స్వామి! మరి పండుగ ఏ రోజు చేసుకోవాలి స్వామి? రెండు రోజుల గందరగోళం లో ఉన్నారు భక్తులు.. ఏం చెయ్యాలో ఎవరికీ అర్ధం కావట్లేదు.. "


"నాయనా.. భక్తి తో పూజిస్తే.. ఎప్పుడైనా ఒక్కటే! ఎలాగా.. నన్ను నిమజ్జనం వరకు.. నవరాత్రులు.. నేను మీ పూజలు అందుకుంటాను కదా! నాయనా.. ఇంటికి ఈశాన్యంలో శివయ్య ఫోటో పెట్టావు.. "

"అవును స్వామి.. "


"మా తండ్రిగారు..”అని నమస్కరిస్తూ.. అయన ఆజ్ఞ లేనిదే.. చీమైనా కుట్టదు.. నేను ఇక్కడకు వచ్చేవాడిని కాదు.. "


"ఈ నవ రాత్రులూ.. మీ దర్శనం దొరుకుతుందా స్వామి?"


"దొరుకుతుంది నాయనా!"


"మా ఇంటికి దయ చేయండి స్వామి!.. మీకు నచ్చిన నైవేద్యం నేను సమర్పించుకుంటాను"


"అలాగే నాయనా! అక్కడ ఆలస్యం అయితే.. ఇక్కడకే వస్తాను.. ఎంతైనా నువ్వు నా ప్రియ భక్తుడవు కదా!"


"ధన్యుడను స్వామి!"


"అపార్ట్‌మెంట్ కింద మండపం లో.. నా పూజ మొదలైనట్టుంది.. భక్తులను ఆశిర్వదించాలి.. ఇక నాకు సెలవు"


"మీరు ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు స్వామి.. "


"అలాగే నాయనా!"


"రేపు మీ రాక కోసం ఎదురు చూస్తాను స్వామి.. మీకు ఇష్టమైన వంటకాలు సిద్ధం చేసి ఉంచుతాను స్వామి..

నేను మిమల్ని.. మా ఇంటి వద్దనే పూజించుకుంటాను స్వామి.. ఈ నవరాత్రులు.. తర్వాత.. కిందకు వస్తాను.. "


"సరే” అని, గణపయ్య వెళ్ళిపోయారు..


రోజూ.. ఆ గణపయ్య ఇంటికి వచ్చి.. కొంత సేపు ఉండి వెళ్ళేవారు..


నవరాత్రులు చివరి రోజు వచ్చింది..


నాయనా! ఈ రోజు నా ఉత్సవాలు ముగుస్తాయి.. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తాను.. నువ్వు చాలా అదృష్టవంతుడవు నాయనా.. ఎవరికీ రాని నా ఈ దర్శన భాగ్యం.. నీకు లభించింది.. ఇంట్లో మీ అమ్మ నాన్న ఊరు వెళ్ళినా.. నా కోసం భక్తి తో పిండివంటలు చేసి పెట్టావు.. మీ కుటుంబం చల్లగా ఉండు గాకా.. ” అని దీవించి స్వామి మాయమైపోయారు..


మన కమిటి వాళ్ళు మాయమైపోవడానికి భలే గ్రాఫిక్స్ వాడినట్టున్నారు..


" బెల్ మోగింది..


“అసోసియేషన్ కమిటి ప్రెసిడెంట్ గారు.. మీరా!.. నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి మీరు.. "


"దేనికి.. మొన్న నువ్వు గెలిచిన మ్యూజికల్ చైర్స్ లోనా?.. ఇస్తాము.. "


"అది కాదండీ! గణపయ్య రియాలిటీ షో చేసారు కదా!.. దానికి!నాకైతే సాక్షాత్తు ఆ వినాయకుడే నన్ను అనుగ్రహించి ప్రత్యక్షమైనట్లు అనిపించింది. "


"మేము షో చెయ్యడము ఏమిటి"?


"మరి మా ఇంటికి వచ్చిన గణపయ్య?.. అయితే నిజంగానే.. ఆ గణపయ్య మా ఇంటికి దయ చేసారా? ఎంత అదృష్టవంతుడను నేను! ఎదురుగా నేను రోజూ పూజించే గణపయ్య ఉన్నా.. గుర్తించలేకపోయాను..

నా మనసంతా ఆనందంతో నిండి పోయింది.


**************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


47 views0 comments
bottom of page