మా మంచి దొంగ
- Anisa Tabassum Sk

- 7 hours ago
- 3 min read
ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

మా మంచి దొంగ, Telugu comedy story, Telugu emotional comedy, Telugu human values story, Telugu short story, funny Telugu story
Ma Manchi Donga - Telugu Comedy Story | Anisa Tabassum Sk
మా మంచి దొంగ - తెలుగు హాస్య కథ | అనిసా తబస్సుమ్ SK
Published in manatelugukathalu.com on 18/05/2026
హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తెల్లవారు ఆరింటికి, ఓ నలుగురు కానిస్టేబుళ్లతో ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. "అవును... అవును! ఇదే వాడి ఇల్లు," అని ఒక కానిస్టేబుల్ అనగా, ఇంతలో మరో ఆఫీసర్, "సందేహమే లేదు! వాడు ఇంట్లోనే ఉన్నాడు," అన్నాడు.
"మనం ఇలాగే ఇక్కడ మాట్లాడుకుంటూ నిలబడితే, వాడు ఏదో ఒక ఆయుధం తీసుకొని మనపై దాడి చేసినా చేస్తాడు..." అంటూ క్రిమినల్స్ అంటే భయపడే ఒక పోలీస్ అన్నాడు.
"కమాన్ ఆఫీసర్స్! ఇక మన ఆపరేషన్ 'టీ' మొదలు పెడదాం," అన్నాడు ఎప్పటికైనా ధైర్యశాలి అన్న బిరుదు పొందాలనుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు.
"ఇప్పుడేం 'టీ' సార్? మనం టీ తాగి వచ్చే లోపు వాడు తప్పించుకుంటాడేమో," అన్నాడు కానిస్టేబుల్ మోహన్.
"టీ అంటే తాగే టీ కాదయ్యా... 'టీ' అంటే 'ఆపరేషన్ థీఫ్' అని!" అంటూ కసురుకున్నాడు సుబ్బారావు.
చిన్న సింగిల్ రూమ్ రేకుల ఇల్లు అది. గుమ్మం ముందు ఊడిపోతే పిన్ పెట్టిన పాత చెప్పులు.
సుబ్బారావు హీరోలా 'ధడేలు'మని తలుపును తోశాడు, కానీ కమెడియన్‌లా వెనక్కి బౌన్స్ అయ్యి పడబోతే తృటిలో మోహన్ పట్టుకున్నాడు.
మొత్తానికి తలుపు తెరుచుకొని సుబ్బారావు బృందం లోపలికి వెళ్లి, హాయిగా పాడుకుంటున్న అంజి నిద్ర చెడగొట్టి, అంజిపై దండయాత్ర చేసి, అతన్ని అతలాకుతలం చేసి... ఒక హంతకుడిని తీసుకెళ్లినట్టు జీప్‌లో ఎక్కించి స్టేషన్‌కి తీసుకెళ్లారు.
సుబ్బారావు అంత పొద్దున్నే ఆపరేషన్ 'టీ' చేయడంతో అలసిపోయి, మిగతా కానిస్టేబుళ్లను అంజి సంగతి చూసుకోమని, అతడు విశ్రాంతి తీసుకోవడానికే వెళ్ళాడు.
అసలు అంజిని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటంటే, అంజి ఒక మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాకపోవడంతో, తనకి వచ్చే జీతం తన తల్లిదండ్రులకు పంపగా, అతని ఖర్చులకు సరిపోయేది.
కాలం గడిచే కొద్దీ మనిషికన్నా, మానవత్వంకన్నా, బంధాలు - బంధుత్వాలకన్నా, డబ్బు వెంట పరిగెడుతున్న మనుషుల్ని చూసి, మనిషి జన్మపై విరక్తి పుట్టింది అంజికి.
ఒక రోజు ఓనర్... షాప్ కాసేపు అంజికి అప్పజెప్పి పని మీద బయటికి వెళ్ళాడు. ఓనర్ తిరిగి వచ్చి కౌంటర్ వద్ద డబ్బు లెక్కబెట్టగా ఇరవై వేలు తగ్గాయి. అంజిని శతవిధాలుగా అడిగినా "నాకు తెలీదు సార్," అనే బదులిస్తున్నాడు. చేసేది లేక ఓనర్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.
సుబ్బారావు వచ్చి చూసేసరికి స్టేషన్‌లో అందరూ అంజి కేసి చూస్తూ నవ్వుకుంటున్నారు. నిజం కక్కించమని వెళ్తే వీళ్ళేంటబ్బా నవ్వుకుంటున్నారు, అని బుర్ర గోక్కుంటూ వచ్చి... "ఏంటి మోహన్, ఏమైంది! ఎందుకు అలా నవ్వుతున్నారు?" అని మోహన్‌ని అడిగాడు.
"సార్, ఇరవై వేలు దొంగిలించింది వీడే సార్! అ...హహహ..." అని పళ్ళికిలించాడు.
"డబ్బేం చేశాడో అడగకుండా ఆ వెక్కిలి నవ్వు ఏంటయ్యా?" అన్నాడు సుబ్బారావు కొంచెం విసుగు ప్రదర్శిస్తూ.
"అది కాదు సార్, ఒకసారి మీరు అడగండి," అన్నాడు మోహన్.
మన సుబ్బి సర్రున వెళ్లి, లాఠీ పుచ్చుకొని... "చెప్పరా! నిజం చెప్పు! ఆ డబ్బు ఏం చేశావో చెప్పు! లేకపోతే ఈ లాఠీ చూశావుగా? దీంతో నీ వీపు పగలగొడతా!" అన్నాడు ఆవేశంతో.
సుబ్బి హడావిడి చూసి, నిజమే అని భయపడిన అంజి, "చెప్తా సార్... చెప్పేస్తా!" అన్నాడు.
"ఊ... ఆలారా దారికి! చెప్పు!" అని గర్జించాడు.
అంజి ఇక మొదలుపెట్టాడు... "మొన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే ఫుట్‌పాత్ మీద బిచ్చగాళ్లు, పేదవాళ్లు, పాపం, అంత చలిలో కప్పుకోవడానికి దుప్పటి కూడా లేక వణుకుతున్నారు సార్. వాళ్లకి ఎలాగైనా సహాయం చేయాలనిపించింది. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో, షాప్‌లో డబ్బులు తీసుకొని, ఓ ఇరవై రగ్గులు కొని, రోడ్డు మీద పడుకునే వారికి పంచిపెట్టాను సార్. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ షాప్‌లో పెట్టేద్దాం అనుకున్నాను. అయినా నేను చేసింది మంచి పనే కాట్టి, మా షాప్ ఓనర్‌కి కూడా పుణ్యం వస్తుంది సార్," అన్నాడు భయంతో బయటికి రావాలనుకుంటున్న కన్నీళ్లను ఆపుకుంటూ.
అంజి మాటలకు విస్తుపోయిన సుబ్బి, "ఓరినీ దుంపతెగా! ఎంతపని చేశావ్... సరే, నువ్వన్నట్టు ఇరవై రగ్గులు తీసుకున్నా ఇంకా ఐదు వేలు మిగులుతాయిగా! అవేం చేశావో చెప్పి తగలడు..."
"అది... అది... సార్! మనమంటే ఏం అవసరం ఉన్నా మాట్లాడగలం. కానీ మూగజీవాలు అలా కాదు కదా సార్. అందుకే మిగిలిన డబ్బుతో రోడ్ల మీద ఉండే మూగజీవాలకు పచ్చగడ్డి కొని వేశాను సార్...," అన్నాడు అంజి తాను చేసింది అసలు తప్పు కాదు అన్న గర్వంతో.
"నీ కడుపు చల్లగుండా... మా మంచి దొంగవేరా! దానం చేయాలంటే నీ సొంత డబ్బుతో చేయాలి కానీ, ఇలా ఇతరుల డబ్బుతో వారికి ఇబ్బంది పెట్టి చేయకూడదురా. ఇది తెలియక చేసిన తప్పు కాబట్టి, కేసు లేకుండా వదులేస్తున్నా. ఇంకోసారి ఇలా చేయకు," అంటూ... అంజి మంచి మనసుకి ముచ్చటేసి, దారి ఖర్చులకు, తినడానికి కొంత డబ్బులిచ్చి పంపించాడు సుబ్బారావు.
ఇది మా ఊళ్లో నిజంగా జరిగిన సంఘటన. 😌❤
కథ సమాప్తం
-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)
అనిసా తబస్సుమ్ SK గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
కథ సమాప్తం

అనిసా తబస్సుమ్ SK




❤