top of page
Original.png

మంత్ర బలం

14 hours ago
3 min read

మంత్ర బలం తెలుగు నీతి కథలో కనకయ్య, బంగారయ్యలకు కష్టపడి పనిచేయడం, వ్యాపారంలో నిజాయితీ ప్రాముఖ్యతను బోధిస్తున్న గురువుగారు.

Mantra Balam - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

మంత్ర బలం - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 19/10/2026


మంత్ర బలం రాళ్లబండి సంగం నాయుడు రచించిన చక్కని తెలుగు నీతి కథ. కష్టపడి పనిచేయడం, చేసే పనిని ఇష్టపడటం, వ్యాపారంలో నిజాయితీతో పాటు ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయానికి మార్గమని ఈ కథ తెలియజేస్తుంది.


పూర్వం పార్వతీపురంలో కనకయ్య, బంగారయ్య అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఇద్దరి వ్యాపారమూ సజావుగా సాగుతోంది.


కాలం గడుస్తోంది. కనకయ్యలో స్వార్థం పెరిగింది. లాభాల కోసం అడ్డతోవలు తొక్కాడు, వ్యాపారంలో కల్తీ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో లాభాలు బాగానే వచ్చాయి.


కానీ కొంతకాలానికి కనకయ్య చేస్తున్న మోసం ప్రజలకు తెలిసిపోయింది. కనకయ్య దగ్గర సరుకులు ఇదివరకులా లేవని, అతనిలో స్వార్థం పెరిగి తప్పుదోవలో నడుస్తున్నాడని ప్రజలు గ్రహించి అతని దగ్గర సరుకులు కొనడం మానేశారు.


దాంతో కనకయ్య వ్యాపారం నష్టాల బాట పట్టింది. అనతికాలంలోనే అతని వ్యాపారం దివాళా తీసింది. కనకయ్య రకరకాల వ్యాపారాలు చేశాడు.


కానీ వ్యాపారంలో ప్రజల నమ్మకమే ముఖ్యం. ప్రజావిశ్వాసం పోగొట్టుకున్న కనకయ్య ఏ వ్యాపారం చేపట్టినా నష్టాలే వచ్చాయి.


కనకయ్యకు ఏ వ్యాపారం చేయాలో దిక్కుతోచలేదు, ఏమీ పాలుపోలేదు. భార్య సలహాతో పొరుగుూరులో ఉన్న బాబాను కలవడానికి వెళ్లాడు.


తనను కలవడానికి వచ్చిన కనకయ్య చెవిలో బాబా ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఎవరికీ చెప్పవద్దని, పదే పదే మననం చేసుకుంటే వ్యాపారంలో తిరుగుండదని బాబా కనకయ్యతో చెప్పాడు.


బాబా చెప్పిన మంత్రంతో కనకయ్య అతికష్టం మీద వ్యాపారంలో పుంజుకున్నాడు. పోయిన ప్రజావిశ్వాసాన్ని మరలా తెప్పించుకోగలిగాడు.


కనకయ్య వ్యాపారం రెండో సంవత్సరానికి గాడిలో పడింది. ఈసారి బంగారయ్య వంతు వచ్చింది.


కనకయ్య వ్యాపారం ఓ రెండు సంవత్సరాలు దివాళా తీసిన నాటి నుండి ఆ బేరమంతా బంగారయ్యదే అయింది. ఆ రెండు సంవత్సరాలూ రెండు చేతులా సంపాదించిన బంగారయ్యకు, కనకయ్య వ్యాపారం మళ్లీ సజావుగా సాగడంతో బేరం తగ్గి లాభాలు తగ్గాయి.


ఎక్కువ లాభాల కోసం బంగారయ్య దొంగ వ్యాపారం మొదలెట్టాడు. ఈసారి ప్రజా నమ్మకాన్ని బంగారయ్య కోల్పోయాడు. త్వరలోనే బంగారయ్యకు కూడా నష్టాలొచ్చాయి.


స్నేహితుల సలహా మీద అతను కూడా పొరుగుూరి బాబా దగ్గరకు వెళ్లాడు. బాబా బంగారయ్యకు కూడా ఓ రహస్య మంత్రం ఉపదేశించాడు. దాన్నే పదే పదే పఠిస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని చెప్పాడు. బంగారయ్య ఆ మంత్రాన్ని పఠించి మంచి లాభాలు పొందాడు.


అయితే కనకయ్య, బంగారయ్యలు వ్యాపారంలో నష్టపోవడం, గురువుగారు వాళ్ల నష్టం పోవడానికి మంత్రాన్ని ఉపదేశించడం, వారు ఆ మంత్రాన్ని మననం చేసి లాభాల బాట పట్టడం గమనిస్తున్న శిష్యులు గురువుగారిని కలసి... ఆ మంత్రం తమకు ఉపదేశిస్తే తమ జీవితంలో కూడా విజయపరంపర వస్తుందని అడుగుతారు.


గురువుగారు ఆ శిష్యులతో ఇలా సెలవిచ్చారు:


"నేను కనకయ్యకు, బంగారయ్యకు ఉపదేశించిన మంత్రం 'కష్టే ఫలి... ఇష్టే ఫలి!' మీరు చేస్తున్న వ్యాపారాన్ని ప్రేమించండి. వ్యాపారంలో లాభాల కోసం కష్టపడండి. మంత్రాలకు చింతకాయలు రాలవు, చింతలూ తీరవు. మనం చేస్తున్న పనిని ఇష్టపడాలి, కష్టపడాలి! ఇదే నేను వారిరువురికీ చెప్పిన మంత్రం."


"గురువుగారూ! మీరు చెప్పిన 'ఇష్టే ఫలి... కష్టే ఫలి' మంత్రాన్ని మేము పఠించి పెద్దవాళ్లం అవుతాము," అన్నారు శిష్యులు గురువుగారితో.


కష్టేఫలి మంత్రబలంతో కనకయ్య, బంగారయ్యల నష్టాల్లో ఉన్న జీవితాలు మళ్లీ బాగుపడ్డాయి.


~ సమాప్తం ~

*** 



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page