top of page
Original.png

మరువని మేలు

6 hours ago
3 min read

ఆపదలో ఉన్న బంధువుకు ఆర్థిక సహాయం చేస్తున్న వాసు – మానవత్వం, కృతజ్ఞతను తెలిపే మరువని మేలు కథ

Maruvani melu - Telugu Social Family Story | Yasoda Gottiparthi

మరువని మేలు - తెలుగు సామాజిక కుటుంబ కథ | యశోద గొట్టిపర్తి

Published In manatelugukathalu.com On 13/11/2026


ఆపదలో ఉన్నవారికి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయమే నిజమైన మానవత్వం. చేసిన మేలును మరచిపోయే బంధాల మధ్య కృతజ్ఞత, మనసున్న మనిషి విలువను గుర్తుచేసే కథ “మరువని మేలు”.


అవసరాన్ని బట్టి మారే ఊసరవెల్లిలా, తిథి నక్షత్రం చూడకుండా వచ్చే అతిథులు, బంధువులు తమ పబ్బం గడుపుకుని, రక్షించుకోవడానికి తప్ప ఆదుకునే వారు అనే నమ్మకం లేదు.


అంతో ఇంతో సహాయం చేస్తే గుర్తుంచుకోవడం మరచి, "ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు" ముఖం చాటేసే వారెందరో నిత్యం మన చుట్టూ కనిపిస్తారు.


"అందం, డబ్బు, ఐశ్వర్యం అనే విలువలను చూసి గౌరవించకు; జీవితం పట్ల విలువలున్న వారిని గుర్తించి గౌరవించు" అని అనుభవజ్ఞుల మాటలు విన్నా, తన దాకా వస్తే కానీ తెలియదు ఎవరికైనా!


"ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ముఖ్యమైన విషయం చెప్పాలి బాబాయి! ఫోన్ లిఫ్ట్ చేయి" అని వేదన పడుతూ, ఏమైందో ఏమో? ఇప్పుడు ఐ.సి.యు (ICU) లో ఉన్న భర్త ఎలా ఉన్నాడో? చాలా ఆందోళనగా ఉంది అంటూ తన అన్నకూతురు ఆద్య ఎంతో బాధపడుతూ... "బాబాయి! నాకు ఏమీ తోచడం లేదు. 


మీ అల్లుడు సంతోష్ అకస్మాత్తుగా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతే, హాస్పిటల్‌కు తీసుకెళ్లగానే అన్ని పరీక్షలు చేసి పెరాలసిస్ (పక్షవాతం) వచ్చింది అని చెప్పగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. 


ఇప్పుడే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము. అర్జెంటుగా టెస్టులకని ఒక లక్ష రూపాయలు కావాలి" అంటూ వలవలా ఏడుస్తూ.. "నాకు మీరు కాక ఇంకెవరు ఉన్నారు? ఎలాగైనా డబ్బు సర్దాలి బాబాయి" అని ఫోన్‌లో బోరున వాపోయింది.


"సరే నువ్వేమీ ఆందోళన పడకు, నీ అకౌంట్ నెంబరు ఇవ్వు ఇప్పుడే పంపిస్తాను" అని... వెంటనే బెంగళూరులో ఉన్న కొడుకుకు వివరించి కొంత డబ్బు ఫోన్‌పే చేయమని, బిడ్డను అడిగి తన దగ్గరున్న డబ్బులు కలిపి రెండు లక్షలు పంపించాడు.


వెంటనే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టి, తగిన మందులిస్తూ, హాస్పిటల్‌లో వారం రోజులు ఉండాలని చెప్పడంతో, పిల్లలు, కుటుంబం అక్కడే ఉంటున్నారు.


ఎప్పుడు ఫోన్ చేసినా వేరే ఎవరో ఆద్య భర్త గురించి చెబుతున్నారు... కానీ, ఆద్య మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.


ఆద్య టెన్షన్‌లో ఉండవచ్చు, కనీసం పక్కన ఉన్న వాళ్ళు కూడా స్పందించలేదు... తెలిసిన వాళ్ళందరూ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు కావచ్చు అని నిశ్చింతగా ఉన్నాడు.


వాసుకు తన దగ్గరి బంధువు తానే ఫోన్ చేసి, "సంతోష్ బాగానే ఉన్నాడు. ఆద్య ఫోన్ చేసి చెప్పింది. ఒక గంట క్రితమే డిశ్చార్జ్ చేశారు. 


పెద్ద ప్రమాదం ఏమీ లేదు..." అని డాక్టర్స్ చెప్పడంతో ఊపిరి తీసుకున్నారట అందరూ. 


"నేను ఇంటికి తోడుగా వెళ్ళి దిగబెట్టి వస్తున్నాను" అని చెప్పగానే, సహృదయంతో సహాయం చేయాలి కానీ ఫలితం గురించి ఆలోచించవద్దు అనుకునే వాళ్ళు చుట్టూ కనపడుతున్నారు.


మనిషికి మనిషికి బంధాల విలువలు డబ్బుతో మాత్రమేనా? అన్నట్టు... "పోనీలే అల్లుడు సంతోష్ ఆరోగ్యంగా ఉన్నాడు అంతే చాలు" అనుకుని ఇంటికి వెళ్ళాడు వాసు.


ఆద్య నన్ను పూర్తిగా మరచిపోయింది అనుకుంటున్న సమయంలో, కొన్ని రోజులకు ఫోన్ చేసి "బాబాయి! అప్పటికప్పుడు నాకు బాగా తెలిసిన వాళ్ళు అయిదు లక్షలు పంపారు. 


వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. వారు చేసిన సహాయం మరచిపోలేను..." అని తన గురించి మాత్రం కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా, "మీరు ఎక్కువ డబ్బులు పంపుతారనుకున్నాను... నేను ఎవరినీ అడగకుండా మిమ్మల్ని అడిగాను" అంటూ డబ్బుల కోసమే అన్నట్టు మాట్లాడింది.


"అందితే జుట్టు అందకపోతే కాళ్ళు"... ఈ రోజుల్లో మరీ బంధుత్వాలు అంటేనే బరువుగా సాగుతున్నాయి అంటూ చేసిన మేలు సైతం బూడిదలో పోసిన పన్నీరులా... తను ఏమైనా కుబేరుడా? అప్పు చేసి పంపించాడు. 


ధనవంతులు పేదవారికి సహాయం చేయాలి. అంతేకాదు సహృదయం ఉన్నవారు మనిషి కనిపించకపోయినా మంచి జరగాలి అనుకోవాలి.


"మంచి మనసున్నా లాభం లేదు. నేను ఇలాంటి మరెన్నో సహాయాలకు ఆదుకునేలా నాకు చాలా డబ్బులు ప్రసాదించు తండ్రీ" అంటూ భగవంతుని వేడుకున్నాడు వాసు.


నావి డబ్బులు కావు, ఒక ప్రాణాన్ని నిలబెట్టిన అమృత బిందువులు అని ఎన్ని రోజులైనా ఆ డబ్బుల గురించి అడగలేదు.


కొన్ని రోజులకు తెలిసింది... అయిదు లక్షలు ఇచ్చిన ఆ బంధువు వడ్డీలకు వడ్డీలు కట్టి, తనకున్న చిన్న ఇల్లును తన పేరు మీద రాయమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.



సమాప్తం



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y









యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


యశోద గొట్టిపర్తి

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page