top of page
Original.png

మేలుకోరా... సినీ గీతం


మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా
మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా

Melukora - Sinee Geetham - Telugu Article | Sudhavishwam Akondi

మేలుకోరా... సినీ గీతం - తెలుగు వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 01/05/2026


ఒక పాట…భక్తి, భావం, జీవన తత్వం మూడింటినీ కలిపి చెబుతుందా?

ఈ గీతం వినిపించేది కేవలం సంగీతం కాదు…మనసును మేల్కొలిపే సందేశం…


మనసు కవిగా పేరుపొందిన ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారిన ఆణిముత్యం ఈ పాట. ఆ కాలంలోని అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా గృహిణి అంటే పొద్దున్నే లేచి ఎలా పనులు చేసుకోవాలి? ఎలా సేవలు చేయాలి? భర్త అంటే బారెడు పొద్దెక్కేవరకూ పడుకుని, పెళ్ళాం లేపితే కూడా లేవడానికి మారాం చేయడం (ఇందులో బెడ్ కాఫీ చూపించనట్టు ఉన్నారు), ఈ సాంగ్‌లో చూపించారు. ఇక్కడి సందర్భానికి కూడా తగినట్టుగా రాస్తూనే, ఆ చిన్నికృష్ణుని మేలుకొలుపుతూ స్తుతి చేస్తూ, శరణాగతిని కూడా కలిపి వ్రాసిన ఈ పాట అద్భుతమైన అనుభూతిని కల్పిస్తూ చిన్నికృష్ణుని ముఖారవిందాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. రేడియోలో చిన్నప్పుడు వింటుంటే ఏదో తెలియని ఆనందానుభూతి కలిగేది.


ఈ పాట గృహలక్ష్మి సినిమా లోనిదట. ఆచార్య ఆత్రేయ కలం సృష్టి చేయగా,

సుశీలమ్మ గళంలో పలికి వేణుగోపాలుని మన మనసుల్లో సాక్షాత్కారం అయ్యేలా చేస్తుంది.

                      ***


మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా

మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా

మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా

మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా


నీ ముద్దు మోమును చూడాలి

మా పొద్దు అప్పుడే పొడవాలి

నీ నవ్వే వెలుగై నిండాలి.. కృష్ణా.. ఆ ఆ...

మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా

మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా


నీవిచ్చిన సౌభాగ్యం.. దీవించిన సంసారం

నీ నీడన నిలకడగా నిలవాలి.. ఈ...

నీవిచ్చిన సౌభాగ్యం... దీవించిన సంసారం

నీ నీడన నిలకడగా నిలవాలి

నెలవంక వెన్నెలగా పెరగాలి

నిన్ను నమ్మి ఉన్నాము.. కృష్ణా.. ఆ..


మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా

మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా


దేవకి వసుదేవులు.. రేపల్లె పౌరులు

నీ కోసమే ఎదురు చూస్తున్నారు

దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు

నీ కోసమే ఎదురు చూస్తున్నారు

సరసాలకు ఇది సమయం కాదురా.. ఆ

సందె వేళదాకైనా ఆగరా.. కృష్ణా.. ఆ


మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా

మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా!


పొద్దున్నే లేవగానే ఆ స్వామినే తలచుకోవడంతోనే రోజు మొదలుపెట్టాలి. అప్పుడు ఆయన అనుగ్రహంతో ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది.

మనకు లభించిన సంతోషం, సౌభాగ్యం, జీవితంలో లభించే ప్రతి క్షణం పరమాత్మ యొక్క కరుణాకటాక్షాల వల్ల లభించాయని గుర్తెరిగి నడుచుకోవడం చేయాలి. జీవితం అంతా నీ కారుణ్యంతో, నిన్నే తలుచుకుంటూ నీ అనుగ్రహంతో గడిచిపోవాలని కోరుకోవడం ఆయనే గృహస్తుకు నిర్ణయించిన విధానం. అదే చెబుతూ స్తుతి చేస్తూ... చివరి చరణం వరకు వచ్చేసరికి గోపికగా తాదాత్మ్యత చెందినట్లుగా చెప్పేశారు ఆత్రేయ.


ఎంత అద్భుతమైన గీతం. అందుకే అప్పటి కవులు ధన్యులు.

మీలో ఎంతమందికి ఇష్టం ఈ పాట?

సుధావిశ్వం 


సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):









-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page