top of page

మెన్ టూ..


'Men Too' - New Telugu Story Written By N. Dhanalakshmi

Published On 07/12/2023

'మెన్ టూ' తెలుగు కథ

రచన: N. ధనలక్ష్మి


‘కొట్టు, బాగా కొట్టు.. ఇలాంటి కీచక టీచర్ విద్యా వ్యవస్థ కే కీడు.. ’


‘ఏ రా నీచుడా! నీలాంటి వెధవల వల్లే కదరా అమ్మాయిలు క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నారు..’


చుట్టు పక్కల కనపడ్డ రాళ్ళను చేతిలోకి తీసుకొని ఆ టీచర్ పై విసిరేసారు అక్కడున్న జనం.


ఇంటర్ విద్యార్థిని పై టీచర్ ఆత్యాచార యత్నం..


తప్పించుకున్న విద్యార్థిని..


అంటూ న్యూస్ ఛానల్ లో బ్రేక్ లేకుండా చెప్పి డిబేట్ డిబేట్ మీద డిబేట్లు పెట్టుకున్నారు..


ఆ టీచర్ ను అరెస్ట్ చేశారు.


ఆ అమ్మాయి తల్లి తండ్రి అమ్మాయి విషయం పరువు పోతుందని కేస్ ఫైల్ చేయకపోవడంతో ఓ పది రోజులు జైల్ లో ఉంచారు.


ఈ పది రోజుల్లో తన ఇంట్లో వారు ఒక్కరూ కూడ తనని చూడడానికి జైల్ కి రాలేదు..


ఆ టీచర్ విడుదల అయ్యాక తన ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కితే "ఏ నీచుడా దిగు రా ఆటో.. నీ లాంటి వాళ్ళకి నా ఆటో లో చోటు లే”దంటూ దింపేశాడు..


బస్ ఎక్కినా అదే చుక్కెదురు. రోడ్లలో నడుస్తుంటే ఆ టీచర్ ను చిన్న చూపు చూస్తున్నారు. ఇంకో దారి లేక తన మొహానికి ముసుగు వేసుకొని తన ఇంటికి నడక మొదలు పెట్టారు. దారిలో దాహం వేసి బోర్ పంపు వద్ద నీళ్లు త్రాగడానికి తను వేసుకున్న ముసుగు తీసిన వెంటనే అక్కడున్న ఆడవారు తమతో ఉన్న బిందెలతో అతడిని దాడి చేశారు.. అతను ఎలాగోలా తప్పించుకొని అక్కడనుండి పారిపోయి తన ఇంటికి చేరుకున్నాడు.. భార్య బిడ్డ ఇంట్లో లేరు.. ఇకపై తనతో తమకేమీ సంబంధం లేదంటూ ఓ ఉత్తరం ముక్క రాసి పెట్టీ వెళ్ళిపోయారు..


ఆకలి వేయడంతో ఇంట్లో తినడానికి ఏమి లేదు. వేతకగా మ్యాగీ ప్యాక్ దొరికింది.. అది వండుకొని తింటూ సెల్ఫీ వీడియో ఆన్ చేసుకొని "నేనవరో ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. నా గురించే న్యూస్ ఛానల్ నుండి సోషల్ మీడియా వరుకు కోడై కూస్తున్నారు. చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని భావిస్తు దానికోసం నిరంతరం శ్రమిస్తూ అయ్యాను. దానిలో భాగంగానే నేను మొదటగా స్కూల్ చేస్తూ కాలేజ్ వరుకు రాగలిగాను. నా మీద నింద వేసిన అమ్మాయి నా స్టూడెంట్. నా కన్నబిడ్డ తో సమానం. ఓ రోజు తను దాహం వేస్తుందని క్లాస్ బయటకి పర్మిషన్ తీసుకోని వెళ్ళింది. నేను పంపాను..

ఇంతలో నన్ను రమ్మని ఆఫీసు నుంచి పిలుపు రావడంతో ఆఫీస్ రూం కి వెళ్తూ ఆ అమ్మాయి కోసం చూశాను.. వాటర్ కాన్స్ వద్ద తను లేదు. నేను ఆఫీస్ కి వెళ్లకుండా తనని వెతుకుతూ వెళ్ళాను.. తానేమో క్లాసెస్ వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ అబ్బాయి తో చనువుగా ఉంది. అది చూసి నేను కోప్పడ్డాను. వాళ్ళ పేరెంట్స్ తో చెప్తానని బెదిరించాను..


ఇకపై ఇలాంటి తప్పులు చేయమని వారు చెప్పగానే నేను కూడా మందలించి వదిలి పెట్టేసాను. వారు కూడా

మారినట్టు గా ఆ క్షణం నన్ను నమ్మించారు. ఆ తరువాత కూడా వారిలో ఎటువంటి మార్పు లేదు. రెండు మూడు సార్లు ఆ ఇరువురుని చూడకూడని స్థితిలో చూశాను.. ఇంక లాభం లేదనుకొని కాలేజ్ ప్రిన్సిపల్ కి వారి తల్లిదండ్రులకు చెప్పలనుకున్నా. కానీ ఇంతలో ఆ అమ్మాయి తన డ్రెస్ ను చింపేసుకొని జుట్టు చెల్లచెదురు చేసుకొని తన గోళ్ళతో మొహం పై గీరుకొని ఏడుస్తూ అరుస్తూ గోల చేసింది..


ఇన్నాళ్లు నేను ఏంటో తెలిసిన వారు, నా ఇంట్లో వారితో సహా నన్ను ఎవరు నమ్మలేదు.. కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేనేమీ చెప్తున్న వినలేదు. జైల్ నుండి బయటకి వచ్చిన ప్రతి క్షణమూ నన్ను ఇన్నాళ్ళు గౌరవించిన వారు నేడు తూటాలు లాంటి వారి మాటలతో హింసించారు.. నా అనుకున్న నా సొంత ఇంట్లో వాళ్ళు సైతం నన్ను నమ్మలేదేమో నేను వచ్చేలోపు ఇంటిని వదిలి పెట్టి వెళ్ళిపోయారు.


కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. మా బంధం ఇకపై కొనసాగదు అంటు ఉత్తరం ముక్క పెట్టేసి వెళ్ళారు.

నా చుట్టూరా ఉన్న ప్రపంచం ఒక్కసారిగా తల కిందులైంది. ఇంకెందుకు నేను బ్రతకడం అనిపించింది.


‘ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ రోజు ప్రశాంతంగా కూర్చొని తినలేదు. అందుకే ఇష్టమైంది వండుకొని తిని చనిపోవాలని అనుకున్నా కానీ ఇంట్లో ఏమి లేవు.. నేను లేని క్షణంలో ఇరుగు పొరుగు వారు నా భార్య బిడ్డలను ఎంతగా వెలివేశారో అర్థమైంది. అందుకే దొరికిన ఈ మ్యాగీలో ఎలుకుల మందును కలుపుకున్నా. అది తింటున్నా’ అంటూ మొత్తం తినేశాడు. నాణేనికి ఇంకోవైపు ఉన్నట్టుగా ప్రతి సంఘటన వెనకాల మనకి తెలియని ఇంకో కోణం ఉంటుంది..


దురదృష్టం ఏమిటంటే తప్పు జరిగిందంటే ఆడవారికి మద్దతునిచ్చే ఈ సమాజం మగవారి మాటలకు ఎందుకు విలువ ఇవ్వరు..

ఇక ఉంటాను, సెలవు’


అంటు వీడియో ఎండ్ చేశాడు. తన ఇంట్లో అనాథగా శవంలా ఓ నాలుగు రోజులు పడి ఉన్నాడు. పోలీసులు రావడం, వీడియో చూడటం, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి అసలు నిజమెంటో తెలుసుకోవడం ఆటోమాటిక్ జరిగిపోయాయి.. ఫైనల్లీ అమ్మాయి తప్పు చేసిందని తెలిసింది. తన తప్పు లేకుండానే అటు సమాజం దృష్టిలో, కుటుంబం దృష్టిలో చెడ్డవాడిగా ముద్ర పడి ప్రాణాలను విడిచిన ఆ టీచర్ కి జీవితమే అంతం అయింది..
చిన్నప్పటి నుంచి మనం తరచుగా వినే మాటలు..


‘ఛీ.. ఛీ.. సిగ్గు లేదు అమ్మాయిలాగా ఏడుస్తున్నావు.. నువ్వు అబ్బాయివి రా!!!!’


‘ఏం అబ్బాయి ఏడవకూడదా.. వారికి ఎమోషన్స్ ఉండకూడదా!!!! ఏ ఎమోషన్ అయిన సరే చూపించాలి. అప్పుడే కదా మనమెంటో మనకి తెలిసేది.. బాధ తగ్గేది.. ఇలా ఎమోషన్స్ దాచుకోవడం వల్లే కదా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి..’‘ఒంటి మీదకి ఇన్ని ఏళ్లు వచ్చాయి. ఇంకెప్పుడు పెళ్ళి చేసుకొని ఓ ఇంటి వాడు అవుతావు..’


‘కొన్ని సార్లు వారికున్న బాధ్యతల వల్ల ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. అది అర్థం చేసుకోరు జనాలు.. ఎన్నెన్ని మాటలు అంటారు పాపం..’


‘మా భారం అంత నీదే రా.. నువ్వే మమ్మల్ని చూసుకోవాలి’ అంటు తెలియకుండానే బంధాల బాధ్యతల వల్ల ఇరుకు పోయేలా చేసేస్తారు.. ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకున్న ఏవి చెప్పనివ్వరు.


మగవారు కొన్ని పనులే చేయాలంటూ రూల్స్ పెడతారు..


. పెళ్ళాం కంట్రోల్ పెట్టకోలేక పోతున్నావు నువ్వేమి మగాడు వి రా.. ’


‘ఈ మాట అనడానికి సిగ్గు లేదు.. అమ్మాయి మోసం చేసిందా!!!!. అంటు తమ వారే సూటి పోటి మాటలతో విసిగిస్తున్నారు.


‘నువ్వేదో చేసి ఉంటావు. అందుకే కదా పెళ్ళైన ఏడాదికి మీ ఆవిడ విడాకులు కోసం కోర్టుకు ఎక్కింది’

అంటారు. అసలు నిజం ఎవరికి తెలీదు..


ఆడవారికే కాదు మగవాళ్ళను కూడా అబ్యూజ్ చేసే వారున్నారు.. ఇవి నమ్మినా నమ్మకపోయినా నేడు ఎక్కడో ఒక్క చోట జరుగుతూనే ఉంది..మగవారి కోసమే Dr. జెరోమీ తీలక్సింగ్ (Dr Jerome Teelucksingh) వాళ్ళ నాన్న గారి పుట్టిన రోజున నవంబర్ నెల 19 వ తేదీన మెన్స్ డే చేయాలని అన్నౌస్ చేశారు.. దీని ముఖ్య ఉద్దేశ్యం కొడుకుగా, భర్తగా, సోదరుడు గా, స్నేహితుడుగా నిరంతరం తోడుగా ఉంటూ బాధ్యతల మధ్య ఇరుకొన్ని విపరీతమైన ఒత్తడి మధ్య నలుగుతూ, శారీరకంగా, మానసికంగా అలసిపోతు హెల్త్ విషయంలో కేర్ గా ఉండాలని, తమ గురించి కేరింగ్ గా ఉండాలని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

*****

N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.42 views0 comments

Comments


bottom of page