మృగరాజు సందేశం - పుస్తకావిష్కరణ
- Patrayudu Kasi Viswanadham

- Apr 22
- 5 min read

Mrugaraju Sandesam - Book Unveiling ceremony |Patrayudu Kasi Viswanadham
మృగరాజు సందేశం - పుస్తకావిష్కరణ | పట్రాయుడు కాశీవిశ్వనాథం
Published In manatelugukathalu.com On 22/04/2026
ఘనంగా ‘మృగరాజు సందేశం’ పుస్తకావిష్కరణ
***************************************
తేదీ 20-04-2026న సాయంత్రం 5 గంటలకు శృంగవరపుకోటలోని ప్రముఖ A.V.N. కళాశాల ప్రాంగణంలో A.V.N. విద్యాసంస్థల చైర్మన్ శ్రీ అరిగి దేవుడు గారి ఆధ్వర్యంలో శ్రీ కాశీవిశ్వనాథం పట్రాయుడు గారి ‘మృగరాజు సందేశం’ నీతి కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. శ్రీ అరిగి దేవుడు గారు పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయం అందించడమే కాక ఆహూతుల మధ్య ఘనంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రచయిత కాశీవిశ్వనాథం దాత దేవుడు గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది, గేదెల సత్యం మరియు ఆహ్వానితులు పాల్గొన్నారు. గేదెల సత్యం మాస్టారు ‘మృగరాజు సందేశం’ కథల పుస్తకాన్ని పరిచయం చేస్తూ బాలలకు ఉపయుక్తమైన నీతి కథలను అందించిన కాశీవిశ్వనాథం అభినందనీయుడన్నారు. ఈ పుస్తకంలోని కథలన్నీ ప్రచురితమై పలువురి ప్రశంసలు పొందినవే అని రచయితను, పుస్తక ప్రచురణకు సహకరించిన దాత అరిగి దేవుడు గారి దాతృత్వాన్ని కొనియాడారు.
1. కమ్మని కథలు.. చక్కని నీతులు
*********************************
ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తకాలకు, ముఖ్యంగా మాతృభాషలోని కథలకు దూరమవుతున్న తరుణంలో, కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు అందించిన "మృగరాజు సందేశం" ఒక చల్లని చిరుగాలి వంటిది. సుమారు 39 వైవిధ్యభరితమైన కథలతో కూడిన ఈ సంపుటి పిల్లల మనసులను రంజింపజేయడమే కాకుండా, వారిలో నైతిక విలువలను పెంపొందించేలా తీర్చిదిద్దబడింది.
ఈ పుస్తకంలో పక్షులు, జంతువుల కథల నుండి సామాజిక అంశాల వరకు ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కేవలం నీతిని బోధించడమే కాకుండా, హాస్యం మరియు కుతూహలాన్ని కలిగించేలా కథలు సాగడం వల్ల పిల్లలు ఎక్కడా విసుగు చెందకుండా చదవగలరు.
ముఖ్యంగా "అమ్మ మాట - బంగారు బాట", "కమ్మనైన అమ్మ భాష" వంటి కథల ద్వారా మాతృభాష ప్రాముఖ్యతను, తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన గౌరవాన్ని రచయిత ఎంతో సున్నితంగా వివరించారు.
ప్రతి కథ చివరలో అంతర్లీనంగా ఒక సందేశం ఉంది. స్వార్థం వీడటం, పట్టుదల, సమయస్ఫూర్తి వంటి లక్షణాలను కథల ద్వారా నేర్పించడం విశేషం.
"అల్లరి అంజు", "చింటూ కోరిక" వంటి కథలు నేటి పిల్లల ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తాయి.
ప్రతి కథకు పెట్టిన శీర్షిక ఆ కథను చదవాలనే ఆసక్తిని పెంచుతుంది.
"మృగరాజు సందేశం" కేవలం పిల్లల కోసమే కాదు, పెద్దలు కూడా తమ బాల్యాన్ని గుర్తుచేసుకునేలా ఉంది. ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకు ఇది ఒక చక్కని బహుమతి.
మన సంస్కృతిని, భాషను, విలువలను తర్వాతి తరానికి అందించడానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో అవసరం.
సరళమైన శైలిలో, చక్కని నీతిని బోధించే కథలను అందించిన రచయిత కాశీ విశ్వనాథం పట్రాయుడు గారి కృషి అభినందనీయం.
శుభాకాంక్షలతో....
నారంశెట్టి ఉమామహేశ్వరరావు
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత.
నా మనసులో మాట (రచయిత)
******************************
బాల్యం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో పిల్లల మనసులను రంజింపజేస్తూనే, వారికి నైతిక విలువలను అందించడం నా ప్రధాన ఉద్దేశ్యం. ఈ కథల సంపుటి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే కాదు, ప్రతి కథ వెనుక ఒక లోతైన ఆలోచన, ఒక చక్కని సందేశం దాగి ఉంది.
ఈ పుస్తకంలోని కథల విశిష్టత పక్షులు, జంతువులే పాత్రలుగా ప్రకృతి ఒడిలో సాగే ఈ కథలు పిల్లల్లో పర్యావరణం పట్ల ప్రేమను పెంచుతాయి.
ప్రాణం విలువ ఏమిటో తెలిపే గండుచీమ కథ అయినా, పిల్లల అల్లరిలో ఆనందాన్ని వెతుక్కునే పెద్దవారి మనసులైనా మానవత్వపు గొప్పతనాన్ని చాటిచెబుతాయి.
క్రమశిక్షణ, సోమరితనాన్ని వీడటం, మన పనులు మనమే చేసుకోవడం వంటి అంశాలను 'మృగరాజు సందేశం', 'తల్లి పిచ్చుక' వంటి కథల ద్వారా నేటి తరం పిల్లలకు అర్థమయ్యేలా వివరించడం జరిగింది.
ఆటపాటల ద్వారా చదువును ఎలా ఆస్వాదించవచ్చో 'చిలుకమ్మ చెప్పిన పాఠం' వివరిస్తుంది. అలాగే మహనీయుల జీవితాలను ఎలా స్ఫూర్తిగా తీసుకోవాలో 'మాస్టారి మాట' కథ తెలియజేస్తుంది.
ఈ కథలన్నీ వివిధ ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమై పాఠకుల మన్ననలు పొందినవి. నా ఈ చిన్న ప్రయత్నం పిల్లలను చక్కని పౌరులుగా తీర్చిదిద్దడంలో తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.
నా కథలన్నీ సంపుటిగా తీసుకురావడానికి ఆర్థిక సహాయం అందజేసి ప్రోత్సహించిన శ్రీ అరిగి దేవుడు, చైర్మన్, A.V.N. విద్యాసంస్థలు, శృంగవరపుకోట వారి సహకారం మరువలేనిది. వారికి సర్వదా కృతజ్ఞుడను.
కాశీవిశ్వనాథం పట్రాయుడు (బాల మిత్ర)
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu Kasi Viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷




















Comments