top of page

మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం


'Mudu Mulla Bandham Edadugula Anubandham' - New Telugu Story Written By Sumathi Thaduri

'మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం' తెలుగు కథ

రచన: సుమతి తాడూరి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

'తెంచుకుంటే తెగిపోతుందా, దేవుడు వేసిన బంధం, తెలుసుకో నీ జీవిత గమ్యం, తెంచుకోమ్మ అనుబంధం'.. అంటూ పాట రాగానే, fm బంద్ చేసింది రోజా.


‘ఈ పాట ఏదో నా సిచుయేషన్ కి తగ్గట్టు ఉంది. ఇప్పటికే ఎటూ తెల్చుకోలేక పోతున్నా. ఈ పాట వినగానే తలనొప్పిగా ఉంది. నందిని ఆల్రెడీ పార్క్ కు వచ్చేసి ఉండొచ్చు’ అనుకుంటూ తొందరగా జింకల పార్క్ కు వచ్చింది రోజా.


అక్కడ నందిని ని చూడగానే హాయ్ చెప్పి హాగ్ చేసుకొని, గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంది రోజా.


“ఏమైందే.. ఎందుకు ఏడుస్తున్నావు, ఫస్ట్ నువ్వు ఆ ఏడుపు ఆపి, ఏం జరిగిందో చెప్పు.. ” అంది నందిని.

“నేను, కిరణ్ ’విడాకులు’ తీసుకుంటున్నాము, రేపే కోర్ట్ లో కేస్!”


"విడాకులా? అదేంటే.. అదేదో ఫ్లాట్ తీసుకుంటున్నాము అన్నంత సింపులుగా చెప్తున్నావ్.. “ అంది నందిని ఆశ్చర్యం తో..


“నేను ‘లవ్ మ్యారేజ్’ చేసుకున్నాను. నీకు తెలుసుకదా”


“ఆ తెలుసు, అయినా నువ్వే చెప్పావు కదా, కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని, చాలా హ్యాపీగా ఉన్నావని” అని నందిని అనగానే, “అవునే అన్నాను, పెళ్లి అయిన కొత్తలో హ్యాపీగానే ఉన్నాము. తరువాత ఆ హ్యాపీ నెస్ తగ్గుతు వచ్చింది. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ, పెళ్లి తర్వాత ఉండదు. ఇద్దరూ పిల్లలు పుట్టాక, ఉన్న కాస్త ప్రేమ పోయింది. నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో.. నేను మాట్లాడినా ‘ఊరికే సోది ముచ్చట్లు చెప్పకు’ అంటాడు.


రోజూ పొద్దునే లేచి, ఇంట్లో పని అంతా చేసుకొని, పిల్లలను రెడీ చేసి, స్కూల్ కు పంపి, కిరణ్ నీ ఆఫిస్ కు పంపి, తర్వాత పని అంతా అయ్యే సరికి మధ్యాహ్నం ఒకటి అవుతుంది. సరే.. కిరణ్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. కిరణ్ రాగానే తనని చూసిన ఆనందములో నా శ్రమ అంత మరచి పోతాను. ప్రేమగా ఎన్నో కబుర్లు చెప్పాలనుకుంటాను. తనేమో నోరు విప్పుడు. నా పాటికి నేనే లొడలొడా వాగుతూ ఉంటాను.


ఎప్పుడు చూడు.. ఆ సెల్ చూస్తూ ఉంటాడు. అన్నము తినేటప్పుడు సెల్, టీవీ చూసిన, బాత్ రూమ్, లో ఉన్న ఎప్పుడూ సెల్లే. ఏమైనా అంటే తిడతాడు. నాకు ఇంట్లో నేను ఒక్కదానినే ఉన్నట్టు అనిపిస్తుంది. పిచ్చి లేస్తుంది. ఇంకా పిల్లలు ఎంత ఆగం చేసినా వాళ్ళను ఏమీ అనొద్దు అంటాడు. అప్పుడు నన్నే తిడతాడు.


పిల్లల ముందు కూడా నన్ను తిట్టే సరికి, వాళ్ళకు కూడా భయం లేకుండా పోయింది. ఇలా రోజు చిన్న, చిన్న గొడవలు, చిలికి చిలికి గాలి వాన పెద్దదైనట్టు, మా మధ్య గొడవలు కూడా పెద్దవయ్యాయి. ఆ గొడవలు కాస్తా విడాకులకు దారి తీసాయి..


కానీ నా మనసు అందుకు ఒప్పుకోవట్లేదు.

మేము చేసే తప్పు కు పిల్లలకు శిక్ష పడకూడదు కదా! అందుకే ఆలోచిస్తున్నా! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు అయితే మంచి సలహా ఇస్తావని, నీ దగ్గరకి వచ్చా నందిని” అంది రోజా.


“అవును నువ్వు చెప్పేవి అన్నీ నిజాలే కావొచ్చు. కానీ ఇవి ప్రతి ఇంటిలోనూ ఉండే తగువులే. అయిన పెళ్లి కి ముందు ఉన్న ప్రేమ, పెళ్లి తర్వాత లేదు అన్నావు. ఐస్క్రీమ్ పార్లల్, సినిమా థియేటర్, పార్కులలోనూ తిరిగితూ, రోజుకు పది సార్లు ఐ లవ్ యు చెప్పుకుంటారు అది పెళ్ళికి ముందు ప్రేమ..


కానీ పెళ్లి తర్వాత ప్రేమ బాధ్యతగా మారుతుంది. రోజుకు ఒక్కసారి ఐ లవ్ యు చెప్పకున్నా, మనకోసం భర్త చేసే ప్రతి పని ప్రేమే, పిల్లలను నువ్వు కొడితే, వాళ్ళకి నీ మీద ప్రేమ తగ్గుతుందని, వాళ్ళని ఏమి అనకు అంటాడు. అంతేకానీ, వాళ్లపై నీకు హక్కు లేదని కాదు. ఏదైనా మనం అర్ధం చేసుకొనే దానిలోనే ఉంటుంది.


పెళ్లి అనేది అది ఒక గొప్ప కావ్యం.

ఎంత చదివినా, ఇంకా అర్ధం కాని పుస్తకమే.

దాన్ని ఓర్పు తో చదవాలేగాని, అందులో బంధాలు, అనుబంధాల, ప్రేమానురాగాలు ఉంటాయి.

మూడు ముళ్లతో, ముడి పడిన, బంధం, ఏడడుగుల సంబంధముగా మారుతుంది..


ఈ రోజుల్లో బాగా అందరికి అలవాటైపోయింది.. తొందరపడి పెళ్లి చేసుకుంటారు, ఆలోచన లేకుండా విడిపోతున్నారు..

నువ్వు ఆ తప్పు చేయకు రోజా. ఈసారి మీ మధ్య గొడవ జరిగినప్పుడు, కిరణ్ ఏమన్నాడు, అన్నది పక్కన పెట్టి అందులో నీ తప్పు ఎంత ఉందో ఆలోచించు. అప్పుడు నీకు అర్ధం అవుతుంది. వెళ్ళు! సారీ చెప్పి చిన్న నవ్వు, నవ్వు.. ఇంకెప్పుడు మీకు గొడవలు రావు” అంది నందిని.


“సరే నందిని.. నువ్వు చెప్పినట్టే చేస్తా. బాయ్” అని చెప్పి ఇంటోకొచ్చింది రోజా.


రాత్రి అంతా నందిని చెప్పిన మాటలు, ఆలోచిస్తూ పడుకుంది..

తెల్లవారింది..


కోర్ట్ లో ఇద్దరూ ఓ ఆరు నెలలు కలిసి ఉన్నాక విడాకులు ఇస్తామని చెప్పారు.


నా కోసం పిల్లలకోసం ఇంత కష్టపడుతున్నాడు, అని తెలుసుకొని, కిరణ్ కి నచ్చినట్టుగా ఉంది రోజా..


రోజా లోని మార్పు చూసి, తన తప్పు తెలుసుకొని, కిరణ్ కూడా రోజాని అర్ధం చేసుకొన్నాడు.


రోజాతో పిల్లలతో సండే, సండే టైమ్ స్పెండ్ చేసే వాడు..


ఓ ఆరు నెలల తరువాత..

ఇద్దరూ విడాకులు రద్దు చేసుకోని, పెళ్లి లోని పరమార్థం, దాంపత్యం లోని అనురాగం తెలుసుకొని అనందముగా ఉన్నారు కిరణ్, రోజా.


***శుభం***


సుమతి తాడూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/sumathi

నా పేరు :సుమతి తాడూరి

నా భర్త పేరు నాగరాజు, పురోహితం చేస్తాడు.


నాకు చిన్నపటి నుండి కథలంటే ఇష్టం, ఎందుకంటే అందుకు కారణం మా అమ్మ, రోజు పడుకునేటప్పుడు కథలు చెప్పేది, అలా నాతో పాటే నాలోని ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది ,చందమామ, భేతాళ, విక్రమార్క కథల బుక్స్ చదివేదాన్ని, అలా నాలోను సొంతముగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. 9 వ తరగతిలోనే కథలు రాయటం మొదలుపెట్టాను. కొన్ని కథలు, సీరియల్ రాశాను. కొన్ని ఆర్థిక ఇబ్బందులు/నాకు ఎవ్వరి సఫోర్ట్ లేకపోవడం, వలన ప్రచురణ కాలేదు.


కానీ నా భర్త నాకు ఫోన్ కొనిచ్చాక, రెండు కథలు రాశాను. నేను రచయిత్రి కావాలన్నదే నా జీవిత ఆశయం.


86 views0 comments
bottom of page