'Na Alludu Super' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 07/11/2023
'నా అల్లుడు సూపర్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
తెల్లవారింది.. ఫోన్ గట్టిగా మోగుతుంది.. ఎవరా? ఇంత పొద్దున్నే అని పద్మ ఫోన్ తీసి చూసింది. నెంబర్ చూడగానే, గాబరాగా ఫోన్ ఎత్తింది పద్మ.
"హలో... సరళ! ఏమిటి ఫోన్ చేసావు? అంతా బాగానే ఉంది కదా!"
అవతల ఏడుస్తున్న గొంతుతో కూతురు సరళ...
"అమ్మా! ఆయన ఇంట్లో కనిపించట్లేదే! నాకు చాలా భయంగా ఉంది"
"ఎక్కడకి వెళ్తారు.. ఇల్లంతా చూడు.. బాత్రూం లో ఉన్నారేమో?"
"చూసాను.. లేరు. ఆయనకు వాకింగ్ కు వెళ్ళే అలవాటు కుడా లేదు"
"రాత్రేమైనా గొడవ పడ్డారా సరళ?"
"కొంచం గట్టిగా మాట్లాడాను అంతే! నువ్వు వెంటనే రా అమ్మా! నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు!"
"సరే.. ఇప్పుడే వస్తున్నాను!"
పద్మ కు ఏకైక సంతానం సరళ. పద్మ భర్త చనిపోయి చాలా కాలం అయింది. కూతురిని అల్లారు ముద్దుగా పెంచింది పద్మ. తండ్రి క్రమశిక్షణ లేకపోవడం తో, సరళ చాలా మొండిగా తయారైంది. చదువుకున్న తెలివైన అమ్మాయే, కాని తన మాటే ఎప్పుడూ వినాలనే ఒక అహం తనది. ఇలాంటి అమ్మాయికి, పద్మ చాలా జాగ్రతగా, మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసింది. అల్లుడు మంచివాడు, తెలివైనవాడు, అన్నీ తెలిసిన వాడు, సర్దుకు పోయే గుణం ఉన్నవాడు.
పద్మ ఉండేది అదే ఊరిలో. ఒక గంట లో సరళ ఇంటికి చేరుకుంది.
"అమ్మా! ఆయన ఇంకా ఇంటికి రాలేదు .. నాకు చాలా భయంగా ఉంది"
"అసలు ఏమైందో.. నాకు చెప్పు తల్లీ!"
"ఇంట్లో అన్ని విషయాలు ఆయనే చూస్తారు.. నన్ను ఎప్పుడూ ఏమీ అనరు. నేను వంట మాత్రమే చేస్తాను. ఈ మధ్య ఉద్యోగం లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి.. అసలు టైం ఉండట్లేదు.. వంట సరిగ్గా చేయట్లేదనీ, తనని పట్టించుకోవట్లేదనీ అంటున్నారు. ఉద్యోగం, ఇల్లు రెండు మేనేజ్ చెయ్యలేకపోతున్నానని.. నన్ను జాబ్ మానెయ్యమన్నారు.
ఇంట్లో ఉండి, నన్ను బాగా చూసుకో.. చాలు.. నువ్వు ఉద్యోగం చెయ్యకపోయినా పర్వాలేదు.. ఎందుకు ఇబ్బంది పడతావు?" అని చాలా సార్లు అన్నారు.
"నువ్వు ఏం చెప్పావు మరి?"
"నేను ఉద్యోగం మానడం జరగదని చెప్పాను"
"ఇంట్లో నేను చెప్పినట్టే.. ఆయన వినాలని అంటున్నానని బాధ పడుతున్నారు. ఎక్కువ పనులు ఆయనే చేస్తారు. కానీ, నేను ఆయన మాట కు విలువ ఇవ్వట్లేదని, అందరి ముందు ఆయనను తిడతానని, చులకనగా మాట్లాడతానని అంటారు. ఇంకా, నేను ఆయనతో సరిగ్గా ఉండట్లేదని.. ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. పెళ్ళి చేసుకున్నది హ్యాపీ గా ఉండడానికే.. అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా ఎప్పుడూ ఆయనని హ్యాపీ గా ఉంచమని అడుగుతారు"
"ఒక్కటి చెప్పనా సరళ! అల్లుడు తేజ గురించి, నీకన్నా నాకే బాగా తెలుసు. తేజ చాలా మంచి వాడు, తెలివైన వాడు. అన్నిటికీ మించి, ప్రతీది ఒక పద్దతిగా చేస్తాడు. పనులు మేనేజ్ చెయ్యడంలో ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా చాలా ఎక్స్‌పర్ట్ అని నాకు తెలుసు. నువ్వు ఆయన చెప్పినట్టు చెయ్యడమే కరెక్ట్. నీకు అన్ని విషయాలు తెలుసునని అనుకోవడం తప్పు. అంత పద్దతి గల మనిషి తనలో తానూ నలిగిపోతాడు గానీ, ఎవరినీ ఏమీ అనడు.. అనాలని అనుకోడు కూడా. ప్రేమించే పెళ్ళామే తన మాట వినకపోతే, ఎంత బాధ పడతాడు చెప్పు! ఆయనకు మాత్రం ఎవరు ఉన్నారు.. నీకైనా నేను ఉన్నాను.. కానీ, ఆయన తన బాధ ఎవరితో చెప్పుకుంటాడు చెప్పు.. నువ్వు ఇలా ఉంటే!
అల్లుడు చెప్పినట్టు విని, లైఫ్ ని ఎంజాయ్ చెయ్యి సరళ! ఇప్పుడు కుడా, మీ అయన ఇలాగ ఇల్లు వదిలి వెళ్ళే మనిషి కాదు. దేనినైన ఎదుర్కునే మనిషి అతను. నా అల్లుడు సూపర్ అని చెప్పగలను’.
ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. సరళ వెళ్ళి తలుపు తీసింది.
"ఏమండీ! వచ్చేసారా!" అని ఎమోషనల్ గా వెళ్లి భర్త ని పట్టుకుంది సరళ.
"నన్ను క్షమించండి! మిమల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు.. మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను.. "
"ఏమిటి ఇంత ప్రేమ.. ఒక్కసారిగా నా మీద సరళ!"
"నువ్వు కొంత సేపు కనిపించపోయేసరికి.. ఉండలేకపోయింది అల్లుడూ! అంతే!"
"నేను మీ మాటే వింటాను.. మీరు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి!" అంది సరళ.
"సరళా! నా మాట ఎప్పుడూ వినమని చెప్పట్లేదు. పరిస్థితి, అవసరం, అనుభవం బట్టి చెయ్యమని చెబుతున్నాను అంతే! ఏది చెప్పినా, ఎలా చేసినా.. మనం హ్యాపీ గా ఉండడానికే నేను చూస్తాను. నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా చెప్పు! నా ఫ్రెండ్ అర్జెంటు గా రమ్మంటే వెళ్ళాను.. నీకు మెసేజ్ చేసే టైం కుడా లేదు! నా ఫోన్ తీసుకుని వెళ్ళలేదు.. అందుకే నువ్వు కంగారు పడ్డావేమో!"
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comentarios