top of page
Original.png

నిజాయితీ

5 hours ago
2 min read

బొబ్బిలి సంస్థానంలో రాము యాభై బంగారు నాణేలను లక్ష్మీపతికి తిరిగి అందిస్తున్న దృశ్యం – నిజాయితీ తెలుగు నీతి కథ

Nijayiti - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

నిజాయితీ - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 23/09/2026


“నిజాయితీ” రాళ్లబండి సంగం నాయుడు గారు రచించిన చక్కని తెలుగు నీతి కథ. బొబ్బిలి సంస్థానంలో ఆర్థిక వ్యవహారాల ఉద్యోగం కోసం ఎంపికైన రాము, సోములకు సంస్థాన పెద్ద లక్ష్మీపతి ఒక ప్రత్యేకమైన పరీక్ష పెడతాడు. యాభై బంగారు నాణేలు కావాలని చెప్పి, వారికి వంద నాణేలు ఇవ్వడం ద్వారా వారి నిజాయితీని పరీక్షిస్తాడు. డబ్బు, బాధ్యత, నమ్మకం వంటి విషయాల్లో నిజాయితీ ఎందుకు ముఖ్యమో పిల్లలకు, పెద్దలకు చక్కగా తెలియజేసే ఈ కథ మంచి నీతిని అందిస్తుంది.


అనగనగా బొబ్బిలి సంస్థానం. ఆ సంస్థానం ఆర్థిక వ్యవహారాలు చూసే రామయ్య మరణించడంతో ఆ ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. బొబ్బిలి సంస్థానం ఆర్థిక కార్యకలాపాలు చూసే ఉద్యోగం కోసం ప్రకటన వేశారు. సంస్థానం అవసరాల కోసం ధనం ఖర్చు చేయటం, చేసిన ఖర్చుకు సరైన జమా ఖర్చుల లెక్కలు రాసే యువకులు కావాలనడం ఆ ప్రకటన సారాంశం. ఆకర్షణీయమైన జీతముంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు. సంస్థానంలో నౌకరీ కాబట్టి చాలా మంది యువకులు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు.


సంస్థానం ఆర్థిక వ్యవహారాల ఉద్యోగం కాబట్టి సంస్థాన పెద్దయిన లక్ష్మీపతి అభ్యర్థులను స్వయంగా పరీక్షించాడు. అన్ని రకాల పరీక్షల తర్వాత రాము, సోము అనే ఇద్దరు యువకులు సరిసమానంగా పోటీలో నెగ్గారు. ఇద్దరికీ ఉద్యోగం వచ్చిందని లక్ష్మీపతి ప్రకటించాడు.


“మీ ఇద్దరికీ చెరో యాభై బంగారు నాణేలు ఇస్తాను. సంస్థానానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి, జమా ఖర్చుల చిట్టాను వారం రోజుల్లోగా తయారు చేసుకురండి,” అన్నాడు. ఇద్దరికీ చెరో బంగారు నాణేల మూట ఇచ్చాడు. ఆ ఇద్దరు యువకులు మూట తీసుకుని ఇంటికి చేరారు.


ఇంటికెళ్లి చూడగా రాము మూటలో వంద నాణేలు ఉన్నాయి. ఒక ఉద్యోగానికి ఇద్దరు ఎంపికయ్యారనడం, వంద నాణేలిచ్చి యాభై అనడం రాముకు అనుమానంగా తోచింది. ఇదేదో తమకు లక్ష్మీపతి పెట్టిన చివరి పరీక్ష అనుకున్నాడు. యాభై నాణేలతో నిత్యావసర సరుకులు కొని చిట్టా తయారు చేశాడు. మిగిలిన యాభై నాణేలను ముట్టలేదు; లక్ష్మీపతికి అందించాడు.


సోము అలా కాకుండా యాభై నాణేలతో సరుకులు కొని, మిగిలిన యాభైంటిని సొంతానికి వాడుకున్నాడు. లక్ష్మీపతి వంద నాణేలు ఇచ్చినట్టు మరచిపోతాడనుకున్నాడు సోము. సోము యాభై నాణేలకు మాత్రమే లెక్క చూపించాడు.


చివరికి లక్ష్మీపతి ఇలా అన్నాడు: “మీ ఇద్దరి నిజాయితీని పరీక్షించడానికి వంద నాణేలిచ్చి యాభై అన్నాను. రాము మిగిలిన యాభై నాణేలు తెచ్చి అప్పజెప్పాడు. వంద నాణేలు ఇచ్చినట్టు నాకు తెలీదనుకుని సోము సొంతానికి వాడుకున్నాడు. మనిషికి నిజాయితీ ప్రాణంగా ఉండాలి. నిజాయితీ పరీక్షలో నెగ్గిన రాముకే ఈ కొలువు.”


ఆ రోజే రాము ఉద్యోగంలో చేరిపోయాడు.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page