top of page
Original.png

అందరూ డైరెక్టర్లే!

4 minutes ago
2 min read

“అందరూ డైరెక్టర్లే!” తెలుగు వ్యంగ్య రచనకు సంబంధించిన చిత్రం. ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తుండగా, మరో వ్యక్తి ఏ పని చేయకుండా డైరెక్టర్‌లా కూర్చుని సూచనలు ఇస్తున్నట్లు చూపించారు.

Andaru Directarle - Telugu Inspirational Article | Kotha Viritha

అందరూ డైరెక్టర్లే! తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 23/09/2026


విజయం వస్తే “నేను ముందే చెప్పాను!”, వైఫల్యం వస్తే “నా మాట వినలేదు!” అంటూ రెండు పరిస్థితులకీ సిద్ధంగా ఉండే ఈ సలహా డైరెక్టర్లపై సరదాగా సెటైర్ చేసే కొత్త విరిత రచన “అందరూ డైరెక్టర్లే!”



వీళ్ల దగ్గర స్క్రిప్ట్ ఉండదు, కెమెరా ఉండదు, పని ఉండదు. కానీ “యాక్షన్… కట్! ” చెప్పడంలో మాత్రం వీళ్లను మించినవాళ్లు ఉండరు. 


పని చేయడం చేతకాదు… కానీ పని ఎలా చేయాలో చెప్పడంలో మాత్రం వీళ్లకు పీహెచ్‌డీ ఉంటుంది. 


“ఇలా చేయాలి… అలా చేయకూడదు” అంటూ ఉచిత సలహాల ఇస్తుంటారు. ఇంట్లోనూ, బయటా ఇలాంటి డైరెక్టర్లు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. వాళ్ల చేతికి పని ఇస్తే "కారణాలు" వస్తాయి… ఇంకొకరి చేతిలో పని ఉంటే "సూచనలు" వస్తాయి. 


పని చేసే మనిషి చెమటోడుస్తుంటే, వీళ్లు పక్కన నిలబడి "ఉషో.. . ఇది కూడా రాదా" అన్నట్లు చూస్తారు. చేసేవాడికి సమస్యలు కనిపిస్తాయి… చేయనివాడికి మాత్రం తప్పులు మాత్రమే కనిపిస్తాయి. 


పని సక్సెస్ అయితే“నేను ముందే చెప్పాను కదా! ” అంటూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటారు. 


ఫెయిల్ అయితే “నేను అలా చేయొద్దని ముందే చెప్పాను! ” అంటూ బాధ్యతను బయటకు పంపిస్తారు. 


అంటే… విజయం వస్తే వీళ్ల డైరెక్షన్… వైఫల్యం వస్తే నీ డెసిషన్! 


చేసే "పని" అనే సినిమా హిట్టా… ఫట్టా… వీళ్లకు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే రెండు పరిస్థితులకీ డైలాగ్ ముందే సిద్ధంగా ఉంటుంది. 


హిట్టయితే “నా ప్లాన్. ” ఫట్టయితే “వాళ్లు నా మాట వినలేదు. 


”పని చేయకుండా ప్రభావం చూపించడం ప్రపంచంలోనే చవకైన మేనేజ్‌మెంట్ టెక్నిక్. సలహా ఇవ్వడం సులువు… కానీ ఆ సలహా ఫలితానికి బాధ్యత వహించడం మాత్రం అసలైన కష్టం. 


అందుకే కొందరు జీవితాంతం డైరెక్టర్లుగానే ఉంటారు తమ జీవితానికి మాత్రం యాక్షన్ చచ్చినా చెప్పరు. 


"మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి డైరెక్టర్లు ఉండే ఉంటారు కదా! "



***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page