top of page

ఒకరిని మించి ఒకరు


'Okarini Minchi Okaru' - New Telugu Story Written By Pitta Gopi

'ఒకరిని మించి ఒకరు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రాం సాధారణ జీవితం గడుపుతూ పెద్ద బిజినెస్ మేన్ గా, ఆ పై పెద్ద వ్యాపారవేత్త గా ఎదగాలని కలలు కనే వారిలో ఒకడు.


చాలా తెలివైనవాడు కావటంతో ఆ కలలు కన్న వారిలో సాకారం చేసుకునే సత్తా ఉన్న కొద్ది మందిలో అతను ఒకడు.


బిజినెస్ మేన్ గా కొనసాగుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఎక్కడ ఏ విధమైన అవకాశాలు దొరికినా.. వదలకుండా లాభాల కోసం, తన బిజినెస్, తన విలువ అందరికీ తెలిసేలా పనులు చేయటం రాం కి వెన్నతో పెట్టిన విద్య.


అలాగే రాం కి రోజూ తెల్లవారి న్యూస్ పేపర్ చూసే అలవాటు ఉంది. దాని ద్వారా ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.


ఎప్పుడూ మంచి వ్యాపార పద్దతులతో లాభాలు ఆర్జిస్తూ పేరు తెచ్చుకోవటమే కాక ఇరుగు పొరుగు వ్యాపారస్తులకు సహయం చేస్తూ.. వార్తల్లో నిలవటం అతని ప్రత్యేకత.


అలా అలా రాం తన వ్యాపారాలను ఎంతో కష్టంతో, నిజాయితీ తో చాలా ఏళ్ళు కొనసాగించి జాతీయస్థాయిలో వ్యాపారం చేసే వరకు వచ్చాడు.


రాం పేరు దేశమంతా మారుమోగింది. ఇప్పుడు తాను దేశంలో పేరు గాంచిన వ్యాపారస్తుల్లో ఒకడు. పైగా నిజాయితీ పరుడు కూడాను.


డబ్బు కు కూడా ఏ ఇబ్బందులు లేకపోవడంతో రాంలో ఏదో మార్పు మొదలైంది.


రాం తానే గొప్పవాడినని సాధారణ స్థాయి నుండి ఈ స్థానంలో ఉన్నానని పెద్ద పెద్ద వేదికలపై పదే పదే చెప్పుకుని గర్వపడే వాడు. ఒకరోజు జాతీయ స్థాయి మీడియా కు ఇంటర్వ్యూ ఇస్తూ..


"దేశంలో మీ కంటే గొప్పవారు లేరని అనుకుంటున్నారు కదూ? నిజంగా ఎవరైనా ఉన్నారా" అని అడిగితే

"నిజంగా నేను గర్వపరుడిని కానీ.. నా కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. నిజంగా నాకు తెలిసి వాడే గొప్పవాడు" అన్నాడు రాం.


"ఎవర"ని వాళ్ళు అడగగా రాం ఇలా చెప్పాడు.


"నా కంటే వ్యాపార మెలుకువలు ఇంకెవరైనా నేర్చుకుంటారని ఎవరికీ చెప్పేవాడిని కాదు. ఒక దశలో నేను నా కంటే గొప్పవాడు ఉండడని, అసలు ఉండకూడదు అని మనసులో అనుకుని ఇక్కడితో ఆగకుండా అంతర్జాతీయ స్థాయిలో నా వ్యాపారం కొనసాగాలని నిర్ణయించుకున్నాను.


అలా నా పలుకుబడి తో వ్యాపార అడుగులు అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళే ప్రయత్నం మొదలుపెట్టాను


అలా ఒకరోజు పరాయి దేశం వెళ్తూ... విమానాశ్రయం లో నా సిబ్బంది తో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది.


విమానాశ్రయం లో నేను అత్యవసరం గా న్యూస్ పేపర్ చూడవల్సి వచ్చింది.


విమానం రాక ఆలస్యం కావటంతో అక్కడే ఓ పేపర్ బాయ్ దేవాన్ష్ ని నా సిబ్బంది పిలిపించగా నేను అతని వద్ద ఒక పేపర్ తీసుకున్నాను.


కానీ.. నేను పెద్ద బిజినెస్ మేన్ కావటంతో నా వద్ద న్యూస్ పేపర్ కి కావాల్సని కావాల్సిన పది రూపాయల చిల్లర నా వద్ద లేదు.. సిబ్బంది ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఏం చేయాలో తోచలేదు. చిల్లర సమస్య వలన న్యూస్ పేపర్ ని తిరిగి ఆ పేపర్ అమ్ముకునే కుర్రాడి కి ఇచ్చేశాను.


కానీ ఆ పేపర్ బాయ్ మాత్రం నన్ను అర్థం చేసుకుని


"చిల్లర లేని కారణంగా మీరు ఈ న్యూస్ పేపర్ తిరిగి ఇచ్చేశారు కదా సార్. ఈ పేపర్ మీకు ఉచితంగా ఇస్తున్నాను తీసుకోండి సార్" అన్నాడు.


"నీకు నష్టం రాదా మరీ.. " అని నేను అడిగితే


"పోతే నాకు పదిరూపాయలు పోతాయి కానీ.. అత్యవసరంగా మీ కోరిక తీర్చినందుకు నాకు వచ్చే ఆనందం మాత్రం కలకాలం ఉంటుంది సార్. తీసుకోండి, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు పెద్ద వ్యాపారవేత్త అని నేను ఎప్పుడూ పేపర్లో చూస్తుంటాను. ఆల్ ది బెస్ట్ సార్" అన్నాడు.


తర్వాత నేను ఎక్కువ లాభాలతో తిరిగి వచ్చాక అదే విమానాశ్రయం లో మరలా అతను పేపర్లు అమ్ముతూ కనిపించగా ఈసారి తనకు ఇవ్వాల్సిన చిల్లర తో పాటు అతడికి సహాయం గా కొంత డబ్బు ఇచ్చాను కానీ ఆ కుర్రాడు సున్నితంగా తిరష్కరించాడు.


"ఏమ"ని అడగ్గా..


"నేను కేవలం సహాయం మాత్రమే చేశాను. ఏదో ఆశించి చేయలేదు. పైగా నా సహాయానికి మీ సహాయం ఎలా సరితూగుతుంది సార్".. అన్నాడు.


"ఎందుకు సరితూగదు" అని నేను ప్రశ్నించాను.


"నేను కఠిన పేదరికంలో ఉండి కూడా బతుకు తెరువుకోసం పేపర్ అమ్మితే కానీ బువ్వరాని పరిస్థితి లో మీకు సహాయం చేశాను.


మీరు మాత్రం దేశంలో గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకడిగా ఇక్కడి నుంచి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప లాభాలు పొంది వచ్చాక సహాయం చేస్తున్నారు. చూడండి.. ఇప్పుడు చెప్పండి ఎవరి సహాయం గొప్ప" అని ప్రశ్నించాడు. దెబ్బకి నా బుర్ర కు తెలివి వచ్చింది " అన్నాడు.


అలా రాం జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో పేపర్ బాయ్ ప్రస్థావన చెప్పి


"నా కంటే నిజంగా అతనే గొప్పవాడు. సహాయం చేయడానికి తమ పరిస్థితులు అడ్డు కాకూడదు. ఏ పరిస్థితి లో ఉన్నా.. ఏమీ ఆశించకుండా సహాయం చేశామా లేదా అన్నది కావాలి.


జీవితంలో మనిషికి నిజంగా అర్థం చేసుకునే మనసు ఉండాలి కానీ.. తాను పేదరికంలో ఉన్నానని, ఎవరికీ సహాయం చేయలేననే వ్యధ ఉండనే ఉండదు. ప్రతి మనిషి తన జీవితంలో తనకు తానే గొప్పవాడు అనుకుంటాడు కానీ..


ఒకరికి మించి ఒకరు గొప్పవాళ్ళు ఉంటూనే ఉంటారని, ఎదుగుతున్న కొలది పుట్టుకొచ్చిన నా యెక్క గర్వాన్ని ఒక పేపర్ బాయ్ రూపంలో గొప్ప వ్యక్తి నాకు కళ్ళు తెరిపించాడని, ఇక నుంచి నేను నా గర్వాన్ని అనుచుకుంటున్నాను అని, నా కంటే గొప్పవాడైనా ఆ కుర్రాడికి ఇప్పుడు, ఎప్పుడు నేను జీవితంలో రుణపడి ఉంటా "నని చెప్పాడు రాం.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం




29 views0 comments

Comments


bottom of page