top of page

ఒంటరి మహిళ - మనోధైర్యం!





ఈమధ్య కొందరు ఒంటరి మహిళలను కలుసుకున్నాను. ఒంటరి అంటే పెళ్లికాని వారు అని కాదు. పెళ్లి ఐనవారే! విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోతే ఒక్కరూ వున్నవారు..

 

 విడాకులు తీసుకుంటే ఏ ఉద్యోగమో ఉంటుంది. అందువలన వ్యాపకం ఉంటుంది. వీరు వయసులో చిన్నవారే ఐవుంటారు. వారికి పిల్లల తోడు, వారి బాధ్యత ఉంటుంది కనుక జీవితం గడిచిపోతుంది. 


 కానీ భర్త చనిపోయిన వారు, వయసు మళ్ళిన సీనియర్ సిటిజన్స్ పరిస్థితే ఇబ్బందికరం. సమయం గడవదు, పనిచేయలేరు. పిల్లలు విదేశాల్లో ఉండేవారు కొందరు. సిటీలోనే వున్నా ( కారణాలు చెప్పరు), పట్టించుకోరు. విడిగావున్నా ఓకే బిల్డింగ్లో దగ్గిరలో వుంటే పర్వాలేదు. ఒకరు యూసఫ్ గూడాలో వుంటే ఇంకొకరు మెహదీ పట్నంలో వుంటారు. 


ఇలాంటివారికి సహాయ సహకారాలు అందించే సంస్థలు వచ్చాయి. సర్వీస్ చేసే కేర్ టేకర్లును పంపుతారు. వీరు ఇంట్లోనే వుంటారు. వారిని కుటుంబ సభ్యులుగా చూడాలి. ఐతే వాళ్ళు పర్మనెంటుగా వుండరు. మారిపోతూ వుంటారు. వాళ్ళ పని పధ్ధతి అలవాటై, ‘పర్వాలేదు’

అనుకునే సరికి ఏదో కారణం చెప్పి మారిపోతారు. 


 చేసేదిలేక అలాగే సర్దుకుపోతుంటారు. పిల్లలు బంధువుల్లా ఏడాదికి ఒకసారి వచ్చి వారం రోజులుండి వెళ్ళిపోతారు. ఆస్తులు ఉంటే ఒక బాధ, లేకుంటే మరోబాధ. వాటిని మైంటైన్ చేయడం మరోతలనొప్పి. 


ఇప్పుడు భారతదేశంలో అందరి ఆర్ధిక పరిస్థితి బాగానే వుంది.. కానీ ఒంటరితనం వేధిస్తోంది. వృద్ధులకు నర్సింగ్ సర్వీస్ చేసేవారు వారుకూడా ఉన్నారు. చాలామంది వారినే ఆశ్రయిస్తున్నారు. 


స్వంత అపార్ట్మెంట్ ఉంటే వృద్ధాశ్రమాలు అవసరంలేదు. ఇలాంటిచోట ఉండటానికి మానసికంగా అనాధ ఐనట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎందరో తోడు వుంటారు.... అంటారుకాని పెద్ద వయసులో అందరితో సరిపడదు. పిల్లలే సరిపెట్టుకోనప్పుడు పరాయివారితో ఎలా కలసి ఉండగలరు! ఇది అర్ధం చేసుకోవాలి. 


డిమెన్షియా అల్జిమార్స్ వంటి జబ్బులువస్తే రీహాబిటేషన్ సెంటర్లు కూడా వున్నాయి. 'ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా పరిస్థితులు భారతదేశంలో కూడా వచ్చాయి'. డబ్బువుంది కనుక ఎవరో ఒక కేర్ టేకర్ను నియమించుకుంటే బెటర్. అన్నిరకాల సేవలు అందుబాటులో వున్నాయి. విదేశాలనుంచి '' ఎవరికివారే యమునాతీరే'' అనే గొప్ప కల్చర్ని చక్కగా నేర్చుకున్నాం. 


పిల్లలు - తల్లితండ్రులమధ్య అనుబంధాలు అవసరానికి మాత్రమే పనికివస్తున్నాయి. అవసరంతీరి ఎవరిదారిన వారువుంటే కొంత వయసువరకూ ఎవరిమీదా ఆధార పడక్కరలేదు. చాలామంది ఒంటరిగా ఉండటం కనబడుతోంది. ఒక్కరూ ఎలావుంటారు? అని అడగక్కరలేదు

ఈరోజుల్లో. అభినందించాలి. 


 ఆరోగ్యం కాపాడుకుంటూ ఉన్నచోటే స్నేహితులను కలుసుకుంటూ మనకంటూ వ్యాపకం కల్పించుకోడం, భవితను గురించి ఎలా ఉంటామో అనే భయానక ఆలోచన చేయకపోవడం, పరిస్థితులనుబట్టి నిర్ణయం తీసుకోడం ఒక్కటే మార్గం. అంతేకాని ఇలా ప్లాన్ చేస్తాను... అనుకోడానికిలేదు. అన్ని సమయాల్లోనూ ప్లాంస్ కుదరవు. 


మా బంధువు ఒకరు భర్త చనిపోతే అమెరికా వెళ్ళిపోదామని అంటా రెడీ అయ్యారు. సడన్గా సిక్ అయ్యారు. డాక్తర్దగ్గిరకు వెడితే క్యాన్సర్ అని తెలిసింది. ఇక ట్రీట్మెంట్ కోసం ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అన్నగారు చూడాల్సి వచ్చింది. ఇటు అన్నకు భారంగా వుండలేదు. అటు అమెరికా వెళ్లలేని స్థితి. ఆవిడ ప్లాను ఇలా విఫలం ఐనది. ఇప్పుడు ‘వేరే అపార్ట్మెంట్ రెంటుకి తీసుకుని కేర్టేకర్ను కుదుర్చుకుందాం, ట్రీట్మెంట్ ఎంతకాలం పడుతుందో’ అని అనుకుంటోంది. 


అందువలన పరిస్థితులనుబట్టి నడుచుకోవాలి. అమెరికా వెళ్లినా చాలా కష్టం. అక్కడ పనివాళ్ళు చాలా కర్చేకాదు ఉద్యోగాలు మానుకుని కొడుకు కోడలు ఎన్నిరోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు? కుదిరేపని కాదు. మారుతున్న జీవిత విధానం వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది కొందరికి. దీనికి పరిష్కారం ఆరోగ్యంగా ఉండటం ఒక్కటే. మన గురించి మనమే..


ఆరోగ్యమే మహాభాగ్యం, బహుపరాక్ !


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)






53 views0 comments

Comments


bottom of page