ఆపరేషన్ కుంకుమ
- Penumaka Vasantha
- Jun 6
- 4 min read
#పెనుమాకవసంత, #PenumakaVasantha, #OperationKunkuma, #కుంకుమ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Operation Kunkuma - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 06/6/2024
ఆపరేషన్ కుంకుమ - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
టివిలో న్యూస్ వస్తుంటే.. కళ్ళప్పగించి చూస్తుంది శర్మద.
"బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ కుంకుమ అని సనాతన ధర్మాన్ని ప్రోత్సహించటం కోసం నుదుటన కుంకుమ బొట్టు చేతిలో కుంకుమ భరిణె తీసుకుని తిరుగుతున్న రాథా గోవిందదాసు.
ఆయన ఎక్కడ ఆడపిల్లలు కనపడినా వాళ్ల నుదుటిన కుంకుమ ధారణ చేస్తున్నాడు. కాలేజీ పిల్లలు మేము వేసుకునే ప్యాంట్ షర్టులకు ఎక్కడ ఇది మ్యాచింగ్!" అంటూ కొందరు ధర్నాకు దిగారు.
దీని గురించి రాధా గోవిందుదాసును, ఆయన ఆపరేషన్ కుంకుమ గురించి అడిగి తెలుసుకుందాము..
"మీరు ఎందుకు? ఇలా చేస్తున్నారు?"
"మర్చిపోతున్న సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా. తల్లులు పిల్లలకు చెప్పటం లేదు. అందుకే నేనే ఒక అడుగు ముందుకు వేసి ఇలా చేస్తున్నా.!"
"ఇపుడు వీళ్లు సరే.. మరి ఆడవాళ్లే బొట్టు పెట్టుకోవటం లేదు కదా వారిని ఏం చేస్తారు?"
"వాళ్లకు ఇదిగో కుంకుమ పెట్టుకోమని ఇస్తున్నా!" అంటూ తన దగ్గర ఉన్న కుంకుమ భరిణె చూపించాడు.
మరి వాళ్ళు తిట్టుకోవడం లేదా? కొంతమంది తీసుకోకుండా వెళ్తున్నారు. కొంతమంది తీసుకుని పెట్టుకుంటున్నారు.
ఇది ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ ను చూసి మీరు దాన్ని అనుకరిస్తున్నారు అనుకోవచ్చా?
"అలా అనుకున్నా నాకు నష్టమేమీ లేదు. ఇపుడు దీన్ని చూసి ఒకరకంగా ప్రభావితుడినీ! అయ్యానని చెప్పటంలో
ఏ మాత్రం సంకోచించను? ఇలా చేయాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇపుడు నాకు
అవకాశం దక్కింది. ఉద్యోగ బాధ్యతలు తీరి ఇపుడు ఇంట్లో కూర్చున్నాను.
పొద్దున బస్టాప్లో సాయంత్రం, కాలేజీల దగ్గర ఉండి నా మనవరాళ్ల వయసు ఉండే.. ఆడపిల్లలకు
బొట్టు పెడుతున్నా. కొంచం పెద్ద వయసు మహిళలకు బొట్టు చేతికి ఇస్తున్నా. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. లేనివాళ్ళు లేరు. అయినా ఈ ఉద్యమాన్ని నేను పోయేంతవరకూ కొనసాగిస్తా. నా ఈ కుంకుమ ఉద్యమాన్ని
చూసి కొంతమందైనా మారితే నాకు సంతోషం."
"అయితే మీ కుంకుమ ఉద్యమానికి ఆపరేషను కుంకుమ అని పెట్టుకోవచ్చా?"
"మీరు ఏదైనా పెట్టుకోండి కానీ ఈ ఉద్యమాన్ని వేరే రకంగా దుష్ప్రచారం మాత్రం చేయకండి. మారుతున్న యువతకు
మన సనాతన విలువలు తెలియజేయాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నం."
ఇంతలో కాలేజి నుండి వచ్చిన శర్మద కూతురు మనస్విని టివిలో గోవిందదాసునుచూస్తూ "అమ్మా! మొన్న నీకు చెప్పానే.. ఈ తాతగారే! నాకు కుంకుమ పెట్టింది. కుంకుమ పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు కూడా చెప్పారు. జుట్టు విరబోసుకకూడదని చెప్పారు.
నువ్వు నాకు జడ వెయ్యి ఇక రోజు..! నేను రోజు కుంకుమ పెట్టుకుంటాను. యూనిఫారం లేని రోజుల్లో పట్టులంగా
ఓణి వేసుకుంటాను."
శర్మద మొగుడు "పెట్టుకో తల్లి! తల్లితండ్రులం మేము చేయలేని పనులు ఆయన చేస్తున్నందుకు ఆయన్ని మెచ్చుకోవాలి" అన్నాడు.
శర్మదను చూసి "నువ్వు కుంకుమ పెట్టుకో ఆ స్టిక్కర్ మానేసి. అప్పటికే కుంకుమ పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు గోవిందదాసు చెప్పటం విని ఉండటం వల్ల అలాగే అని తలూపింది శర్మద.
ఒకటిరెండు రోజులు అందరూ గోవిందదాసు పనులు విసుగ్గా అనిపించినా అందరూ పాటించడానికి ప్రయత్నిస్తున్నారు.
అలా చేస్తున్న వాళ్లకు దాసు భగవద్గీత పుస్తకాలు పంచుతున్నాడు.
"ఇది చదివితే..మీరు జీవితాన్ని ఎలా డీల్ చెయ్యాలి.
తెలుస్తుంది. రోజుకు పది పేజీలు చదవండి! లార్డ్ కృష్ణా మోటివేషనల్ స్పీకర్. మీరు చేయవలసిన కర్తవ్యాలను బోధిస్తాడు. మీరు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో
ఈ బుక్ చదివితే మీ తలరాత మారుతుంది. అర్జునుడుకు లైఫ్ కోచ్ గా మారి మోటివేట్ చేసింది ఎవరనుకున్నారు? లార్డ్ కృష్ణా!"
జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని ఇచ్చి మనకు ముందుకు వెళ్ళటానికి దారి చూపే.. ఈ భగవద్గీత ముఖ్యంగా యువత చదవా”లంటూ
యువతను జాగృతం చేస్తున్న ఈ కుంకుమదాసుని అభినందిద్దాము.
"మీ ఉద్యమం ఇంత బాగా హిట్ అవ్వటంవల్ల తదుపరి మీ కార్యక్రమం ఏంటి?"
"నా కార్యక్రమము మగవాళ్ళకు కూడా కుంకుమ పెట్టటం. "
అదేంటి ఆడవాళ్ళకు కుంకుమ పెట్టటం కదా మీ ఉద్యమం. ఇపుడు మగవాళ్ళకు కూడా పాకారు ఏంటి?"
అదా అసలు సనాతన ధర్మాలు అందరూ పెట్టుకోవాలి అని చెప్తున్నపుడు మరి మగవాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు?
అసలు మన పూర్వీకుల ఫోటోలు చూస్తే వాళ్ళు ఎంతోమంది బొట్టు పెట్టుకున్నట్లు వుంటుంది. మనల్ని పాలించిన రాజులు కూడా తిలక ధారణ చేసినట్లు చరిత్రలు చెప్తున్నాయి. మరియు చిత్ర కారులు గీసిన రాజుల చిత్రాలను చూస్తే మనకు తేట తెల్లం అవుతుంది.
"అయితే ఇపుడు మీ ఆపరేషన్ కుంకుమ ఆల్ అని చెప్పొచ్చు కదా?"
"చెప్పుకోండి దాంట్లో తప్పేముంది?"
ఇంకా నా ప్రచారానికి చేయూతను ఇవ్వండి." అన్నాడు దాసు.
"కొంతమంది నాస్తికులు మిమ్మల్ని చాందస కుంకుమ దాసు అని మిమ్మల్ని తిడుతున్నారు. వాళ్ళకు మీ సమాధానం ఏంటి?"
"చాందస కుంకుమ దాస్ చాలా బావుంది పేరు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే. మన పూర్వీకులు మనకు కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు ప్రవేశపెట్టారు. మరి వాళ్ళు యోగా చేస్తున్నారు కదా. మరి అది కూడా ఋషులు ఏర్పర్చిందే. వాళ్ళు యోగాను ఫాలో అయ్యేప్పుడు మరి మిగతా వాటిని ఫాలో అవ్వాలి కదా?
మనం ఏమి కష్టపడి వేటిని కనుక్కోలేదు. మన యోగులు, ఋషులు కష్టపడి మనకు కొన్ని ధర్మాలు, ఏర్పరిచారు. వాటిని ఫాలో అయితే చాలు. ఇక నేను వాళ్లతో వాదించి గెలవాలని లేదు. అంత తీరిక కూడా లేదు."
ముందు స్కూల్స్ కాలేజీల దగ్గర మగపిల్లలకు కుంకుమ పెడుతున్నాడు. వద్దని నిరాకరించినా ఇతర మతస్తులకు
పెట్టకుండా ఒకే అంటున్నాడు. కొంతమంది ఇతర మతస్తులు కూడా కుంకుమ దాసుని చూసి ఉత్తేజితులై..
కుంకుమ పెట్టించుకున్నారు.
ఇపుడు ఆఫీసులకు వెళ్లి కుంకుమ విలువ గురించి ఆఫీసర్స్ కు చెప్పి వస్తున్నాడు. వాళ్ళు..! మా క్లయింట్లులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము ఇలా కుంకుమ
పెట్టుకుంటే.. మాతో డీలింగ్స్ నడపరు?"
ఇవన్నీ అపోహలు మాత్రమే. నిజం చెప్పాలంటే.. ఎవరి ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో? వాళ్ళనే మనం నమ్ముతాం. వాళ్ళు మీరు మీ ధర్మాన్ని పాటిస్తే.. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తారు. కన్నతల్లి ని ధర్మాన్ని మార్చని వాళ్లకు ఎపుడు గౌరవం ఉంటుంది. ఒకవేళా వాళ్ళు మీతో మీ ధర్మము పట్ల వ్యతిరేకతో మీతో బిజినెస్ మానుకుంటే వాళ్ళకే నష్టం.
మీ గుడ్ విల్ చూసి రావాలని కానీ నీ మతాన్ని చూసి కాదు. ఇంకా కొంచం ముందుకు వెళ్ళి వాళ్ళ మతాలను ఎలా? గౌరవిస్తున్నారో మీరు అలాగే.. మా సనాతన మతాన్ని గౌరవిస్తాం అని చెపితే ఏమి చెయ్యలేరు? మీదగ్గర
నాణ్యత వుంటే కుంకుమ పెట్టినా వస్తారు?" అంటూ హితబోధ చేస్తున్నాడు దాసు.
ఇపుడు ఆఫీసుకు కూడా కుంకుమ విధిగా పెట్టుకుని మగవాళ్ళు వెళ్తున్నారు. దాసుకు ఇపుడు కుంకుమ దాసు అనే పేరు స్థిర వచ్చింది.
రెండు రాష్ట్రాలు మొత్తం తిరిగి దీన్ని ప్రచారం చేయటం వల్ల ఇపుడు కుంకుమదాసును అందరూ గౌరవిస్తున్నారు.
ఇది చూసి కుంకుమ దాసును మగవాళ్ళు "ఆపరేషన్ చీరలు అనే ఉద్యమాన్ని చేపట్టండి" అని చెప్తున్నారు.
"అది స్త్రీలు చేయవలసిన ఉద్యమము. నా పని కా”దని తెలివిగా చెప్పి తప్పించుకున్నాడు కుంకుమదాసు.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments