'Pancha Bhuthalu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'పంచ భూతాలు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
పృథ్వి, జల, తేజో, వాయు, ఆకాశము- ఈ ఐదు జీవుల మనుగడకు ఆధారము. వీటినే పంచభూతాలు అంటారు. ఈ ఐదింటిలో ఏది లేకున్నా జీవి బతుకుట అసాధ్యము. ఇందులో ఆకాశము పెద్దన్న లాగ తక్కిన నాల్గింటిని తనలో ఇముడ్చుకొని జీవ కోటిని పోషిస్తున్నది.
ఇక కథ లోకి వస్తె.. ఐదుగురు అన్న దమ్ములలో నారాయణ పెద్దవాడు. తలిదండ్రులు తనకు అప్పగించి పోయిన నలుగురు తమ్ములను ఎంతో ప్రేమతో పోషిస్తుంటాడు. నలుగురు తమ్ముల పేర్లు వరుసగా రాఘవ, ప్రదీప్, ప్రసాద్, వినోద్. నారాయణ తానొక్కడే సంపాదనకు పూనుకొని తమ్ములు కష్ట పడకుండ విద్యా బుద్ధులు నేర్పిస్తుంటాడు, తలిదండ్రులు లేని లోటు కనపడకుండ.
ఎట్లైతె పంచ భూతాలలో ఆకాశమే బాధ్యత తీసుకొని తక్కిన నాలుగు భూతాలనే కాక సృష్టి లోని ముల్లోకాలను, నక్షత్రాలను, గ్రహాలను తనలో ఇముడ్చుకొని ఇక దేనికీ స్థానము లేదను లోటు కలుగనీయకుండా ఉన్నట్లే .. నారాయణ తనకు చేతనైనంత వరకు వికలాంగులకు, వృద్ధులకు, అశక్తులకు సహాయము చేస్తుంటాడు సార్థక నామధేయుడై.
తమ్ములు పెరిగి పెద్దవారై సంపాదనాపరు లయినంత వరకు తాను పెళ్ళి కూడ చేసుకోడు నారాయణ. అప్పటికే నలుబది ఏండ్లు దాటిన నారాయణను చూసి కృతఘ్నులు కాకుండా నలుగురు తమ్ములు నారాయణకు హరిప్రియ అనబడు అమ్మాయితో వివాహము జరిపించి ఆవదిననే కన్న తల్లిగా భావించి మనుగడ సాగిస్తుంటారు. తమ్ములు తనపై చూపిన ఆదరాభి మానాలకు మురిసి పోతాడు నారాయణ.
నారాయణ తమ్ములు నలుగురికి . రాఘవకు రమ్యతో, ప్రదీప్ కు పావనితో, ప్రసాద్ కు లావణ్యతో, వినోద్ కు రాగిణి తో వివాహము జరిపించుతాడు. తమ్ములకు ఒక మాట చెబుతూ ఈ పుడమిలో మనము పుట్టి పెరిగినందులకు మనకు చేతనైనంత వరకు ఆర్తులకు సహాయము చేయడము మన విధి పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు అని బోధిస్తాడు.
ఎప్పుడూ కృతజ్ఞత మరువ కూడదు. ఉదాహరణకు ప్రకృతిలో చెట్లు మొక్కలు కదులకున్న వాటి సంపదైన పండ్లు, కాయలు, పూలు మనకందిస్తాయి ఇది వాటి కృతజ్ఞతా భావము. రంతి దేవువుడు ఏమన్నాడంటె అందరికి అన్ని దానము చేసి తాను నీళ్ళు మాత్రమే తాగబోతుండగ ఒక బిచ్చగాడు వస్తె-
అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి
త్రాగుమన్న- రావన్న- శరీర ధారులకు ఆపద వచ్చిన
వారి యాపదల్ గ్రన్నన మాన్పి వారికి సుఖంబులు
జేయుట కన్న యొండు మేలున్నదె నాకు దిక్కు
పురుషోత్తముడొక్కడె సుమ్మి పుల్కసా—
అయితె ఇప్పుడు మీరందరు చిన్న వాళ్ళు కారు. లోక జ్ఞానము తెలియక కాదు. అయినా చెప్పడము నావిధి- ఎట్లైతె రాముడు అతని ముగ్గురు తమ్ములు కూడా కొంతే తేడాతో ఒకే నాడు పుట్టినా రాముడు మాత్రము తమ్ములకు హితబోధ చేస్తూ ఉంటాడు.
ఇది విన్న తరువాత “అన్నా! నీ మాట ఎప్పుడూ కాదనము” అని నలుగురు తమ్ములు ముక్త కంఠముతో అంటారు.
అయితె వారి భార్యల వలన గాలి వీయడము, భూమి కంపించడము, సముద్రములో తూఫాను, ఎండల వేడి ఇత్యాది ప్రకృతి విపత్తు మాదిరిగా కలతలు వచ్చి పోతుంటాయి. ఇది రుధిర భేదము- ఎట్లంటె అన్నదమ్ములందరు ఒకే రక్తము పంచుక పుట్టుట చే వారి స్వభావములో అంత మార్పు రాదు- భార్యలు వేరు వేరు ప్రదేశాల నుండి రావడము చే వారి మనస్తత్వాలు వేరుగా ఉంటాయి అదే ప్రకృతి లక్షణము.
పెద్దవాళ్ళై ఆస్తులు సంపాదించినా తల్లి దండ్రులు మిగిల్చి పోయిన ఇంటిని ఇంకా పెద్దగా కట్టించి ఐదుగురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు.
వారి పచ్చని కాపురానికి చిచ్చు పెట్టబోక ఏరాండ్లందరూ కలిసి మెలిసే ఉండ సాగారు.
ఐదుగురిలో ఏ ఒక్కరికి కష్ట నష్టాలు వచ్చినా తమకే వచ్చినట్టు భావించి తక్కిన వారందరు సహకరించుతారు-
నోములు,వ్రతములు,పుట్టిన దినములు,పెళ్ళి రోజులు అన్ని అందరూ కలిసిమెలసే జరుపుకొంటారు.
వారిలోని అన్యోన్య భావమే వారి కుటుంబము పిల్లా పాపలతో సదా కళ కళ లాడుతూ ఉంటుంది.నరాయణను దక్షుణిగా భావించి ఆతని కనుసన్నలలో మెలుగుతారు.సంతానము పొందుట ప్రకృతి ధర్మమని భావించి అధికము కాకుండా నియంత్రణతో మెలుగుతారు.
అయిదుగురు అన్నదమ్ములు అన్యోన్యంగా ఉంటూ అందరికీ వారి శక్తి కొరకు సహకరిస్తుంటారు కనుక వారిని ప్రజలందరూ పంచభూతాలు అని పిలుస్తుంటారు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments