top of page
Original.png

పందెం

1 day ago
2 min read

రామ్‌లాల్ మీసాలపై సోమయ్య వేసిన సరదా పందెం – పందెం తెలుగు హాస్య కథ

Pandhem - Telugu Comedy Story | Varalakshmi Yanamandra

పందెం - తెలుగు హాస్య కథ | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 30/09/2026


“పందెం” వరలక్ష్మి యనమండ్ర రచించిన సరదా, హాస్యభరితమైన తెలుగు కథ.

స్నేహం, సరదా, మాటల చాతుర్యాన్ని మేళవించిన ఈ కథ కుటుంబ సమేతంగా చదవదగిన వినోదాత్మక కథ.


చందానగర్ బస్టాండ్ దగ్గర ఉంది రామ్‌లాల్ పాన్ షాప్. అతనికి రెండు గొప్పలు... ఒకటి పాన్, రెండు మీసాలు.


"ఇవి మా వంశపు పరువు" అంటాడు రోజూ.


పక్కనే సోమయ్య టీ కొట్టు. అతనికి ఈ మీసాల గోల నచ్చదు.


ఒక రోజు సోమయ్య అన్నాడు:


"రామ్‌లాల్, బెట్! నీ మీసాలు నేను వారంలో తీయిస్తాను."


"నా మీసాలా? ప్రాణం పోయినా తీయను! ఓడితే నెల రోజులు ఫ్రీ పాన్!"


బెట్ కుదిరింది ఇద్దరికీ.


మరుసటి రోజు నుంచి సోమయ్య ఎత్తులు మొదలెట్టాడు.


మొదటి రోజు వచ్చి, "రామ్‌లాల్, మున్సిపాలిటీ కొత్త రూల్. మీసాలుంటే పాన్ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ అట!"


రామ్‌లాల్ నవ్వాడు. "నమ్మను!"


రెండో రోజు, "నీ మీసాల వల్ల కస్టమర్లు తగ్గారట. పిల్లలు భయపడుతున్నారట!"


రామ్‌లాల్, "భయపడితే మానేయనీ, నా మీసాలు తీయను!"


మూడో రోజు సోమయ్య ఒక వంకర అద్దం తెచ్చాడు.


"ఒక్కసారి అద్దంలో చూసుకో! నీ కుడి మీసం పెద్దగా, ఎడమది చిన్నగా ఉంది. అందరూ నవ్వుకుంటున్నారు."


రామ్‌లాల్ అద్దంలో చూసుకున్నాడు. నిజంగానే తేడా కనిపించింది.


"అయ్యో! అవునా?"


"కొంచెం సమంగా కత్తిరిస్తే సరిపోతుంది" అన్నాడు సోమయ్య.


రామ్‌లాల్ కుడిది కత్తిరించాడు, ఇప్పుడు ఎడమది పెద్దదైంది. ఎడమది కత్తిరించాడు, మళ్ళీ కుడిది... ఇలా కత్తిరిస్తూ కత్తిరిస్తూ చివరికి రెండూ నున్నగా అయిపోయాయి!


సోమయ్య ఎగిరి గంతేశాడు. "బెట్ గెలిచా! ఫ్రీ పాన్!"


రామ్‌లాల్ క్షణంలో తేరుకున్నాడు.


"ఆగు! బెట్ ఏంటి? నువ్వు నా మీసాలు తీయిస్తానన్నావు. నేనే తీసుకున్నా, నువ్వు తీయలేదు కదా! అంటే నువ్వే ఓడావు!"


సోమయ్యకు నోట మాట రాలేదు.


చుట్టూ ఉన్న జనం గొల్లున నవ్వారు.


"భలే మాట! రామ్‌లాల్ మీసం పోయినా మెదడు పోలేదు!"


చివరికి ఇద్దరూ నవ్వుకుంటూ బెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ రోజు ఊరంతా ఫ్రీ పాన్, ఫ్రీ టీ!


వరలక్ష్మి యనమండ్ర✒️


 ***



వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page