top of page

పాణిగ్రహణం - 4


'Panigrahanam - 4' New Telugu Web Series



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో..

సాగరమేఖలకు వివాహం జరుగుతుంది.

కాపురానికి ఢిల్లీ వెళుతుంది.

ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక అబ్బాయి పుడతాడు.

కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల.

అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త.


ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 4 చదవండి.


"హలో!ఎక్కడున్నారు. "

"మీరెవరు?"

"నేను మీ ఆవిడ సాగరమేఖల పనిచేసే ఆఫీసులో పనిచేసే వాచ్ మెన్ ని, ఒక్కసారి ఆఫీసుకి రాగలరా!"

"ఇప్పుడా? నేనెందుకు?"

"మీ ఆవిడ.... ఆఫీసర్ తో నడిపే బాగోతం కళ్ళారా చూపిస్తా!"


"నో! నేనునమ్మను"

"నమ్మలేదుకాబట్టే చూపిస్తామనేది!...

ఎందుకైనా మంచిది.... ఓ పెగ్గు వేసుకుని రండి. ఈ ఘోరం మీరు చూడలేరు. "


ఫోన్ పెట్టేసి... ఎదురుగా ఉన్న క్లర్క్ సరోజ కి

బొటనవేలు పైకెత్తి థమ్స్ అప్ లా చూపించినవ్వి, ఆమె ఇచ్చిన నోట్లు జేబులో కుక్కుకుంటూ నవ్వాడు.

ఆడదానికి ఆడదేశత్రువు ఇంకోసారి బుుజువయింది.


ఎక్కణ్ణించి ఊడిపడ్డాడో సాగరమేఖల

మెుగుడు....

అతను నిజంగానే తాగివచ్చాడు. అతను రావటం చూసి, తలుపులు తాళం తీసారు.

ఆ తర్వాత అక్కడ జరిగిన బీభత్సకాండ... చూసేవాళ్ళకి, చూడవినోదం

చెప్పుకునే వాళ్ళకి చెప్పవినోదం...


నలుగురిలో ఇంత అవమానం జరిగాక... సాగరమేఖల ఆత్మహత్య కు పాల్పడింది.

స్ప్రహ లేని స్థితిలో ఉన్న సాగరమేఖలను

హాస్పటల్ కి తీసుకువచ్చాడు, విరూపాక్ష.


'అనుమాస్పద ఆత్మహత్యా ప్రయత్నం, అపస్మారక స్థితిలో.... అతివ' పేపర్లోఘోష.

పోలీసుకేసు అయింది.

ఆమెను స్ప్రహలోకి తేవటానికి.... నాలుగు గంటలపాటు శ్రమించారు డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పటల్ లో, పడిగాపులు పడి కూర్చున్నాడు. తల్లి కంటికి, మింటికీ, ఏకధారగా ఏడవటం చూడలేక, హాస్పటల్ లో ఉండనీయక, తెలిసిన వాళ్ళింట్లో ఉంచేసాడు.


పోలీసు ఎంక్వయిరీ లో, ఆఫీసులో ఎవరూ, "ఇది ఫామిలీ గొడవ... " అని సాక్ష్యం చెప్పటానికి నిరాకరించారు.

సాగరమేఖల మాత్రం "తప్పంతా నాదేనండీ ఆయన్నేం చేయకండీ. ఆయనకు ఏ పాపం తెలీదండీ... " అని వాగ్మూలం ఇచ్చింది.

అందరూ అవాక్కయ్యారు.


"అక్క బ్రతికిందిగా చాలండీ!" అంటూ సింపుల్ గా కేసుక్లోజ్ చేయించాడు విరూపాక్ష.

హాస్పటల్ లో "ఏంటక్కా ఇదంతా!?"

కన్నీళ్ళతో అడిగాడు.


"జీవితంరా! నేనూ లేక.... ఆయనా జైలుపాలయితే, పిల్లలు అనాధలవుతారు. పైగా, పోలీసుకేసులూ, కోర్టుకేసులూ ఓపట్టాన తేలతాయా? పిల్లలూ?.... "


"ఎందుకు? ఎలా ?ఎవరివల్ల జరిగిందో తెలుసుకుని, వాళ్ళ చెంపలు పగలగొట్టి, నిజం నిరూపించగలిగితే బాగుండేదిగా అక్కా! నేనూ సహాయపడేవాడినిగా! " అన్నాడు.


"నిజమే! కానీ ఓ అనుకోని సంఘటన జరిగినప్పుడు... జీవితం నాశనం అయిందే! అనే.... మానసికఒత్తిడిలో, ప్రతి మనిషీ వేసే రాంగ్ స్టెప్... ఆత్మహత్యా ప్రయత్నం...


నేనూ అతీతురాలినేం కాదు. నిజం నిలకడ మీద తేలుతుందిలే! ఆయనంతట ఆయనే తెలుసుకోవాలి... ఇన్నేళ్ళ కాపురం.... సాక్ష్యాలూ... ఆధారాలమీద నిలబెట్టుకోవాలా?.... 'కట్టె వంకర పొయ్యి తీరుస్తుందనీ'..... కాలమే తీర్పుచెబుతుంది

కానీ పశ్చాత్తాపపడుతున్నాను. "


"ఎందుకూ "

"ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు.

బ్రతికి ఉంటేనే కదా! నేను నిరపరాధినని నిరూపించుకునేదీ! నేనుపోతే లోకం వేసిననింద నిజమనేగా?! "


"మరి ఇంత తెలిసినదానివి!.... "

"బ్రతుకుతా... బ్రతికి చూపిస్తా "


చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సాగరమేఖలను బ్రతికించి ఇంటికి తీసుకురావటానికి.... విరూపాక్ష పడిన తపన, అందులో అతని పాత్ర చాలా క్లిష్టమైంది.

ఈర్ష్య, అసూయలు, మేనేజర్ కి ఆమె అంతదగ్గరవటం భరించలేని.... కొంతమంది

రాజేసిన అనుమానపు అగ్గి.... ఓ కాపురాన్ని కాల్చేసింది.


కానీ ప్రాణాలతో బయటపడ్డ సాగరమేఖల భర్తకు ఫోన్ చేసింది.


"ఏమండీ!ముగ్గురు పిల్లల తల్లిని. ఇలా నడిరోడ్డున పడేసిన, కారణాలు తెలుసుకోండి. ఆఫీసులో వాచ్ మెన్ దగ్గర నుండీ, ప్రతిఒక్కరినీ, వాళ్ళ భాషలోనే అడిగిచూడండి. నేను నిరపరాధిని అని మీకనిపించినప్పుడే, మీరు పిలిచినప్పుడే మళ్ళీ తిరిగివస్తా.... "

భర్త తో బంధం వదిలేసి, పుట్టింటికి వచ్చింది. అప్పటికి విరూపాక్షకు

చదువుపూర్తయి పెళ్ళిచూపుల ఏర్పాట్లు జరుగుతున్నాయ్.


ఎంతో ఉత్సాహంగా పెళ్ళి కార్యక్రమాలలో పాల్గొనాలని ఉన్నా, మనసుకు తగిలిన గాయం గుండెల్లో సూదుల్లా గుచ్చేస్తుంటే, ఏదో వెలితిని పూడ్చుకోటానికి అన్నట్లు, నవ్వుపులుముకుని, నటిస్తూ పెళ్ళిలో తిరుగుతోంది.

కానీ చుట్టాలుమాత్రం ఊరికే ఎందుకు వదులుతారూ?!


"క్యారెక్టర్ మంచిదికాదని మెుగుడు వదిలేసాడటగా!....

మరి!పిల్లలు అక్కడే ఉన్నారా?.... తెచ్చుకోకపోయిందా!? "

"వాళ్ళల్లో ఒక్కపిల్లనన్నా తెచ్చుకోక పోయావుటే! నీకు ఉపయోగపడేవాళ్ళుగా"

ముఖంమీదే అడుగుతూ....

సూటిపోటిమాటలతో గుచ్చిగుచ్చిపారేసారు.


పెళ్ళి తంతు పూర్తికాగానే ఈ ప్రశ్న విరూపాక్షా అడిగాడు.

"పిల్లలను తీసుకురమ్మంటావా? అక్కా!" అని. "తెచ్చి నేను ఎలాపోషించనురా?"

సాగరమేఖల ఏడ్చింది.


"మేమంతా లేమా?! అందరం కలిసి... "

"వద్దు విరూ! వాళ్ళని తెచ్చి, పోషించలేక, భరణంకోసం కేసువేసి, మళ్ళీ ఆయనే పోషించీ, వాళ్ళపోషణఎప్పుడైనా... ఆయనదే కదా?! అక్కడే ఉంటారు. వాళ్ళ బామ్మ ఉందిగా. చూసుకుంటుందిగా "


"నువ్వుండగలవా? వాళ్ళని వదిలీ!"

"ఏం చేయమంటావ్? 'తాదూరకంత లేదూ! మెడకోడోలనీ! 'నేను మళ్ళీ తేరుకుని ఉద్యోగం చూసుకుని స్థిరపడాలిగా! నువ్వు కొత్తగా పెళ్ళయిన వాడివి. నీ భార్య ఎన్నోకలలతో నీ జీవితంలోకివచ్చింది. కాపురానికి రాగానే! నేనూ, నా పిల్లలు ఆమెకు గుదిబండలు కాకూడదు. "


"అమ్మను, నీకు నీపిల్లలకూ తోడుగా ఉంచుతాను. మధ్య లో నేను చూస్తుంటాను అక్కా!"

"కృష్ణా రామా అంటూ కొడుకు దగ్గర రెస్ట్ తీసుకునే వయసులో అమ్మకు నేనూ, నాపిల్లలూ భారమేగా!... "


"పోనీలే అక్కా!పిల్లలను అక్కడే ఉంచితే బావ రెండో పెళ్ళి మాట ఎత్తడేమోలే !చూద్దాం "

"అవునురా! నువ్వు ఓ మంచి కొడుకుగా మంచిభర్తగా, ఉండు.... నేను హైదరాబాదు లో ఉద్యోగం చూసుకోటానికి వెడుతున్నాను. అక్కడికి దగ్గరలోనే, హంసమంజీర ఉందిగా! తనకి కష్టమేం కలిగించకుండా తన సహాయం తీసుకుంటా!"


"కాలోహి దురతిక్రమ: కాలాన్నుండి ఎవరూ తప్పించుకోలేరు. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నేను ఇక ఎలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలకూ పాల్పడనని మాటఇస్తున్నాను. అప్పుడప్పుడూ వచ్చిపోతూ ఉందాం అందరం" అంటూ కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ వెళ్ళిపోయింది.


అందుకే విరూపాక్ష... ఇంటినీ, ఇల్లాలినీ, కంటిరెప్పలా కాపాడుతూ ఉండటం వెనుక

తనఅక్కజీవితమే తనకో హెచ్చరిక.


ఓ మగవాడి వల్ల, తన అక్కజీవితం అవమానాల పాలయింది. అలాంటి విషాదాలు తన జీవితంలోకి రాకూడదని, స్నేహితులు పార్టీలకు రమ్మన్నా, వెళ్ళడు.


పెళ్ళి ఆడపిల్లలేకాదు.. మగాడికీ అవసరమే బాధ్యత ఆడవాళ్లకే కాదు మగవాళ్ళకి కూడా. పెళ్ళి అనేది బ్రహ్మాండపదార్దం.... ఇద్దరికీనూ... అని నమ్మాడు విరూపాక్ష. అందుకే తన కొడుకునూ, ఇంటిపనీ, వంటపనీ, పంచుకునే, బాధ్యత గల కొడుకుగానే పెంచుతున్నాడు.


సోఫాలో కూలబడి గతంలోకి తొంగిచూస్తున్న విరూపాక్ష, ఆలోచనలను, చెదర కొడుతూ, ఫోన్ రింగైంది.

తలవిదిల్చి, ఫోన్ అందుకొన్నాడు.

అవతల విషయం విన్న విరూపాక్ష నిఠారుగా లేచినిలబడి "వ్వాట్" అన్నాడు.


=============================================

సశేషం


=============================================

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.











129 views1 comment
bottom of page