top of page
Original.png

పనికోసం

#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #Panikosam, #పనికోసం #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Panikosam - New Telugu Story Written By - Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 02/03/2026

పనికోసం - తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

“పనిమనిషిని దొరికింది. ఐతే ఆమె తెలివికి తట్టుకోలేక చివరికి ఎవరు గెలిచారో తెలుసా?” 


పెద్దాడ సత్యనారాయణ గారి హాస్య కథ 'పనికోసం'  చదవండి.

“మేడం! నా పేరు హాసిని. మీకు సర్వెంట్ మైడ్ కావాలని వాచ్‌మెన్ చెప్పాడు.


మీ ఇంట్లో ఏమేమి పనులు చేయాలమ్మా?”


“సరేగాని, నీవు ఇంతకుముందు ఎవరింట్లో పని చేశావు? అని అడిగింది సుజాత.


“మన కాంప్లెక్స్‌లో మూడో ఫ్లోర్‌లో ఉన్న శారదమ్మ ఫ్లాట్‌లో చేస్తున్నానమ్మా.”


“పనికి ఎంత తీసుకుంటావు?”


“పనికి వెయ్యి రూపాయలు. పది రోజులు పని చేశాక, అప్పుడు రేటు చెప్తానమ్మా.”


“అంటే ఏమిటే నీ ఉద్దేశము?”


“కోపం తెచ్చుకోకండమ్మా. మీ ఇంట్లో గిన్నెలు ఎక్కువైతే వెయ్యి రూపాయలు సరిపోవు కదా, అప్పుడు రేటు చెబుతా.”


“అలాకాదుగాని, ఒక నెల వెయ్యి రూపాయలు చొప్పున రెండు పనులు చెయ్యి. నెల తర్వాత నీకు ఇష్టమైతే చెయ్యి. గిట్టకపోతే మానెయ్”.


“సరే మేడం. ఇంకో మాట, నాకు మార్నింగ్ కాఫీ, టిఫిన్ ఇవ్వండి. ఇంకా నెలకి మూడు రోజులు సెలవు ఇవ్వండమ్మా.”


“సరేలే” (మాట మారుస్తూ, పనిమనుషులు దొరకడం కష్టమని గ్రహించి), "హాసిని, ఎంతవరకు చదువుకున్నావు?" అని అడుగుతుంది.


“ఇంటర్ పాసయ్యాను మేడం. డిగ్రీలో చేరడం కుదరక ఈ పని చేస్తున్నాను.”


(పది రోజులు సజావుగా గడిచిపోయాయి. పదకొండో రోజు...)


“మేడం, నా వర్క్ అయిపోయింది. మీరు టిఫిన్, టీ ఇస్తే వెళ్లిపోతాను.”


“ఇవాళ మేము పార్టీకి వెళ్తున్నాము, అందుకు నీకు బ్రేక్‌ఫాస్ట్ లేదు.”


(అసహనంగా) "అదేంటి మేడం, మీరు నిన్ననే చెబితే ఇంటి దగ్గర తిని వచ్చేదానిని" అని జవాబిస్తుంది హాసిని.


(అయిష్టంగా) "సరే, ఈ డబ్బులు తీసుకొని టిఫిన్ చెయ్యి" అని ఇస్తుంది సుజాత.


(ఇరవై రోజుల తర్వాత...)


“మేడం, నెలాఖరున దసరా వస్తోంది కదా. కొత్త చీర కావాలమ్మా.”


“అదేంటి? నెల రోజులు కూడా చేయకుండా చీర ఎలా ఇస్తాను?”


“మేడం, దసరా పెద్ద పండుగ. అందరూ చీర, స్వీట్స్ ఇస్తున్నారు. ఈ విషయంలో


మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వండి మేడం.”


(వాదించడం ఇష్టం లేక) "సరేలే, చూద్దాము" అంటుంది సుజాత.


పండుగకి బట్టలు పెడుతుంది సుజాత. (రెండు నెలలు పని చేసిన తర్వాత...)


“అమ్మగారు, నా కూతురు స్నేహకు ఈ రోజు పుట్టినరోజు. నాలుగు సంవత్సరాలు నిండి ఐదో సంవత్సరం వచ్చింది. శారదమ్మగారు కొత్త డ్రెస్ ఇచ్చారమ్మా. అమ్మ, మీరు కూడా మా పాపని బ్లెస్స్ చేయండమ్మా.”


(మనసులో: "ఎంత తెలివిగా అడిగావే. ఇక తప్పదన్నట్టు!")


"విష్ యూ హ్యాపీ బర్త్‌డే" అని మూడొందలు ఇస్తుంది.


(మూడు నెలల తర్వాత...)


"హాసిని, ఎల్లుండి నుంచి నీవు రావద్దు" అంటుంది.


"ఎందుకు మేడం? నేను ఏమైనా తప్పు చేశానా?"


"అదేమీ లేదు, డిష్‌వాష్ కొన్నాము. రేపు వచ్చి ఇన్‌స్టాల్ చేస్తున్నారు."


***

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page